Tuesday, August 26, 2014

ప్రకృతి కన్నెర్ర చేస్తుందా?



ప్రతి సంవత్సరము వర్షా కాలములో గాని, ఎండా కాలములో గాని, వేసవి కాలములో గాని జరుగుతున్న ప్రకృతి వైపరిత్యాలు లేక విపత్తులు అది ఒక భూకంప రూపముగా, సునామి రూపముగా, తుఫాను రూపముగా ఇలా ప్రకృతిలో సంభవించినప్పుడు జరిగే ఆస్తి నష్టము, ప్రాణ నష్టము పరిగణలోకి తీసుకుని ప్రింట్ మీడీయ (న్యూస్ పేపర్), ఎలెక్ట్రానిక్ మీడీయ( టీవీ న్యూస్) వారి మాటల్లో, రాతల్లో ఉపయోగించే పదమే “ప్రకృతి కన్నెర్ర చేసింది” అని. ఇప్పటివరకు జరిగిన వైపరిత్యాలు వెనుక ప్రకృతి ఉందని, పగ పట్టిందని, కన్నెర్ర చేసిందని, భిబత్సవము చేసిందని అనుకుంటున్నారు. అసులు ప్రకృతికి ఎందుకు పగ? ప్రకృతి మనిషి పై పగ చేయటము ఏంటి? ప్రకృతి అనగా పంచ భూతల కలయిక అని మనకు తెలుసు. ఈ పంచ భూతాలు సాక్షాత్తు దేవుని దూతలు అని bible లో తెలుసుకున్నాము. ప్రకటన 16:6- జలముల దేవదూత చెప్పగా వింటిని. అంటే నీరు ఒక దూతగా కనపడుతుంది వాక్యములో. అస్సలు ఈ ప్రకృతి ఎలా ఏర్పడింది, కలిగింది అని ప్రారంభాములోకి వెళితే దేవుడు వీటన్నిటిని తన మాట చేత కలిగించాడు. భూమి కలుగును గాక అను మాటకు ,సూర్య ,చంద్ర నక్షత్రాలు కలుగును గాక అను మాటకు కలిగాయి. అనగ ప్రకృతిలోని సర్వము సాక్షాత్తు దేవుని నోటి మాట వలన ఏర్పడింది.

1) హెబ్రీ 1:7 తన దూతలను వాయువులను గాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. అస్సలు నీరు గాలి, అగ్ని అను దూతలు ఎందుకు కలిగించాడు? ప్రకృతిని దేవుడు కలిగించుటలో ఉద్దేశము ఏంటి అనుకుంటే “భూమి మీద బ్రతుకుతున్న తన పిల్లలమైన మనకి ఈ ప్రకృతి లోబడి మనకు సేవ చేయాలనీ. అదే దేవుడు వాటికీ అజ్ఞాపించాడు. హెబ్రీ 1:14- వీరందరు (దూతలు) రక్షణయను స్వాస్థము పొందబోవువారికి ( మనకి) పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అనగా మనకు పరిచారము (సేవ) చేయటానికి పంపబడిన సేవకులైన దూతలు. దేవుడు ఈ ప్రకృతిని మనకు సేవ చేసేటట్టు పెట్టాడు. సూర్యుడు మన పనిలో, గాలి మన పనిలో, నేల మన అవసరాన్ని తీరుస్తుంది. సేవకులుగా చెప్పిన మాటను వినవలసినది పోయి ఈ రోజు మనుషుల మీదకు ఈ ప్రకృతి తిరగబడడములో ఉన్న కారణమూ ఏంటి? మన సేవలో ఉండవలసిన నీరు ఎందుకు మనుషులను శెవాలుగా మారుస్తుంది? గాలి పెనుగాలిగా మరి ఎందుకు ప్రాణ నష్టము మిగిలిస్తుందిఎందుకు? ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? అస్సలు సేవకులు మనకు తిరగాబడుతున్నరెందుకు? మన సేవలో మన కాళ్ళ క్రింద అణిగి మణిగి ఉండవలసిన ఈ ప్రకృతి ఈ రోజు మనకు తిరుగుబాటు చేయుటలో గల ఉద్దేశము ఏంటి?

2) ప్రకృతికి దేవుడు ఒక నియమము పెట్టాడు .” భూమి మీద బ్రతికినంత కాలము నా పిల్లలు నాకు లోబడితే మీరు వారికీ లొబడి పని చేయండి. ఒకవేళ ఎప్పుడైతే నా పిల్లలు నాపై తిరుబాటు చేస్తారో మీరు తిరుగుబాటు చేయండి.. అనగా మనము భూమి మీద దేవుడికి భయపడి, దేవుడికి లోబడి బ్రతికినంత కాలము ఈ ప్రకృతి మనకు లోబడి ఉంటుంది. ఇది దేవుడు ప్రకృతికి ఇచ్చిన ఆజ్ఞ. యెషయ 1:2- యెహోవ మాటలడుచున్నాడు - ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యోగ్గుము . నేను పిల్లలను పెంచి గోప్పవారినిగా చేసితిని. వారు నా మీద తిరగాబడియున్నారు. ఇక్కడ దేవుడు ఆకాశాముతో, భూమితో మాటలడుచున్నాడు. హబక్కుకు 2:11-గోడలలోని రాళ్ళూ మొర్రపెట్టుచున్నది దూతలు  వాటికీ ప్రత్యుత్తరమిచ్చుచున్నది. అనగా రాళ్ళూ కూడా మొర్రపెట్టుచున్నాయి. ఆకాశము, భూమి దేవుని మాట వింటుంది గనుక దేవుడు వాటితో మాటలడుచున్నాడు. భూమి మీద దేవునికి లోబడవలసిన పిల్లలు లోబడక తిరిగుబాటు చేసినప్పుడు అయన పంచభుతాలకు అజ్ఞాపిస్తున్నాడు. భూమి మీద తన పిల్లలైనా వారు తనను కాదు అనుకుని, తన మాటను పెడచెవిన పెట్టి ఆవిధేయులుగా మారిన రోజున ఈ పంచభుతలకుపని చెబుతాడు. అస్సలు కన్నెర్ర చేస్తుంది పరలోకమందున్న దేవుడు అని తెలియక ప్రకృతి కన్నెర్ర చేస్తుంది అనుకుంటున్నారు. దేవుని కళ్ళు ఎర్రపడ్డాయి గనుక ప్రకృతిలో భీబత్సము. అందుకే ప్రకృతిలో ఇన్ని వైపరిత్యాలు. ప్రకృతిలో జరుగుతున్న ప్రతి వైపరీత్యము వెనుకాల ప్రకృతిని కలిగించిన దేవుని కన్నులు ఎర్రబడ్డాయి.

3) నీరు యొక్క ఉగ్రత చూద్దాము. ప్రకటన 16:4- మూడవ దూత తన పాత్రను (దేవుని కోపము) సముద్రములో కుమ్మరింపగా. ఇప్పటి వరకు వరద భీబత్సము అను మాటను న్యూస్ లో కానీ, న్యూస్ పేపర్ లో చూసాము విన్నాము. దేవుడు సముద్రాలను కలిగించి ఇసుకను సరిహద్దుగా నియమించాడు ఆ సరిహద్దు అయిన ఇసుకను దాటి ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని ఆజ్ఞ ఇచ్చాడు గనుక. యెషయ 23:11-అయన సముద్రము మీద తన చెయ్యి చాపెను. భూమిమీద పాపము విస్తరించడము వలన దేవునికి కోపం వచ్చింది. ఈ రోజు మంచి పాలనా చోట ఉన్నది అని చెప్పే స్థితి లేదు. ఎక్కడ చుసిన చెడు. అందుకని దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ ఎందుకు ఇంత భయముకరముగా వైపరిత్యాలు కలిగిస్తున్నడంటే ఆయనకు కోపము వచ్చిందన్న సంగతి ఆ వార్తలను వింటున్నపుడు, చదువుతున్నపుడు తెలుసుకుని నీ, నా, మన బ్రతుకుని సరిచేసుకుంటామని ఆ వార్తలు నీ, నా, మన చెవిన పడుతున్నాయి, కళ్ళముందు కనపడుతున్నాయి. ఆమోసు 5:8-సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యహోవా.

4) అగ్ని యొక్క ఉగ్రత చూద్దాము. ప్రకటన 16:8-నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కల్చుటకు సూర్యునికి అదికారము ఇయ్యబడెను. ప్రారంభములో దేవుడు సూర్యుని వెలుగిమ్మని చెప్పగా ఇప్పుడు అదే సూర్యుడు భూమి మీద మనుష్యులను కాల్చివేయమంటునాడు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఉష్ణోగ్రత దీనికి సాక్ష౦. ఎండాకాలం వచ్చిందంటే భయముతో బ్రతకవలసిన పరిస్థితి. కారణము పెరుగుతున్న అత్యదిక ఉష్ణోగ్రత. ప్రతి సంవత్సరం రీకార్డ్ గా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయంటే కారణము సూర్యునికి అదికారము ఇచ్చేసాడు. అందుకే సూర్యుడు ఉగ్రుడై భయముకరముగా మండిపోతున్నాడు. మండిపోతున్నదుకు ఎందరో మనుషులు రాలిపోతున్నారు. దేవుడు అగ్నికి ఆజ్ఞ ఇచ్చాడు.

5) గాలి యొక్క ఉగ్రత చూద్దాము. యిర్మియా 23:19-ఇదిగో యెహోవ యొక్క మహోగ్రతమను పెనుగాలి భయాలు వెళ్ళుచున్నది . అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకు పెళ్లున దిగును. తన కార్యమును సఫలపరచు వరకు తన హృదయలోచనలను నేరవేర్చువరకు యెహోవః కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతి మీరు బాగుగా గ్రహించుదురు. యేసు పుట్టకతో ప్రారంభమైనవి అంత్య దినాలు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రకృతి భీభత్సాలు ఆలోచిస్తే జరుగుతున్న ప్రతి వైపరీత్యాల వెనుక లోపము భూమి మీద బ్రతుకుతున్న మనిషిలో ఉన్న లోపము ద్వార దేవుని కళ్ళు ఎర్రబడి ప్రకృతితో దేవుడు మనుష్యులను నాశనము చేస్తున్నాడు. కనుక లోపము ప్రకృతిలో కాదు మనిషిలో ఉంది అని గ్రహించాలి.

6) తల్లి గర్భములో రూపించి, అవయవాలను ఇచ్చి, ఆకారము ఇచ్చి ఈ భూమి మీదకు రప్పించి, పెంచిన దేవునినే లేడు అనుకుని. ఉన్న అయన కోసము ఆలోచించక, బ్రతకక విచ్చల విడి జీవితానికి అలవాటు పడిపోయారు గనుక దేవుడు ఈ స్థితి చూసి కన్నెర్ర చేసి ప్రకృతితో నాశనము చేయాలనుకుంటున్నాడు. ఉదాహరణకి:: యోన చరిత్ర – యోన 1:10 నుంచి – దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా తనకు ఇష్టము వచ్చిన చోటికి వేలడానీకి సిధమయినాడు. ఆ వచనములో నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చెనని నాకు తెలిసియున్నది.. అనగా మనుషుల తప్పు వలన సునామి, భుకంపములు వస్తున్నాయి. భూమి మీద దేవుని వలన పుట్టి దేవుని కొరకు బ్రతకవలసిన మనుష్యులు తమ కోసము బ్రతకడంలో మునిగిపోయారు. దేవుని చిత్తము పక్కన పట్టి తన చిత్తము నెరవేరుస్తున్నారు. దేవుని మాట కాదని వారి మాటలనే నెరవేరుస్తున్నారు. అందుకే ప్రకృతిలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

7) ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యోగ్గుము అన్న దేవుడు ఎందుకు ఆకాశము, భూమితో మాటలడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భూమి మీద మనుష్యుల బ్రతుకులు సరిగా లేకపోవడము వలన. వారి బ్రతుకు విధానము బట్టి దేవునికి కోపము రావటము, ఆ కోపాన్ని బట్టి ప్రకృతికి ఆజ్ఞ ఇవ్వడము, ఆ ప్రకృతి దేవుని ఆజ్ఞను అమలు చేయడము, అమలు చేయడాన్ని బట్టి వందలాది వేలాది లక్షలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు.

No comments:

Post a Comment