Wednesday, September 3, 2014

బైబిల్లో మొహమ్మద్ గురించి చెప్పబడింది అంటున్న వారికీ చెప్పబడలేదు అనుటకు రుజువులతో కూడిన వివరణ PART - I

బైబిల్లో వ్రాయబడ్డ సందర్భాలను తప్పుగా అర్థము చేసుకుని వారికీ(ముస్లిం లు) అనుకూలముగా అన్వయించుకుని బైబిల్లో మోహామోద్ ప్రవక్త గురించి ఉంది అని “ బైబిల్లో మోహామోద్ అనే పుస్తకాన్ని వ్రాసి ప్రకటిస్తున్నారు. అక్కడక్కడ సెమినార్స్ పెడుతూ బైబిల్లో చెప్పబడిన ఆ ప్రవక్త మోహామోద్ అని ప్రకటిస్తూ అనేక అమాయకులైన క్రైస్తవ విశ్వాసులను వారి మతములోకి మార్చుకుంటున్నారు. బైబిల్లో మోహామోద్ గురించి వ్రాయబడిన సందర్భాలు ఉన్నవని వారు(ముస్లింలు) అంటున్నప్పుడు అది ఎవరిని గురించి వ్రాయబడ్డాయో అన్న వాస్తవము ఏమిటో చెప్పవలసిన భాద్యత క్రైస్తవులమైన మనకు ఉంది. వీరి యొక్క మాటలకూ జవాబు ఇచ్చుటకు నేను సందేశమును రెండు భాగాలుగా(Parts) గా చేస్తున్నాను. ఈ సందేశము మొదటి భాగము(First part). రెండవ భాగము( Second part) మరొక సందేశములో చుడండి.

వారి మొదటి ప్రశ్న మరియు మన వివరణ.

1) ముందుగా బైబిల్లో ముఖ్యముగా మూడు వచనాలను వారికీ అనుకూలముగా మార్చుకుని ఇందులో మోహామోద్ గూర్చి చెప్పబడింది అని అంటున్నారు. బైబిల్లో మోహామోద్ ఎలా ఉన్నడో ఒక్కసారి వారి యొక్క మాటలలో విందాము. శ్రద్దగా చదవండి. వారు చూపిస్తున్న మొదటి  వచనమును చూద్దాము. John 14:25-నేను(యేసు) మీ యెద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును మీకు భోదించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ యేసు వెళ్లిపోతు మరొక ఆదరణకర్తను పంపిస్తానని అంటున్నాడు. యేసు వెళ్లిపొతున్నాడన్న మాట విని శిష్యులు భాదపడుతూ కలవర పడుచున్నారు. కలవరపడుచున్న, భాదపడుచున్న వారిని ఓదార్చడానికి నేను వెళ్లి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని శిష్యులను ఉద్దేశించి, ఆ తరువాత రాబోయే పరిశుదాత్మ గురించి చెప్పుచున్న మాటే ఈ వచనము.

2) అలాగే John 14:16,17- నేను తండ్రిని వేడుకొందును. మియోద్ద “ఎల్లప్పుడూ” నుండుటకై అయన “వేరొక ఆదరణ కర్తను “అనగా సత్య స్వరుపియగు ఆత్మను మీకు అనుగ్రహించును.” లోకము ఆయనను చూడదు”, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు.”అయన మీతో కూడా నివసించును, మిలో ఉండును. ఈ వచనములో కూడా యేసు వెళ్లి ఎల్లప్పుడూ మన మధ్య ఉండడానికి వేరొక ఆదరణ కర్తను పంపిస్తాను అని చెప్పాడు. బైబిల్ లో ఉన్న ఈ మాటలను చూపించి యేసు వెళ్ళిన తరువాత అయన పంపిన ఆదరణకర్తే మోహామోద్ గా అంటున్నారు.

3) వీళ్ళు అడుగుతున్న ప్రశ్నను చూస్తే క్రైస్తవులైన మీరు పరిశుద్దాత్మ అని అంటే మరి యేసు వేరొక ఆదరనకర్తను పంపిస్తాను అన్నాడు కదా? ఒక వ్యక్తిని పంపిస్తానని యేసు చెప్పాడు కదా? యేసు ఒక వ్యక్తి. నేను వెళ్లి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అంటే వ్యక్తి గురించి కదా మాటలాడుతుంది, మరి పరిశుద్దాత్మ ఒక వ్యక్తా?? నేను వెళ్లి వేరొక ఆదరణకర్తను పంపిస్తానని ఒక వ్యక్తి గురించి చెబితే క్రైస్తవులైన మీరు ఒక పరిశుదాత్మ అని ఒక శక్తి గురించి ఎందుకు అంటున్నారు?? ఇక్కడ యేసు చెబుతున్నది మోహామోద్ గురించి అని పై రెండు వచనాలను బట్టి తప్పుడుగా వక్రీకరించి చెబుతున్నారు.

4) ఇప్పుడు ప్రశ్నయొక్క జవాబును చూద్దాము. (a) ఒక వేళా అది మోహామోద్ గురించి అని అనుకుంటే బైబిల్లో పరిశుదాత్మ లేదా ఆదరణకర్త గూర్చి యేసు చెప్పిన మాటలన్నీ మోహామోద్ లో కనిపించాలి. యేసు చెప్పిన లక్షణాలు అన్ని మోహామోద్ లో ఉంటె అప్పుడు ఆలోచించొచ్చు. John 14:25-ఆదరణకర్తగా పరిశుదాత్మను పంపబోతున్నానని చెబుతున్నాడు. అంటే వచ్చే అయన వ్యక్తినా లేక శక్తీనా? ఆదరణకర్త అనగా ఒక వ్యక్తి అని అనుకుంటారని తండ్రి నా నామమున పంపబోవు పరిశుదాత్మ అని యేసు స్పష్టముగా చెప్పాడు. అనగా రావలసినది ఆత్మే తప్ప వ్యక్తి కాదు. (b) John 14:25లో నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును అను మాట ఉంది. ఒక వేళ మోహామోద్ అయితే యేసు చెప్పినవే చెప్పాలి. యేసు చెప్పనివి చెబితే పంపబడిన ఆదరణకర్త మోహామోద్ ఎలా అవుతాడు? ఖురాన్లో మోహామోద్ చెప్పిన సంగతులు వేరు బైబిల్లో యేసు చెప్పిన సందర్భాలు వేరు. రాబోయే ఆదరణకర్తకు సొంతముగా ఏ నిర్ణయము తీసుకునే హక్కు లేదు. ఇప్పుడు మోహామోద్ గురించి ఆలోచిస్తే మోహామోద్ నే ఆదరణకర్త అయితే యేసు చెప్పిన మాటలే చెప్పాలి. కాని యేసు చెప్పిన మాటలు వేరు ఖురాన్లో మోహామోద్ మాటలు వేరు. అలాంటప్పుడు ఆదరణకర్త మోహామోద్ అని ఎలా ఉహించుకుంటారు? (c) John 14:16,17- మియోద్ద “ఎల్లప్పుడూ” నుండుటకై అయన “వేరొక ఆదరణ కర్తను. ఒక వేళ మోహామోద్ ఆదరణకర్త అయితే ఎల్లప్పుడూ భూమి మీద ఉండాలి. మరి ఎందుకు మోహామోద్ చచ్చిపోయాడు? పై వచనములో ఎల్లప్పుడూ ఉండుటకై అను మాట ఉంది కదా. ఒక వ్యక్తి అయితే ఎల్లప్పుడూ ఉంటాడా? ఆత్మ అయితేనే ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ఆదరణకర్తగా పరిశుద్దాత్మను పంపాడు. పై వచనములో పంపబడుతున్న ఈయన ఎవరికీ కనపడడు అనే మాట ఉంది. ఇప్పుడు మోహామోద్ ని చూసారా లేదా? చూసారు. ఇప్పటికి ఫోటోలో చూస్తున్నాము. పై వచనములో అయన మీతో కూడా నివసించును, మిలో ఉండును అను మాట ఉంది. మిలో అనగా ఎక్కడా? పరిశుదాత్మకు ఆలయము మానవులైనా మన హృదయమే. హృదయము మనలో ఉంది. మనలో ఉన్న హృదయములో ఉండబోయే ఆత్మ గురించి చెబుతున్నాడు. వాస్తవముగా మోహామోద్ మనతో పాటు కలిసి ఉండేవాడు. మనలో ఉండే వాడు కాదు. కాబట్టి యేసు మనలో ఉండగలిగిన శక్తివంతమైన పరిశుదాత్మడు గురించి చెబుతున్నాడే 
తప్ప ఒక వ్యక్తి అయిన మోహామోద్ గురించి చెప్పలేదు. అస్సలు ఖురాన్లో మోహామోద్ ఉన్నప్పుడు బైబిల్లోకి వచ్చి చెప్పవలసిన అవసరత ఏమి వచ్చింది? చివరిగా బైబిల్లో యేసు పలికిన మాటలు పరిశుదాత్మను గురించి చెప్పిన మాటలే తప్ప మోహామోద్ గురించి చెప్పినవి కావు. 

వారి రెండవ ప్రశ్న మరియు మన వివరణ.

1) John 1:15,16- యోహాను అయనను(యేసు) గూర్చి సాక్షమిచ్చుచు- నా వెనుక వచ్చువాడు నా కంటే ప్రముఖుడు. ఈ వచనములో ఎవరు ఎవరిని ఉద్దేశించి మాటలడుచున్నారో తెలియాలి. యోహాను యేసును ఉద్దేశించి చెప్పబడుతున్న మాట. కాని ఈ వచనమును యోహాను కాదు యేసు మోహామోద్ నీ ఉద్దేశించి మాటలడుతున్నాడని అని చెబుతున్నారు. మరి క్రైస్తవులైన మనము ఈ వచనములో యోహాను అని అన్నట్లుగా ఉంది అని అడిగితే బైబిల్ తర్జుమలో పొరపాటు జరిగింది అని అంటున్నారు. వచనములోకి వెళ్తే నా వెనుక వచ్చువాడు అనగా ఏమి? ఉదాహరణకు మీతో ఎవరైనా నీవెనుక ఒకడు వస్తున్నాడు చూడు అనగా వెంటనే వెనక్కి చూస్తాము కాని ముందుకు చూడము. యేసు మొదటి శతాబ్దములో మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన 500 years తర్వాత పుట్టాడు. ఇక్కడ యేసునే నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు అను మాటను అన్నాడు అని అనుకుంటే 500 years తర్వాత వచ్చిన మోహామోద్ గురించి నా వెనుకల వచ్చువాడు అని అంటాడా? నిజముగా యోహాను ఈ మాట అనగానే యేసు వెనుక వచ్చాడు. ఒకసారి Luke3:16,21-యోహాను-నేను నీళ్ళలో మీకు బాప్తీస్మం ఇచ్చుచున్నాను.అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. అయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. అయన పరిశుదాత్మ లోను, అగ్నితోనూ మీకు బాప్తీస్మం ఇచ్చును. 21-ప్రజలందరు బాప్తీస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తీస్మం పొంది. ఇక్కడ యోహాను మాట అంటుండగా యేసు వెనుక నుంచి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అనగా యోహాను యేసు గురించి చెప్పిన మాటే తప్ప యేసు మోహామోద్ గురించి చెప్పిన మాట కాదు. అలనే Mark 1:7 నుంచి 9- ఇక్కడ కూడా అదే సందర్భము. నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు అని ఇలా ప్రకటిస్తూ ఉండగా యేసు ప్రవేశించాడు. చివరిగా యోహాను యేసును ఉద్దేశించి చెప్పిన మాటే తప్ప యేసు మోహామోద్ గురించి చెప్పిన మాట కాదు. ఇప్పటికైనా వ్రాయబడిన వాటిననిటిని మరోమారు చదివి అలోచించి మీ మనస్సులను, ఆలోచనలను సరి చేసుకుని బైబిల్ సర్వ సత్యమని, యేసు అనంతరము వచ్చిన ఆదరణకర్త పరిశుదాత్మడు దేవుడని నమ్మితే నిత్యజీవము(పరలోకము). లేదంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళాల్సిందే. యేసు అర్థము కావాలంటే ముందు వాక్యము అర్థము కావాలి. వాక్యము అర్థము చేసుకోవాలంటే పరిశుదాత్మ సహాయము ఉండాలి. కాని అనేక మంది ముస్లిం సోదరులు బైబిల్ చదివి యేసు దేవుడు కాదు అంటున్నారు. నేను దేవుడని యేసు చెప్పలేదు అని అంటున్నారు. విశ్వాసము కలిగి పరిశుద్దాత్మ సహాయముతో చదివితే తప్ప అర్థము కాని బైబిల్ వీళ్ళకు సులువుగా అర్థమవుతుందా? పరిశుదాత్మ సహాయము లేకపోతే బైబిల్ అర్థం కానప్పుడు పరిశుదాత్మనే నమ్మని వీరికి బైబిల్ అర్థమవుతుందా?

No comments:

Post a Comment