Wednesday, September 3, 2014

బైబిల్లో మొహమ్మద్ గురించి చెప్పబడింది అంటున్న వారికీ చెప్పబడలేదు అనుటకు రుజువులతో కూడిన వివరణ PART - II

బైబిల్లో వ్రాయబడ్డ సందర్భాలను తప్పుగా అర్థము చేసుకుని, వారికీ(ముస్లింలు) అనుకూలముగా అన్వయించుకుని బైబిల్లో మోహామోద్ ప్రవక్త గురించి మోషే ముందుగా చెప్పబడింది అని ప్రకటిస్తున్నారు. అక్కడక్కడ సెమినార్స్ పెడుతూ బైబిల్లో చెప్పబడిన ఆ ప్రవక్త మోహామోద్ అని ప్రకటిస్తూ అనేక అమాయకులైన క్రైస్తవ విశ్వాసులను వారి మతములోకి మార్చుకుంటున్నారు. బైబిల్లో మోహామోద్ గురించి వ్రాయబడిన సందర్భాలు ఉన్నవని వారు(ముస్లింలు) అంటున్నప్పుడు అది ఎవరిని గురించి వ్రాయబడ్డాయో అన్న వాస్తవము ఏమిటో చెప్పవలసిన భాద్యత క్రైస్తవులమైన మనకు ఉంది. రెండవ భాగముగా(Second part) ఈ సందేశములో చుడండి.

1) (a) ఇంతకు బైబిల్లో మోషే చెప్పిన ఆ ప్రవక్త ఎవరు అనే విషయము మనకు తెలియాలంటే ముందుగా ప్రవక్త అని ఎవరిని అంటారో తెలియాలి. ప్రవక్త అనగా ప్రభువు పంపగా వచ్చినవాడు, ప్రభువు పక్షముగా ప్రజలతో మాట్లాడేవాడు, దేవునికి మరియు ప్రజలకు మధ్యవర్తి అని. పాత నిబంధనలో ప్రవక్తలందరూ ప్రజలతో మాటలాడుచున్నప్పుడు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా అని స్టార్ట్ చేయడం మనము చూస్తున్నాము. యెషయ 50:1-యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెషయ 66:1-యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యీర్మియా1:4- యెహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. పై వచనాలు బట్టి చూస్తే ప్రవక్త అంటే ప్రభువు చెప్పిన మాటలను ప్రజలకు ప్రకటించుట అని. 

(b)ఈ మధ్య కాలములో కొందరు తమ పేరులకు ముందు ప్రవక్త అని, మరికొందరు అపోస్తులడని పెట్టుకోవడము మనము చూస్తూ ఉంటాము. కానీ ప్రవక్తలనబడిన వారు ఎప్పటి వరకు ఉన్నారో అనే విషయాన్నీ బైబిల్లో చూస్తే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే Luke16:16-యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తులును ఉండిరి అని అంటున్నాడు. మొదటి శతాబ్దము వరకే ప్రవక్తలు ఉన్నారన్న విషయము అర్థమైతే తరువాత వచ్చిన వారు ఎవ్వరు ప్రవక్తలు కారనే సంగతి సులువుగా గ్రహించవచ్చు. అలా అయితే యేసు మాటను బట్టి( బైబిల్) క్రీస్తు తరువాత 500 years వచ్చిన మోహామోద్ ప్రవక్త అయ్యే అవకాశమే లేనప్పుడు “ఆ” ప్రవక్త కాగలడా?

(c) ముస్లిం సోదరులు ఏ మాటను అపార్ధము చేసుకుని బైబిల్లో లేని మోహామోద్ ను బైబిల్లో ఉన్నాడు అంటూ భ్రమపడుచున్నారో చూస్తే ద్వితియోప18:16,18,19.- (నీ) వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. అతని నోట నా మాటలు ఉంచేదను. నేను అతనికి అజ్ఞాపించునది యావత్తు అతడు వారితో చెప్పెను. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను. పై మాటను ముస్లిం సోదరులు ఎలా వక్రికరించారంటే మోషే ఇశ్రాయేలీయులతో నీ సహోదరులలో నుండి అన్నాడు కనుక ఇశ్రాయేలీయుల సహోదరులు ఇష్మాయేలీయులు కనుక మోషే చెప్పిన “ఆ” ఇష్మాయేలీయులలో నుండి రావాలి మరియు ఆ ప్రవక్త మాటే అందరు వినాలి ఆయనే మోహామోద్ ప్రవక్త అని వాక్యాన్ని అపార్ధము చేసుకున్నారు. 2 పేతురు 3:16- లేఖములను అపార్ధము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్ధము చేయుదురు.

(d)ఈ సందర్భములో మోషే మాటలాడుచున్నది ఇశ్రాయేలీయులను ఉద్దేశించే కానీ ఇష్మాయేలీయులు కొరకు కాదు. కారణము చూస్తే ఇశ్రాయేలీయులు అనగానే ఒక్కరు కాదు పన్నెండు గోత్రాలు ప్రజలు. ఒక గోత్రము వారు మరొక గోత్రపు వారికీ సహోదరులు అవుతారు. ఒక వేళ వారి (నీ) సహోదరులు అనగానే ఇష్మాయేలీయులు గురించి అని అనుకుంటే ప్రతి సందర్భములో అలానే ఆలోచించాలి. ఉదాహరణ: ద్వితయో 17:15- నీ సహోధరులలోనే ఒకని నీ మిధ రాజుగా నియమించుకొనవలెను అను మాట ఉంది. పై మాటలో నీ సహోదరులు అనగానే ఇష్మాయేలీయులు అయితే ఇశ్రాయేలీయులపై రాజులూ ఎవరు ఉండాలి? ఇష్మాయేలీయులే ఉండాలి. అలా అయితే ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులలో ఒక్కరినైన ఇష్మాయేలీయుడను చూపించగలరా? లేదు. కారణము ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులందరు ఇశ్రాయేలీయులే( సౌలు, దావీదు, సోలోమోను, రెహబాము, యరోబము. ఇలా వీరు అందరు ఇశ్రాయేలీయులు.

(e) పై సందర్భమును బట్టి ప్రవక్త ఇశ్రాయేలీయులలో నుండి మాత్రమే రావాలి అనే విషయము స్పష్టమయింది. దేవుడు తన మాటలను తెలియజేయటానికి ప్రారంభము నుండి అనగా మోషే కాలము నుండి ఇశ్రాయేలీయులు(యూదులు)ను మాత్రమే ఎంపిక చేసుకున్నట్లుగా మనము బైబిల్ నందు చూడగలము. ఎక్కడైనా దేవుడు ఇష్మాయేలీయుల ద్వారా నా మాటలను తెలియజేయుదును అని అన్నట్లుగా మీరు చూపించగలరా? రోమ 3:1, యావేలు2:11, ఆమోసు 2:11, కీర్తన 147:19 ఇలా ఈ వచనాలలో చూడొచ్చు. ప్రవక్తలందరు ఇశ్రాయేలీయుల నుండి వచ్చారు, వస్తారు అనే విషయము మనకు అర్థమవుచున్నది గనుక ఆ మాటలన్నిటిని బట్టి మోహామోద్ “ఆ” ప్రవక్త అయ్యే అవకాశమే లేదు.

(f) ఇప్పటివరకు “ఆ “ ప్రవక్త ఇశ్రాయేలీయులలో నుండి మాత్రమే రావాలి అని. మరి ఎవరు “ఆ ప్రవక్త? యేసుక్రీస్తు(రాక) విషయమై ఎన్నో ప్రవచన లేఖనములు ధర్మశాస్త్రములోను, కీర్తన గ్రంధములోను, ప్రవక్తల గ్రంధములోను మనము చూడగలము ( యోహాను 1:45, లూకా 24:44) . ఈ వచనములో యేసుక్రిస్తే స్వయంగా నన్ను గూర్చి మోషే ధర్మశాస్త్రములోనువ్రాయబడింది అని చెబుతున్నాడు అంటే ఒక వేళ మోషే ద్వితియొపదేశకాండంలో చెప్పిన “ఆ” ప్రవక్త యేసు కావచ్చు కదా!

యేసు ప్రవక్తా?

2) (a)హెబ్రీ 1:12- పూర్వకాలమందు నానా సమయములలోను, నానా విధములగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు , ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడేను. దేవుడు చెప్పిన ప్రతి మాటను ప్రజలకు తెలియజేయువాడే ప్రవక్త అని ముందు మాటల్లో మీరు చదివారు. ఇప్పుడు యేసును కూడా ప్రవక్తగా మనము చెప్పుటలో తప్పు లేదు. యోహాను 12:49,50, 17:7,8:26,7:16 లో చూడొచ్చు. తండ్రియైన దేవుడు తెలియజేసిన( చెప్పమన్న) సంగతులు కాక యేసు మరేమియు చెప్పలేదని అనగా ఒకనాటి ప్రవక్తల వలె యేసు కూడా దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా యుండి ప్రజలకు దేవుని మాటలు తెలియజేసారు. కావున యేసు “ప్రవక్త” . యేసు ప్రవక్త అనుటకు బైబిల్లో మరికొన్ని మాటలను మనము చూస్తే యోహాను 4:19, 9:17, లూకా 24:19,మత్తాయి 21:11,21:46, లూకా 7:15,16.

(b) పై వ్రాయబడిన వచనాలు అన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రవక్త అనే విషయము మనకు స్పష్టముగా అర్థమయింది. యేసుక్రీస్తు ప్రవక్త అని చెప్పినంత మాత్రమున అయన దేవుడు కాదు, దైవ కుమారుడు కాడు అని నేను చెప్పుట లేదు. 

(c) ఒక ఆఫీసర్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీసర్ గా పిలువబడతాడు. ఇంటిలో ఉన్నప్పుడు భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, తల్లితండ్రులకు కుమారుడిగా, అన్నకు తమ్ముడిగా పిలువబడుతాడు. ఒక వ్యక్తే ఇన్ని విధములుగా పిలువబడుచున్నాడు. ఇది సరియైనదే అలానే యేసుక్రీస్తు ప్రవక్తగా, దేవునిగా, దేవుని కుమారుడిగా ఆయనకున్న లక్షణాలను బట్టి మనకు అర్థమవుచున్నది. యేసుక్రీస్తు ప్రవక్త అనే విషయము మనకు అర్థమయింది కాని యేసుక్రీస్తు “ ఆ ప్రవక్త నా?

యేసు “ఆ” ప్రవక్తనా?

(3) (a)యేసుక్రీస్తు ఆ ప్రవక్త అనుటకు మనకున్న లేఖన ఆధారములలో కొన్నిటిని మనము ఆలోచన చేయ గలిగితే “ఆ ప్రవక్త ఇశ్రాయేలు గోత్రాలలో ఏదో ఒక గోత్రము నుండి రావాలి. యేసుక్రీస్తు ముమ్మాటికి ఇశ్రాయేలియుడే. రోమా 9:4, మత్తాయి 1:1, మత్తాయి 2:2, రోమా1:7, 2 తిమోతి 2:8లో చూడొచ్చు. ఈ కొన్ని లేఖనాదారాలను బట్టి యేసుక్రీస్తు దావీదు సంతానముగా అనగా యుదా వంశము నుండి వచ్చాడు అనే విషయము అర్థమవుచున్నది. యోహాను 6:14- లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. యోహాను 7:40- నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి.

(b) ఇదంతా చదివిన తరువాత ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక వారు ఇది ప్రజలిచ్చిన సాక్షం కనుక చెల్లదు అనవచ్చు. ఎందుకనగా క్రిస్తుపైనే వారికీ సరియైన అబిప్రాయము లేదు. కారణము మనసంతా మోహామోద్ తో నిండికొనియుంది. అపోకార్య3:22,23లో పేతురు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచున్నారో బైబిల్ పై కనీస జ్ఞానముయున్న ఎవరైనా సులువుగా గ్రహించగలరు. 

(c) ముస్లిం సోదరులులు యేసును నమ్ముతాము. అయన అంటే మాకు గౌరవము అంటున్నప్పుడు అయన చెప్పిన ప్రతి మాట నమ్మాలి. అయన చెప్పిన ప్రతిది చేయాలి. వారికీ అనుకూలముగా ఉన్నవాటిని నమ్మి మిగిలినవి వదిలేయడము మహానుభావుడైన యేసును ఆగౌరవపరచడమే అవుతుంది.

(d) మోషే గారు నా వంటి ఒక ప్రవాక్తను అన్నారు కదా . మోషేకి పెళ్లి అయింది కదా మరి యేసు కు కాలేదు అని అంటున్నారు. మోషే లాంటి ప్రవక్త అనగానే వయస్సు, వివాహము, పిల్లలు కాదు ఆలోచించాల్సింది. లక్షణాలు కావాలి. దేవుడు అనగానే ఎలా గుణ లక్షణాలను పరిగణలోనికి తీసుకుంటామో అలానే మోషే లాంటి లక్షణాలు కలిగినవాడు అని అర్థము. మోషేను గూర్చి దేవుడే పలికిన మాటలను చూస్తే (సంఖ్యా 12:3,సంఖ్యా 12:7). ఇవే లక్షణాలు తిరిగి మనము స్పష్టముగా ఎసుక్రిస్తులో చూడగలము.

CONCLUSION: మోషే లాంటి వాడు యేసుక్రీస్తు కాని మోహామోద్ కాదు. “ఆ ప్రవక్త ఇశ్రాయేలులో నుండే రావాలి ప్రవక్తలందరు ఇశ్రాయేలియులే సహోదరులు అనగానే ఇశ్రాయేలు 12 గోత్రాలు వారే ప్రజలు, అపోస్తులలు పౌలు గారి ఇచ్చిన వ్రాసిన సాక్షాన్ని బట్టి యేసునే “ఆ ప్రవక్త” యేసు తరువాత సుమారు 500 years కి వచ్చిన మోహామోద్ “ఆ “ ప్రవక్త అనుకోవడము ఇస్లాము సోదరుల భ్రమ.--> మోహామోద్ ఇశ్రాయేలియుడై కానప్పుడు ప్రవక్త కాదు. ఆ ప్రవక్త అస్సలు కాదు.

No comments:

Post a Comment