Wednesday, September 3, 2014

ఏమి లేనప్పుడు దేవుడెలా ఉన్నాడు?


1) మనుష్యలందరికీ మిగిలిపోయిన చిక్కు ప్రశ్న “దేవుడు అర్థము కాకపోవడము”. ఏమి లేనప్పుడు దేవుడు ఎలా పుట్టాడు అని అడుగుతారే కానీ, తన కుడి చెయ్యి గుప్పెడు మెతుకులతో తన నోటి వద్దకు ఎందుకు తీసుకోని వస్తుందో ఆలోచించలేడు. దేవుని గూర్చి రుజువులతో చూపించే శక్తీ ఒక్క బైబిల్ కు మాత్రమే ఉన్నది. చెట్టు ముందా లేక విత్తనము ముందా? కోడి ముందా గుడ్డు ముందా అని తలతిక్క ప్రశ్నలు అడుగుతుంటారు. చెట్టు రావాలంటే విత్తనము ఉండాలి, విత్తనము రావాలంటే చెట్టు ఉండాలి అంటూ ఎదుటి వారిని తిక మక పెడుతూ ఉంటారు. అదే విధముగా దేవుడు పుట్టాలి అంటే దేవుడు అమ్మ అన్న ఉండాలి లేక దేవుడికి తండ్రి అన్న ఉండాలి అంటారు.

2) కోడి ముందా గుడ్డు ముందా అనే వారికీ మనము వేయాల్సిన ప్రశ్న నువ్వు ముందా? మీ నాన్న ముందా? దీనికి ఖచ్చితముగా మా నన్నే ముందు అని సమాధానము చెప్పక తప్పదు. అనగా సృష్టిలో ఉన్న ప్రతిది కూడా చిన్నది పెద్దదాని నుండి రావలసిందే కాని చిన్న దాని నుండి పెద్దది ఎప్పటికి రాదు.చిన్నది ఎదుగుతూ పెద్దదానిగా మారుతుంది. ఈ విషయము గూర్చి బైబిల్ లో చూస్తే ఆదికాండ1:11,12- దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మిధ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మోలిపించును గాక అని పలకగా ఆప్రకారమాయెను. అనగా వృక్షములు మొదట మొలిచినవి ,వాటిలో గల ఫలములలో విత్తనాలు ఉన్నయి. ఈ విశ్వములో వృక్షములు భూమి మిద తప్పించి మరే గ్రహములో చెట్లు ఉండవు. ఇక్కడ మనము చాల జాగ్రతగా ఆలోచిస్తే ఈ భూమి మీదకు విత్తనములు వచ్చుటకు ఆ విత్తనములు కలిగిన చెట్లు ఎక్కడ ఉన్నాయి? అందుకనే మొదట దేవుడు చెట్లను కలిగించాడు. మరో ముఖ్యమైన సంగతి ఏమనగా సృష్టిలో ఉన్నవన్నీ(మనతో సహా) వచ్చినవే గానీ ఉన్నవి కాదు.మనకంటే ముందే వచ్చేసాయి కాబట్టి మనకు సృష్టి అర్థము కావటము లేదు. మనకంటే ముందు ఈ సృష్టి జరిగినదని మనము ఎలా చెప్పగలం అంటే మనము ముందు చేయబడిన తర్వాత గాలిని చేసియుంటే ,గాలి లేక మనము చచ్చిపోయి ఉండేవారము. అందుకే తల్లి గర్భము నుండి భయటకు రాగానే మనకంటూ ముందే గాలి భూమి మిద ఉంటుంది. 

3) భుగర్భములో నుండి ఆదాము యొక్క మట్టి బొమ్మ భయటకు రాకముందే దేవుడు అన్ని వసతులు కలిగించి యుంచాడు. ఈ లోక వస్తువు వలెనే దేవుడు కూడా వచ్చిన వాడు కాదు. దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు ? దేవుడు చెబుతున్న సమాధానము నిర్గమ 3: 4- నేను ఉన్నవాడను,అనువాడను. అంటే నేను వచ్చిన వాడిని కాదు అని నేను ఉన్నవాడినిఅని చెబుతున్నాడు. ఉదాహరణకు:: నేను ఉన్నాను. నేను మా తండ్రి  నుండి వచ్చాను. మా తండ్రి  వాళ్ళ తండ్రి  నుండి వచ్చాడు. ఈ విధముగా వెనక్కి పోతే ఆఖరున చివరి ఎవరో ఒకాయన ఉండకపోడు. అందరి కంటే ఆఖరున(అనగా ప్రారంభములో) మిగిలిన వాడె దేవుడు. యెషయ 43:10,11- నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు.నా తరువాత ఏ దేవుడును ఉండదు. నేను నేనే యహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

4) అన్నిటికంటే ముందు ఉన్నవాడే నాకు ముందు ఎవరు లేరు అని అంటూ ఉంటె ,ఆఖరున పుట్టిన మనిషి దేవుడు ఎలా పుట్టాడు అంటాడు. దీనికి దేవుడు జవాబును యెషయ45:9లో చూడొచ్చు. దేవుడు చేస్తే కలిగిన వారము మనము. అయన పోమన్ని చెబితే మట్టిలోనికి పోవలసిన వారమే మనమంతా! అ,ఆ లు రానివాడు పాటాలు చదివిన ఎలా గ్రహించలేడో అలానే దేవుడు గురించి, మనము అనుభవిస్తున్న ప్రకృతి గురించి అర్థము కాని వారికీ దేవుని విషయాలు కూడా అర్థము కాలేవు. దేవుని గూర్చి అర్థము కావాలంటే మన శరీర అవయవాల నిర్మాణము వాటి పనితీరు దగ్గర నుండి దేవుడు వరకు ఆలోచించాలి. 

5) మనిషికి దేవుడు అర్థంకాలేకపోయినా దేవుళ్ళును మాత్రము కలిపివేస్తూ అందరి దేవుళ్ళు ఒక్కటే అంటాడు.మనము కలిపితే కలిసిపోవడానికి అయన( తండ్రియైన యెహోవా) నీళ్ళలో పాలను కుంటున్నారా? నిర్గమ 20:3,4- నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను రోషము గల దేవుడను. ఒకసారి ఈ వచనమును చదవండి. బైబిల్ నందు దేవుని మనస్సు తెలుసుకోక అందరి దేవుళ్ళు ఒక్కటే అనుట నిజం కాదు. యెషయ 44:24-యెహోవానాగు నేను సమస్తమును జరిగించువాడను. మనిషికి బ్రతుకు నేర్పించింది దేవుడే. అందుకే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ నుండి వచ్చాడు? అని ప్రశ్నించి తెలుసుకొనుట గుండుసూదితో మహా పర్వతాన్ని త్రావ్వినంత కష్టమైనదిగా భావించాలి. దేవుడు కలిగించిన మెదడు దేవుడుని ప్రశ్నిస్తున్నాడు.

6) దేవుడు కాలము లేని వాడు.( కీర్తన 102:27) .పరిమితి కలిగిన ఆయుష్షు ఉన్నవాడు కాదు. పూర్వ కాలము నుండి మనిషికి అన్ని విషయాలు దేవుడే నేర్పించాడు. భూమిని ఈ విధముగా సేద్యపరచాలో అడమునకు నేర్పించింది దేవుడే. పురుషుడు ఈ విధముగా ఉండాలని, స్త్రీ ఈ విధముగా ఉండాలని కలగజేసింది ఆయనే. ప్రపంచములో అంత పురుషులో లేక స్త్రీలో ఉంటె మన సంగతి ఏమిటో ఆలోచించండి. ఆదికాండ 1:27-దేవుడు తన స్వరుపమందు నరుని సృజించెను.

7) మనిషి తన కళ్ళతో చుడలేనివి,తన ఆలోచనకు అందనివి చాలా ఉన్నాయి. కొన్నిటిని మైక్రొస్కోప్ (Microscope) లో చూసుకుంటున్నాడు మరి కొన్నిటిని హబుల్ టెలిస్కొపు(Habul Telecrope) లో చూసుకుంటున్నాడు. మరి దేవుని దేనితో చూడాలో తెలుసా? బైబిల్ నందు వ్రాయబడిన వాక్యముతో చూడాలి.దేవునికి జ్ఞానము మనవలె మట్టి మెడదు నుండి వచ్చింది కాదు. 1కోరంది2:11- ఒక మనుష్యుని సంగతులు అతనిలో నున్న మనుష్యత్మకే కాని, ముష్యులలో మరి ఎవరికీ తెలియును?అలాగే దేవుని సంగతులు దేవుని అత్మకే గానీ మరి ఎవనికిని తెలియవు. కాబట్టి దేవుడు తన మాటలను, కార్యములను Translate చేయుటకు ప్రవక్తలకు తన పరిశుద్దాత్మను ఇచ్చియున్నాడు.

8) సూర్యుడు మండుచున్నాడు అంటే నమ్ముతున్నారు. నీరుగడ్డకడుతుంది అంటే నమ్మగలరు. కానీ కానీ దేవుడు ఉన్నాడు అంటే మాత్రమూ ఎందుకో నమ్మలేడు. మనకు వాలే దేవుడు వచ్చియుంటే అయన దేవుడు ఎలా అవుతాడు?? దేవుని గూర్చి బైబిల్ లో పూర్తిగా వ్రాయబడింది. బైబిల్ ముద్రణ యంత్రాన్ని కనుగొనిన తరువాత అచ్చు వేయబడిన మొదటి పుస్తకము ఇదే కాబట్టి చివరిగా మరొక మాట యోహాను 5:26 ను చదవండి.

9) దేవుడు ఒక మహాశక్తి కాబట్టి ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు.శక్తికి పుట్టుక ఉన్నదా? చావు ఉన్నదా? శక్తిని గానీ, పదార్ధాన్ని గానీ పుట్టించలేము నాశనము చేయలేము. శక్తికి లింగ భేదము లేదు. శక్తికి పుట్టుక చవులు లేనట్లే దేవునికి కూడా లేవు. మరి ఈ శక్తులు దేవుని ఉనికిని తెలియజేస్తున్నాయి దేవుడు కలిగించిన శక్తీకే ఇంతటి ధర్మము ఉంటె దేవుడు కూడా నాశనము లేనివాడుగా మహా శక్తిగా ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు స్వతంత్రుడుగా ఉన్నవాడు వచ్చివాడు కాదు. దేవుడు మరొక రూపము ధరించవలసిన అవసరము లేదు.

10) నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడే దేవుడు. మాటలలో, క్రియల్లోనూ దైవత్వాన్ని చూపించేవాడు.ఆయనకు బ్రతుకును ఎవ్వరు ఇవ్వలేదు. 

11) దేవుడు ఎలా వచ్చాడో ఆలోచించుటకు ముందు మనము ఎలా వచ్చామో ఆలోచించండి. తల్లి గర్భములో నుండి వచ్చాము అంటారా? అది నిజమే. ఆ తల్లి గర్భాములోనికి ఎక్కడ నుండి వచ్చాము? తల్లి గర్భాములోనికి రాకముందు ఎక్కడో ఉన్నాము. ఎక్కడో చెప్పమంటారా? ఉన్నవాడైన దేవునిలో ఉన్నాము. కాబట్టి దేవుడు “ఉన్నవాడే” గానీ వచ్చినవాడు కాదు. లోకములో ఉన్నవి మనము మొదట ఆలోచిస్తే అర్థమైతే అప్పుడు దేవుడు అర్థమవుతాడు.

బైబిల్లో మొహమ్మద్ గురించి చెప్పబడింది అంటున్న వారికీ చెప్పబడలేదు అనుటకు రుజువులతో కూడిన వివరణ PART - II

బైబిల్లో వ్రాయబడ్డ సందర్భాలను తప్పుగా అర్థము చేసుకుని, వారికీ(ముస్లింలు) అనుకూలముగా అన్వయించుకుని బైబిల్లో మోహామోద్ ప్రవక్త గురించి మోషే ముందుగా చెప్పబడింది అని ప్రకటిస్తున్నారు. అక్కడక్కడ సెమినార్స్ పెడుతూ బైబిల్లో చెప్పబడిన ఆ ప్రవక్త మోహామోద్ అని ప్రకటిస్తూ అనేక అమాయకులైన క్రైస్తవ విశ్వాసులను వారి మతములోకి మార్చుకుంటున్నారు. బైబిల్లో మోహామోద్ గురించి వ్రాయబడిన సందర్భాలు ఉన్నవని వారు(ముస్లింలు) అంటున్నప్పుడు అది ఎవరిని గురించి వ్రాయబడ్డాయో అన్న వాస్తవము ఏమిటో చెప్పవలసిన భాద్యత క్రైస్తవులమైన మనకు ఉంది. రెండవ భాగముగా(Second part) ఈ సందేశములో చుడండి.

1) (a) ఇంతకు బైబిల్లో మోషే చెప్పిన ఆ ప్రవక్త ఎవరు అనే విషయము మనకు తెలియాలంటే ముందుగా ప్రవక్త అని ఎవరిని అంటారో తెలియాలి. ప్రవక్త అనగా ప్రభువు పంపగా వచ్చినవాడు, ప్రభువు పక్షముగా ప్రజలతో మాట్లాడేవాడు, దేవునికి మరియు ప్రజలకు మధ్యవర్తి అని. పాత నిబంధనలో ప్రవక్తలందరూ ప్రజలతో మాటలాడుచున్నప్పుడు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా అని స్టార్ట్ చేయడం మనము చూస్తున్నాము. యెషయ 50:1-యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెషయ 66:1-యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యీర్మియా1:4- యెహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. పై వచనాలు బట్టి చూస్తే ప్రవక్త అంటే ప్రభువు చెప్పిన మాటలను ప్రజలకు ప్రకటించుట అని. 

(b)ఈ మధ్య కాలములో కొందరు తమ పేరులకు ముందు ప్రవక్త అని, మరికొందరు అపోస్తులడని పెట్టుకోవడము మనము చూస్తూ ఉంటాము. కానీ ప్రవక్తలనబడిన వారు ఎప్పటి వరకు ఉన్నారో అనే విషయాన్నీ బైబిల్లో చూస్తే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే Luke16:16-యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తులును ఉండిరి అని అంటున్నాడు. మొదటి శతాబ్దము వరకే ప్రవక్తలు ఉన్నారన్న విషయము అర్థమైతే తరువాత వచ్చిన వారు ఎవ్వరు ప్రవక్తలు కారనే సంగతి సులువుగా గ్రహించవచ్చు. అలా అయితే యేసు మాటను బట్టి( బైబిల్) క్రీస్తు తరువాత 500 years వచ్చిన మోహామోద్ ప్రవక్త అయ్యే అవకాశమే లేనప్పుడు “ఆ” ప్రవక్త కాగలడా?

(c) ముస్లిం సోదరులు ఏ మాటను అపార్ధము చేసుకుని బైబిల్లో లేని మోహామోద్ ను బైబిల్లో ఉన్నాడు అంటూ భ్రమపడుచున్నారో చూస్తే ద్వితియోప18:16,18,19.- (నీ) వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. అతని నోట నా మాటలు ఉంచేదను. నేను అతనికి అజ్ఞాపించునది యావత్తు అతడు వారితో చెప్పెను. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను. పై మాటను ముస్లిం సోదరులు ఎలా వక్రికరించారంటే మోషే ఇశ్రాయేలీయులతో నీ సహోదరులలో నుండి అన్నాడు కనుక ఇశ్రాయేలీయుల సహోదరులు ఇష్మాయేలీయులు కనుక మోషే చెప్పిన “ఆ” ఇష్మాయేలీయులలో నుండి రావాలి మరియు ఆ ప్రవక్త మాటే అందరు వినాలి ఆయనే మోహామోద్ ప్రవక్త అని వాక్యాన్ని అపార్ధము చేసుకున్నారు. 2 పేతురు 3:16- లేఖములను అపార్ధము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్ధము చేయుదురు.

(d)ఈ సందర్భములో మోషే మాటలాడుచున్నది ఇశ్రాయేలీయులను ఉద్దేశించే కానీ ఇష్మాయేలీయులు కొరకు కాదు. కారణము చూస్తే ఇశ్రాయేలీయులు అనగానే ఒక్కరు కాదు పన్నెండు గోత్రాలు ప్రజలు. ఒక గోత్రము వారు మరొక గోత్రపు వారికీ సహోదరులు అవుతారు. ఒక వేళ వారి (నీ) సహోదరులు అనగానే ఇష్మాయేలీయులు గురించి అని అనుకుంటే ప్రతి సందర్భములో అలానే ఆలోచించాలి. ఉదాహరణ: ద్వితయో 17:15- నీ సహోధరులలోనే ఒకని నీ మిధ రాజుగా నియమించుకొనవలెను అను మాట ఉంది. పై మాటలో నీ సహోదరులు అనగానే ఇష్మాయేలీయులు అయితే ఇశ్రాయేలీయులపై రాజులూ ఎవరు ఉండాలి? ఇష్మాయేలీయులే ఉండాలి. అలా అయితే ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులలో ఒక్కరినైన ఇష్మాయేలీయుడను చూపించగలరా? లేదు. కారణము ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులందరు ఇశ్రాయేలీయులే( సౌలు, దావీదు, సోలోమోను, రెహబాము, యరోబము. ఇలా వీరు అందరు ఇశ్రాయేలీయులు.

(e) పై సందర్భమును బట్టి ప్రవక్త ఇశ్రాయేలీయులలో నుండి మాత్రమే రావాలి అనే విషయము స్పష్టమయింది. దేవుడు తన మాటలను తెలియజేయటానికి ప్రారంభము నుండి అనగా మోషే కాలము నుండి ఇశ్రాయేలీయులు(యూదులు)ను మాత్రమే ఎంపిక చేసుకున్నట్లుగా మనము బైబిల్ నందు చూడగలము. ఎక్కడైనా దేవుడు ఇష్మాయేలీయుల ద్వారా నా మాటలను తెలియజేయుదును అని అన్నట్లుగా మీరు చూపించగలరా? రోమ 3:1, యావేలు2:11, ఆమోసు 2:11, కీర్తన 147:19 ఇలా ఈ వచనాలలో చూడొచ్చు. ప్రవక్తలందరు ఇశ్రాయేలీయుల నుండి వచ్చారు, వస్తారు అనే విషయము మనకు అర్థమవుచున్నది గనుక ఆ మాటలన్నిటిని బట్టి మోహామోద్ “ఆ” ప్రవక్త అయ్యే అవకాశమే లేదు.

(f) ఇప్పటివరకు “ఆ “ ప్రవక్త ఇశ్రాయేలీయులలో నుండి మాత్రమే రావాలి అని. మరి ఎవరు “ఆ ప్రవక్త? యేసుక్రీస్తు(రాక) విషయమై ఎన్నో ప్రవచన లేఖనములు ధర్మశాస్త్రములోను, కీర్తన గ్రంధములోను, ప్రవక్తల గ్రంధములోను మనము చూడగలము ( యోహాను 1:45, లూకా 24:44) . ఈ వచనములో యేసుక్రిస్తే స్వయంగా నన్ను గూర్చి మోషే ధర్మశాస్త్రములోనువ్రాయబడింది అని చెబుతున్నాడు అంటే ఒక వేళ మోషే ద్వితియొపదేశకాండంలో చెప్పిన “ఆ” ప్రవక్త యేసు కావచ్చు కదా!

యేసు ప్రవక్తా?

2) (a)హెబ్రీ 1:12- పూర్వకాలమందు నానా సమయములలోను, నానా విధములగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు , ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడేను. దేవుడు చెప్పిన ప్రతి మాటను ప్రజలకు తెలియజేయువాడే ప్రవక్త అని ముందు మాటల్లో మీరు చదివారు. ఇప్పుడు యేసును కూడా ప్రవక్తగా మనము చెప్పుటలో తప్పు లేదు. యోహాను 12:49,50, 17:7,8:26,7:16 లో చూడొచ్చు. తండ్రియైన దేవుడు తెలియజేసిన( చెప్పమన్న) సంగతులు కాక యేసు మరేమియు చెప్పలేదని అనగా ఒకనాటి ప్రవక్తల వలె యేసు కూడా దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా యుండి ప్రజలకు దేవుని మాటలు తెలియజేసారు. కావున యేసు “ప్రవక్త” . యేసు ప్రవక్త అనుటకు బైబిల్లో మరికొన్ని మాటలను మనము చూస్తే యోహాను 4:19, 9:17, లూకా 24:19,మత్తాయి 21:11,21:46, లూకా 7:15,16.

(b) పై వ్రాయబడిన వచనాలు అన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రవక్త అనే విషయము మనకు స్పష్టముగా అర్థమయింది. యేసుక్రీస్తు ప్రవక్త అని చెప్పినంత మాత్రమున అయన దేవుడు కాదు, దైవ కుమారుడు కాడు అని నేను చెప్పుట లేదు. 

(c) ఒక ఆఫీసర్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీసర్ గా పిలువబడతాడు. ఇంటిలో ఉన్నప్పుడు భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, తల్లితండ్రులకు కుమారుడిగా, అన్నకు తమ్ముడిగా పిలువబడుతాడు. ఒక వ్యక్తే ఇన్ని విధములుగా పిలువబడుచున్నాడు. ఇది సరియైనదే అలానే యేసుక్రీస్తు ప్రవక్తగా, దేవునిగా, దేవుని కుమారుడిగా ఆయనకున్న లక్షణాలను బట్టి మనకు అర్థమవుచున్నది. యేసుక్రీస్తు ప్రవక్త అనే విషయము మనకు అర్థమయింది కాని యేసుక్రీస్తు “ ఆ ప్రవక్త నా?

యేసు “ఆ” ప్రవక్తనా?

(3) (a)యేసుక్రీస్తు ఆ ప్రవక్త అనుటకు మనకున్న లేఖన ఆధారములలో కొన్నిటిని మనము ఆలోచన చేయ గలిగితే “ఆ ప్రవక్త ఇశ్రాయేలు గోత్రాలలో ఏదో ఒక గోత్రము నుండి రావాలి. యేసుక్రీస్తు ముమ్మాటికి ఇశ్రాయేలియుడే. రోమా 9:4, మత్తాయి 1:1, మత్తాయి 2:2, రోమా1:7, 2 తిమోతి 2:8లో చూడొచ్చు. ఈ కొన్ని లేఖనాదారాలను బట్టి యేసుక్రీస్తు దావీదు సంతానముగా అనగా యుదా వంశము నుండి వచ్చాడు అనే విషయము అర్థమవుచున్నది. యోహాను 6:14- లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. యోహాను 7:40- నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి.

(b) ఇదంతా చదివిన తరువాత ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక వారు ఇది ప్రజలిచ్చిన సాక్షం కనుక చెల్లదు అనవచ్చు. ఎందుకనగా క్రిస్తుపైనే వారికీ సరియైన అబిప్రాయము లేదు. కారణము మనసంతా మోహామోద్ తో నిండికొనియుంది. అపోకార్య3:22,23లో పేతురు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచున్నారో బైబిల్ పై కనీస జ్ఞానముయున్న ఎవరైనా సులువుగా గ్రహించగలరు. 

(c) ముస్లిం సోదరులులు యేసును నమ్ముతాము. అయన అంటే మాకు గౌరవము అంటున్నప్పుడు అయన చెప్పిన ప్రతి మాట నమ్మాలి. అయన చెప్పిన ప్రతిది చేయాలి. వారికీ అనుకూలముగా ఉన్నవాటిని నమ్మి మిగిలినవి వదిలేయడము మహానుభావుడైన యేసును ఆగౌరవపరచడమే అవుతుంది.

(d) మోషే గారు నా వంటి ఒక ప్రవాక్తను అన్నారు కదా . మోషేకి పెళ్లి అయింది కదా మరి యేసు కు కాలేదు అని అంటున్నారు. మోషే లాంటి ప్రవక్త అనగానే వయస్సు, వివాహము, పిల్లలు కాదు ఆలోచించాల్సింది. లక్షణాలు కావాలి. దేవుడు అనగానే ఎలా గుణ లక్షణాలను పరిగణలోనికి తీసుకుంటామో అలానే మోషే లాంటి లక్షణాలు కలిగినవాడు అని అర్థము. మోషేను గూర్చి దేవుడే పలికిన మాటలను చూస్తే (సంఖ్యా 12:3,సంఖ్యా 12:7). ఇవే లక్షణాలు తిరిగి మనము స్పష్టముగా ఎసుక్రిస్తులో చూడగలము.

CONCLUSION: మోషే లాంటి వాడు యేసుక్రీస్తు కాని మోహామోద్ కాదు. “ఆ ప్రవక్త ఇశ్రాయేలులో నుండే రావాలి ప్రవక్తలందరు ఇశ్రాయేలియులే సహోదరులు అనగానే ఇశ్రాయేలు 12 గోత్రాలు వారే ప్రజలు, అపోస్తులలు పౌలు గారి ఇచ్చిన వ్రాసిన సాక్షాన్ని బట్టి యేసునే “ఆ ప్రవక్త” యేసు తరువాత సుమారు 500 years కి వచ్చిన మోహామోద్ “ఆ “ ప్రవక్త అనుకోవడము ఇస్లాము సోదరుల భ్రమ.--> మోహామోద్ ఇశ్రాయేలియుడై కానప్పుడు ప్రవక్త కాదు. ఆ ప్రవక్త అస్సలు కాదు.

బైబిల్లో మొహమ్మద్ గురించి చెప్పబడింది అంటున్న వారికీ చెప్పబడలేదు అనుటకు రుజువులతో కూడిన వివరణ PART - I

బైబిల్లో వ్రాయబడ్డ సందర్భాలను తప్పుగా అర్థము చేసుకుని వారికీ(ముస్లిం లు) అనుకూలముగా అన్వయించుకుని బైబిల్లో మోహామోద్ ప్రవక్త గురించి ఉంది అని “ బైబిల్లో మోహామోద్ అనే పుస్తకాన్ని వ్రాసి ప్రకటిస్తున్నారు. అక్కడక్కడ సెమినార్స్ పెడుతూ బైబిల్లో చెప్పబడిన ఆ ప్రవక్త మోహామోద్ అని ప్రకటిస్తూ అనేక అమాయకులైన క్రైస్తవ విశ్వాసులను వారి మతములోకి మార్చుకుంటున్నారు. బైబిల్లో మోహామోద్ గురించి వ్రాయబడిన సందర్భాలు ఉన్నవని వారు(ముస్లింలు) అంటున్నప్పుడు అది ఎవరిని గురించి వ్రాయబడ్డాయో అన్న వాస్తవము ఏమిటో చెప్పవలసిన భాద్యత క్రైస్తవులమైన మనకు ఉంది. వీరి యొక్క మాటలకూ జవాబు ఇచ్చుటకు నేను సందేశమును రెండు భాగాలుగా(Parts) గా చేస్తున్నాను. ఈ సందేశము మొదటి భాగము(First part). రెండవ భాగము( Second part) మరొక సందేశములో చుడండి.

వారి మొదటి ప్రశ్న మరియు మన వివరణ.

1) ముందుగా బైబిల్లో ముఖ్యముగా మూడు వచనాలను వారికీ అనుకూలముగా మార్చుకుని ఇందులో మోహామోద్ గూర్చి చెప్పబడింది అని అంటున్నారు. బైబిల్లో మోహామోద్ ఎలా ఉన్నడో ఒక్కసారి వారి యొక్క మాటలలో విందాము. శ్రద్దగా చదవండి. వారు చూపిస్తున్న మొదటి  వచనమును చూద్దాము. John 14:25-నేను(యేసు) మీ యెద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును మీకు భోదించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ యేసు వెళ్లిపోతు మరొక ఆదరణకర్తను పంపిస్తానని అంటున్నాడు. యేసు వెళ్లిపొతున్నాడన్న మాట విని శిష్యులు భాదపడుతూ కలవర పడుచున్నారు. కలవరపడుచున్న, భాదపడుచున్న వారిని ఓదార్చడానికి నేను వెళ్లి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని శిష్యులను ఉద్దేశించి, ఆ తరువాత రాబోయే పరిశుదాత్మ గురించి చెప్పుచున్న మాటే ఈ వచనము.

2) అలాగే John 14:16,17- నేను తండ్రిని వేడుకొందును. మియోద్ద “ఎల్లప్పుడూ” నుండుటకై అయన “వేరొక ఆదరణ కర్తను “అనగా సత్య స్వరుపియగు ఆత్మను మీకు అనుగ్రహించును.” లోకము ఆయనను చూడదు”, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు.”అయన మీతో కూడా నివసించును, మిలో ఉండును. ఈ వచనములో కూడా యేసు వెళ్లి ఎల్లప్పుడూ మన మధ్య ఉండడానికి వేరొక ఆదరణ కర్తను పంపిస్తాను అని చెప్పాడు. బైబిల్ లో ఉన్న ఈ మాటలను చూపించి యేసు వెళ్ళిన తరువాత అయన పంపిన ఆదరణకర్తే మోహామోద్ గా అంటున్నారు.

3) వీళ్ళు అడుగుతున్న ప్రశ్నను చూస్తే క్రైస్తవులైన మీరు పరిశుద్దాత్మ అని అంటే మరి యేసు వేరొక ఆదరనకర్తను పంపిస్తాను అన్నాడు కదా? ఒక వ్యక్తిని పంపిస్తానని యేసు చెప్పాడు కదా? యేసు ఒక వ్యక్తి. నేను వెళ్లి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అంటే వ్యక్తి గురించి కదా మాటలాడుతుంది, మరి పరిశుద్దాత్మ ఒక వ్యక్తా?? నేను వెళ్లి వేరొక ఆదరణకర్తను పంపిస్తానని ఒక వ్యక్తి గురించి చెబితే క్రైస్తవులైన మీరు ఒక పరిశుదాత్మ అని ఒక శక్తి గురించి ఎందుకు అంటున్నారు?? ఇక్కడ యేసు చెబుతున్నది మోహామోద్ గురించి అని పై రెండు వచనాలను బట్టి తప్పుడుగా వక్రీకరించి చెబుతున్నారు.

4) ఇప్పుడు ప్రశ్నయొక్క జవాబును చూద్దాము. (a) ఒక వేళా అది మోహామోద్ గురించి అని అనుకుంటే బైబిల్లో పరిశుదాత్మ లేదా ఆదరణకర్త గూర్చి యేసు చెప్పిన మాటలన్నీ మోహామోద్ లో కనిపించాలి. యేసు చెప్పిన లక్షణాలు అన్ని మోహామోద్ లో ఉంటె అప్పుడు ఆలోచించొచ్చు. John 14:25-ఆదరణకర్తగా పరిశుదాత్మను పంపబోతున్నానని చెబుతున్నాడు. అంటే వచ్చే అయన వ్యక్తినా లేక శక్తీనా? ఆదరణకర్త అనగా ఒక వ్యక్తి అని అనుకుంటారని తండ్రి నా నామమున పంపబోవు పరిశుదాత్మ అని యేసు స్పష్టముగా చెప్పాడు. అనగా రావలసినది ఆత్మే తప్ప వ్యక్తి కాదు. (b) John 14:25లో నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును అను మాట ఉంది. ఒక వేళ మోహామోద్ అయితే యేసు చెప్పినవే చెప్పాలి. యేసు చెప్పనివి చెబితే పంపబడిన ఆదరణకర్త మోహామోద్ ఎలా అవుతాడు? ఖురాన్లో మోహామోద్ చెప్పిన సంగతులు వేరు బైబిల్లో యేసు చెప్పిన సందర్భాలు వేరు. రాబోయే ఆదరణకర్తకు సొంతముగా ఏ నిర్ణయము తీసుకునే హక్కు లేదు. ఇప్పుడు మోహామోద్ గురించి ఆలోచిస్తే మోహామోద్ నే ఆదరణకర్త అయితే యేసు చెప్పిన మాటలే చెప్పాలి. కాని యేసు చెప్పిన మాటలు వేరు ఖురాన్లో మోహామోద్ మాటలు వేరు. అలాంటప్పుడు ఆదరణకర్త మోహామోద్ అని ఎలా ఉహించుకుంటారు? (c) John 14:16,17- మియోద్ద “ఎల్లప్పుడూ” నుండుటకై అయన “వేరొక ఆదరణ కర్తను. ఒక వేళ మోహామోద్ ఆదరణకర్త అయితే ఎల్లప్పుడూ భూమి మీద ఉండాలి. మరి ఎందుకు మోహామోద్ చచ్చిపోయాడు? పై వచనములో ఎల్లప్పుడూ ఉండుటకై అను మాట ఉంది కదా. ఒక వ్యక్తి అయితే ఎల్లప్పుడూ ఉంటాడా? ఆత్మ అయితేనే ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ఆదరణకర్తగా పరిశుద్దాత్మను పంపాడు. పై వచనములో పంపబడుతున్న ఈయన ఎవరికీ కనపడడు అనే మాట ఉంది. ఇప్పుడు మోహామోద్ ని చూసారా లేదా? చూసారు. ఇప్పటికి ఫోటోలో చూస్తున్నాము. పై వచనములో అయన మీతో కూడా నివసించును, మిలో ఉండును అను మాట ఉంది. మిలో అనగా ఎక్కడా? పరిశుదాత్మకు ఆలయము మానవులైనా మన హృదయమే. హృదయము మనలో ఉంది. మనలో ఉన్న హృదయములో ఉండబోయే ఆత్మ గురించి చెబుతున్నాడు. వాస్తవముగా మోహామోద్ మనతో పాటు కలిసి ఉండేవాడు. మనలో ఉండే వాడు కాదు. కాబట్టి యేసు మనలో ఉండగలిగిన శక్తివంతమైన పరిశుదాత్మడు గురించి చెబుతున్నాడే 
తప్ప ఒక వ్యక్తి అయిన మోహామోద్ గురించి చెప్పలేదు. అస్సలు ఖురాన్లో మోహామోద్ ఉన్నప్పుడు బైబిల్లోకి వచ్చి చెప్పవలసిన అవసరత ఏమి వచ్చింది? చివరిగా బైబిల్లో యేసు పలికిన మాటలు పరిశుదాత్మను గురించి చెప్పిన మాటలే తప్ప మోహామోద్ గురించి చెప్పినవి కావు. 

వారి రెండవ ప్రశ్న మరియు మన వివరణ.

1) John 1:15,16- యోహాను అయనను(యేసు) గూర్చి సాక్షమిచ్చుచు- నా వెనుక వచ్చువాడు నా కంటే ప్రముఖుడు. ఈ వచనములో ఎవరు ఎవరిని ఉద్దేశించి మాటలడుచున్నారో తెలియాలి. యోహాను యేసును ఉద్దేశించి చెప్పబడుతున్న మాట. కాని ఈ వచనమును యోహాను కాదు యేసు మోహామోద్ నీ ఉద్దేశించి మాటలడుతున్నాడని అని చెబుతున్నారు. మరి క్రైస్తవులైన మనము ఈ వచనములో యోహాను అని అన్నట్లుగా ఉంది అని అడిగితే బైబిల్ తర్జుమలో పొరపాటు జరిగింది అని అంటున్నారు. వచనములోకి వెళ్తే నా వెనుక వచ్చువాడు అనగా ఏమి? ఉదాహరణకు మీతో ఎవరైనా నీవెనుక ఒకడు వస్తున్నాడు చూడు అనగా వెంటనే వెనక్కి చూస్తాము కాని ముందుకు చూడము. యేసు మొదటి శతాబ్దములో మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన 500 years తర్వాత పుట్టాడు. ఇక్కడ యేసునే నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు అను మాటను అన్నాడు అని అనుకుంటే 500 years తర్వాత వచ్చిన మోహామోద్ గురించి నా వెనుకల వచ్చువాడు అని అంటాడా? నిజముగా యోహాను ఈ మాట అనగానే యేసు వెనుక వచ్చాడు. ఒకసారి Luke3:16,21-యోహాను-నేను నీళ్ళలో మీకు బాప్తీస్మం ఇచ్చుచున్నాను.అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. అయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. అయన పరిశుదాత్మ లోను, అగ్నితోనూ మీకు బాప్తీస్మం ఇచ్చును. 21-ప్రజలందరు బాప్తీస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తీస్మం పొంది. ఇక్కడ యోహాను మాట అంటుండగా యేసు వెనుక నుంచి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అనగా యోహాను యేసు గురించి చెప్పిన మాటే తప్ప యేసు మోహామోద్ గురించి చెప్పిన మాట కాదు. అలనే Mark 1:7 నుంచి 9- ఇక్కడ కూడా అదే సందర్భము. నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు అని ఇలా ప్రకటిస్తూ ఉండగా యేసు ప్రవేశించాడు. చివరిగా యోహాను యేసును ఉద్దేశించి చెప్పిన మాటే తప్ప యేసు మోహామోద్ గురించి చెప్పిన మాట కాదు. ఇప్పటికైనా వ్రాయబడిన వాటిననిటిని మరోమారు చదివి అలోచించి మీ మనస్సులను, ఆలోచనలను సరి చేసుకుని బైబిల్ సర్వ సత్యమని, యేసు అనంతరము వచ్చిన ఆదరణకర్త పరిశుదాత్మడు దేవుడని నమ్మితే నిత్యజీవము(పరలోకము). లేదంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళాల్సిందే. యేసు అర్థము కావాలంటే ముందు వాక్యము అర్థము కావాలి. వాక్యము అర్థము చేసుకోవాలంటే పరిశుదాత్మ సహాయము ఉండాలి. కాని అనేక మంది ముస్లిం సోదరులు బైబిల్ చదివి యేసు దేవుడు కాదు అంటున్నారు. నేను దేవుడని యేసు చెప్పలేదు అని అంటున్నారు. విశ్వాసము కలిగి పరిశుద్దాత్మ సహాయముతో చదివితే తప్ప అర్థము కాని బైబిల్ వీళ్ళకు సులువుగా అర్థమవుతుందా? పరిశుదాత్మ సహాయము లేకపోతే బైబిల్ అర్థం కానప్పుడు పరిశుదాత్మనే నమ్మని వీరికి బైబిల్ అర్థమవుతుందా?