Tuesday, August 26, 2014

ప్రకృతి కన్నెర్ర చేస్తుందా?



ప్రతి సంవత్సరము వర్షా కాలములో గాని, ఎండా కాలములో గాని, వేసవి కాలములో గాని జరుగుతున్న ప్రకృతి వైపరిత్యాలు లేక విపత్తులు అది ఒక భూకంప రూపముగా, సునామి రూపముగా, తుఫాను రూపముగా ఇలా ప్రకృతిలో సంభవించినప్పుడు జరిగే ఆస్తి నష్టము, ప్రాణ నష్టము పరిగణలోకి తీసుకుని ప్రింట్ మీడీయ (న్యూస్ పేపర్), ఎలెక్ట్రానిక్ మీడీయ( టీవీ న్యూస్) వారి మాటల్లో, రాతల్లో ఉపయోగించే పదమే “ప్రకృతి కన్నెర్ర చేసింది” అని. ఇప్పటివరకు జరిగిన వైపరిత్యాలు వెనుక ప్రకృతి ఉందని, పగ పట్టిందని, కన్నెర్ర చేసిందని, భిబత్సవము చేసిందని అనుకుంటున్నారు. అసులు ప్రకృతికి ఎందుకు పగ? ప్రకృతి మనిషి పై పగ చేయటము ఏంటి? ప్రకృతి అనగా పంచ భూతల కలయిక అని మనకు తెలుసు. ఈ పంచ భూతాలు సాక్షాత్తు దేవుని దూతలు అని bible లో తెలుసుకున్నాము. ప్రకటన 16:6- జలముల దేవదూత చెప్పగా వింటిని. అంటే నీరు ఒక దూతగా కనపడుతుంది వాక్యములో. అస్సలు ఈ ప్రకృతి ఎలా ఏర్పడింది, కలిగింది అని ప్రారంభాములోకి వెళితే దేవుడు వీటన్నిటిని తన మాట చేత కలిగించాడు. భూమి కలుగును గాక అను మాటకు ,సూర్య ,చంద్ర నక్షత్రాలు కలుగును గాక అను మాటకు కలిగాయి. అనగ ప్రకృతిలోని సర్వము సాక్షాత్తు దేవుని నోటి మాట వలన ఏర్పడింది.

1) హెబ్రీ 1:7 తన దూతలను వాయువులను గాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. అస్సలు నీరు గాలి, అగ్ని అను దూతలు ఎందుకు కలిగించాడు? ప్రకృతిని దేవుడు కలిగించుటలో ఉద్దేశము ఏంటి అనుకుంటే “భూమి మీద బ్రతుకుతున్న తన పిల్లలమైన మనకి ఈ ప్రకృతి లోబడి మనకు సేవ చేయాలనీ. అదే దేవుడు వాటికీ అజ్ఞాపించాడు. హెబ్రీ 1:14- వీరందరు (దూతలు) రక్షణయను స్వాస్థము పొందబోవువారికి ( మనకి) పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అనగా మనకు పరిచారము (సేవ) చేయటానికి పంపబడిన సేవకులైన దూతలు. దేవుడు ఈ ప్రకృతిని మనకు సేవ చేసేటట్టు పెట్టాడు. సూర్యుడు మన పనిలో, గాలి మన పనిలో, నేల మన అవసరాన్ని తీరుస్తుంది. సేవకులుగా చెప్పిన మాటను వినవలసినది పోయి ఈ రోజు మనుషుల మీదకు ఈ ప్రకృతి తిరగబడడములో ఉన్న కారణమూ ఏంటి? మన సేవలో ఉండవలసిన నీరు ఎందుకు మనుషులను శెవాలుగా మారుస్తుంది? గాలి పెనుగాలిగా మరి ఎందుకు ప్రాణ నష్టము మిగిలిస్తుందిఎందుకు? ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? అస్సలు సేవకులు మనకు తిరగాబడుతున్నరెందుకు? మన సేవలో మన కాళ్ళ క్రింద అణిగి మణిగి ఉండవలసిన ఈ ప్రకృతి ఈ రోజు మనకు తిరుగుబాటు చేయుటలో గల ఉద్దేశము ఏంటి?

2) ప్రకృతికి దేవుడు ఒక నియమము పెట్టాడు .” భూమి మీద బ్రతికినంత కాలము నా పిల్లలు నాకు లోబడితే మీరు వారికీ లొబడి పని చేయండి. ఒకవేళ ఎప్పుడైతే నా పిల్లలు నాపై తిరుబాటు చేస్తారో మీరు తిరుగుబాటు చేయండి.. అనగా మనము భూమి మీద దేవుడికి భయపడి, దేవుడికి లోబడి బ్రతికినంత కాలము ఈ ప్రకృతి మనకు లోబడి ఉంటుంది. ఇది దేవుడు ప్రకృతికి ఇచ్చిన ఆజ్ఞ. యెషయ 1:2- యెహోవ మాటలడుచున్నాడు - ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యోగ్గుము . నేను పిల్లలను పెంచి గోప్పవారినిగా చేసితిని. వారు నా మీద తిరగాబడియున్నారు. ఇక్కడ దేవుడు ఆకాశాముతో, భూమితో మాటలడుచున్నాడు. హబక్కుకు 2:11-గోడలలోని రాళ్ళూ మొర్రపెట్టుచున్నది దూతలు  వాటికీ ప్రత్యుత్తరమిచ్చుచున్నది. అనగా రాళ్ళూ కూడా మొర్రపెట్టుచున్నాయి. ఆకాశము, భూమి దేవుని మాట వింటుంది గనుక దేవుడు వాటితో మాటలడుచున్నాడు. భూమి మీద దేవునికి లోబడవలసిన పిల్లలు లోబడక తిరిగుబాటు చేసినప్పుడు అయన పంచభుతాలకు అజ్ఞాపిస్తున్నాడు. భూమి మీద తన పిల్లలైనా వారు తనను కాదు అనుకుని, తన మాటను పెడచెవిన పెట్టి ఆవిధేయులుగా మారిన రోజున ఈ పంచభుతలకుపని చెబుతాడు. అస్సలు కన్నెర్ర చేస్తుంది పరలోకమందున్న దేవుడు అని తెలియక ప్రకృతి కన్నెర్ర చేస్తుంది అనుకుంటున్నారు. దేవుని కళ్ళు ఎర్రపడ్డాయి గనుక ప్రకృతిలో భీబత్సము. అందుకే ప్రకృతిలో ఇన్ని వైపరిత్యాలు. ప్రకృతిలో జరుగుతున్న ప్రతి వైపరీత్యము వెనుకాల ప్రకృతిని కలిగించిన దేవుని కన్నులు ఎర్రబడ్డాయి.

3) నీరు యొక్క ఉగ్రత చూద్దాము. ప్రకటన 16:4- మూడవ దూత తన పాత్రను (దేవుని కోపము) సముద్రములో కుమ్మరింపగా. ఇప్పటి వరకు వరద భీబత్సము అను మాటను న్యూస్ లో కానీ, న్యూస్ పేపర్ లో చూసాము విన్నాము. దేవుడు సముద్రాలను కలిగించి ఇసుకను సరిహద్దుగా నియమించాడు ఆ సరిహద్దు అయిన ఇసుకను దాటి ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని ఆజ్ఞ ఇచ్చాడు గనుక. యెషయ 23:11-అయన సముద్రము మీద తన చెయ్యి చాపెను. భూమిమీద పాపము విస్తరించడము వలన దేవునికి కోపం వచ్చింది. ఈ రోజు మంచి పాలనా చోట ఉన్నది అని చెప్పే స్థితి లేదు. ఎక్కడ చుసిన చెడు. అందుకని దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ ఎందుకు ఇంత భయముకరముగా వైపరిత్యాలు కలిగిస్తున్నడంటే ఆయనకు కోపము వచ్చిందన్న సంగతి ఆ వార్తలను వింటున్నపుడు, చదువుతున్నపుడు తెలుసుకుని నీ, నా, మన బ్రతుకుని సరిచేసుకుంటామని ఆ వార్తలు నీ, నా, మన చెవిన పడుతున్నాయి, కళ్ళముందు కనపడుతున్నాయి. ఆమోసు 5:8-సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యహోవా.

4) అగ్ని యొక్క ఉగ్రత చూద్దాము. ప్రకటన 16:8-నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కల్చుటకు సూర్యునికి అదికారము ఇయ్యబడెను. ప్రారంభములో దేవుడు సూర్యుని వెలుగిమ్మని చెప్పగా ఇప్పుడు అదే సూర్యుడు భూమి మీద మనుష్యులను కాల్చివేయమంటునాడు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఉష్ణోగ్రత దీనికి సాక్ష౦. ఎండాకాలం వచ్చిందంటే భయముతో బ్రతకవలసిన పరిస్థితి. కారణము పెరుగుతున్న అత్యదిక ఉష్ణోగ్రత. ప్రతి సంవత్సరం రీకార్డ్ గా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయంటే కారణము సూర్యునికి అదికారము ఇచ్చేసాడు. అందుకే సూర్యుడు ఉగ్రుడై భయముకరముగా మండిపోతున్నాడు. మండిపోతున్నదుకు ఎందరో మనుషులు రాలిపోతున్నారు. దేవుడు అగ్నికి ఆజ్ఞ ఇచ్చాడు.

5) గాలి యొక్క ఉగ్రత చూద్దాము. యిర్మియా 23:19-ఇదిగో యెహోవ యొక్క మహోగ్రతమను పెనుగాలి భయాలు వెళ్ళుచున్నది . అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకు పెళ్లున దిగును. తన కార్యమును సఫలపరచు వరకు తన హృదయలోచనలను నేరవేర్చువరకు యెహోవః కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతి మీరు బాగుగా గ్రహించుదురు. యేసు పుట్టకతో ప్రారంభమైనవి అంత్య దినాలు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రకృతి భీభత్సాలు ఆలోచిస్తే జరుగుతున్న ప్రతి వైపరీత్యాల వెనుక లోపము భూమి మీద బ్రతుకుతున్న మనిషిలో ఉన్న లోపము ద్వార దేవుని కళ్ళు ఎర్రబడి ప్రకృతితో దేవుడు మనుష్యులను నాశనము చేస్తున్నాడు. కనుక లోపము ప్రకృతిలో కాదు మనిషిలో ఉంది అని గ్రహించాలి.

6) తల్లి గర్భములో రూపించి, అవయవాలను ఇచ్చి, ఆకారము ఇచ్చి ఈ భూమి మీదకు రప్పించి, పెంచిన దేవునినే లేడు అనుకుని. ఉన్న అయన కోసము ఆలోచించక, బ్రతకక విచ్చల విడి జీవితానికి అలవాటు పడిపోయారు గనుక దేవుడు ఈ స్థితి చూసి కన్నెర్ర చేసి ప్రకృతితో నాశనము చేయాలనుకుంటున్నాడు. ఉదాహరణకి:: యోన చరిత్ర – యోన 1:10 నుంచి – దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా తనకు ఇష్టము వచ్చిన చోటికి వేలడానీకి సిధమయినాడు. ఆ వచనములో నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చెనని నాకు తెలిసియున్నది.. అనగా మనుషుల తప్పు వలన సునామి, భుకంపములు వస్తున్నాయి. భూమి మీద దేవుని వలన పుట్టి దేవుని కొరకు బ్రతకవలసిన మనుష్యులు తమ కోసము బ్రతకడంలో మునిగిపోయారు. దేవుని చిత్తము పక్కన పట్టి తన చిత్తము నెరవేరుస్తున్నారు. దేవుని మాట కాదని వారి మాటలనే నెరవేరుస్తున్నారు. అందుకే ప్రకృతిలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

7) ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యోగ్గుము అన్న దేవుడు ఎందుకు ఆకాశము, భూమితో మాటలడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భూమి మీద మనుష్యుల బ్రతుకులు సరిగా లేకపోవడము వలన. వారి బ్రతుకు విధానము బట్టి దేవునికి కోపము రావటము, ఆ కోపాన్ని బట్టి ప్రకృతికి ఆజ్ఞ ఇవ్వడము, ఆ ప్రకృతి దేవుని ఆజ్ఞను అమలు చేయడము, అమలు చేయడాన్ని బట్టి వందలాది వేలాది లక్షలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు.

Monday, August 25, 2014

క్రైస్తవుడు చేయవలసిన మేలు (దానం) ఏది?

1) మేలు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి దానధర్మాలు, పుణ్య కార్యాలు, సహాయ సహకారాలు, ఎక్కువుగా కలిగి ఉన్నవారు లేని వారికీ పంచటాలు ఇలా వీటిని సమాజం మేలులుగా భావిస్తుంది.ముఖ్యముగా ఈ మేలులు చేసేవారిలో కొందరు స్వార్ధ ప్రయోజనాలు ఆశిస్తూ, కొందరు నిస్వార్ధంగా చేస్తూ ఉంటారు. ఈ దాన ధర్మాలు చేయటం వెనుక సమాజములో కొన్ని సామెతలు కూడ లేకపోలేదు. అవి“మానవ సేవే మాధవ సేవ”, ప్రార్దించే పెదవులకన్న సయం చేసే చేతులే మిన్న. ఇలాంటి మాటలు వినబడినప్పుడు లేదా కనపడినప్పుడు మానవత్వం ఉన్న ఎవరికైనా ఖచ్చితముగా సాటి మనిషికి దానం చేయాలనో, సహాయం చేయాలనో అనిపించటం సహజం. ఈ దాన ధర్మాలు చేయటం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని. 

a) ఈ జనంలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మంచి జీవితం వస్తుందని.
b) మేలులు లేదా పుణ్య కార్యాలు ద్వార సంతానం కలుగుతుందనే నమ్మకం.
c)కొందరు పేరు ప్రఖ్యాతలు కోసం మంచిని తలపెట్టేవారు.
d) చేసిన పాపాలను నివృత్తి చేసుకోవటం కోసం చేస్తారు.
e) కొందరు పిల్లలు లేక ఇక చేసేది ఏమి లేక ఉన్న ఆస్తిని దాన ధర్మాలు చేయటం . 
f) మనిషిగా పుట్టాము కాబట్టి ఈ జన్మలో నలుగురు గుర్తు పెట్టుకునే పనులు చేయాలి.

2) పైన చెప్పిన విధముగా స్వార్ధంగానో, నిస్వార్ధంగానో సమాజానికి మేలు కలిగించే పనులు జరుగుతున్నాయి. అన్నదానం అని, నీటి దానం అని, గోవుల దానం అని, భూదానం అని, విద్య దానం అని, బంగారు మామిడి పండ్ల దానం, శ్రమ దానం, రక్త దానం, నేత్ర దానం, మూత్రపిండాల దానం ఇలా అనేక దానాలు మనం సమాజములో చూస్తున్నాము. ఇక ప్రభుత్వం సమజానికి చేసే మేలులు గురించి ఆలోచిస్తే బియ్యం, కందిపపు నుంచి నిత్యావసర వస్తువులు తక్కువ ధరకే పంపిణి చేయటం, ముసలి, వికలాంగులకు pension ఇవ్వటం ఇలా అనేక విధముగా మేలులు చేస్తుంది ప్రభుత్వం.

3) పైన చెప్పిన దాన ధర్మాలు, మేలులు, సేవలు, పుణ్య కార్యాలు అన్నింటికీ ఉద్దేశం ఒకటే. అదేమనగా మరో జన్మంటూ ఉంటె మంచి జన్మ పొందుకోవాలి అని ఒకరు, స్వర్గం –నరకం నిజంగా ఉంటె స్వర్గములోకి వెళ్ళాలని ఇంకొకరు. ఇంతకు ఈ కార్యక్రమాలు దేవునికి ఎలా ఉన్నాయో ఒక్కసారి bibleనీ అడిగితే యెషయ ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన మాటను చూస్తే అర్చర్యపోక తప్పదు. యెషయ 64:6 మా నీతి క్రియలు(మనం చేసే మేలులు) దేవుని దృష్టికి మురికి గుడ్డవలె ఉన్నాయి. లోకంలో నిజ దేవున్ని నమ్మకుండా చేసే ఏ విధమైన మేలు అయిన, ధర్మం అయిన “ దేవుని“దృష్టికి మురికి గుడ్డ వాలే ఉందంటే మరి దేవునికి మనం చేసే దానం నచ్చటం లేదా? లేక దానం చేసే మనుష్యులు నచ్చటం లేదా? ఇంతకి నచ్చకపోవటం వెనుక కారణం ఏంటి? యోహాను 12:43 వారు దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును ఎక్కువుగా అపెక్షించిరి.

4) పైన చెప్పిన మాటను బట్టి దానం లేదా మేలు చేయటం తప్పు కాదు కానీ, ఆ దానం చేసే వ్యక్తులు పేరు ప్రఖ్యాతలు కోసమే, స్వార్ధ ప్రయోజనాల కోసమో, అందరు గుర్తించుకోవలనో చేస్తున్నారే తప్ప దేవునికి మహిమకరంగా, దేవునికిఇష్టమైన మేలులు చేయటం లేదు. అయితే దేవుడు ఎవరినైనా మేలు చేయమని చెప్పాడా అని ఆలోచిస్తే bibleలో దేవుడు చెబుతున్నమాటను చూస్తే II దేస్సా3:13 సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుక వద్దు. దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞను జాగ్రత్తగా పరిశిలిస్తే ఒక అద్భుతమైన విషయం బయటపడుతుంది. అది క్రైస్తవులు చేసే మేలు ప్రపంచ ప్రజలు చేసేటటువంటి మేలు కాదని, క్రైస్తవులు చేసే మేలు దేవునికి ఇష్టమైనదని, అందువలననే దేవుడు క్రైస్తవులను విసుగక మేలు చేస్తూ ఉండమని అజ్ఞాపించాడు.

5) ఇంతకుక్రైస్తవుని మేలు ఏంటో చూద్దాం. మేలు చేయటం అనగా మంచి చేయటం, దానం చేయటం అని పర్యాయ పదాలు వస్తాయి. క్రైస్తవ మేలు అనగానే దేవుని వలన క్రైస్తవుడు మేలు పొందటం అనుకుంటే పొరపాటే. నిజం ఏంటంటే క్రైస్తవుడు అనగా “క్రీస్తు రక్తం ద్వారా విలువ పెట్టి కొనబడిన వ్యక్తి”. అనగా క్రైస్తవుడు చేయవలసిన మేలు సాక్షాత్తు క్రీస్తు ద్వార దేవునికే. ఎందుకనగా మనం కొనే ఏ వస్తువు అయిన మనకు మేలు చేస్తే మనం ఉంచుకుంటాం. అలాగే క్రీస్తు మనల్ని తన క్రయధనంతో కొన్నప్పుడు మనం కూడ క్రీస్తుకు మేలు చేయలి.

6) మేలు చేయటం వలన ఉపయోగాలు ఉన్నాయా అంటే ఈ లోక సంభందమైన ఉపయోగాలు లేవు గానీ పరలోక సంభంధమైన మేలులే ఉన్నాయి. యోహాను 5:29 మేలు చేసిన వారు మాత్రమే జివ పునరుర్దానమునకు సమాధి నుండి బయటకు వస్తారు & Iతిమోతి 6:18 వాస్తవమైన నిత్యజివాన్ని రాబోవు కాలానికి మంచి పునాదిని వేసుకోవాలంటే మేలు చేయాలి. దేవునిదృష్టిలో మేలు చేయటం ద్వార దేవున్ని సంతోషపెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. రోమా 3:12 మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. ఈ విషయాన్ని గమనించిన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ భూమి మీదకు వచ్చాడు (హెబ్రీ 10:7). కాబట్టి మేలు అనే పదానికి అర్థం యేసుక్రీస్తు ద్వారానే తెలుసుకోవాలి. 

7) “యేసుక్రీస్తు పరలోకానికి మార్గమని, యేసు ద్వారానే నిత్యజివమని ప్రకటించుటయే క్రైస్తవుడు చేయవలసిన మేలు”. రోమా 5:17 మరణము ఒకని అపరాధములమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబహుల్యమును “నీతి దానము” ను పొందిన వారు జీవము గలవారై మరి నిర్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే యేలుదురు.

8) పైన చెప్పబడిన మాటను బట్టి క్రైస్తవుడు చేయవలసిన దానము “నీతి దానము” అని అర్థమయింది. మరి నీతి అనగా ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే దానికి కూడా bible సమాధానం చెప్తుంది. రోమా 4:3 లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవున్ని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయనను నమ్మటమే నీతి. మరి ఈ నీతిని దానం చేయటం ఎలాగో పరిశిలిద్దాం. II పేతురు 2:5 మరియు అయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహినుల సమూహము మీదికి జలప్రళయం రప్పించినప్పుడు “నీతిని ప్రకటించిన” నోవహును మరి ఏడుగురిని కాపాడెను. 

9) కాబట్టి పైన చెప్పబడిన లేఖనం ప్రకారం నోవాహు జలప్రళయం సమయంలో రక్షణ సువార్తను ప్రకటించాడు అనేవిషయాన్ని పరిశుదాత్మ దేవుడు నీతిని ప్రకటించటంగా బయలుపరిచాడు(Iపేతురు3:21). ఇంతవరకు మన వివరణలో మనకు తెలిసిన ఫలితార్ధం ఏమనగా “క్రైస్తవుడు సువార్తను ప్రకటించుటయే నీతిని దానం చేయటం”

10) సర్వలోకనికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే సర్వలోకాన్ని నీతిమంతులుగా మార్చమనే అర్థం ఇమిడి ఉంది. కానీ క్రైస్తవులు ఆకలిలేని ప్రపంచాన్ని నిర్మించాలని అన్నదాన కార్యక్రమాలు, ఆరోగ్యవంతమైన సమాజం కోసం మిషనరీ hospitals, రక్తదానాలు, నేత్రదానాలు, పేదరిక నిర్మూలనకు వేదేశాలు పంపుతున్న ధనంతో కేవలం ఇవి మాత్రమే చేయటం ద్వారా క్రైస్తవ్యం కాస్తా క్రైస్తవ మతంగా మారిపోయింది.

11) ఈ జీవితకాలం మట్టుకు సుఖాల కోసం దాన ధర్మాలు చేసి మనుష్యుల్ని ధనవంతుడు ఉండే వేధనకరమైన స్థలానికి పంపుతారో లేక వాటితో పాటు నీతి దానం చేసి దరిద్రులను సైతం దేవుడున్న లోకానికి చేరుస్తారో నిర్ణయం మిదే. యుదా1:23 నీతి దానం ద్వారా అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా రక్షించండి. యాకోబు 4:17- మేలైనది చేయనేరిగియు ఆలాగు చేయని వణికి పాపము కలుగును. యాకోబు 1:21-ఆత్మలను నరకగుండం అనే కటినమైన శిక్ష నుండి తప్పించగల శక్తీ గల్గిన వాక్యమును ప్రకటించండి.

12) ఇదే క్రైస్తవుడు చేయవలసిన, క్రీస్తు చేసిన, దేవుడు చేయమన్న అతి ప్రాముఖ్యమైన, శ్రేష్టమైన గొప్ప మేలు. ఇది అన్ని దానముల కన్నా విశిష్టమైన దానం. ఈ మేలు(దానం) మరుపురానిది, దేవుడు మరువలేనిది. 

Friday, August 8, 2014

మనిషీ జన్మ దినం రహస్యమా?


1) నేటి ఆధునిక ప్రపంచములో ఏ దేశంలో చూసిన ప్రజలు వారితో పాటు వారి భంధువుల యొక్కయు ,నాయకుల,అభిమాను ల,అధికారుల యొక్కయు జన్మ దినం(జయంతి), మరణ దినం(వర్ధంతి) స్మరించుట మనం చూస్తున్నాము. అలాగే వారు నమ్మిన దేవుళ్ళకి కూడా జయంతి, వర్ధంతులను జరిపించడం సర్వసాదారణ విషయం.మనిషి జన్మ బహు గొప్పది. తనకన్నా ముందు పుట్టిన ప్రకృతి నుండి తీయబడిన శరీరాన్ని ధరించుకుని, అదే ప్రకృతిపై పెత్తనం చేలాయించుట అనేది నిజముగా అదృష్టం. ఏవరికి అంతుబట్టని ఈ అపురూపమైన శరీరాన్ని ధరించుకోవటానికి వెనుక ఎంతటి పోరాటం జరిగిందో ఒకసారి ఆలోచిస్తే మతి పోతుంది.

2) ఉదాహరణకు ఒక మామిడి చెట్టును చూద్దాం. దాని పుతకాలంలో ఆకులే కనబడనంతగా కోట్ల సంఖ్యలో పూస్తుంది. కానీ పువ్వు అంత కాయలుగా మారుతాయా? ప్రకృతి ప్రభావముతో ఎన్నో లక్షల పూలు నెల రాలిపోగా వేల సంఖ్యలో పిందెలుగా మారుతాయి. ఆ పిందెలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుని వందల సంఖ్యలో మాత్రమే కాయలుగా ఇస్తున్నాయి. అవన్నీ పండ్లు అవుతాయా అంటే లేదు. ఎన్నో కారణాల చేత చాలా నేలరాలిపోగా లెక్కపెట్టే సంఖ్యలో కొన్ని మాత్రమే పండ్లుగా మారుతాయి. ఇప్పుడు నరుల పుట్టుక గూర్చి ఆలోచిద్దాం. పెండ్లి అయిన దంపతులు దేవుని ఆజ్ఞ- ఆశీర్వాదం ప్రకారం ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు పురుషుని నుండి కోట్లాది జివ కణాలు( X,Y CHROMOSOMES) స్త్రీ గర్భాములోకి వెళ్తాయి. అయితే వారు కలుసుకున్న ప్రతి సారి స్త్రీ అండాశయంలోకి ప్రవేశించి పిండముగా మారుతాయా? లేదు.ప్రతి సారి కొన్ని కోట్ల జీవ కణాలు నేల రాలుతాయి. ప్రతి నెల స్త్రీ అండం కూడా నెల రాలుతుంది.ఇలా ఎన్నో years నుండి పిల్లలు పుట్టని వారు ఉన్నారు.ఎప్పుడో ఒకసారి దైవ సంకల్పాన్ని బట్టి మాత్రమే స్త్రీ కణం(అండం)తో ఒక పురుష కణం (x గానీ,y గానీ) మాత్రమే కలుసుకుని ఫలదీకరణం చెంది పిండముగా మారుతుంది. అది అడ లేక మగ కావచ్చు. అదే నీవు-నేను ధరించుకున్న ఈ ఆకారం. 

3) నీకన్నా ముందు వెనుకల ఎంత మంది నెల రాలిపోయరో పువ్వు రాలినట్టుగా అని ఆలోచిస్తే ఒళ్ళు జలదరిస్తుంది. పిండముగా మారిన బయటికి రాలేక గర్బస్రావంలో పోయిన వారెందరో, ఇలా ఎంతో గట్టి పోటీని తట్టుకుని ఎంతో పోరాటంలో అమ్మ కడుపులోంచి బయటి ప్రపంచానికి వచ్చాం. కీర్తన 139:14- నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, అర్చర్యమును నాకు పుట్టుచున్నవి అని దేవుడు తన కుమారుడైన దావీదు ద్వారా పలికించిన మాట అక్షర సత్యం కదు. ఈనాడు ప్రతి మనిషి దేవునిని వదిలి శాస్త్రం వెంబడి పరుగులు తీస్తున్నాడు.నిజంగా ఏ మానవ జ్ఞానం లేక శాస్త్రం తల్లి గర్భములో శరీరాన్ని నిర్మించగలదో ఆలోచించండి.కంటికి కనబడని అవయవాల సమ్మెళనమై అందమైన ఆకారముగా మారుతుంది. ఈ అవయవాలను దేవుడే (1కోరంది 15:37:38) తల్లి గర్భములో తయారు చేస్తున్నాడు. ఈనాడు శాస్త్రాన్ని నమ్ముకున్న మనుషులు శరీరములో ఉన్న leg లేద hand పోతే కృతిమ leg లేక hand తప్ప original leg or hand తయారు చేయలేరు. ఇంకా కన్ను, kidney, heart ఇలా ప్రతి అవయవం దేవుడే తయారు చేసిన చేసాడు కానీ మనిషి చేయలేదు. 

4) ప్రపంచములో ఎన్నో కోట్ల మంది మనుషులున్నారు. వాళ్ళను జాగ్రతగా పరిశిలిస్తే అందరికి అవే స్థానాల్లో ముక్కు, నోరు. ఇలా కనబడే అవయవాలు ఒక్కటిగానే ఉన్నట్టుగా అనిపించినా ఒక్కటిగా ఉండరు. చివరికి కవల పిల్లల్లు అయిన ఎక్కడో ఒక చోట తేడ ఉంటుంది. యోబు 37:7-మనుషులందరు అయన ( దేవుని) సృష్టి కార్యములను తెలుసుకోనునట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి అయన ముద్ర వేసియున్నాడు. ప్రపంచం జనాభా సుమారు 700 కోట్లు. వారి చేతి వేలి ముద్రలను పరిశీలించినట్లయితే ఏ ఒక్కరి వేలి ముద్ర మరొకరి వేలి ముద్రతో సరిపోదు.అదే దేవుడిచ్చిన మానవ శరీరం ప్రత్యేకత అని సకల శాస్త్రాలను అధిగమించిన bible ఏనాడో చెప్పిన వాస్తవం.

5) నేటి సర్వ మానవులు ప్రతి ఒక్కరు ఒక ప్రాంతంలోనో, దేశంలోనో, ఇంట్లోనో, ఆసుపత్రిలోనో, మనుష్యుల సమక్షములో పుట్టుచున్నాం అనుకుని తమ పుట్టిన తేదిని వ్రాయించుకుని ప్రతి దినము లేవ గానే దిన,వార,మాస ఫలాల పేపర్లలో చూసుకుని మురిసిపోతున్నారు.నిజముగా లోకం అనుకుంటున్నా ఈ జన్మ దినం కరెక్ట్ నేనా? మనుష్యులు వ్రాసిన గ్రంధాలను అడిగితే వారి ఆలోచనలు ప్రకారం వ్రాస్తారు గనుక ఒకరు వ్రాసింది మరొకరితో సరిపోదు. అందరిని పుట్టించిన దేవుడిని అడిగితేనే న్యాయముగా ఉంటుంది. కీర్తన 139:15- నేను రహస్య మందు పుట్టినవాడు. క్రి.పూ ఇశ్రాయేలియులను పరిపాలించిన దావీదు మహారాజు దేవుని ప్రేరేపణతో అంటున్న మాటయే అయన రహస్య మందు పుట్టానన్న విషయం. bibleలో కచ్చితముగా చెప్పబడింది అంటే మనుష్యులందరు రహస్యంగానే పుడుతూ ఉండాలి. అది ఎలాగో పరిశిలిద్దాం. 

6) తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన దినాన్నే పుట్టిన రోజు అంటున్నాం. కానీ అంతకముందే దాదాపు 9 నెలలు తల్లి గర్బంలో ఉన్నాం అనే సంగతి మర్చిపోతున్నాం. అంతకమునుపు ఎక్కడ ఉన్నాం? అందులోనికి ఎప్పుడు వచ్చాం? తల్లి గర్భములోకి రాకమునుపు తండ్రిలో ఉన్నాం. అంటే ప్రతి మనిషి తన తండ్రి ద్వార తల్లి గర్భములో ప్రవేస్తున్నాడు. అందుకే నేటి doctorsనీ అడిగితే అడ, మగ బిడ్డ పుట్టాలన్న నిర్ణయించేది పురుషుడే అని చెబుతారు. అంటే మనం తండ్రిలో నుండి తల్లిలోనికి ప్రవేశించి తల్లి గర్భములో శరీరాన్ని లేదా ఒక ఆకారాన్ని సంతరించుకుని దాదాపు 9 months తర్వాత బయటి ప్రపంచానికోస్తున్నాం అన్నమాట. ”తండ్రిలో నుండి విడిపోయి అనగా తండ్రి కనగా తల్లిలోనికి వచ్చి అండంతో కలిసి పిండంగా మారిన దినమే మనం పుట్టిన దినం”. తల్లి గర్భమే మన జన్మ స్థలం కానీ ఇండియా కాదు.

7) నిజముగా మన జన్మ దినం రహస్యమే. అది అమ్మకు,నాన్నకు తెలియదు. అమ్మకు నెల రోజుల తర్వాత తెలుస్తుంది.అమ్మ చెబితేనే నాన్నకు తెలుస్తుంది. ఎందుకు తెలియదు?? test చేసి scanning ద్వారా doctor చెబుతాడని వెళితే ఆ కంప్యూటర్ కూడా ఒక వారం ముందు,వెనుక అనగా expected delivery date అని చెబుతుందే తప్ప correct date చెప్పదు. ఎందుకంటే దేవుడే మన పుట్టిన దినం రహస్యం అన్నాడు కాబట్టి మనిషి ఎన్నటికి తెలుసుకోలేడు. ఇది దేవుడి challenge.మనం పుట్టిన దినమే రహస్యమైతే మరి దేవుడి పుట్టిన దినం గూర్చి ఆలోచిస్తే పిచ్చిపడుతుంది 

8) దేవుడు bibleలో మరో అద్బుతమైన మాట చెప్పాడు. మన తల్లితండ్రులు అయితే మనల్ని భూప్రపంచాములోనికి వచ్చాక చూస్తారు గానీ ఆయనైతే తల్లి గర్భంలో పిండముగా ఉండి ఆ తర్వాత ప్రతి దినము మన అవయవ నిర్మాణము జరుగుతున్నప్పుడు చూస్తున్నాడు. కీర్తన 136:16-నేను పిండమునైయుండగా నీ కన్నులు నన్ను చూచెను. అంటే మానవ నేత్రానికి కనపడని సుక్ష్మ పిండంగా ఉన్నప్పటినుండి చూస్తున్న దేవుడు నీవు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎక్కడ తిరుగుతున్నావో, ఏమి చేస్తున్నావో చుడడా? ఎందుకు అంత జాగ్రతగా నిన్ను చూస్తున్నాడు అను అనుకుంటున్నావు? నీవు అయన కుమారుడవు,సాక్షాత్తు అయన స్వరూపమై ఆయనలోని భాగానివి గనుక. అలాగే నీకు ఒక జీవిత కాలాన్నిముందే నియమించి ఇక్కడకు పంపుతున్నాడు. కీర్తన 139:16- నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నియు నీ గ్రంధములో లిఖితిములాయెను. నియమింపబడిన దినాలు అనగా జీవితకాలం. అదే ప్రపంచంలోనికి వచ్చిన దినం నుండి ప్రపంచాన్ని వదిలి వచ్చిన చోటికి తిరిగి వెళ్ళడం అనగా మరణ దినం. అదే సమాధి రాయి మీద కనబడే “జననం- మరణం. 

9) మరో అద్బుతమైన విషయం చూస్తే మన మరణ దినమేప్పుడో కూడా మనకు తెలియదు. ఇది. secret. bibleలో అన్ని విషయాలు తెలియజేసిన దేవుడు మన జన్మదిన-మరణ దినాల గూర్చి మనకెందుకు తెలియజేయలేదు అనే ఆలోచన రావొచ్చు. మన జన్మకు,ఈ జగత్తుకు కారకుడు మన ఆత్మకు భాగము(కీర్తన 16:5) అయన పరమాత్ముడైన తండ్రియగు దేవునికి కూడా జనన-మరణాలు లేవు గనుక. మన తండ్రియైన దేవుడు ఆది-అంతం లేనివాడైతే మనకు ఆది- అంతం ఉంటాయని బ్రమించడం వేర్రితనమే అవుతుంది. దేవుడు ఉన్నవాడు గనుక ఆ ఉన్నవాడిలో నుండే పుట్టుకోనివచ్చి కొద్ది కాలం ఆ మట్టి శరీరంలో, ప్రస్తు తం ఆభూమి మీద జివించుచూ ఉన్నవారం. ఇందులోనికి రాక ముందు దేవునిలో ఉండేవారం(కీర్తన 90:1). 

10) ఈ శరీరాన్ని వదిలినాక కూడా మన క్రియలను బట్టి నరకంలో నిత్యం కాలుతునో,లేక పరలోకంలో నిత్యం అనంధముతోనో ఎక్కడో ఒక చోట తప్పని సరిగా ఉంటాం.. address మాత్రం గల్లంతు కాదు.. అన్ని సంగతులను నిజంగా చెప్పిన bible ఈ విషయం కూడ సత్యమే చెప్పింది.నమ్మటం-నమ్మకపోవటం నీ ఇష్టం. అందుకే మానవ మట్టి బుర్రతో కాక ఆత్మజ్ఞానంతో ఆలోచిస్తేనే తెలుస్తుంది. దేవుడు మన పుట్టుక-చావులను మనకెందుకు రహస్యముగా ఉంచాడో అర్థమయింది .కనుక దేవుడుజీవిత కాలాన్ని వ్యర్ధం చేయకుండా,మనకెందుకు ఈ జన్మనిచ్చాడో అనే దేవుని సంకల్పాన్ని తెలుసుకొని అయన ఆశ,ఆశయాలకను గుణంగా అయన చిత్తాన్నిఅను క్షణం నెరవేరుస్తూ మట్టి లోకంలో మనిషిగా బ్రతికినంత కాలం నీలోని దైవత్వాన్ని ప్రపంచ ప్రజలకు చూపాలి.

11) మనిషి సృష్టించలేని, ఎక్కడ తెలుసుకోలేని అమూల్యమైన కాలాన్ని సరిగ్గా ఆ దేవుని కోసం ఉపయోగిస్తే నీకు, నీ కుటుంబానికి, నీ దేశానికి ఆఖరున నిన్ను కనిన దేవునికి కూడా ఎంతో మేలు చేసిన వాడివి అవుతావు. ఇంకా ఎన్నో వేల years అయిన ఈ శాస్త్రవేత్తలు ,మేధావులు,ఇంకా ఎవ్వరైనా తెలుసుకోలేని ఎన్నో నిగుడమైన సంగతులను దేవుడు తన పిల్లలైనా వారి కోసం ఎన్నో వేల years క్రితమే తన మాటలైనా పరిశుద్ద గ్రంథమని పిలువబడే bibleలో వ్రాయించి ఆ తర్వాత వాటిని ముద్రించి భావితరాల కోసం భద్రం చేసాడు.వాటిని తెలుసుకుని ,గ్రహించి వాటి ప్రకారం ప్రవర్తించి దేవునితో పాటు దేవలోకం లేక పరలోకంలో నిత్యము ఆనందముతో జీవించాలనే ఆశ,ఆశయం,తపనతో ఉండాలి.