Thursday, May 8, 2014

భుమికి పునాది వేసిన దేవుడు సమాధి చేస్తాడా?

గత 2 or 3 years నుంచి అక్కడ,ఇక్కడ మనకు వినబడుతున్న మాట యుగాంతము గురించి. ఈ ప్రపంచము నాశనము అవుతుందని dates fix చేస్తున్నారు,books రాస్తున్నారు. ఇవన్ని మనము వింటున్నపుడు దేవుడు అనుకుంటున్నది ఏదో తెలుసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. దేవుడు ఈ ప్రకృతిని కలిగించేటప్పుడు,ఈ ప్రక్రుతిలోనికి మనిషి వచ్చిన తర్వాత దేవుని ఆలోచన ఏంటో మనము పరిశిలిస్తే ఒక ప్రణాళికతో ఉన్నాడని అర్థమవుతుంది. హెబ్రీ1:10- ప్రభువా! నీవూ “ఆదియందు భూమికి పునాది వేసితివి”,ఆకాశములు కూడా నీ చేతి పనులే ఇలా paul గారు పరిశుద్దాత్ముని ప్రేరేపణతో భుముకి పునాది వేసిన సందర్భాన్ని జ్ఞపకము చేస్తున్నాడు.విశ్వములో గ్రహాలు,stars, ఎన్నో వస్తువులు దాగి ఉన్న భూమిని గురించే దేవుడు మాట్లాడుటకు గల ప్రత్యేకత or ప్రాదాన్యత ఏంటి???? ఈ విశ్వములో భూమికంటే పెద్దవి ఉన్నప్పటికీ, ప్రత్యేకించి భూమికి పునాదులు వేసిన సందర్బంనే గుర్తుచేస్తున్నాడు. అంటే భూమి ఈ విశ్వమంతటిలో ప్రాముక్యతతో ఉన్నదని హెబ్రీ1:10 ద్వార అర్థమవుతుంది.

ఆదికాండము 1:1- ఆదియందు దేవుడు భుమ్యకసములను సృజించెను. మల్లి ఇక్కడను కూడా భూమి ప్రస్తావనే కనపడుతుంది. అనగా భూమి మీద అయన పిల్లలముగా మనము రాబోతున్నామని కనుక భూమి చాల ప్రాముక్యతగా ఉన్నది అని అంటున్నాడు. దేవుడు భూమికి పునాది వేసిన రోజులు ఎలా ఉన్నాయి?? భూమికి పునాదులు వేసిన్నప్పుడు దేవుని మనస్సులో ఎంత సంతోషము ఉందో లేఖనలలో చూస్తే మన మనస్సు ఆనందముతో నిండుతుంది. దేవుడు భూమిని కలిగించిన తర్వత మనకు కావలసినవన్ని సిద్దపరచిన తర్వాతే ఆదామును కన్నాడు. తొలి రోజుల దేవుని సంతోష పరిస్థితి చూస్తే యోబు 38:7- ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు,దేవదుతలందరు ఆనందించి జయ ద్వనులు చేసినప్పుడు దాని ములరాతిని వేసినవాడు ఎవడు?ఇక్కడ యోబు తో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పరీక్షించాలని,సాతాను శోదించాలని అనుకున్నాడు.ఈ పరిక్ష,శోధనల మధ్య స్నేహితులు వచ్చి యోబుతో మాట్లాడుతు నీవూ ఏదో తప్పు చేసి ఉంటావు ,అందుకే ఈ కష్టాలు వచ్చాయని మాటలతో యోబును నిందిస్తున్నప్పుడు నిరసించిన యోబును చూసి ,మానవ పుట్టుక గురించి జరిగిన తొలి దినాల సందర్భాన్ని జ్ఞపకము చేసి యోబును సంతోషపరచాలని,నిరసించిన యోబును మానసిక ధైర్యము ఇవ్వడానికి దేవుడు మాట్లాడుతున్న సందర్భము. యోబు 38:4- నేను భూమికి పునాదులు వేసిన్నప్పుడు నీవేక్కడ నుంటివి? అనగా ప్రారoభములో దేవుడు ప్రకృతిని కలిగించిన తొలి రోజుల సందర్బాన్ని గురించి చెప్పుతున్నాడు.( ఈ వివరణ హెబ్రీ1:10 కు link)

యోబు 38:7లో మనము రాబోతున్నామని ఆనందముతో మనకోసము భూమిని కలిగిస్తున్నపుడు మొట్టమొదట రాయి వేసినప్పుడు ఎంత ఆనందమో చెప్పుతున్నాడు. కేవలము ఈ భూమిపై ఒక స్వంత ఇల్లు కట్టుకుని సంతోషపడే మనకు రాబోయే మన గురించి దేవుడు కడుతున్న ఈ విశ్వమనే ఇల్లు గురించి ఆలోచిస్తే దేవుడికి కూడా గొప్ప ఆనందము ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.ఉదయనక్షత్రములు యొక్క పాటల మధ్య,దేవదూతలు యొక్క జయద్వానుల మధ్య ఈ నేలపై నా పిల్లలు రాబోతున్నారని గొప్ప ఆనందముతో ఉన్నాడు. దేవుడు ఈ విశాలమైన ,ఉహకు అందని ప్రకృతిని కలిగించడానికి 6 days కష్టపడ్డాడు. 6 days కష్టపడింది అయన ఉండడానికి కాక రాబోయే మనము ఉండడానికే.. అంటే రాబోవుతున్న మనయెందు దేవునికి ఎంత ప్రేమ???మనము పుట్టాక ముందే ఇంత ప్రేమ ఉంటె ఇంకా పుట్టిన తర్వాత ఇంకా ఎంత ప్రేమ ఉండాలి?? మనిషి పుట్టాక ముందే ఇంత ఆనందముగా ఉన్న దేవుడు ,పుట్టిన తర్వాత ఇంకెంత ఆనందముగా ఉండాలి? కోట్లనుకోట్ల మంది పిల్లలు కలగబోతున్నారని ఆ తొలి రోజులలో దేవునికి ఆనందమే. భూమి మీదకు వచ్చి,నా కోసము బ్రతుకుతూ,తండ్రి అని నన్ను పిలుస్తుంటే ఆనందపడాలి అని అనుకున్నాడు.

ఇంతవరకు మనము పుట్టాక ముందు తొలి రోజులలో దేవుడు మన యెడల ఒక ప్రణాళికతో ఉన్నాడని, చాల ఆనందముగా ఉన్నాడని తెలుసుకున్నాము.మనము పుట్టక ముందే దేవునికి ఆనందము ఉంటె పుట్టిన తర్వాత ఆనందము రెట్టింపు అవ్వాలి కానీ పుట్టిన తర్వాత భాద అంటే ఏంటో దేవునికి పరిచయము చేసాడు మనవుడు . అప్పటివరకు ఆనందముగా ఉన్న, కన్నతండ్రికి భాద ఎలా ఉంటుందో రుచి చూపించింది మనిషే. ఆదాముని అదేను తోటలో పెట్టి ఒక్క పండును తిన్నోద్దు అంటే అదే తిని దేవుని మాట మీరి దేవునిని భాదపెట్టాడు. 11timothy3:1 నుంచి-మనుష్యులు స్వార్ధప్రియులు,ధనపేక్షులు,బిమ్కములడువారు దుషకులు ........అని అంటున్నాడు.మనవ చరిత్ర మలినము అయింది.. ఆదికాండము6:6-తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవ సంతాపము నొంది తన హృదయము నోచ్చుకోనేను.. అంటే ప్రారంభ దినాలలో మనము పుట్టాక ముందు ఆనందపడ్డ దేవుడు తర్వాత దినాలలో మానవుని క్రియలు ద్వార హృదయము నోచ్చుకోన్నట్ట్లుగా మనకు అర్థమవుతుంది. యేసు రాక ముందు అనేక ప్రకతి వైపరిత్యాలు చేసినను, jesus పంపించినను మనిషి మారడము లేదు. మారలేదు. మనిషి ఎప్పటికి మారని వాడిగా మిగిలిపోతున్నాడు.

రాభోవుతున్న తన పిల్లలకోసము భూమికి పునాదులు వేసి,మనకు కావలసినవన్నీ దేవుడు పెడితే మనిషి మానవత్వము కోల్పోయిన పరిస్థిని బట్టి దేవుడు ఎలాంటి నిర్ణయము తిస్కుకోవాలి???? మనిషికి భుద్ది చెప్పటానికి ప్రకృతి వైపరిత్యాలు కలగజేసి తెలియజేస్తూ ఉన్నాడు.ఇంత వరకు ఎన్నో earth quakes, tsunami వచ్చిన ఉపయోగము లేదు.ప్రవక్తలను,యేసును,apostles భోధన ద్వార,ప్రకృతి వైపరిత్యాలు ద్వార మానవుడు మరుతాడని చేసిన ఏమి పట్టనివాడిగా ఉన్నాడు.వినని సమాజానికి ఏమి చేయాలి దేవుడు? అందుకే దేవుడు హెబ్రీ 12:26- భూమిని,నక్షత్రాలను కంపింపజేతును అని అంటున్నాడు.

మనకి భుద్ది కలగటానికి earth quakes,tsunami కలిగిస్తున్నాడు.ఇలా ప్రపంచములో అంతట ఎక్కడోఅక్కడ ప్రకృతి వైపరిత్యాలు మనము చూస్తున్న భుద్ది కలగట్లేదు.అక్కడ కదా వచ్చింది మాకు ఏంటి అని అనుకుంటున్నారు. ప్రకటన 6:13- ఆకాశానక్షత్రాలు రాలును అంటున్నాడు. మత్తయి 24:29-యేసు రెండవ రాకడలో ఆకాశము నుండి stars రాలబోతున్నాయి అని అంటున్నాడు.

ముంచుకొస్తున్న ప్రమాదము గురిచి అలోచించి అయిన మనిషి జగ్రతపడుతదని ఈ విలువైన bible మాటలను రాసాడు దేవుడు.యేసు ను రెండవ రాకడగా పంపబోతు ఈ విశ్వాన్ని అంతము చేయాలనుకుంటున్నాడు.దేవుడు ముగించాలనుకున్న ఈ కాలములో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ అంత్య దినలలో ఎలా ఉన్నమన్నడో 11 peter3:11,12,13- పరిశుద్దమైన ప్రవర్తనతోను ,భక్తితోను ఎంతో జాగ్రతగా ఉండాలి అని అంటున్నాడు.

ఆ ప్రమాదము వచ్చేముందు మనము ఉండే ఈ కొద్దికాలములో ఆత్మలను రక్షిస్తే దేవుడు సంతోశపడుతాడు.ఒకసారి అలోచించి ఒక మంచి నిర్ణయము మన జీవితము పట్ల తీసుకుని మనల్ని మనము కాపాడుకొని,సమాజములో ఉంటున్న కొద్దిమందైన మనము కాపాడాలి.

No comments:

Post a Comment