Tuesday, December 16, 2014

క్రిస్మస్

2000సంల క్రితం యేసుక్రీస్తు ఈలోకములో పుట్టాడని, 2000 సంవత్సరాల ముందు ఆయనకు ఏ చరిత్ర లేదని అనుకుంటుంది ఈ అమాయక ప్రపంచములోని అమాయక మనుషులు. వాక్యము తెలియని భోదకుల సైతం యేసు 2000సంల క్రితంఈలోకములో పుట్టాడని ఘంటాపదంగా భోదిస్తున్నారు. ఇలా చెప్పుట వలన ప్రపంచం అయన పుట్టింది 2000సంల క్రితమే కదా మరి అయన కంటే బుద్ధ, అలక్షాండెర్, ఎంతో మంది రాజులు వచ్చారు కదా మరి వాళ్ళందరి తర్వాత వచ్చిన అతను యేసుక్రీస్తు అని, వాళ్ళందరి కంటే చిన్నవాడు యేసుక్రీస్తు అని చెబుతున్నారు.

అనేకులు భావిస్తున్నట్లుగా యేసు కన్య మరియ గర్బాన్న2000సంల క్రితం పుట్టినా, ఈ సృష్టి పుట్టక మునుపే పరలోకములో ఉన్నాడు. నేటి క్రైస్తవులు సైతము యేసు కన్య మరియ గర్భాన పుట్టిన ఘటననే మాటిమాటికి చెబుతూ, పండగలుగా(క్రిస్మస్) ఆచరిస్తున్నారే గానీ, యేసు జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నవాడని ప్రపంచం గుర్తించేలా ఎలుగెత్తి చాటటం లేదు. పరలోకమందు ప్రారంభమైన మహనీయునిగా యేసుని చూడవలసిన ప్రపంచము, మట్టిలోకములో పుట్టిన మట్టి మనిషి గానే చూస్తున్నారంటే తప్పు ఈ భోదకులదే కాదంటారా?

వాక్యము తెలిసిన క్రైస్తవులైన మనము యేసుక్రీస్తును పరిచయం చేయు విధానము తెలియకపోవుట వలన ఇలా తప్పుడు అభిప్రాయము కలిగి, తప్పుడుగా ఆలోచిస్తూ, తప్పుడుగా భోదిస్తున్నారు. వాస్తవముగా యేసుక్రీస్తును పరిచయం చేయవలసిన తీరు ఇది కాదనే చెప్పాలి.

అస్సలు యేసుక్రీస్తు 2000సంల క్రితం ఈ లోకమునకు వచ్చాడా లేక పుట్టాడాన్న ప్రాముఖ్యమైన మూల విషయము తెలుసుకోవాలి. హెబ్రీ 10:5 కాబట్టి అయన ఈ లోక మందు “ప్రవేశించునప్పుడు” ఈలాగు చెప్పుచున్నాడు. వచ్చాడు అంటే అంతకముందుగానే ఉన్నవాడని అర్థమవుతుంది. ఉదా: నేనునెల్లూరు నుండి హైదరాబాద్ కూ వచ్చాననుకోండి. అనగా అంతక ముందు నేను నెల్లూరులో ఉన్నానని మరియు ఉన్న నేను హైదరాబాద్ కూ వచ్చానని అర్థమవుతుంది. అలానే యేసుక్రీస్తు 2000సంల క్రితంఈ భూమి మీదకు వచ్చాండంటేఅంతకుముందు అయన ఎక్కడో ఉన్నాడని అర్థమవుతుంది. అంటే అయన చరిత్ర 2000సంల క్రితముది కాదని,అంతకంటే ముందు యేసుక్రీస్తుకు చరిత్ర ఉందని ప్రపంచమునకు, మనము తెలియజేయాలి.

2000సంల క్రితం ఈ లోకానికి వచ్చాడు అంటే ఎప్పుడు పుట్టాడు? పుట్టుక ఎప్పుడు జరిగింది? తన పుట్టుక గురించి తను చెప్పిన సంగతి చూస్తే సామెతలు 8:22-26  పూర్వ కాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. పై వచనాలలో సృష్టి పుట్టకముందే పుట్టినట్టుగా అర్థమవుతుంది. అనగా అసలైన పుట్టుక జగత్తు పునాది వేయబడకముందే యేసుక్రీస్తు పుట్టాడు. కీర్తనలు2:7 యెహోవా నాకిలాగుసెలవిచ్చెను –నీవునా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. ఇలా తండ్రి ఎప్పుడైతే యేసుతో అన్నాడో ఆ రోజున పుట్టిన వాడు. యేసుక్రీస్తు ఎప్పటివాడు?

యోహాను 1:1 ఆది యందు వాక్యము ఉండును. వాక్యము దేవుని యెద్ద ఉండెను.వాక్యము దేవుడై ఉండెను. యోహాను1:14 ఈ వాక్యము శారిరధారియై యేసుగా వచ్చెను. ప్రకటన 19:13 దేవుని వాక్యము అను నామము ఆయనకు(యేసు) పెట్టబడియున్నది. ఇప్పుడు వాక్యము అనగా యేసు అను మాటను యెహోవా1:1లో పెట్టి చదవండి. అనగా అది నుండి దేవుని యెద్ద దేవుడిగా ఉన్నాడు యేసు. అయన సృష్టి పుట్టక ముందే ఉన్నవాడు. యెషయ 9:6 మనకు శిశువు పుట్టెను. ఇక్కడే పుట్టెను అను మాట ఉంది కానీ పుట్టబోవుతున్నాడు అని లేదు.యెషయ చెప్పక ముందే యేసు పరలోకములో ఉన్నాడు. యోహాను1:3 కలిగి ఉన్నదేదియు అయన(యేసు) లేకుండా కలుగలేదు. అంటే యేసు సృష్ట పుట్టక ముందే తండ్రి దగ్గర ఉన్నాడు.

అయన జగత్తు పునాది వేయబడక ముందే పుట్టాడని యేసును గూర్చి ప్రపంచమునకు పరిచయం చేయాలి. సైన్సు ప్రకారముగా ఈ ప్రకృతి పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలని అంటున్నారు. ప్రకృతి పుట్టక మునుపేయేసుక్రీస్తు పుడితే నేటికి ప్రకృతి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయితే యేసు ఎంతటి కాలమునకు క్రిందటి వాడు? ఇంత గొప్ప చరిత్ర కలిగిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడో పుట్టినవాడు ఈ లోకానికి వచ్చాడు. ప్రకటన 19:16 రాజులకు రాజును,ప్రభువుల కు ప్రభువును అను నామము అయన వస్త్రము మీదను,తోడ మీదను వ్రాయబడింది. అనగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినవాడు రాజులకు రాజు,ప్రభువులకు ప్రభువు అని పరిచయం చేయాలి. ఏ కారణం లేకుండా యేసుక్రీస్తుఈ లోకానికి వస్తాడా? ఉదా:: అప్పుడప్పుడు ముఖ్య మంత్రి లేక ప్రధాన మంత్రి మన ప్రాంతమునకు వస్తుంటారు. ఒక్క పని కోసమే కాక అనేక పనులను ముందుగా నిర్ణయించుకొని వస్తారు. అనగా శంకుస్థాపన-విగ్రహ ఆవిష్కరణ-రచ్చబండ పాల్గొనుట- సాయంత్రపు మహా సభలలో మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్య మంత్రి ఒక ప్రాంతం వెళ్ళాలంటే సమయము తీరిక లేకుండా చేసుకునివస్తాడో మనకు అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు సంగతి ఏంటి? ఏ కారణాలు లేకుండా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటారా?లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఫిలిఫు 2:6  అయన (యేసుక్రీస్తు) దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గానీ “మనుష్యుల పోలికగా పుట్టి”,”దాసుని స్వరూపమును ధరించుకుని”,తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను.మరియు అయన అకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా అనగా “సిలువ మరణము పొందునంతగా” విధేయత చూపినవాడై ,తన్ను తాను తగ్గించుకొనేను.

భూమి పుట్టక మునుపు అయన పుడితే ఒక వేళ అయన పుట్టుక క్రిస్మస్ అనుకుంటే డిసెంబర్ 25 ఎప్పుడు వచ్చింది? భూమి పుట్టిన తర్వాత డిసెంబర్ 25 ఏర్పడింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టిన తేది డిసెంబర్ 25 నా? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 

యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముఖ్యముగా ఏడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము:

(a) మొదటి కారణము - తండ్రిని ఈ లోకానికి పరిచయం చేయుట కొరకు, తండ్రి మనస్సును బయలు పరచడానికి యేసుక్రీస్తుఈ లోకానికి వచ్చాడు. ప్రపంచ మంతా పరలోకపు తండ్రిని గుర్తించలేని పరిస్థితిగా ఏర్పడింది. యోహాను 1:18 ఎవడును, ఎప్పుడైనను దేవునిని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను. అనగా పరలోకపు తండ్రి మనస్సును ప్రపంచానికి చూపించుట కొరకు, తండ్రి మనస్సులో ఉన్న ఉద్దేశాలను, భావాలను,ఇష్టాలను,చిత్తాన్ని ఈ లోకానికి చూపించుట కొరకు వచ్చాడు.

(b) రెండవ కారణము - దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు, సాతాను రాజ్యాన్ని చూపించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యెషయ 9:6 అయన భుజము మీద రాజ్య భారముండెను. యేసుక్రీస్తు ఈ లోకానికి రాజ్య స్థాపన చేయుటకు వచ్చాడు.అయన రాక ముందు ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉందో తెలియాలి. నాలుగు సామ్రజ్యాలు భయంకరముగా పరిపాలిస్తున్న కాలము ఆది. 1. నెబుకద్నేజరు చేత పరిపాలింపబడిన బబులోను సామ్రాజ్యం 2. మాదియ పారసికుల సామ్రాజ్యం 3. గ్రీక్ సామ్రాజ్యం 4. రోమా సామ్రాజ్యం. దానియేలు 2:44 ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును.దానికెన్నటికి నాశనము కలుగదు.ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికి చెందదు. ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్ములము చేయును గానీ ఆది యుగములు వరకు నిలుచును. పై వచనములో అయన మొదటి రాకడలో రాజ్యం వస్తుందని,రాజ్య స్థాపన జరుగుతుందని అర్థమవుతుంది. లూకా1:33 అయన(యేసు క్రీస్తు) రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను.పైవచనములో గబ్రియేలు దేవ దూత మరియతో రాజ్యము గూర్చి తెలియపరచడమైనది. లూకా17:20 దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు అయన-దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు.ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదీ. దేవుని రాజ్యమును స్థాపించుటకు, ఆ రాజ్యానికి ఆహ్వానించుటకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని రాజ్యమును స్థాపించుటకే కాక మరొక రాజ్యమును చూపించుటకు వచ్చాడు. మత్తయి 12:26 సాతనును వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరు పడును.అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?? అనగా సాతాను రాజ్యము అప్పటికే లోకములో ఉంది.

(c) మూడవ కారణము - పాపులను రక్షించుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనేను. లూకా19:10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. పై వచనాలను పరిలిస్తే యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చినట్టుగా అర్థమవుతుంది.

(d) నాల్గోవ కారణము - అన్యజనులైన మనకు రక్షణను కలుగజేసి దేవుని ఇంటివారిగా చేయుటకు ఈ లోకానికి వచ్చాడు.. యేసుక్రీస్తు లోకానికి రాకముందు ప్రపంచ పరిస్థితిని ఆలోచిస్తే ఒక్క ఇశ్రాయేలియులకు తప్ప నిజమైన దేవుడు ఎవరో ఎవరికీ తెలియదు. అప్పటిలో ఎందరో ప్రవక్తలు అనేక ప్రవచనాలు అనగా త్వరలో మెస్సయ వస్తాడని, ఇంతవరకు ఉన్న అన్యజనులందరిని ఇశ్రాయేలియులతో సమానము చేస్తాడని అప్పుడు అన్యజనులకు కూడ దేవుడు తెలియబడతాడని ప్రవచించారు. యెషయ 2:2  ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు, యెషయ2-4 అయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును, యెషయ 42:1 అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును, యెషయ 42:7 అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను. అనగా యేసుక్రీస్తు అన్యజనులను దేవుని ఇంటిలోనికి లాగుటకు వచ్చాడు. అన్యజనులను  శ్రాయేలియులతో సహా పౌరులుగా చేయుటకు వచ్చాడు. ఒక వేళ యేసుక్రీస్తు రాకుంటే మన పరిస్థితి ఏంటి? నిజమైన దేవునిని తెలియని వారముగా బ్రతికి ప్రాణము విడిచేవారము. అయన లేకుండా ఒక్కసారి మన జీవితాలను ఆలోచిస్తే భయం పుడుతుంది. యేసుక్రీస్తును బట్టి మనకు పరలోకం వస్తుందని ఆశతో ఉన్నాము.

(e) ఐదవ కారణము - ధర్మశాస్త్రము అను చెరలో ఉన్నవారిని విడిపించి క్రొత్త నిబంధన క్రిందకు తీసుకురావడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చేంత ముందు ఇశ్రాయేయులు ధర్మశాస్త్రము అనే చెరలో ఉన్నారు. గలతీ 3:23 చెరలో ఉంచబడినట్టు మనముధర్మశాస్త్ర మునకు లోనైనవారమైతిమి. లూకా  4:18 చెరలో ఉన్నవారిని విడిపించుటకు అయన నన్ను పంపెను. ఎఫేసి 2:14 మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన అజ్ఞాలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హెబ్రీ 10:9 ఆ రెండవ దానిని స్థిరపరుచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

(f) ఆరవ కారణము - మనలాంటి శరీరంతో ఉన్నను ఏ మచ్చ లేకుండా జీవించవచ్చు అని చెప్పుటకు వచ్చాడు. యోహాను 8:46 నా యందు పాపమున్నదని మిలో ఎవడు స్థాపించును? మనలాంటి మట్టి శరీరంతో ఉన్నను పాపం లేకుండా జీవించాడు. 

(g) ఏడవ కారణము - అంత్యదినాలను ప్రారంభించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ 1:1 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. 1పేతురు 1:20,21 కడవరి కాలమందు అయన ప్రత్యక్ష పరచబడెను. 1 యోహాను 2:18 ఇది కడవరి ఘడియ. 

పై చెప్పబడిన ముఖమైన ఏడు ప్రధాన కారణాలతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. కనుకకేవలము క్రిస్మస్ దినమున మాత్రమే యేసును గూర్చిన మాటలే ప్రకటించక ప్రతి దినము ప్రకటించాలి. యేసు క్రీస్తు ఎవరో, ఈ లోకానికి రాక ముందు ఎక్కడ ఉన్నాడో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, యేసులో ప్రత్యేకత ఏంటో ఇలా అనేక అంశాలతో కూడిన సువార్తను కేవలము క్రిస్మస్ దినమునే కాక ప్రతి దినము ప్రకటించి కొందరినైన నరకము నుండి వారి ఆత్మను తప్పించి దేవుని వైపు మళ్ళిద్దాం. మార్క్ 16:15 మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షించబడును;నమ్మనివానికి శిక్ష విధింపబడును.

Tuesday, November 11, 2014

THE TRUE MEANING OF - "AMEN"

One day God took Abraham outside his tent & told him,“Look towards the heavens and see if you can count the stars there.That’s how many descendants you're going to have” (Genesis 15:5). At that time Abraham didn’t even have one child. There r millions of stars in the sky. And it says that Abraham believed the Lord (Genesis 15:6). The word ‘believe’ there in the original Hebrew is ‘AMAN’ from which we get the English word ‘AMEN’ which means ‘I believe that it will be so.’ So when God told Abraham that his seed would be like the stars of heaven, Abraham just said,“Amen=I believe it will be so” That’s it. And it was fulfilled. Today, the children of Abraham (physically & spiritually)number in millions.

Faith means saying “Amen” when God has said something to you. Faith is always based on the word of God. “Faith comes by hearing and hearing by the word of God” (Rom.10:17). You can’t have faith, if you don’t listen to God. Abraham heard God first. Then he said “Amen”. Nowadays, I find many believers saying that they have faith for things about which God has said nothing. They say: “I have faith that God will give me a Mercedez-Benz car. And I believe it’s going to be black in colour. ”That’s not faith. That is presumption. It is tempting God. Faith can be born only after hearing God speaking to us first. Only then can we say, “Amen=It shall be so.” If you remember this, you will be saved from presumption and from counterfeit faith.

Faith begins with God’s promise & not with our desires. Once God has spoken, we must keep on saying,“Amen” to it, all through our life, no matter how long God takes to fulfill His Word. But in Genesis 16; we read that Sarah was impatient. She suggested to Abraham to have children through Hagar, her maid (Gen.16:2). What did Abraham do then? unfortunately he said, “Amen”, to Sarah too. That caused a problem for Abraham’s descendants that have now lasted for 4000 years.

Never say "Amen" to man's word

Thursday, October 30, 2014

అంగ వైకల్యం గలవారిని దేవుడే పుట్టిస్తున్నాడా?

1) ప్రపంచ మనుషులలో అతి కొద్దిమంది అంగవైకల్యంతో మన ముందు ఉండటం చూస్తున్నాము. కాళ్ళు లేని వారుగా, చేతులు లేని వారుగా, చూపు లేని వారుగా, వినికిడి లేని వారుగా, మాట్లాడ లేని వారుగా, మతి స్థిమితం లేని వారుగా ఇలా అనేక రకాలుగా అనేక మంది మన కళ్ళకు కనబడినప్పుడు చూసి జాలి పడటం సహజం. వీరి విషయములో ఆరోగ్యంగా ఉన్నవారు అనగా ఏ లోపం లేని వారు అయ్యో అనడం, అయ్యో పాపం అనడం ఇలా వారి భాదను తమ మాటలతో వ్యక్తపరుస్తారు.

2) అంగవైకల్యంతో భాదపడుతున్నవారు ఆరోగ్యంగా ఉన్నవారిని చూచి దేవుడు నాకు ఎందుకు ఇలాంటి బ్రతుకును ఇచ్చాడు అని, వారినెందుకు అలా ఆరోగ్యముగా చేసి నన్ను ఎందుకు ఇలా అంగవైకల్యంతో పుట్టించాడు అని, నేను ఏమి పాపం చేసానని కుమిలిపోతు, కృంగిపోతు భాదపడుతుంటారు. ఇంకా కొంతమంది అస్సలు దేవుడు అనేవాడు ఉన్నాడా మరి ఉంటే నేను ఎందుకు ఇలా అంగవైకల్యంతో పుడుతాను అని దేవుడినే నిందిస్తారు. ఆరోగ్యవంతులు అంగవైకల్యంతో భాద, వేదన పడుతున్న వారిని చూచి ఏంటి దేవుడు వీరి జీవితాలతో ఆటలాడుకోవడం అని, ఎందుకు ఇలాంటివారికి దేవుడు జన్మనిస్తున్నాడు అని, ఎందుకు దేవుని మనస్సు ఇంత కటినమైనది అన్న మాటలతో దేవునిని నిందించే వారు లేకపోలేదు. మరి కొంత మంది అంగవైకల్యంతో పుట్టడానికి గత జన్మలో పాపం చేసారని, వారి కన్నవారు పాపం చేస్తే ఈ జన్మలో ఇలా అంగవైకల్యంగా పుట్టారని సమాజములో అనుకునే వారు కూడా లేకపోలేదు. ఇలా అంగవైకల్యంతో ఉన్నవారిని చూసి భాదపడుతూ, దేవునిని నిందిస్తూ చివరికి దేవుడే లేడనుకుంటున్నారు.

3) అంగవైకల్యం గలవారు ఆరోగ్యవంతుల స్థితిని చూచి భాదపడుతున్నారు అలానే ఆరోగ్యవంతులు అంగవైకల్యం గలవారి స్థితిని చూచి భాదపడుతున్నారు కానీ పరలోకపు దేవుడు మానవుల పాపపు స్థితిని చూసి భాదపడుతున్నాడనే విషయం మరచిపోయారు. అంగవైకల్యంతో ఉన్న అతి కొద్ది మందిని చూచి భాదపడుతున్నారు కానీ ఈ సృష్టిలో ఉన్న 700 కోట్ల మందికి జన్మనిచ్చిన పరలోకపు తండ్రి భాదను అర్థం చేసుకోవడం లేదు. మన కళ్ళ ముందు రెండు చేతులు లేనివాడిని చూసి అయ్యో అని భాదపడుతాము, కంటి చూపు కోల్పోయిన వారిని చూచి అయ్యో అని సానుభుతి వ్యక్త పరుస్తాముమరి ఏనాడైనా దేవుడు యొక్క వేదన స్థితిని ఆలోచించావా? చాలా మంది పరలోకంలో దేవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు అని అనుకుంటున్నారు.

4) నోవాహు జల ప్రళయం ముందు దేవుని పరిస్థితిని చూస్తే ఎవరి విషయంలో భాదపడ్డాడో అర్థమవుతుంది. ఆదికాండ 6:5 - నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నోచ్చుకోనేను. నేడున్న పరిస్థితులు ఆనాటి చెడు పరిస్థితుల కంటే మార్పు ఉంటే దేవుడు ఆనందముగా ఉన్నాడు అని అనుకోవాలి. వాస్తవముగా ఇప్పటి పరిస్థితులు బొత్తిగా చెడిపోయాయి. నోవాహు కాలములో ఉన్న ప్రజల కన్న నేటి కాల ప్రజలు ఇంకా పాడైపోయారు. ఆనాడు తినుచు, త్రాగుచు సుఖిస్తున్న వారి విషయములో దేవుడు అంతగా భాదపడితే మరి ఈ రోజు ఉన్న మనుషుల విషయములో దేవుడు ఇంకెంత భాదపడుతున్నడో అర్థం కావాలి. దేవుని భాదను పట్టించుకోవడం లేదు కానీ కళ్ళ ముందు ఉన్న అంగవైకల్యం గల కొరకు అయ్యో అంటున్నారు.

5) అంగవైకల్యంతో పుట్టిన వారిని ఉద్దేశించి దేవునిని నిందించడం సరి కాదు. అంగవైకల్యంతో పుట్టిన వారందరిని దేవుడే పుట్టిస్తున్నాడని అనుకోకండి. అలా అనుకుంటే ప్రారంభములో దేవుడు ఆదాము హవ్వను కలిగించినప్పుడు అంగవైకల్యంతో చేసాడా లేక అంగవైకల్యం లేనివారిగా చేసాడా? ఇద్దరినీ ఆరోగ్యవంతులుగా, చావు అనేది లేనట్టుగా దేవుడు కలిగించగ వారు పాపము చేయుట ద్వారా మరణము అను జీతము పొందుకున్నారు. అనగా పాపము చేయుట వలన శరీరం కాస్త మృతమైన దేహముగా మారిపోయింది. దేహం మృతమైనదిగా మారాలి అంటే ఆ యొక్క శరీరంలో ఉన్న జన్యువులలో ఉన్న కణాలలో మార్పు జరిగిన దేహం కాస్త మృతమైన దేహముగా మారింది. అప్పటినుండిశరీరకణాలలో శరీర జన్యువులలో మార్పులు ప్రారంభమైనాయి. అక్కడ నుంచి వారి గర్భాన పుట్టబోతున్న వారందరికీ మార్పులు వచ్చాయి.

6) మనము తీసుకొనవలసిన జాగ్రతలు తీసుకోకపోతే అంగవైకల్యముగానే పుడతారు. అందుకనే గర్భవతులను ఉద్దేశించి తరచుగా చెక్అప్ చేయించుకోవాలని,పుట్టిన బిడ్డలకు పోలియోవేయించుకోవాలని,తరచుగా అవసరమైన ఇంజక్షన్ వేసుకోవాలని,టైంకి మందులు వేసుకోవాలని ఇలా అనేక జాగ్రతలు చెప్తారు. పాటించవలసిన జాగ్రతలు నిర్లక్షముతో పాటించక శరీరంలోకి రోగం వచ్చే సరికి దేవా ఏంటి ఈ పరిస్థితులు అని దేవుడిని నిందిస్తున్నారు. మొదటిగా గర్భముతో ఉన్న తల్లి తీసుకోనవలసిన జాగ్రతలు తీసుకోవాలి. అంగవైకల్యంతో పుట్టడందేవుని ఉద్దేశం అయితే ప్రకృతిలో ఇన్ని రకాల ఆహారాలను ఎందుకు పెడతాడు? నిజముగా ఇలా అంగవైకల్యంతో పుట్టగానే అందరి చూపు దేవుని వైపు వెళ్ళిపోతుంది. పుట్టక ముందు మరియు పుట్టిన తర్వాత ఒక తల్లి తీసుకోనవలసిన జాగ్రతలు పిల్లల విషయములో తీసుకుంటే అప్పుడు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యముగా ఉంటాడు.

7) తీసుకొనవలసిన జాగ్రతలు తీసుకున్న అంగవైకల్యంతో పుట్టినప్పుడు కంగారు పడవలసిన అవసరత లేదు. మోషే కూడా నత్తివాడు. నిర్గమ 4:10-నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా అందుకు యెహోవా –మానవునకు నోరిచ్చువాడు ఎవడు? ముగ వానినేగాని, చెవిటి వానినేగానీ, దృష్టిగలవానినే గానీ, గ్రుడ్డి వానినే గానీ పుట్టించువాడేవడు? యెహోవానైన నేనే గదా.. మోషే బట్టి ఆలోచిస్తే అంగవైకల్యపు వారితో, అంగవైకల్యం లేని వారితో దేవునికి అవసరత ఉన్నదీ. అంగవైకల్యంతో ఉన్న మోషే యొక్క ఆత్మీయ స్థితి దేవునికి నచ్చింది కనుక ఆహారోనును కాక మోషేనే ఎన్నుకున్నాడు. మోషేలో ఉన్న ఓపిక,సహనం, సాత్వికం లాంటి గుణాలు వలన దేవుని చేత ఎన్నికింపబడ్డాడు. దేవుని పనికి ఆహోరోను కాక మోషేనే సరియైనవాడు అని ఎన్నుకున్నాడు. 

8) అంగవైకల్యంతో పుట్టిన వారమైన మేము దేవుని పనికి ఉపయోగం కాము అని అనుకోవడం సరి కాదు. అంగవైకల్యంతో ఉన్న వారు దేవునికి అవసరం లేదని వారిని చూస్తున్న మనము అనుకోకూడదు. మత్తయి 18:8- నీ చెయ్యి యైనను, నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికి నీ యెద్ద నుండి పారివేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటే కుంటివాడవుగానో, అంగహినుడవుగానో జివములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని పెరికి నీ యెద్ద నుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటే ఒక కన్ను కలిగి జివములో ప్రవేశించుట నీకు మేలు. అనగా మనలో ఉన్న ఏ అవయవం అయితే చెడును జరిగించి, అభ్యంతరపరచి పాతాళమునకు నడిపిస్తుందో వాటిని పారివేయుము అని యేసు అంటున్నాడు. రోమా 6:13- మీ అవయవములను దుర్నితి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నిజముగా అంగవైకల్యం గలవారికిఅవయవాలు లేనందుకు నరకం వెళ్ళడానికి అవకాశం తక్కువ. శరీరంలో ఏ అవయవం లేకపోయినా మిగిలిన అవయవాలుతో దేవుడు అప్పగించిన పని చేయవలసిన వారిగా ఉండాలి.

9) రోమా 9:20- ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు కీలాగు చేసితివని రూపింపబడినది రుపించువానితో చెప్పునా? దేవునిచే సృష్టించబడిన మనము తుదుకు దేవునినే అంగవైకల్యమును బట్టి నిండించటసరినా? కాదు. దేవుడు ఇచ్చిన అవయవాలతో దేవుని పని చేయాలి. ఆరోగ్యవంతుడిగా అవయవాలు అన్ని సరిగా ఉన్నను దేవుని పని చేయక నరకానికి వెళ్ళిపోతున్న వాడికన్న అంగవైలక్యంతో ఉన్నను దేవుని కొరకు బ్రతికి పరలోకానికి వెళ్ళేవాడు చాలా గొప్పవాడు. వాస్తవముగా ఆలోచిస్తే పరలోకం వెళ్ళుటకు అంగవైకల్యం ఆటంకము కాదు. అంగవైకల్యం అనునది శరీరానికి సంభందించిందే కానీ ఆత్మకు సంభందించింది కాదు. కనుక అంగవైకల్యంతో ఈ లోకములో జివించినప్పటికి చనిపోయాక పరలోకానికి ప్రవేశించవచ్చు కానీ పాపంతో పరలోకానికి ప్రవేశించలేము.

10) పరలోకానికి అంగవైకల్యం ఆటంకము కాదు. గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని జాగ్రతలు తీసుకున్నప్పుడు కూడా అంగవైకల్యంతో పుడితే భాదపడక దేవుని పనిలో ఉండగలిగితే లేక దేవునికి ఇష్టానుసారముగా ఉండగలిగితే ఆ మహాలోకమైన పరలోకానికి ప్రవేశించగలుగుతాము. అంగవైకల్యంతో ఉన్నను లేక లేకపోయినను దేవునిలోజీవించి- దేవునితో జీవించి-దేవునికై జీవించి- దేవునిలా జీవించి పరలోకానికి ప్రవేశించుదాము.

Wednesday, September 3, 2014

ఏమి లేనప్పుడు దేవుడెలా ఉన్నాడు?


1) మనుష్యలందరికీ మిగిలిపోయిన చిక్కు ప్రశ్న “దేవుడు అర్థము కాకపోవడము”. ఏమి లేనప్పుడు దేవుడు ఎలా పుట్టాడు అని అడుగుతారే కానీ, తన కుడి చెయ్యి గుప్పెడు మెతుకులతో తన నోటి వద్దకు ఎందుకు తీసుకోని వస్తుందో ఆలోచించలేడు. దేవుని గూర్చి రుజువులతో చూపించే శక్తీ ఒక్క బైబిల్ కు మాత్రమే ఉన్నది. చెట్టు ముందా లేక విత్తనము ముందా? కోడి ముందా గుడ్డు ముందా అని తలతిక్క ప్రశ్నలు అడుగుతుంటారు. చెట్టు రావాలంటే విత్తనము ఉండాలి, విత్తనము రావాలంటే చెట్టు ఉండాలి అంటూ ఎదుటి వారిని తిక మక పెడుతూ ఉంటారు. అదే విధముగా దేవుడు పుట్టాలి అంటే దేవుడు అమ్మ అన్న ఉండాలి లేక దేవుడికి తండ్రి అన్న ఉండాలి అంటారు.

2) కోడి ముందా గుడ్డు ముందా అనే వారికీ మనము వేయాల్సిన ప్రశ్న నువ్వు ముందా? మీ నాన్న ముందా? దీనికి ఖచ్చితముగా మా నన్నే ముందు అని సమాధానము చెప్పక తప్పదు. అనగా సృష్టిలో ఉన్న ప్రతిది కూడా చిన్నది పెద్దదాని నుండి రావలసిందే కాని చిన్న దాని నుండి పెద్దది ఎప్పటికి రాదు.చిన్నది ఎదుగుతూ పెద్దదానిగా మారుతుంది. ఈ విషయము గూర్చి బైబిల్ లో చూస్తే ఆదికాండ1:11,12- దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మిధ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మోలిపించును గాక అని పలకగా ఆప్రకారమాయెను. అనగా వృక్షములు మొదట మొలిచినవి ,వాటిలో గల ఫలములలో విత్తనాలు ఉన్నయి. ఈ విశ్వములో వృక్షములు భూమి మిద తప్పించి మరే గ్రహములో చెట్లు ఉండవు. ఇక్కడ మనము చాల జాగ్రతగా ఆలోచిస్తే ఈ భూమి మీదకు విత్తనములు వచ్చుటకు ఆ విత్తనములు కలిగిన చెట్లు ఎక్కడ ఉన్నాయి? అందుకనే మొదట దేవుడు చెట్లను కలిగించాడు. మరో ముఖ్యమైన సంగతి ఏమనగా సృష్టిలో ఉన్నవన్నీ(మనతో సహా) వచ్చినవే గానీ ఉన్నవి కాదు.మనకంటే ముందే వచ్చేసాయి కాబట్టి మనకు సృష్టి అర్థము కావటము లేదు. మనకంటే ముందు ఈ సృష్టి జరిగినదని మనము ఎలా చెప్పగలం అంటే మనము ముందు చేయబడిన తర్వాత గాలిని చేసియుంటే ,గాలి లేక మనము చచ్చిపోయి ఉండేవారము. అందుకే తల్లి గర్భము నుండి భయటకు రాగానే మనకంటూ ముందే గాలి భూమి మిద ఉంటుంది. 

3) భుగర్భములో నుండి ఆదాము యొక్క మట్టి బొమ్మ భయటకు రాకముందే దేవుడు అన్ని వసతులు కలిగించి యుంచాడు. ఈ లోక వస్తువు వలెనే దేవుడు కూడా వచ్చిన వాడు కాదు. దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు ? దేవుడు చెబుతున్న సమాధానము నిర్గమ 3: 4- నేను ఉన్నవాడను,అనువాడను. అంటే నేను వచ్చిన వాడిని కాదు అని నేను ఉన్నవాడినిఅని చెబుతున్నాడు. ఉదాహరణకు:: నేను ఉన్నాను. నేను మా తండ్రి  నుండి వచ్చాను. మా తండ్రి  వాళ్ళ తండ్రి  నుండి వచ్చాడు. ఈ విధముగా వెనక్కి పోతే ఆఖరున చివరి ఎవరో ఒకాయన ఉండకపోడు. అందరి కంటే ఆఖరున(అనగా ప్రారంభములో) మిగిలిన వాడె దేవుడు. యెషయ 43:10,11- నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు.నా తరువాత ఏ దేవుడును ఉండదు. నేను నేనే యహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

4) అన్నిటికంటే ముందు ఉన్నవాడే నాకు ముందు ఎవరు లేరు అని అంటూ ఉంటె ,ఆఖరున పుట్టిన మనిషి దేవుడు ఎలా పుట్టాడు అంటాడు. దీనికి దేవుడు జవాబును యెషయ45:9లో చూడొచ్చు. దేవుడు చేస్తే కలిగిన వారము మనము. అయన పోమన్ని చెబితే మట్టిలోనికి పోవలసిన వారమే మనమంతా! అ,ఆ లు రానివాడు పాటాలు చదివిన ఎలా గ్రహించలేడో అలానే దేవుడు గురించి, మనము అనుభవిస్తున్న ప్రకృతి గురించి అర్థము కాని వారికీ దేవుని విషయాలు కూడా అర్థము కాలేవు. దేవుని గూర్చి అర్థము కావాలంటే మన శరీర అవయవాల నిర్మాణము వాటి పనితీరు దగ్గర నుండి దేవుడు వరకు ఆలోచించాలి. 

5) మనిషికి దేవుడు అర్థంకాలేకపోయినా దేవుళ్ళును మాత్రము కలిపివేస్తూ అందరి దేవుళ్ళు ఒక్కటే అంటాడు.మనము కలిపితే కలిసిపోవడానికి అయన( తండ్రియైన యెహోవా) నీళ్ళలో పాలను కుంటున్నారా? నిర్గమ 20:3,4- నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను రోషము గల దేవుడను. ఒకసారి ఈ వచనమును చదవండి. బైబిల్ నందు దేవుని మనస్సు తెలుసుకోక అందరి దేవుళ్ళు ఒక్కటే అనుట నిజం కాదు. యెషయ 44:24-యెహోవానాగు నేను సమస్తమును జరిగించువాడను. మనిషికి బ్రతుకు నేర్పించింది దేవుడే. అందుకే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ నుండి వచ్చాడు? అని ప్రశ్నించి తెలుసుకొనుట గుండుసూదితో మహా పర్వతాన్ని త్రావ్వినంత కష్టమైనదిగా భావించాలి. దేవుడు కలిగించిన మెదడు దేవుడుని ప్రశ్నిస్తున్నాడు.

6) దేవుడు కాలము లేని వాడు.( కీర్తన 102:27) .పరిమితి కలిగిన ఆయుష్షు ఉన్నవాడు కాదు. పూర్వ కాలము నుండి మనిషికి అన్ని విషయాలు దేవుడే నేర్పించాడు. భూమిని ఈ విధముగా సేద్యపరచాలో అడమునకు నేర్పించింది దేవుడే. పురుషుడు ఈ విధముగా ఉండాలని, స్త్రీ ఈ విధముగా ఉండాలని కలగజేసింది ఆయనే. ప్రపంచములో అంత పురుషులో లేక స్త్రీలో ఉంటె మన సంగతి ఏమిటో ఆలోచించండి. ఆదికాండ 1:27-దేవుడు తన స్వరుపమందు నరుని సృజించెను.

7) మనిషి తన కళ్ళతో చుడలేనివి,తన ఆలోచనకు అందనివి చాలా ఉన్నాయి. కొన్నిటిని మైక్రొస్కోప్ (Microscope) లో చూసుకుంటున్నాడు మరి కొన్నిటిని హబుల్ టెలిస్కొపు(Habul Telecrope) లో చూసుకుంటున్నాడు. మరి దేవుని దేనితో చూడాలో తెలుసా? బైబిల్ నందు వ్రాయబడిన వాక్యముతో చూడాలి.దేవునికి జ్ఞానము మనవలె మట్టి మెడదు నుండి వచ్చింది కాదు. 1కోరంది2:11- ఒక మనుష్యుని సంగతులు అతనిలో నున్న మనుష్యత్మకే కాని, ముష్యులలో మరి ఎవరికీ తెలియును?అలాగే దేవుని సంగతులు దేవుని అత్మకే గానీ మరి ఎవనికిని తెలియవు. కాబట్టి దేవుడు తన మాటలను, కార్యములను Translate చేయుటకు ప్రవక్తలకు తన పరిశుద్దాత్మను ఇచ్చియున్నాడు.

8) సూర్యుడు మండుచున్నాడు అంటే నమ్ముతున్నారు. నీరుగడ్డకడుతుంది అంటే నమ్మగలరు. కానీ కానీ దేవుడు ఉన్నాడు అంటే మాత్రమూ ఎందుకో నమ్మలేడు. మనకు వాలే దేవుడు వచ్చియుంటే అయన దేవుడు ఎలా అవుతాడు?? దేవుని గూర్చి బైబిల్ లో పూర్తిగా వ్రాయబడింది. బైబిల్ ముద్రణ యంత్రాన్ని కనుగొనిన తరువాత అచ్చు వేయబడిన మొదటి పుస్తకము ఇదే కాబట్టి చివరిగా మరొక మాట యోహాను 5:26 ను చదవండి.

9) దేవుడు ఒక మహాశక్తి కాబట్టి ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు.శక్తికి పుట్టుక ఉన్నదా? చావు ఉన్నదా? శక్తిని గానీ, పదార్ధాన్ని గానీ పుట్టించలేము నాశనము చేయలేము. శక్తికి లింగ భేదము లేదు. శక్తికి పుట్టుక చవులు లేనట్లే దేవునికి కూడా లేవు. మరి ఈ శక్తులు దేవుని ఉనికిని తెలియజేస్తున్నాయి దేవుడు కలిగించిన శక్తీకే ఇంతటి ధర్మము ఉంటె దేవుడు కూడా నాశనము లేనివాడుగా మహా శక్తిగా ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు స్వతంత్రుడుగా ఉన్నవాడు వచ్చివాడు కాదు. దేవుడు మరొక రూపము ధరించవలసిన అవసరము లేదు.

10) నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడే దేవుడు. మాటలలో, క్రియల్లోనూ దైవత్వాన్ని చూపించేవాడు.ఆయనకు బ్రతుకును ఎవ్వరు ఇవ్వలేదు. 

11) దేవుడు ఎలా వచ్చాడో ఆలోచించుటకు ముందు మనము ఎలా వచ్చామో ఆలోచించండి. తల్లి గర్భములో నుండి వచ్చాము అంటారా? అది నిజమే. ఆ తల్లి గర్భాములోనికి ఎక్కడ నుండి వచ్చాము? తల్లి గర్భాములోనికి రాకముందు ఎక్కడో ఉన్నాము. ఎక్కడో చెప్పమంటారా? ఉన్నవాడైన దేవునిలో ఉన్నాము. కాబట్టి దేవుడు “ఉన్నవాడే” గానీ వచ్చినవాడు కాదు. లోకములో ఉన్నవి మనము మొదట ఆలోచిస్తే అర్థమైతే అప్పుడు దేవుడు అర్థమవుతాడు.

బైబిల్లో మొహమ్మద్ గురించి చెప్పబడింది అంటున్న వారికీ చెప్పబడలేదు అనుటకు రుజువులతో కూడిన వివరణ PART - II

బైబిల్లో వ్రాయబడ్డ సందర్భాలను తప్పుగా అర్థము చేసుకుని, వారికీ(ముస్లింలు) అనుకూలముగా అన్వయించుకుని బైబిల్లో మోహామోద్ ప్రవక్త గురించి మోషే ముందుగా చెప్పబడింది అని ప్రకటిస్తున్నారు. అక్కడక్కడ సెమినార్స్ పెడుతూ బైబిల్లో చెప్పబడిన ఆ ప్రవక్త మోహామోద్ అని ప్రకటిస్తూ అనేక అమాయకులైన క్రైస్తవ విశ్వాసులను వారి మతములోకి మార్చుకుంటున్నారు. బైబిల్లో మోహామోద్ గురించి వ్రాయబడిన సందర్భాలు ఉన్నవని వారు(ముస్లింలు) అంటున్నప్పుడు అది ఎవరిని గురించి వ్రాయబడ్డాయో అన్న వాస్తవము ఏమిటో చెప్పవలసిన భాద్యత క్రైస్తవులమైన మనకు ఉంది. రెండవ భాగముగా(Second part) ఈ సందేశములో చుడండి.

1) (a) ఇంతకు బైబిల్లో మోషే చెప్పిన ఆ ప్రవక్త ఎవరు అనే విషయము మనకు తెలియాలంటే ముందుగా ప్రవక్త అని ఎవరిని అంటారో తెలియాలి. ప్రవక్త అనగా ప్రభువు పంపగా వచ్చినవాడు, ప్రభువు పక్షముగా ప్రజలతో మాట్లాడేవాడు, దేవునికి మరియు ప్రజలకు మధ్యవర్తి అని. పాత నిబంధనలో ప్రవక్తలందరూ ప్రజలతో మాటలాడుచున్నప్పుడు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా అని స్టార్ట్ చేయడం మనము చూస్తున్నాము. యెషయ 50:1-యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెషయ 66:1-యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యీర్మియా1:4- యెహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. పై వచనాలు బట్టి చూస్తే ప్రవక్త అంటే ప్రభువు చెప్పిన మాటలను ప్రజలకు ప్రకటించుట అని. 

(b)ఈ మధ్య కాలములో కొందరు తమ పేరులకు ముందు ప్రవక్త అని, మరికొందరు అపోస్తులడని పెట్టుకోవడము మనము చూస్తూ ఉంటాము. కానీ ప్రవక్తలనబడిన వారు ఎప్పటి వరకు ఉన్నారో అనే విషయాన్నీ బైబిల్లో చూస్తే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే Luke16:16-యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తులును ఉండిరి అని అంటున్నాడు. మొదటి శతాబ్దము వరకే ప్రవక్తలు ఉన్నారన్న విషయము అర్థమైతే తరువాత వచ్చిన వారు ఎవ్వరు ప్రవక్తలు కారనే సంగతి సులువుగా గ్రహించవచ్చు. అలా అయితే యేసు మాటను బట్టి( బైబిల్) క్రీస్తు తరువాత 500 years వచ్చిన మోహామోద్ ప్రవక్త అయ్యే అవకాశమే లేనప్పుడు “ఆ” ప్రవక్త కాగలడా?

(c) ముస్లిం సోదరులు ఏ మాటను అపార్ధము చేసుకుని బైబిల్లో లేని మోహామోద్ ను బైబిల్లో ఉన్నాడు అంటూ భ్రమపడుచున్నారో చూస్తే ద్వితియోప18:16,18,19.- (నీ) వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. అతని నోట నా మాటలు ఉంచేదను. నేను అతనికి అజ్ఞాపించునది యావత్తు అతడు వారితో చెప్పెను. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను. పై మాటను ముస్లిం సోదరులు ఎలా వక్రికరించారంటే మోషే ఇశ్రాయేలీయులతో నీ సహోదరులలో నుండి అన్నాడు కనుక ఇశ్రాయేలీయుల సహోదరులు ఇష్మాయేలీయులు కనుక మోషే చెప్పిన “ఆ” ఇష్మాయేలీయులలో నుండి రావాలి మరియు ఆ ప్రవక్త మాటే అందరు వినాలి ఆయనే మోహామోద్ ప్రవక్త అని వాక్యాన్ని అపార్ధము చేసుకున్నారు. 2 పేతురు 3:16- లేఖములను అపార్ధము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్ధము చేయుదురు.

(d)ఈ సందర్భములో మోషే మాటలాడుచున్నది ఇశ్రాయేలీయులను ఉద్దేశించే కానీ ఇష్మాయేలీయులు కొరకు కాదు. కారణము చూస్తే ఇశ్రాయేలీయులు అనగానే ఒక్కరు కాదు పన్నెండు గోత్రాలు ప్రజలు. ఒక గోత్రము వారు మరొక గోత్రపు వారికీ సహోదరులు అవుతారు. ఒక వేళ వారి (నీ) సహోదరులు అనగానే ఇష్మాయేలీయులు గురించి అని అనుకుంటే ప్రతి సందర్భములో అలానే ఆలోచించాలి. ఉదాహరణ: ద్వితయో 17:15- నీ సహోధరులలోనే ఒకని నీ మిధ రాజుగా నియమించుకొనవలెను అను మాట ఉంది. పై మాటలో నీ సహోదరులు అనగానే ఇష్మాయేలీయులు అయితే ఇశ్రాయేలీయులపై రాజులూ ఎవరు ఉండాలి? ఇష్మాయేలీయులే ఉండాలి. అలా అయితే ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులలో ఒక్కరినైన ఇష్మాయేలీయుడను చూపించగలరా? లేదు. కారణము ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులందరు ఇశ్రాయేలీయులే( సౌలు, దావీదు, సోలోమోను, రెహబాము, యరోబము. ఇలా వీరు అందరు ఇశ్రాయేలీయులు.

(e) పై సందర్భమును బట్టి ప్రవక్త ఇశ్రాయేలీయులలో నుండి మాత్రమే రావాలి అనే విషయము స్పష్టమయింది. దేవుడు తన మాటలను తెలియజేయటానికి ప్రారంభము నుండి అనగా మోషే కాలము నుండి ఇశ్రాయేలీయులు(యూదులు)ను మాత్రమే ఎంపిక చేసుకున్నట్లుగా మనము బైబిల్ నందు చూడగలము. ఎక్కడైనా దేవుడు ఇష్మాయేలీయుల ద్వారా నా మాటలను తెలియజేయుదును అని అన్నట్లుగా మీరు చూపించగలరా? రోమ 3:1, యావేలు2:11, ఆమోసు 2:11, కీర్తన 147:19 ఇలా ఈ వచనాలలో చూడొచ్చు. ప్రవక్తలందరు ఇశ్రాయేలీయుల నుండి వచ్చారు, వస్తారు అనే విషయము మనకు అర్థమవుచున్నది గనుక ఆ మాటలన్నిటిని బట్టి మోహామోద్ “ఆ” ప్రవక్త అయ్యే అవకాశమే లేదు.

(f) ఇప్పటివరకు “ఆ “ ప్రవక్త ఇశ్రాయేలీయులలో నుండి మాత్రమే రావాలి అని. మరి ఎవరు “ఆ ప్రవక్త? యేసుక్రీస్తు(రాక) విషయమై ఎన్నో ప్రవచన లేఖనములు ధర్మశాస్త్రములోను, కీర్తన గ్రంధములోను, ప్రవక్తల గ్రంధములోను మనము చూడగలము ( యోహాను 1:45, లూకా 24:44) . ఈ వచనములో యేసుక్రిస్తే స్వయంగా నన్ను గూర్చి మోషే ధర్మశాస్త్రములోనువ్రాయబడింది అని చెబుతున్నాడు అంటే ఒక వేళ మోషే ద్వితియొపదేశకాండంలో చెప్పిన “ఆ” ప్రవక్త యేసు కావచ్చు కదా!

యేసు ప్రవక్తా?

2) (a)హెబ్రీ 1:12- పూర్వకాలమందు నానా సమయములలోను, నానా విధములగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు , ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడేను. దేవుడు చెప్పిన ప్రతి మాటను ప్రజలకు తెలియజేయువాడే ప్రవక్త అని ముందు మాటల్లో మీరు చదివారు. ఇప్పుడు యేసును కూడా ప్రవక్తగా మనము చెప్పుటలో తప్పు లేదు. యోహాను 12:49,50, 17:7,8:26,7:16 లో చూడొచ్చు. తండ్రియైన దేవుడు తెలియజేసిన( చెప్పమన్న) సంగతులు కాక యేసు మరేమియు చెప్పలేదని అనగా ఒకనాటి ప్రవక్తల వలె యేసు కూడా దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా యుండి ప్రజలకు దేవుని మాటలు తెలియజేసారు. కావున యేసు “ప్రవక్త” . యేసు ప్రవక్త అనుటకు బైబిల్లో మరికొన్ని మాటలను మనము చూస్తే యోహాను 4:19, 9:17, లూకా 24:19,మత్తాయి 21:11,21:46, లూకా 7:15,16.

(b) పై వ్రాయబడిన వచనాలు అన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రవక్త అనే విషయము మనకు స్పష్టముగా అర్థమయింది. యేసుక్రీస్తు ప్రవక్త అని చెప్పినంత మాత్రమున అయన దేవుడు కాదు, దైవ కుమారుడు కాడు అని నేను చెప్పుట లేదు. 

(c) ఒక ఆఫీసర్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీసర్ గా పిలువబడతాడు. ఇంటిలో ఉన్నప్పుడు భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, తల్లితండ్రులకు కుమారుడిగా, అన్నకు తమ్ముడిగా పిలువబడుతాడు. ఒక వ్యక్తే ఇన్ని విధములుగా పిలువబడుచున్నాడు. ఇది సరియైనదే అలానే యేసుక్రీస్తు ప్రవక్తగా, దేవునిగా, దేవుని కుమారుడిగా ఆయనకున్న లక్షణాలను బట్టి మనకు అర్థమవుచున్నది. యేసుక్రీస్తు ప్రవక్త అనే విషయము మనకు అర్థమయింది కాని యేసుక్రీస్తు “ ఆ ప్రవక్త నా?

యేసు “ఆ” ప్రవక్తనా?

(3) (a)యేసుక్రీస్తు ఆ ప్రవక్త అనుటకు మనకున్న లేఖన ఆధారములలో కొన్నిటిని మనము ఆలోచన చేయ గలిగితే “ఆ ప్రవక్త ఇశ్రాయేలు గోత్రాలలో ఏదో ఒక గోత్రము నుండి రావాలి. యేసుక్రీస్తు ముమ్మాటికి ఇశ్రాయేలియుడే. రోమా 9:4, మత్తాయి 1:1, మత్తాయి 2:2, రోమా1:7, 2 తిమోతి 2:8లో చూడొచ్చు. ఈ కొన్ని లేఖనాదారాలను బట్టి యేసుక్రీస్తు దావీదు సంతానముగా అనగా యుదా వంశము నుండి వచ్చాడు అనే విషయము అర్థమవుచున్నది. యోహాను 6:14- లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. యోహాను 7:40- నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి.

(b) ఇదంతా చదివిన తరువాత ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక వారు ఇది ప్రజలిచ్చిన సాక్షం కనుక చెల్లదు అనవచ్చు. ఎందుకనగా క్రిస్తుపైనే వారికీ సరియైన అబిప్రాయము లేదు. కారణము మనసంతా మోహామోద్ తో నిండికొనియుంది. అపోకార్య3:22,23లో పేతురు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచున్నారో బైబిల్ పై కనీస జ్ఞానముయున్న ఎవరైనా సులువుగా గ్రహించగలరు. 

(c) ముస్లిం సోదరులులు యేసును నమ్ముతాము. అయన అంటే మాకు గౌరవము అంటున్నప్పుడు అయన చెప్పిన ప్రతి మాట నమ్మాలి. అయన చెప్పిన ప్రతిది చేయాలి. వారికీ అనుకూలముగా ఉన్నవాటిని నమ్మి మిగిలినవి వదిలేయడము మహానుభావుడైన యేసును ఆగౌరవపరచడమే అవుతుంది.

(d) మోషే గారు నా వంటి ఒక ప్రవాక్తను అన్నారు కదా . మోషేకి పెళ్లి అయింది కదా మరి యేసు కు కాలేదు అని అంటున్నారు. మోషే లాంటి ప్రవక్త అనగానే వయస్సు, వివాహము, పిల్లలు కాదు ఆలోచించాల్సింది. లక్షణాలు కావాలి. దేవుడు అనగానే ఎలా గుణ లక్షణాలను పరిగణలోనికి తీసుకుంటామో అలానే మోషే లాంటి లక్షణాలు కలిగినవాడు అని అర్థము. మోషేను గూర్చి దేవుడే పలికిన మాటలను చూస్తే (సంఖ్యా 12:3,సంఖ్యా 12:7). ఇవే లక్షణాలు తిరిగి మనము స్పష్టముగా ఎసుక్రిస్తులో చూడగలము.

CONCLUSION: మోషే లాంటి వాడు యేసుక్రీస్తు కాని మోహామోద్ కాదు. “ఆ ప్రవక్త ఇశ్రాయేలులో నుండే రావాలి ప్రవక్తలందరు ఇశ్రాయేలియులే సహోదరులు అనగానే ఇశ్రాయేలు 12 గోత్రాలు వారే ప్రజలు, అపోస్తులలు పౌలు గారి ఇచ్చిన వ్రాసిన సాక్షాన్ని బట్టి యేసునే “ఆ ప్రవక్త” యేసు తరువాత సుమారు 500 years కి వచ్చిన మోహామోద్ “ఆ “ ప్రవక్త అనుకోవడము ఇస్లాము సోదరుల భ్రమ.--> మోహామోద్ ఇశ్రాయేలియుడై కానప్పుడు ప్రవక్త కాదు. ఆ ప్రవక్త అస్సలు కాదు.

బైబిల్లో మొహమ్మద్ గురించి చెప్పబడింది అంటున్న వారికీ చెప్పబడలేదు అనుటకు రుజువులతో కూడిన వివరణ PART - I

బైబిల్లో వ్రాయబడ్డ సందర్భాలను తప్పుగా అర్థము చేసుకుని వారికీ(ముస్లిం లు) అనుకూలముగా అన్వయించుకుని బైబిల్లో మోహామోద్ ప్రవక్త గురించి ఉంది అని “ బైబిల్లో మోహామోద్ అనే పుస్తకాన్ని వ్రాసి ప్రకటిస్తున్నారు. అక్కడక్కడ సెమినార్స్ పెడుతూ బైబిల్లో చెప్పబడిన ఆ ప్రవక్త మోహామోద్ అని ప్రకటిస్తూ అనేక అమాయకులైన క్రైస్తవ విశ్వాసులను వారి మతములోకి మార్చుకుంటున్నారు. బైబిల్లో మోహామోద్ గురించి వ్రాయబడిన సందర్భాలు ఉన్నవని వారు(ముస్లింలు) అంటున్నప్పుడు అది ఎవరిని గురించి వ్రాయబడ్డాయో అన్న వాస్తవము ఏమిటో చెప్పవలసిన భాద్యత క్రైస్తవులమైన మనకు ఉంది. వీరి యొక్క మాటలకూ జవాబు ఇచ్చుటకు నేను సందేశమును రెండు భాగాలుగా(Parts) గా చేస్తున్నాను. ఈ సందేశము మొదటి భాగము(First part). రెండవ భాగము( Second part) మరొక సందేశములో చుడండి.

వారి మొదటి ప్రశ్న మరియు మన వివరణ.

1) ముందుగా బైబిల్లో ముఖ్యముగా మూడు వచనాలను వారికీ అనుకూలముగా మార్చుకుని ఇందులో మోహామోద్ గూర్చి చెప్పబడింది అని అంటున్నారు. బైబిల్లో మోహామోద్ ఎలా ఉన్నడో ఒక్కసారి వారి యొక్క మాటలలో విందాము. శ్రద్దగా చదవండి. వారు చూపిస్తున్న మొదటి  వచనమును చూద్దాము. John 14:25-నేను(యేసు) మీ యెద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును మీకు భోదించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ యేసు వెళ్లిపోతు మరొక ఆదరణకర్తను పంపిస్తానని అంటున్నాడు. యేసు వెళ్లిపొతున్నాడన్న మాట విని శిష్యులు భాదపడుతూ కలవర పడుచున్నారు. కలవరపడుచున్న, భాదపడుచున్న వారిని ఓదార్చడానికి నేను వెళ్లి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని శిష్యులను ఉద్దేశించి, ఆ తరువాత రాబోయే పరిశుదాత్మ గురించి చెప్పుచున్న మాటే ఈ వచనము.

2) అలాగే John 14:16,17- నేను తండ్రిని వేడుకొందును. మియోద్ద “ఎల్లప్పుడూ” నుండుటకై అయన “వేరొక ఆదరణ కర్తను “అనగా సత్య స్వరుపియగు ఆత్మను మీకు అనుగ్రహించును.” లోకము ఆయనను చూడదు”, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు.”అయన మీతో కూడా నివసించును, మిలో ఉండును. ఈ వచనములో కూడా యేసు వెళ్లి ఎల్లప్పుడూ మన మధ్య ఉండడానికి వేరొక ఆదరణ కర్తను పంపిస్తాను అని చెప్పాడు. బైబిల్ లో ఉన్న ఈ మాటలను చూపించి యేసు వెళ్ళిన తరువాత అయన పంపిన ఆదరణకర్తే మోహామోద్ గా అంటున్నారు.

3) వీళ్ళు అడుగుతున్న ప్రశ్నను చూస్తే క్రైస్తవులైన మీరు పరిశుద్దాత్మ అని అంటే మరి యేసు వేరొక ఆదరనకర్తను పంపిస్తాను అన్నాడు కదా? ఒక వ్యక్తిని పంపిస్తానని యేసు చెప్పాడు కదా? యేసు ఒక వ్యక్తి. నేను వెళ్లి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అంటే వ్యక్తి గురించి కదా మాటలాడుతుంది, మరి పరిశుద్దాత్మ ఒక వ్యక్తా?? నేను వెళ్లి వేరొక ఆదరణకర్తను పంపిస్తానని ఒక వ్యక్తి గురించి చెబితే క్రైస్తవులైన మీరు ఒక పరిశుదాత్మ అని ఒక శక్తి గురించి ఎందుకు అంటున్నారు?? ఇక్కడ యేసు చెబుతున్నది మోహామోద్ గురించి అని పై రెండు వచనాలను బట్టి తప్పుడుగా వక్రీకరించి చెబుతున్నారు.

4) ఇప్పుడు ప్రశ్నయొక్క జవాబును చూద్దాము. (a) ఒక వేళా అది మోహామోద్ గురించి అని అనుకుంటే బైబిల్లో పరిశుదాత్మ లేదా ఆదరణకర్త గూర్చి యేసు చెప్పిన మాటలన్నీ మోహామోద్ లో కనిపించాలి. యేసు చెప్పిన లక్షణాలు అన్ని మోహామోద్ లో ఉంటె అప్పుడు ఆలోచించొచ్చు. John 14:25-ఆదరణకర్తగా పరిశుదాత్మను పంపబోతున్నానని చెబుతున్నాడు. అంటే వచ్చే అయన వ్యక్తినా లేక శక్తీనా? ఆదరణకర్త అనగా ఒక వ్యక్తి అని అనుకుంటారని తండ్రి నా నామమున పంపబోవు పరిశుదాత్మ అని యేసు స్పష్టముగా చెప్పాడు. అనగా రావలసినది ఆత్మే తప్ప వ్యక్తి కాదు. (b) John 14:25లో నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును అను మాట ఉంది. ఒక వేళ మోహామోద్ అయితే యేసు చెప్పినవే చెప్పాలి. యేసు చెప్పనివి చెబితే పంపబడిన ఆదరణకర్త మోహామోద్ ఎలా అవుతాడు? ఖురాన్లో మోహామోద్ చెప్పిన సంగతులు వేరు బైబిల్లో యేసు చెప్పిన సందర్భాలు వేరు. రాబోయే ఆదరణకర్తకు సొంతముగా ఏ నిర్ణయము తీసుకునే హక్కు లేదు. ఇప్పుడు మోహామోద్ గురించి ఆలోచిస్తే మోహామోద్ నే ఆదరణకర్త అయితే యేసు చెప్పిన మాటలే చెప్పాలి. కాని యేసు చెప్పిన మాటలు వేరు ఖురాన్లో మోహామోద్ మాటలు వేరు. అలాంటప్పుడు ఆదరణకర్త మోహామోద్ అని ఎలా ఉహించుకుంటారు? (c) John 14:16,17- మియోద్ద “ఎల్లప్పుడూ” నుండుటకై అయన “వేరొక ఆదరణ కర్తను. ఒక వేళ మోహామోద్ ఆదరణకర్త అయితే ఎల్లప్పుడూ భూమి మీద ఉండాలి. మరి ఎందుకు మోహామోద్ చచ్చిపోయాడు? పై వచనములో ఎల్లప్పుడూ ఉండుటకై అను మాట ఉంది కదా. ఒక వ్యక్తి అయితే ఎల్లప్పుడూ ఉంటాడా? ఆత్మ అయితేనే ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ఆదరణకర్తగా పరిశుద్దాత్మను పంపాడు. పై వచనములో పంపబడుతున్న ఈయన ఎవరికీ కనపడడు అనే మాట ఉంది. ఇప్పుడు మోహామోద్ ని చూసారా లేదా? చూసారు. ఇప్పటికి ఫోటోలో చూస్తున్నాము. పై వచనములో అయన మీతో కూడా నివసించును, మిలో ఉండును అను మాట ఉంది. మిలో అనగా ఎక్కడా? పరిశుదాత్మకు ఆలయము మానవులైనా మన హృదయమే. హృదయము మనలో ఉంది. మనలో ఉన్న హృదయములో ఉండబోయే ఆత్మ గురించి చెబుతున్నాడు. వాస్తవముగా మోహామోద్ మనతో పాటు కలిసి ఉండేవాడు. మనలో ఉండే వాడు కాదు. కాబట్టి యేసు మనలో ఉండగలిగిన శక్తివంతమైన పరిశుదాత్మడు గురించి చెబుతున్నాడే 
తప్ప ఒక వ్యక్తి అయిన మోహామోద్ గురించి చెప్పలేదు. అస్సలు ఖురాన్లో మోహామోద్ ఉన్నప్పుడు బైబిల్లోకి వచ్చి చెప్పవలసిన అవసరత ఏమి వచ్చింది? చివరిగా బైబిల్లో యేసు పలికిన మాటలు పరిశుదాత్మను గురించి చెప్పిన మాటలే తప్ప మోహామోద్ గురించి చెప్పినవి కావు. 

వారి రెండవ ప్రశ్న మరియు మన వివరణ.

1) John 1:15,16- యోహాను అయనను(యేసు) గూర్చి సాక్షమిచ్చుచు- నా వెనుక వచ్చువాడు నా కంటే ప్రముఖుడు. ఈ వచనములో ఎవరు ఎవరిని ఉద్దేశించి మాటలడుచున్నారో తెలియాలి. యోహాను యేసును ఉద్దేశించి చెప్పబడుతున్న మాట. కాని ఈ వచనమును యోహాను కాదు యేసు మోహామోద్ నీ ఉద్దేశించి మాటలడుతున్నాడని అని చెబుతున్నారు. మరి క్రైస్తవులైన మనము ఈ వచనములో యోహాను అని అన్నట్లుగా ఉంది అని అడిగితే బైబిల్ తర్జుమలో పొరపాటు జరిగింది అని అంటున్నారు. వచనములోకి వెళ్తే నా వెనుక వచ్చువాడు అనగా ఏమి? ఉదాహరణకు మీతో ఎవరైనా నీవెనుక ఒకడు వస్తున్నాడు చూడు అనగా వెంటనే వెనక్కి చూస్తాము కాని ముందుకు చూడము. యేసు మొదటి శతాబ్దములో మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన 500 years తర్వాత పుట్టాడు. ఇక్కడ యేసునే నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు అను మాటను అన్నాడు అని అనుకుంటే 500 years తర్వాత వచ్చిన మోహామోద్ గురించి నా వెనుకల వచ్చువాడు అని అంటాడా? నిజముగా యోహాను ఈ మాట అనగానే యేసు వెనుక వచ్చాడు. ఒకసారి Luke3:16,21-యోహాను-నేను నీళ్ళలో మీకు బాప్తీస్మం ఇచ్చుచున్నాను.అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. అయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. అయన పరిశుదాత్మ లోను, అగ్నితోనూ మీకు బాప్తీస్మం ఇచ్చును. 21-ప్రజలందరు బాప్తీస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తీస్మం పొంది. ఇక్కడ యోహాను మాట అంటుండగా యేసు వెనుక నుంచి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అనగా యోహాను యేసు గురించి చెప్పిన మాటే తప్ప యేసు మోహామోద్ గురించి చెప్పిన మాట కాదు. అలనే Mark 1:7 నుంచి 9- ఇక్కడ కూడా అదే సందర్భము. నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు అని ఇలా ప్రకటిస్తూ ఉండగా యేసు ప్రవేశించాడు. చివరిగా యోహాను యేసును ఉద్దేశించి చెప్పిన మాటే తప్ప యేసు మోహామోద్ గురించి చెప్పిన మాట కాదు. ఇప్పటికైనా వ్రాయబడిన వాటిననిటిని మరోమారు చదివి అలోచించి మీ మనస్సులను, ఆలోచనలను సరి చేసుకుని బైబిల్ సర్వ సత్యమని, యేసు అనంతరము వచ్చిన ఆదరణకర్త పరిశుదాత్మడు దేవుడని నమ్మితే నిత్యజీవము(పరలోకము). లేదంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళాల్సిందే. యేసు అర్థము కావాలంటే ముందు వాక్యము అర్థము కావాలి. వాక్యము అర్థము చేసుకోవాలంటే పరిశుదాత్మ సహాయము ఉండాలి. కాని అనేక మంది ముస్లిం సోదరులు బైబిల్ చదివి యేసు దేవుడు కాదు అంటున్నారు. నేను దేవుడని యేసు చెప్పలేదు అని అంటున్నారు. విశ్వాసము కలిగి పరిశుద్దాత్మ సహాయముతో చదివితే తప్ప అర్థము కాని బైబిల్ వీళ్ళకు సులువుగా అర్థమవుతుందా? పరిశుదాత్మ సహాయము లేకపోతే బైబిల్ అర్థం కానప్పుడు పరిశుదాత్మనే నమ్మని వీరికి బైబిల్ అర్థమవుతుందా?

Tuesday, August 26, 2014

ప్రకృతి కన్నెర్ర చేస్తుందా?



ప్రతి సంవత్సరము వర్షా కాలములో గాని, ఎండా కాలములో గాని, వేసవి కాలములో గాని జరుగుతున్న ప్రకృతి వైపరిత్యాలు లేక విపత్తులు అది ఒక భూకంప రూపముగా, సునామి రూపముగా, తుఫాను రూపముగా ఇలా ప్రకృతిలో సంభవించినప్పుడు జరిగే ఆస్తి నష్టము, ప్రాణ నష్టము పరిగణలోకి తీసుకుని ప్రింట్ మీడీయ (న్యూస్ పేపర్), ఎలెక్ట్రానిక్ మీడీయ( టీవీ న్యూస్) వారి మాటల్లో, రాతల్లో ఉపయోగించే పదమే “ప్రకృతి కన్నెర్ర చేసింది” అని. ఇప్పటివరకు జరిగిన వైపరిత్యాలు వెనుక ప్రకృతి ఉందని, పగ పట్టిందని, కన్నెర్ర చేసిందని, భిబత్సవము చేసిందని అనుకుంటున్నారు. అసులు ప్రకృతికి ఎందుకు పగ? ప్రకృతి మనిషి పై పగ చేయటము ఏంటి? ప్రకృతి అనగా పంచ భూతల కలయిక అని మనకు తెలుసు. ఈ పంచ భూతాలు సాక్షాత్తు దేవుని దూతలు అని bible లో తెలుసుకున్నాము. ప్రకటన 16:6- జలముల దేవదూత చెప్పగా వింటిని. అంటే నీరు ఒక దూతగా కనపడుతుంది వాక్యములో. అస్సలు ఈ ప్రకృతి ఎలా ఏర్పడింది, కలిగింది అని ప్రారంభాములోకి వెళితే దేవుడు వీటన్నిటిని తన మాట చేత కలిగించాడు. భూమి కలుగును గాక అను మాటకు ,సూర్య ,చంద్ర నక్షత్రాలు కలుగును గాక అను మాటకు కలిగాయి. అనగ ప్రకృతిలోని సర్వము సాక్షాత్తు దేవుని నోటి మాట వలన ఏర్పడింది.

1) హెబ్రీ 1:7 తన దూతలను వాయువులను గాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. అస్సలు నీరు గాలి, అగ్ని అను దూతలు ఎందుకు కలిగించాడు? ప్రకృతిని దేవుడు కలిగించుటలో ఉద్దేశము ఏంటి అనుకుంటే “భూమి మీద బ్రతుకుతున్న తన పిల్లలమైన మనకి ఈ ప్రకృతి లోబడి మనకు సేవ చేయాలనీ. అదే దేవుడు వాటికీ అజ్ఞాపించాడు. హెబ్రీ 1:14- వీరందరు (దూతలు) రక్షణయను స్వాస్థము పొందబోవువారికి ( మనకి) పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అనగా మనకు పరిచారము (సేవ) చేయటానికి పంపబడిన సేవకులైన దూతలు. దేవుడు ఈ ప్రకృతిని మనకు సేవ చేసేటట్టు పెట్టాడు. సూర్యుడు మన పనిలో, గాలి మన పనిలో, నేల మన అవసరాన్ని తీరుస్తుంది. సేవకులుగా చెప్పిన మాటను వినవలసినది పోయి ఈ రోజు మనుషుల మీదకు ఈ ప్రకృతి తిరగబడడములో ఉన్న కారణమూ ఏంటి? మన సేవలో ఉండవలసిన నీరు ఎందుకు మనుషులను శెవాలుగా మారుస్తుంది? గాలి పెనుగాలిగా మరి ఎందుకు ప్రాణ నష్టము మిగిలిస్తుందిఎందుకు? ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? అస్సలు సేవకులు మనకు తిరగాబడుతున్నరెందుకు? మన సేవలో మన కాళ్ళ క్రింద అణిగి మణిగి ఉండవలసిన ఈ ప్రకృతి ఈ రోజు మనకు తిరుగుబాటు చేయుటలో గల ఉద్దేశము ఏంటి?

2) ప్రకృతికి దేవుడు ఒక నియమము పెట్టాడు .” భూమి మీద బ్రతికినంత కాలము నా పిల్లలు నాకు లోబడితే మీరు వారికీ లొబడి పని చేయండి. ఒకవేళ ఎప్పుడైతే నా పిల్లలు నాపై తిరుబాటు చేస్తారో మీరు తిరుగుబాటు చేయండి.. అనగా మనము భూమి మీద దేవుడికి భయపడి, దేవుడికి లోబడి బ్రతికినంత కాలము ఈ ప్రకృతి మనకు లోబడి ఉంటుంది. ఇది దేవుడు ప్రకృతికి ఇచ్చిన ఆజ్ఞ. యెషయ 1:2- యెహోవ మాటలడుచున్నాడు - ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యోగ్గుము . నేను పిల్లలను పెంచి గోప్పవారినిగా చేసితిని. వారు నా మీద తిరగాబడియున్నారు. ఇక్కడ దేవుడు ఆకాశాముతో, భూమితో మాటలడుచున్నాడు. హబక్కుకు 2:11-గోడలలోని రాళ్ళూ మొర్రపెట్టుచున్నది దూతలు  వాటికీ ప్రత్యుత్తరమిచ్చుచున్నది. అనగా రాళ్ళూ కూడా మొర్రపెట్టుచున్నాయి. ఆకాశము, భూమి దేవుని మాట వింటుంది గనుక దేవుడు వాటితో మాటలడుచున్నాడు. భూమి మీద దేవునికి లోబడవలసిన పిల్లలు లోబడక తిరిగుబాటు చేసినప్పుడు అయన పంచభుతాలకు అజ్ఞాపిస్తున్నాడు. భూమి మీద తన పిల్లలైనా వారు తనను కాదు అనుకుని, తన మాటను పెడచెవిన పెట్టి ఆవిధేయులుగా మారిన రోజున ఈ పంచభుతలకుపని చెబుతాడు. అస్సలు కన్నెర్ర చేస్తుంది పరలోకమందున్న దేవుడు అని తెలియక ప్రకృతి కన్నెర్ర చేస్తుంది అనుకుంటున్నారు. దేవుని కళ్ళు ఎర్రపడ్డాయి గనుక ప్రకృతిలో భీబత్సము. అందుకే ప్రకృతిలో ఇన్ని వైపరిత్యాలు. ప్రకృతిలో జరుగుతున్న ప్రతి వైపరీత్యము వెనుకాల ప్రకృతిని కలిగించిన దేవుని కన్నులు ఎర్రబడ్డాయి.

3) నీరు యొక్క ఉగ్రత చూద్దాము. ప్రకటన 16:4- మూడవ దూత తన పాత్రను (దేవుని కోపము) సముద్రములో కుమ్మరింపగా. ఇప్పటి వరకు వరద భీబత్సము అను మాటను న్యూస్ లో కానీ, న్యూస్ పేపర్ లో చూసాము విన్నాము. దేవుడు సముద్రాలను కలిగించి ఇసుకను సరిహద్దుగా నియమించాడు ఆ సరిహద్దు అయిన ఇసుకను దాటి ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని ఆజ్ఞ ఇచ్చాడు గనుక. యెషయ 23:11-అయన సముద్రము మీద తన చెయ్యి చాపెను. భూమిమీద పాపము విస్తరించడము వలన దేవునికి కోపం వచ్చింది. ఈ రోజు మంచి పాలనా చోట ఉన్నది అని చెప్పే స్థితి లేదు. ఎక్కడ చుసిన చెడు. అందుకని దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ ఎందుకు ఇంత భయముకరముగా వైపరిత్యాలు కలిగిస్తున్నడంటే ఆయనకు కోపము వచ్చిందన్న సంగతి ఆ వార్తలను వింటున్నపుడు, చదువుతున్నపుడు తెలుసుకుని నీ, నా, మన బ్రతుకుని సరిచేసుకుంటామని ఆ వార్తలు నీ, నా, మన చెవిన పడుతున్నాయి, కళ్ళముందు కనపడుతున్నాయి. ఆమోసు 5:8-సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యహోవా.

4) అగ్ని యొక్క ఉగ్రత చూద్దాము. ప్రకటన 16:8-నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కల్చుటకు సూర్యునికి అదికారము ఇయ్యబడెను. ప్రారంభములో దేవుడు సూర్యుని వెలుగిమ్మని చెప్పగా ఇప్పుడు అదే సూర్యుడు భూమి మీద మనుష్యులను కాల్చివేయమంటునాడు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఉష్ణోగ్రత దీనికి సాక్ష౦. ఎండాకాలం వచ్చిందంటే భయముతో బ్రతకవలసిన పరిస్థితి. కారణము పెరుగుతున్న అత్యదిక ఉష్ణోగ్రత. ప్రతి సంవత్సరం రీకార్డ్ గా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయంటే కారణము సూర్యునికి అదికారము ఇచ్చేసాడు. అందుకే సూర్యుడు ఉగ్రుడై భయముకరముగా మండిపోతున్నాడు. మండిపోతున్నదుకు ఎందరో మనుషులు రాలిపోతున్నారు. దేవుడు అగ్నికి ఆజ్ఞ ఇచ్చాడు.

5) గాలి యొక్క ఉగ్రత చూద్దాము. యిర్మియా 23:19-ఇదిగో యెహోవ యొక్క మహోగ్రతమను పెనుగాలి భయాలు వెళ్ళుచున్నది . అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకు పెళ్లున దిగును. తన కార్యమును సఫలపరచు వరకు తన హృదయలోచనలను నేరవేర్చువరకు యెహోవః కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతి మీరు బాగుగా గ్రహించుదురు. యేసు పుట్టకతో ప్రారంభమైనవి అంత్య దినాలు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రకృతి భీభత్సాలు ఆలోచిస్తే జరుగుతున్న ప్రతి వైపరీత్యాల వెనుక లోపము భూమి మీద బ్రతుకుతున్న మనిషిలో ఉన్న లోపము ద్వార దేవుని కళ్ళు ఎర్రబడి ప్రకృతితో దేవుడు మనుష్యులను నాశనము చేస్తున్నాడు. కనుక లోపము ప్రకృతిలో కాదు మనిషిలో ఉంది అని గ్రహించాలి.

6) తల్లి గర్భములో రూపించి, అవయవాలను ఇచ్చి, ఆకారము ఇచ్చి ఈ భూమి మీదకు రప్పించి, పెంచిన దేవునినే లేడు అనుకుని. ఉన్న అయన కోసము ఆలోచించక, బ్రతకక విచ్చల విడి జీవితానికి అలవాటు పడిపోయారు గనుక దేవుడు ఈ స్థితి చూసి కన్నెర్ర చేసి ప్రకృతితో నాశనము చేయాలనుకుంటున్నాడు. ఉదాహరణకి:: యోన చరిత్ర – యోన 1:10 నుంచి – దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా తనకు ఇష్టము వచ్చిన చోటికి వేలడానీకి సిధమయినాడు. ఆ వచనములో నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చెనని నాకు తెలిసియున్నది.. అనగా మనుషుల తప్పు వలన సునామి, భుకంపములు వస్తున్నాయి. భూమి మీద దేవుని వలన పుట్టి దేవుని కొరకు బ్రతకవలసిన మనుష్యులు తమ కోసము బ్రతకడంలో మునిగిపోయారు. దేవుని చిత్తము పక్కన పట్టి తన చిత్తము నెరవేరుస్తున్నారు. దేవుని మాట కాదని వారి మాటలనే నెరవేరుస్తున్నారు. అందుకే ప్రకృతిలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

7) ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యోగ్గుము అన్న దేవుడు ఎందుకు ఆకాశము, భూమితో మాటలడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భూమి మీద మనుష్యుల బ్రతుకులు సరిగా లేకపోవడము వలన. వారి బ్రతుకు విధానము బట్టి దేవునికి కోపము రావటము, ఆ కోపాన్ని బట్టి ప్రకృతికి ఆజ్ఞ ఇవ్వడము, ఆ ప్రకృతి దేవుని ఆజ్ఞను అమలు చేయడము, అమలు చేయడాన్ని బట్టి వందలాది వేలాది లక్షలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు.

Monday, August 25, 2014

క్రైస్తవుడు చేయవలసిన మేలు (దానం) ఏది?

1) మేలు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి దానధర్మాలు, పుణ్య కార్యాలు, సహాయ సహకారాలు, ఎక్కువుగా కలిగి ఉన్నవారు లేని వారికీ పంచటాలు ఇలా వీటిని సమాజం మేలులుగా భావిస్తుంది.ముఖ్యముగా ఈ మేలులు చేసేవారిలో కొందరు స్వార్ధ ప్రయోజనాలు ఆశిస్తూ, కొందరు నిస్వార్ధంగా చేస్తూ ఉంటారు. ఈ దాన ధర్మాలు చేయటం వెనుక సమాజములో కొన్ని సామెతలు కూడ లేకపోలేదు. అవి“మానవ సేవే మాధవ సేవ”, ప్రార్దించే పెదవులకన్న సయం చేసే చేతులే మిన్న. ఇలాంటి మాటలు వినబడినప్పుడు లేదా కనపడినప్పుడు మానవత్వం ఉన్న ఎవరికైనా ఖచ్చితముగా సాటి మనిషికి దానం చేయాలనో, సహాయం చేయాలనో అనిపించటం సహజం. ఈ దాన ధర్మాలు చేయటం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని. 

a) ఈ జనంలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మంచి జీవితం వస్తుందని.
b) మేలులు లేదా పుణ్య కార్యాలు ద్వార సంతానం కలుగుతుందనే నమ్మకం.
c)కొందరు పేరు ప్రఖ్యాతలు కోసం మంచిని తలపెట్టేవారు.
d) చేసిన పాపాలను నివృత్తి చేసుకోవటం కోసం చేస్తారు.
e) కొందరు పిల్లలు లేక ఇక చేసేది ఏమి లేక ఉన్న ఆస్తిని దాన ధర్మాలు చేయటం . 
f) మనిషిగా పుట్టాము కాబట్టి ఈ జన్మలో నలుగురు గుర్తు పెట్టుకునే పనులు చేయాలి.

2) పైన చెప్పిన విధముగా స్వార్ధంగానో, నిస్వార్ధంగానో సమాజానికి మేలు కలిగించే పనులు జరుగుతున్నాయి. అన్నదానం అని, నీటి దానం అని, గోవుల దానం అని, భూదానం అని, విద్య దానం అని, బంగారు మామిడి పండ్ల దానం, శ్రమ దానం, రక్త దానం, నేత్ర దానం, మూత్రపిండాల దానం ఇలా అనేక దానాలు మనం సమాజములో చూస్తున్నాము. ఇక ప్రభుత్వం సమజానికి చేసే మేలులు గురించి ఆలోచిస్తే బియ్యం, కందిపపు నుంచి నిత్యావసర వస్తువులు తక్కువ ధరకే పంపిణి చేయటం, ముసలి, వికలాంగులకు pension ఇవ్వటం ఇలా అనేక విధముగా మేలులు చేస్తుంది ప్రభుత్వం.

3) పైన చెప్పిన దాన ధర్మాలు, మేలులు, సేవలు, పుణ్య కార్యాలు అన్నింటికీ ఉద్దేశం ఒకటే. అదేమనగా మరో జన్మంటూ ఉంటె మంచి జన్మ పొందుకోవాలి అని ఒకరు, స్వర్గం –నరకం నిజంగా ఉంటె స్వర్గములోకి వెళ్ళాలని ఇంకొకరు. ఇంతకు ఈ కార్యక్రమాలు దేవునికి ఎలా ఉన్నాయో ఒక్కసారి bibleనీ అడిగితే యెషయ ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన మాటను చూస్తే అర్చర్యపోక తప్పదు. యెషయ 64:6 మా నీతి క్రియలు(మనం చేసే మేలులు) దేవుని దృష్టికి మురికి గుడ్డవలె ఉన్నాయి. లోకంలో నిజ దేవున్ని నమ్మకుండా చేసే ఏ విధమైన మేలు అయిన, ధర్మం అయిన “ దేవుని“దృష్టికి మురికి గుడ్డ వాలే ఉందంటే మరి దేవునికి మనం చేసే దానం నచ్చటం లేదా? లేక దానం చేసే మనుష్యులు నచ్చటం లేదా? ఇంతకి నచ్చకపోవటం వెనుక కారణం ఏంటి? యోహాను 12:43 వారు దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును ఎక్కువుగా అపెక్షించిరి.

4) పైన చెప్పిన మాటను బట్టి దానం లేదా మేలు చేయటం తప్పు కాదు కానీ, ఆ దానం చేసే వ్యక్తులు పేరు ప్రఖ్యాతలు కోసమే, స్వార్ధ ప్రయోజనాల కోసమో, అందరు గుర్తించుకోవలనో చేస్తున్నారే తప్ప దేవునికి మహిమకరంగా, దేవునికిఇష్టమైన మేలులు చేయటం లేదు. అయితే దేవుడు ఎవరినైనా మేలు చేయమని చెప్పాడా అని ఆలోచిస్తే bibleలో దేవుడు చెబుతున్నమాటను చూస్తే II దేస్సా3:13 సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుక వద్దు. దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞను జాగ్రత్తగా పరిశిలిస్తే ఒక అద్భుతమైన విషయం బయటపడుతుంది. అది క్రైస్తవులు చేసే మేలు ప్రపంచ ప్రజలు చేసేటటువంటి మేలు కాదని, క్రైస్తవులు చేసే మేలు దేవునికి ఇష్టమైనదని, అందువలననే దేవుడు క్రైస్తవులను విసుగక మేలు చేస్తూ ఉండమని అజ్ఞాపించాడు.

5) ఇంతకుక్రైస్తవుని మేలు ఏంటో చూద్దాం. మేలు చేయటం అనగా మంచి చేయటం, దానం చేయటం అని పర్యాయ పదాలు వస్తాయి. క్రైస్తవ మేలు అనగానే దేవుని వలన క్రైస్తవుడు మేలు పొందటం అనుకుంటే పొరపాటే. నిజం ఏంటంటే క్రైస్తవుడు అనగా “క్రీస్తు రక్తం ద్వారా విలువ పెట్టి కొనబడిన వ్యక్తి”. అనగా క్రైస్తవుడు చేయవలసిన మేలు సాక్షాత్తు క్రీస్తు ద్వార దేవునికే. ఎందుకనగా మనం కొనే ఏ వస్తువు అయిన మనకు మేలు చేస్తే మనం ఉంచుకుంటాం. అలాగే క్రీస్తు మనల్ని తన క్రయధనంతో కొన్నప్పుడు మనం కూడ క్రీస్తుకు మేలు చేయలి.

6) మేలు చేయటం వలన ఉపయోగాలు ఉన్నాయా అంటే ఈ లోక సంభందమైన ఉపయోగాలు లేవు గానీ పరలోక సంభంధమైన మేలులే ఉన్నాయి. యోహాను 5:29 మేలు చేసిన వారు మాత్రమే జివ పునరుర్దానమునకు సమాధి నుండి బయటకు వస్తారు & Iతిమోతి 6:18 వాస్తవమైన నిత్యజివాన్ని రాబోవు కాలానికి మంచి పునాదిని వేసుకోవాలంటే మేలు చేయాలి. దేవునిదృష్టిలో మేలు చేయటం ద్వార దేవున్ని సంతోషపెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. రోమా 3:12 మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. ఈ విషయాన్ని గమనించిన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ భూమి మీదకు వచ్చాడు (హెబ్రీ 10:7). కాబట్టి మేలు అనే పదానికి అర్థం యేసుక్రీస్తు ద్వారానే తెలుసుకోవాలి. 

7) “యేసుక్రీస్తు పరలోకానికి మార్గమని, యేసు ద్వారానే నిత్యజివమని ప్రకటించుటయే క్రైస్తవుడు చేయవలసిన మేలు”. రోమా 5:17 మరణము ఒకని అపరాధములమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబహుల్యమును “నీతి దానము” ను పొందిన వారు జీవము గలవారై మరి నిర్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే యేలుదురు.

8) పైన చెప్పబడిన మాటను బట్టి క్రైస్తవుడు చేయవలసిన దానము “నీతి దానము” అని అర్థమయింది. మరి నీతి అనగా ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే దానికి కూడా bible సమాధానం చెప్తుంది. రోమా 4:3 లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవున్ని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయనను నమ్మటమే నీతి. మరి ఈ నీతిని దానం చేయటం ఎలాగో పరిశిలిద్దాం. II పేతురు 2:5 మరియు అయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహినుల సమూహము మీదికి జలప్రళయం రప్పించినప్పుడు “నీతిని ప్రకటించిన” నోవహును మరి ఏడుగురిని కాపాడెను. 

9) కాబట్టి పైన చెప్పబడిన లేఖనం ప్రకారం నోవాహు జలప్రళయం సమయంలో రక్షణ సువార్తను ప్రకటించాడు అనేవిషయాన్ని పరిశుదాత్మ దేవుడు నీతిని ప్రకటించటంగా బయలుపరిచాడు(Iపేతురు3:21). ఇంతవరకు మన వివరణలో మనకు తెలిసిన ఫలితార్ధం ఏమనగా “క్రైస్తవుడు సువార్తను ప్రకటించుటయే నీతిని దానం చేయటం”

10) సర్వలోకనికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే సర్వలోకాన్ని నీతిమంతులుగా మార్చమనే అర్థం ఇమిడి ఉంది. కానీ క్రైస్తవులు ఆకలిలేని ప్రపంచాన్ని నిర్మించాలని అన్నదాన కార్యక్రమాలు, ఆరోగ్యవంతమైన సమాజం కోసం మిషనరీ hospitals, రక్తదానాలు, నేత్రదానాలు, పేదరిక నిర్మూలనకు వేదేశాలు పంపుతున్న ధనంతో కేవలం ఇవి మాత్రమే చేయటం ద్వారా క్రైస్తవ్యం కాస్తా క్రైస్తవ మతంగా మారిపోయింది.

11) ఈ జీవితకాలం మట్టుకు సుఖాల కోసం దాన ధర్మాలు చేసి మనుష్యుల్ని ధనవంతుడు ఉండే వేధనకరమైన స్థలానికి పంపుతారో లేక వాటితో పాటు నీతి దానం చేసి దరిద్రులను సైతం దేవుడున్న లోకానికి చేరుస్తారో నిర్ణయం మిదే. యుదా1:23 నీతి దానం ద్వారా అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా రక్షించండి. యాకోబు 4:17- మేలైనది చేయనేరిగియు ఆలాగు చేయని వణికి పాపము కలుగును. యాకోబు 1:21-ఆత్మలను నరకగుండం అనే కటినమైన శిక్ష నుండి తప్పించగల శక్తీ గల్గిన వాక్యమును ప్రకటించండి.

12) ఇదే క్రైస్తవుడు చేయవలసిన, క్రీస్తు చేసిన, దేవుడు చేయమన్న అతి ప్రాముఖ్యమైన, శ్రేష్టమైన గొప్ప మేలు. ఇది అన్ని దానముల కన్నా విశిష్టమైన దానం. ఈ మేలు(దానం) మరుపురానిది, దేవుడు మరువలేనిది. 

Friday, August 8, 2014

మనిషీ జన్మ దినం రహస్యమా?


1) నేటి ఆధునిక ప్రపంచములో ఏ దేశంలో చూసిన ప్రజలు వారితో పాటు వారి భంధువుల యొక్కయు ,నాయకుల,అభిమాను ల,అధికారుల యొక్కయు జన్మ దినం(జయంతి), మరణ దినం(వర్ధంతి) స్మరించుట మనం చూస్తున్నాము. అలాగే వారు నమ్మిన దేవుళ్ళకి కూడా జయంతి, వర్ధంతులను జరిపించడం సర్వసాదారణ విషయం.మనిషి జన్మ బహు గొప్పది. తనకన్నా ముందు పుట్టిన ప్రకృతి నుండి తీయబడిన శరీరాన్ని ధరించుకుని, అదే ప్రకృతిపై పెత్తనం చేలాయించుట అనేది నిజముగా అదృష్టం. ఏవరికి అంతుబట్టని ఈ అపురూపమైన శరీరాన్ని ధరించుకోవటానికి వెనుక ఎంతటి పోరాటం జరిగిందో ఒకసారి ఆలోచిస్తే మతి పోతుంది.

2) ఉదాహరణకు ఒక మామిడి చెట్టును చూద్దాం. దాని పుతకాలంలో ఆకులే కనబడనంతగా కోట్ల సంఖ్యలో పూస్తుంది. కానీ పువ్వు అంత కాయలుగా మారుతాయా? ప్రకృతి ప్రభావముతో ఎన్నో లక్షల పూలు నెల రాలిపోగా వేల సంఖ్యలో పిందెలుగా మారుతాయి. ఆ పిందెలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుని వందల సంఖ్యలో మాత్రమే కాయలుగా ఇస్తున్నాయి. అవన్నీ పండ్లు అవుతాయా అంటే లేదు. ఎన్నో కారణాల చేత చాలా నేలరాలిపోగా లెక్కపెట్టే సంఖ్యలో కొన్ని మాత్రమే పండ్లుగా మారుతాయి. ఇప్పుడు నరుల పుట్టుక గూర్చి ఆలోచిద్దాం. పెండ్లి అయిన దంపతులు దేవుని ఆజ్ఞ- ఆశీర్వాదం ప్రకారం ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు పురుషుని నుండి కోట్లాది జివ కణాలు( X,Y CHROMOSOMES) స్త్రీ గర్భాములోకి వెళ్తాయి. అయితే వారు కలుసుకున్న ప్రతి సారి స్త్రీ అండాశయంలోకి ప్రవేశించి పిండముగా మారుతాయా? లేదు.ప్రతి సారి కొన్ని కోట్ల జీవ కణాలు నేల రాలుతాయి. ప్రతి నెల స్త్రీ అండం కూడా నెల రాలుతుంది.ఇలా ఎన్నో years నుండి పిల్లలు పుట్టని వారు ఉన్నారు.ఎప్పుడో ఒకసారి దైవ సంకల్పాన్ని బట్టి మాత్రమే స్త్రీ కణం(అండం)తో ఒక పురుష కణం (x గానీ,y గానీ) మాత్రమే కలుసుకుని ఫలదీకరణం చెంది పిండముగా మారుతుంది. అది అడ లేక మగ కావచ్చు. అదే నీవు-నేను ధరించుకున్న ఈ ఆకారం. 

3) నీకన్నా ముందు వెనుకల ఎంత మంది నెల రాలిపోయరో పువ్వు రాలినట్టుగా అని ఆలోచిస్తే ఒళ్ళు జలదరిస్తుంది. పిండముగా మారిన బయటికి రాలేక గర్బస్రావంలో పోయిన వారెందరో, ఇలా ఎంతో గట్టి పోటీని తట్టుకుని ఎంతో పోరాటంలో అమ్మ కడుపులోంచి బయటి ప్రపంచానికి వచ్చాం. కీర్తన 139:14- నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, అర్చర్యమును నాకు పుట్టుచున్నవి అని దేవుడు తన కుమారుడైన దావీదు ద్వారా పలికించిన మాట అక్షర సత్యం కదు. ఈనాడు ప్రతి మనిషి దేవునిని వదిలి శాస్త్రం వెంబడి పరుగులు తీస్తున్నాడు.నిజంగా ఏ మానవ జ్ఞానం లేక శాస్త్రం తల్లి గర్భములో శరీరాన్ని నిర్మించగలదో ఆలోచించండి.కంటికి కనబడని అవయవాల సమ్మెళనమై అందమైన ఆకారముగా మారుతుంది. ఈ అవయవాలను దేవుడే (1కోరంది 15:37:38) తల్లి గర్భములో తయారు చేస్తున్నాడు. ఈనాడు శాస్త్రాన్ని నమ్ముకున్న మనుషులు శరీరములో ఉన్న leg లేద hand పోతే కృతిమ leg లేక hand తప్ప original leg or hand తయారు చేయలేరు. ఇంకా కన్ను, kidney, heart ఇలా ప్రతి అవయవం దేవుడే తయారు చేసిన చేసాడు కానీ మనిషి చేయలేదు. 

4) ప్రపంచములో ఎన్నో కోట్ల మంది మనుషులున్నారు. వాళ్ళను జాగ్రతగా పరిశిలిస్తే అందరికి అవే స్థానాల్లో ముక్కు, నోరు. ఇలా కనబడే అవయవాలు ఒక్కటిగానే ఉన్నట్టుగా అనిపించినా ఒక్కటిగా ఉండరు. చివరికి కవల పిల్లల్లు అయిన ఎక్కడో ఒక చోట తేడ ఉంటుంది. యోబు 37:7-మనుషులందరు అయన ( దేవుని) సృష్టి కార్యములను తెలుసుకోనునట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి అయన ముద్ర వేసియున్నాడు. ప్రపంచం జనాభా సుమారు 700 కోట్లు. వారి చేతి వేలి ముద్రలను పరిశీలించినట్లయితే ఏ ఒక్కరి వేలి ముద్ర మరొకరి వేలి ముద్రతో సరిపోదు.అదే దేవుడిచ్చిన మానవ శరీరం ప్రత్యేకత అని సకల శాస్త్రాలను అధిగమించిన bible ఏనాడో చెప్పిన వాస్తవం.

5) నేటి సర్వ మానవులు ప్రతి ఒక్కరు ఒక ప్రాంతంలోనో, దేశంలోనో, ఇంట్లోనో, ఆసుపత్రిలోనో, మనుష్యుల సమక్షములో పుట్టుచున్నాం అనుకుని తమ పుట్టిన తేదిని వ్రాయించుకుని ప్రతి దినము లేవ గానే దిన,వార,మాస ఫలాల పేపర్లలో చూసుకుని మురిసిపోతున్నారు.నిజముగా లోకం అనుకుంటున్నా ఈ జన్మ దినం కరెక్ట్ నేనా? మనుష్యులు వ్రాసిన గ్రంధాలను అడిగితే వారి ఆలోచనలు ప్రకారం వ్రాస్తారు గనుక ఒకరు వ్రాసింది మరొకరితో సరిపోదు. అందరిని పుట్టించిన దేవుడిని అడిగితేనే న్యాయముగా ఉంటుంది. కీర్తన 139:15- నేను రహస్య మందు పుట్టినవాడు. క్రి.పూ ఇశ్రాయేలియులను పరిపాలించిన దావీదు మహారాజు దేవుని ప్రేరేపణతో అంటున్న మాటయే అయన రహస్య మందు పుట్టానన్న విషయం. bibleలో కచ్చితముగా చెప్పబడింది అంటే మనుష్యులందరు రహస్యంగానే పుడుతూ ఉండాలి. అది ఎలాగో పరిశిలిద్దాం. 

6) తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన దినాన్నే పుట్టిన రోజు అంటున్నాం. కానీ అంతకముందే దాదాపు 9 నెలలు తల్లి గర్బంలో ఉన్నాం అనే సంగతి మర్చిపోతున్నాం. అంతకమునుపు ఎక్కడ ఉన్నాం? అందులోనికి ఎప్పుడు వచ్చాం? తల్లి గర్భములోకి రాకమునుపు తండ్రిలో ఉన్నాం. అంటే ప్రతి మనిషి తన తండ్రి ద్వార తల్లి గర్భములో ప్రవేస్తున్నాడు. అందుకే నేటి doctorsనీ అడిగితే అడ, మగ బిడ్డ పుట్టాలన్న నిర్ణయించేది పురుషుడే అని చెబుతారు. అంటే మనం తండ్రిలో నుండి తల్లిలోనికి ప్రవేశించి తల్లి గర్భములో శరీరాన్ని లేదా ఒక ఆకారాన్ని సంతరించుకుని దాదాపు 9 months తర్వాత బయటి ప్రపంచానికోస్తున్నాం అన్నమాట. ”తండ్రిలో నుండి విడిపోయి అనగా తండ్రి కనగా తల్లిలోనికి వచ్చి అండంతో కలిసి పిండంగా మారిన దినమే మనం పుట్టిన దినం”. తల్లి గర్భమే మన జన్మ స్థలం కానీ ఇండియా కాదు.

7) నిజముగా మన జన్మ దినం రహస్యమే. అది అమ్మకు,నాన్నకు తెలియదు. అమ్మకు నెల రోజుల తర్వాత తెలుస్తుంది.అమ్మ చెబితేనే నాన్నకు తెలుస్తుంది. ఎందుకు తెలియదు?? test చేసి scanning ద్వారా doctor చెబుతాడని వెళితే ఆ కంప్యూటర్ కూడా ఒక వారం ముందు,వెనుక అనగా expected delivery date అని చెబుతుందే తప్ప correct date చెప్పదు. ఎందుకంటే దేవుడే మన పుట్టిన దినం రహస్యం అన్నాడు కాబట్టి మనిషి ఎన్నటికి తెలుసుకోలేడు. ఇది దేవుడి challenge.మనం పుట్టిన దినమే రహస్యమైతే మరి దేవుడి పుట్టిన దినం గూర్చి ఆలోచిస్తే పిచ్చిపడుతుంది 

8) దేవుడు bibleలో మరో అద్బుతమైన మాట చెప్పాడు. మన తల్లితండ్రులు అయితే మనల్ని భూప్రపంచాములోనికి వచ్చాక చూస్తారు గానీ ఆయనైతే తల్లి గర్భంలో పిండముగా ఉండి ఆ తర్వాత ప్రతి దినము మన అవయవ నిర్మాణము జరుగుతున్నప్పుడు చూస్తున్నాడు. కీర్తన 136:16-నేను పిండమునైయుండగా నీ కన్నులు నన్ను చూచెను. అంటే మానవ నేత్రానికి కనపడని సుక్ష్మ పిండంగా ఉన్నప్పటినుండి చూస్తున్న దేవుడు నీవు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎక్కడ తిరుగుతున్నావో, ఏమి చేస్తున్నావో చుడడా? ఎందుకు అంత జాగ్రతగా నిన్ను చూస్తున్నాడు అను అనుకుంటున్నావు? నీవు అయన కుమారుడవు,సాక్షాత్తు అయన స్వరూపమై ఆయనలోని భాగానివి గనుక. అలాగే నీకు ఒక జీవిత కాలాన్నిముందే నియమించి ఇక్కడకు పంపుతున్నాడు. కీర్తన 139:16- నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నియు నీ గ్రంధములో లిఖితిములాయెను. నియమింపబడిన దినాలు అనగా జీవితకాలం. అదే ప్రపంచంలోనికి వచ్చిన దినం నుండి ప్రపంచాన్ని వదిలి వచ్చిన చోటికి తిరిగి వెళ్ళడం అనగా మరణ దినం. అదే సమాధి రాయి మీద కనబడే “జననం- మరణం. 

9) మరో అద్బుతమైన విషయం చూస్తే మన మరణ దినమేప్పుడో కూడా మనకు తెలియదు. ఇది. secret. bibleలో అన్ని విషయాలు తెలియజేసిన దేవుడు మన జన్మదిన-మరణ దినాల గూర్చి మనకెందుకు తెలియజేయలేదు అనే ఆలోచన రావొచ్చు. మన జన్మకు,ఈ జగత్తుకు కారకుడు మన ఆత్మకు భాగము(కీర్తన 16:5) అయన పరమాత్ముడైన తండ్రియగు దేవునికి కూడా జనన-మరణాలు లేవు గనుక. మన తండ్రియైన దేవుడు ఆది-అంతం లేనివాడైతే మనకు ఆది- అంతం ఉంటాయని బ్రమించడం వేర్రితనమే అవుతుంది. దేవుడు ఉన్నవాడు గనుక ఆ ఉన్నవాడిలో నుండే పుట్టుకోనివచ్చి కొద్ది కాలం ఆ మట్టి శరీరంలో, ప్రస్తు తం ఆభూమి మీద జివించుచూ ఉన్నవారం. ఇందులోనికి రాక ముందు దేవునిలో ఉండేవారం(కీర్తన 90:1). 

10) ఈ శరీరాన్ని వదిలినాక కూడా మన క్రియలను బట్టి నరకంలో నిత్యం కాలుతునో,లేక పరలోకంలో నిత్యం అనంధముతోనో ఎక్కడో ఒక చోట తప్పని సరిగా ఉంటాం.. address మాత్రం గల్లంతు కాదు.. అన్ని సంగతులను నిజంగా చెప్పిన bible ఈ విషయం కూడ సత్యమే చెప్పింది.నమ్మటం-నమ్మకపోవటం నీ ఇష్టం. అందుకే మానవ మట్టి బుర్రతో కాక ఆత్మజ్ఞానంతో ఆలోచిస్తేనే తెలుస్తుంది. దేవుడు మన పుట్టుక-చావులను మనకెందుకు రహస్యముగా ఉంచాడో అర్థమయింది .కనుక దేవుడుజీవిత కాలాన్ని వ్యర్ధం చేయకుండా,మనకెందుకు ఈ జన్మనిచ్చాడో అనే దేవుని సంకల్పాన్ని తెలుసుకొని అయన ఆశ,ఆశయాలకను గుణంగా అయన చిత్తాన్నిఅను క్షణం నెరవేరుస్తూ మట్టి లోకంలో మనిషిగా బ్రతికినంత కాలం నీలోని దైవత్వాన్ని ప్రపంచ ప్రజలకు చూపాలి.

11) మనిషి సృష్టించలేని, ఎక్కడ తెలుసుకోలేని అమూల్యమైన కాలాన్ని సరిగ్గా ఆ దేవుని కోసం ఉపయోగిస్తే నీకు, నీ కుటుంబానికి, నీ దేశానికి ఆఖరున నిన్ను కనిన దేవునికి కూడా ఎంతో మేలు చేసిన వాడివి అవుతావు. ఇంకా ఎన్నో వేల years అయిన ఈ శాస్త్రవేత్తలు ,మేధావులు,ఇంకా ఎవ్వరైనా తెలుసుకోలేని ఎన్నో నిగుడమైన సంగతులను దేవుడు తన పిల్లలైనా వారి కోసం ఎన్నో వేల years క్రితమే తన మాటలైనా పరిశుద్ద గ్రంథమని పిలువబడే bibleలో వ్రాయించి ఆ తర్వాత వాటిని ముద్రించి భావితరాల కోసం భద్రం చేసాడు.వాటిని తెలుసుకుని ,గ్రహించి వాటి ప్రకారం ప్రవర్తించి దేవునితో పాటు దేవలోకం లేక పరలోకంలో నిత్యము ఆనందముతో జీవించాలనే ఆశ,ఆశయం,తపనతో ఉండాలి. 

Friday, June 20, 2014

దేవుడు చేసిన మానవ అకార నిర్మాణపు రహస్యములు

1) మానవ జన్మను గురించి ప్రపంచములో వ్రాయబడిన పుస్తకాల అన్నిటిలో కన్న శ్రేష్టమైనది, సాక్షాత్తు దేవుడు మన గురించి వ్రాయించిన ఏకైక గ్రంధమైన Bible లో చెప్పబడింది. Scientists అయితే మనిషి కోతి నుండి వచ్చాడని, ఒకప్పుడు కోతులు మనుషులుగా మారిపోయారని చెప్తున్నాడు. మేధావులు కూడా ఏదో మనిషి పుడుతున్నాడు, బతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు మరియు పుట్టుక ముందు ఏమి లేదు-మరణించిన తర్వాత ఏమి లేదు అని అంటున్నారు. మానవ జన్మ గురించి మనిషికి తెలియని మహా జ్ఞాన సంగతులు మన చేతులో ఉంటున్న Bible లోనే దేవుడు వ్రాయించాడు. మన చరిత్ర ఎప్పుడు ప్రారంభమైనదో చూస్తే భూమి మీద రాక ముందు తల్లి గర్భములో, తల్లి గర్భములో రాక ముందు తండ్రి  గర్భములో, తండ్రి గర్భములో రాక ముందు మన పితరుల గర్భములో, ఒకప్పుడు ఆదాములో, అంతకంటే ముందు దేవునిలో పరలోకములో ఉన్నవారము మనము. అనగా పరలోకములో దేవుని నుండి మట్టి శరీరంలోకి వచ్చి, ఆ తర్వాత మనుషుల ద్వారా ప్రయాణించి దేవుడు అనుకున్న రోజు ఈ భూమి మీదకు వచ్చాము.

2) పుట్టుక ముందు మన చరిత్ర దేవునిలో ఉన్న చరిత్ర. పరలోకములో ఉంటున్న మనం కొద్ది కాలం ఈ భూమి మీద దేవునికి ఇష్టకరముగా జీవించుటకు వచ్చాము. 6 days మనకు కావలసినది అన్ని సృష్టిలో కలిగించి,మనలని ఈ భూమి మీదకు పంపుట వెనుక గల ఉద్దేశము ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు చేయాలనీ (ఎఫేసి 2:10). మనల్ని ఈ భూమి మీదకు పంపుతూ ఒక ఉద్దేశాన్ని కలిగియున్నాడు.అస్సలు మన జన్మ గురించి మొదట బాగా తెలియాలి.ఎందుకంటే ఈ చిన్న జీవితములో ఏదో తిని,త్రాగి చావాలనుకుంటూన్నాడే తప్ప దేవుడు మన గురించి ఏంత కష్టపడ్డాడని, ఏంత ఆలోచిస్తూన్నాడనే సంగతులు తెలిస్తే మనం అయన గురించి ఆలోచించడానికి ఇష్టపడుతాము.

3) యెషయ 44:1,2- నిన్ను సృష్టించి, గర్భములో నిన్ను నిర్మించి, నీకు సహాయము చేయువాడైన యెహోవా. ఒక కన్న తండ్రిగా నిన్ను కావాలనుకుని ,నీ కోసం నేను ఏంత కష్టపడ్డానో నీకు తెలియాలి అని ఈ మాట చెపుతున్నాడు దేవుడు. అప్పుడప్పుడు తల్లితండ్రులు వారి పిల్లలతో మేము ఏంత కష్టపడితే నువ్వు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావు అని చెప్తారు. వారు పడ్డ కష్టాన్ని పిల్లలకు తెలియజేస్తే మా తల్లితండ్రులు నా కోసము ఇంతగా కష్టపడ్డారు గనుక వాళ్ళు కోసము ఏమన్నా చేయాలన్న ఆలోచన వస్తుంది. అలానే పరలోకమందున్న తండ్రి కూడా తన పిల్లలకు తన కష్టాన్ని గూర్చి తెలియజేస్తున్న వచనము పై వచనమ. మానవ జన్మ యొక్క రహస్యాన్నియెషయ44:1, 2లో చెబుతున్నాడు.  దేవుడు మన గురంచి పడిన కష్టాన్ని ఈ వచనములో చెప్తున్నాడు. ఈ రోజు చక్కటి మానవ ఆకారముతో ఉన్న మనిషికి ఈ ఆకారం ఎలా వచ్చిందో తెలియదు. తెలియదు కాబట్టి నాది నాది అనుకుంటూ తనకు ఇష్టమైనట్టు బ్రతకడానికి ఆలోచిస్తున్నాడు.

4) యెషయ 44:1,2 లో చెప్పబడినట్టుగా దేవుడు అస్సలు ఎలా సృష్టించాడు, ఎలా నిర్మించాడు,ఎలా సహాయము చేశాడు అన్న లోతులకు వెళ్దాము.ఒక్కొక్కటిగా ఆలోచిద్దాము. దేవుడు చెప్పిన ఈ సృష్టించుట, నిర్మించుట, సహాయము చేయుట అను మాటలు అర్థము కావాలి. ఎలా, ఎప్పడు, ఎక్కడ సృష్టించాడో, నిర్మించాడో, సహాయము చేసాడో చూద్దాము.
 
సృష్టించుట:
మనల్ని సృష్టించడం అంటే ఏంటి? ఎక్కడ, ఎప్పుడు, ఎలా సృష్టించబడ్డామో ఆలోచించాలి.గలతీ 1:15-తల్లి గర్భము నందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరచి అంటే ప్రత్యేకపరుచుకున్నాడట. వాస్తవముగా ప్రత్యేకించబడిన వారే ఈ భూమి మీదకు వస్తారు. తల్లి గర్భములో పడ్డవారు అనేక మంది కానీ ప్రత్యేకింపబడిన వారు కొద్ది మందే. కోట్లను కోట్ల వీర్య కణాలు తల్లి గర్భాములోకి వెళ్తాయి కానీ తల్లి గర్భములో ఉన్న అండం ఒకే ఒక్క కణంనే స్వీకరిస్తుంది. ఆ స్వీకరించబడిన కణం నువ్వు. నువ్వు అనబడుతున్న కణం ఆ రోజు తల్లి అండంతో కలవకపోతే నువ్వు లేవు. తండ్రిలో నుంచి తల్లి లోనికి వెళ్ళుతున్న వీర్యకణాలు సుమారు 50 కోట్లు. 50 కోట్లలో ఒక్క కాణానివి నువ్వు. ఈ భూమి మీదకు రావడానికి ఏంత పోటి జరిగిందో ఆలోచించండి. 50 కోట్ల కణాలలో నిన్ను ప్రత్యేకపరిచి ,నిన్ను కావాలనుకున్నాడు దేవుడు. అప్పుడు సృష్టింపబడ్డావు.నువ్వు భూమి మీదకు వచ్చావంటే 50 కోట్ల కణాలలోనుంచి నిన్ను ప్రత్యేకపరచి సృష్టించుకున్నాడు. కేవలము నీవు తన కోసము కావాలని, తన కోసము బ్రతకాలని.

నిర్మించుట - సహాయము చేయుట:
(a) తల్లి గర్బము నుండి బయటకు రావాలంటే ఒక సరియైన ఆకారం ఉండాలి. నిన్ను సృష్టించిన తర్వాత దేవుడు తల్లి గర్భములో నీకు నిర్మాణం ఇవ్వడానికి ప్రారంభించాడు.అనగా ఒక మహా కట్టడాన్ని చేపట్టాడు. మానవ ఆకారము అనే మహా కట్టడాన్ని ప్రారంభించడానికి తల్లి గర్భము అనే క్రేంద్ర స్థానoలో ప్రారంభించాడు.నిన్ను సృష్టించక ఆకారం ఇవ్వడానికి మహా నిర్మాణాన్ని చేపట్టాడు. యోబు10:11 చర్మముతోను, మంసముతోను నీవునన్నుకప్పితివి. ఎముకులతోను, నరము లతోను నన్ను చేసితివి. అనగా మానవ అకార నిర్మాణానికి ఉపయోగించిన పదార్ధాలు చర్మము, మంసము, ఎముకులు, నరాలు. నిర్మాణము అన్నాడు గనుక మన కళ్ళ ముందు ఉన్న నిర్మాణాలు ఆలోచిద్దాము. ఉదాహరణకు ఒక ఇంటి నిర్మాణాన్ని చెప్పటడానికి మనం స్థలము ఎంపిక చేసుకోవాలి. స్థలము తర్వాత house plan కావాలి. తర్వాత కావాల్సిన పదార్ధాలు అనగా పునాదులు వేయడానికి రాయి, cement, iron, water, sand ఇలా అన్ని కావాలి.పునాది వేసిన దగ్గర నుంచి slab వేసే వరకు పదార్ధాలు కావాలి. మానవ నిర్మాణము వీటితో కట్టితే కుదరదు కదా.

(b) మనవునిని కట్టడానికి ఉపయోగించిన పదార్ధాలు చర్మము, మంసము, ఎముకులు, నరాలు. గర్భములో నిన్ను సృష్టించిన తర్వాత నిర్మించడానికి దేవుడు ఉపయోగిస్తున్న పదార్ధాలు ఇవన్ని మానవ ఆకారము దేవుడు ఇస్తే దేవుడు చేస్తే, నిర్మిస్తే వచ్చింది. చర్మము లేకపోతే చూడలేము అని చర్మాన్ని మాంసపు ముద్డపై కప్పాడు. ఎముకులను మాంసము మధ్యలో దృడముగా ఉండడానికి పెట్టాడు. ఇల్లు కట్టేటప్పుడు iron rods పెట్టి pillarsకి కంకర cement వేస్తారు దృడముగా ఉండడానికి. తల్లి గర్భము అనే నిర్మాణ స్థలాన్ని ఎంచుకుని అక్కడ మాంసము మధ్యలో bones use చేశాడు. bones లేకపోతే మన ఆకారము ఒక మాంసపు ముద్దలా ఉంటుంది. bones లేకపోతే ఏ అవయవము కూడా కదలదు.లోపల bones ఉంటేనే అవయవాలు కదులుతాయి.


(c) మన లోపల రక్త నరాలు ఎన్ని ఉన్నాయో చూస్తే భూమిని ఒక సారి చుట్టూ వచ్చే అంతగా ఉన్నాయి. bonesకి అనుకుని ఉంటాయి. తల్లి గర్భములో దేవుడు ఏంత కష్టపడుతున్నాడో ఆలోచించండి. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఒక్కొక్క అవయవము ఒక్కొక్క స్థలములో అమర్చాడు. ముక్కు, కళ్ళు,చె వులు ఇలా అన్ని వాటి వాటి స్థానాలలో స్థిరపరిచాడు. భూమి మీదకు వచ్చిన తర్వాత అమ్మ మనకు ఆహారమును తినిపించింది. మరి కడుపులో ఉన్నప్పుడు మనకు ఎవరు తినిపించారు? తల్లి గర్భములో ఉన్న నీకు ఆహారము,గాలి ఎలా వచ్చింది? ఎవరు సహాయము చేసారు? దేవుడే చేశాడు. భూమి మీదకు వచ్చాక అమ్మ సహాయము చేసింది కానీ భూమి మీదకు రాక ముందు నువ్వు తినడానికి, త్రాగడానికి, పిల్చుకోవడానికి దేవుడే సహాయము చేశాడు.

5) అయన పుట్టిస్తే వచ్చిన నీవు వచ్చిన తర్వాత తన కోసము ఆలోచిస్తున్నావా? యెషయ1:2- ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యోగ్గుము. నేను పిల్లలను పెంచి గోప్పవరినిగా చేసితిని.వారు నా మీద తిరుగబడియున్నారు. మనిషికి తన జన్మ రహస్యము అర్థము కాక దేవునిపై తిరుగబడుతున్నారు. దేవుడు మనల్ని సృష్టించిన సంగతి, నిర్మించిన సంగతి,సహాయము చేసిన సంగతి మరచిపోయి తిరగబడుతున్నాడు. మన అవయవాలు దేవుని కొరకు use చేస్తున్నామా? రోమా12:1,2- సజీవ యగాముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనుడి. మన కన్నులను దేవుని వాక్యమును చదువుటకు,మన చెవులను దేవుని మాటలు వినుటకు, మన కళ్ళు, చేతులు దేవుని పని కొరకు వాడబడుతున్నాయా లేక లోక సంభంధమైన పాపాలు చేయడానికి ఉపయోగపడుతున్నాయా? మనకు కలిగియున్న ఆకారాన్ని ఎవరు ఇచ్చారు,ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే మన జన్మ ఎందుకో అర్థమవుతుంది మరియు ఈ జన్మలో ఏమి చేయాలో అర్థమవుతుంది.

6) రోమా 6:12- కాబట్టి శరీర దురశలకు లోబడునట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఎలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నితి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి.అయితే మృతులలో నుండి సజీవులమనుకుని, మిమ్మును మిరే దేవునికి అప్పగించుకోనుడి. మీ అవయవాలను నీతి సాధనాములుగా దేవునికి అప్పగించుడి. అనగా ఈ వచనములో మన body parts దేవుని కొరకు ఉపయోగపడాలి అని అర్థమయింది. మన mind-దేవుని గురించి ఏమి చేయాలనీ ఆలోచించాలి,మన eyes- దేవుని వాక్యమును చదవడానికి ఉపయోగపడాలి, మన నోరు- దేవుని మాటలు ప్రకటించుటకు ఉపయోగపడాలి, మన కాళ్ళు,చేతులు- దేవుని పని కొరకు ఉపయోగపడాలి. అందుకే మనల్ని సృష్టించి, నిర్మించి and ఇప్పటి వరకు సహాయము చేస్తున్నాడు అయన కొరకు బ్రతకాలని.

Thursday, June 12, 2014

క్రైస్తవులలోని కొందరు విశ్వసిస్తున్న నుదిటి వ్రాతలు(తల రాతలు) వాక్యానుసారమా?


1) భూమి మీద ఒక వ్యక్తి తక్కువ వయస్సులోనే చనిపోయినా, తక్కువ కులంలో పుట్టినా, కడు పేద కుటుంబములో జన్మించిన, ఆడవారిగా జన్మించి కష్టాలు పడుతున్నా, తను కోరుకున్నది నెరవేరకపోయిన వీటి అన్నిటికి కారణము మన “నుదిటి మీద రాతే(తల రాతే) అన్న భావన ప్రజలలో నాటుకుపోయింది.

2) ఒక నూతన జంట వివాహము తరువాత విహార యాత్రకు బయలుదేరినప్పుడు driver నిర్లక్షం వల్లనో, మితి మీరిన వేగం వల్లనో ప్రమాదము సంభవించి వరుడు మరణిస్తే ఆ మరణించిన వరుడి తల్లికి ఒకే బిడ్డ అయితే ఆ తల్లి తన బిడ్డ శవం ముందు కుర్చుని పలికే రోదన ధ్వనులలో ఎక్కువ శాతం దేవుడినే ధుషిస్తూ, శాపనార్ధాలు పెడుతూ – దేవుడా లోకములో ఇంత మంది బిడ్డలుండగా నీకు నా బిడ్డే కనిపించాడా? అన్యాయముగా నా బిడ్డను పొట్టన పెట్టుకున్నావు కదయ్యా అని అంటూ విధవరాలుగా మారిన నవ వధువును ఉద్దేశించి నీ రాత బగలేదమ్మా, ఇది దేవుడు రాసిన రాతే, విధి వ్రాతను తప్పించుకోవడము ఎవరి తరం గాదు అనే మాటల సందర్భాన్ని మనము గమనించొచ్చు.

3) ఒక్కొకరికి ఒక్కో రకమైన తల రాతను దేవుడు వ్రాస్తాడా? ఒక వేళ అలా వ్రాస్తే దేవుడు పక్షపతి అవ్వుతాడు. ఒకడు పేదరికములో పుట్టాలని, ఒకడు సంపన్న కుటుంబములో పుట్టాలని దేవుడు ఏర్పాటు చేస్తాడా? ఒకడు చెడ్డవాడుగా, ఇంకొకడు మంచివాడుగా బ్రతకాలని దేవుడే నియమిస్తాడా? ఇలా అయితే దేవుడు పక్షపాతిగా వ్యవహరించినట్లు. కానీ దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో చూస్తే అపోకార్య 10:34- అందుకు పేతురు నోరు తెరిచి ఇలా అనెను-దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా నేను గ్రహించాను అని అంటున్నాడు.

4) వృత్తిలో మార్పులు, చేర్పులకు దేవుని రాతకు సంభందము లేదని, మన జీవన స్థితిగతులను దేవుడు నిర్ణయించడని, అది వారి వారి పూర్వికుల పరిస్థితిని బట్టి ప్రదేశాలను బట్టి ఆసక్తిని బట్టి ఉంటుందని అర్థము చేసుకోవచ్చు. దేవుడు సమానంగా అన్ని కల్పించాడు. కానీ వాటి వినియోగములోనే మనకు వ్యత్యాసము కనిపిస్తుంది. అందరికి ఉపకారము చేయాలన్న దేవుని లక్షణము చూస్తే కీర్తన 145:9- దేవుడు అందరికి ఉపకారి అని ఉంది. దేవుడు కొందరికే ఉపకారి కాదు. ఆయనలో పక్షపాతి స్వభావము లేదు. మత్తయి 5:45- అయన చెడ్డవారి మీదను, మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నితిమంతుల మీదను, ఆ నితిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.

5) ఇంతకు దేవుడు నుదిటి పై వ్రాత వ్రాసాడంటారా? ఆ సంగతి అర్థమైతే ఎన్నో చిక్కు ముడులు విప్పబడుతాయి. నుదిటి రాత అంటున్న వారికీ నుదుటిపై ముడతలు తప్ప ఏమి కనిపించవు. ఏ భూతద్దంతో వెతికిన –చర్మపు ముడతలు. స్వేద రంధ్రాలు తప్ప వ్రాత దొరకదు. ఒక వేళా ఉందని కాసేపు అనుకున్న అయన వ్రాసిన వ్రాత వీరికి అర్థం అవుతుందా? ఇంతకు ఏ భాషలో ఉంది ఈ వ్రాత? దినిని బట్టి ఎవ్వరు నుదిటిపై వ్రాత లేదు అని సామాన్యముగా అర్థము చేసుకోవచ్చు. ఇంతకు దేవుడు వ్రాసుకున్నది నుదిటి మీదేనా అని bibleలో చూస్తే హెబ్రీ 10:7- అప్పుడు నేను- గ్రంధపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం. అంటే దేవుడు మన గురించి వ్రాసుకున్నది గ్రంధపు చుట్టలో అని చెప్పబడింది కానీ నుదిటి మీద కాదు అని అర్థమయింది.

6) కీర్తన 139:16-నియమింపబడిన దినములలో ఒకటైనాను కాకమునుపే నా దినములన్నియు( నా భవిష్యత్తు ) నీగ్రంధములో లిఖితములాయేను. ఇక్కడ కూడా అదే విషయం ప్రస్తావించాడు. అనగా మన future దేవుని గ్రంధములో వ్రాయబడింది. పై రెండు వచన సందర్భాలు(హెబ్రీ 10:7, కీర్తన 139:16) ఒకటి క్రీస్తు గురించి, మరొకటి దావీదు గురించి అని అనుకుని నా గురించి మాత్రము ఏమి వ్రాయలేదు అని అనుకోకండి. దేవుడు ఆలోచన తన పిల్లలపై ఉన్నతంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు అనగా job, పెళ్లి, పిల్లలు, సంపద, ఇల్లు వీటి గురించి దేవుడు వ్రాయలేదు. కానీ దేవుడు అందరి గురించి వ్రాసుకున్న ఒకే రాత(ఒక్కొకరికి ఒక్కో రాత కాదు) ఏమిటో bible లో చూద్దాము.

7) ఎఫేసి 1:4-6- మనము దేవుని ఎదుట పరిశుద్దులముగా ,నిర్దోషలముగా బ్రతకాలని జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించి వ్రాసుకున్నాడు. దేవుడు వ్రాసుకున్న ఉన్నతమైన వ్రాత ఏమిటంటే పరిశుద్దుడిగా ,నిర్దోషిగా బ్రతకడం అంతే తప్ప పేదవాడిగా బ్రతుకు, ఫలానా job చేస్తూ బ్రతుకు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను దేవుడు వ్రాసుకోలేదు.ఇంతకు మనము ఏ పనులు చేసి పరిశుద్దముగా ,నిర్దోషిగా బ్రతకమని దేవుడు వ్రాసుకున్నాడో bible లో చూస్తే ఎఫేసి 2:10- వాటి యందు మనము నడుచుకోనవలెనని దేవుడు ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు ( వాక్యపు పనులు) చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై, అయన ( దేవుడు) చేసిన పనియై యున్నాము.

8) మనము చేయవలసిన వాక్యపు పనులు( వాక్యానుసారమైన జీవితము జీవించాలని) వ్రాసుకున్నాడు.దేవుడు సిద్దపరచిన సత్ క్రియలను మనము చేయాలి కానీ అయన మనతో చేయించడు. సమాజములో అవకాశవాదులు తాము అనుకున్నది సాదించుకుంటే “తమ గొప్ప” అని చెబుతారు. కానీ అనుకున్నది సాదించుకోలేకపోతే “ దేవుని రాత అని తప్పించుకుంటూ ఉంటారు. ఉదా:: సంతానము కలిగేటప్పుడు మగ పిల్లవాడు పుడితే – నేను చెప్పినట్లే మగ పిల్లవాడు పుట్టాడు చూసారా అనే అని అంటారు. అనుకోని విధముగా ఆడపిల్ల పుడితే ఏమి చేద్దాము, దేవుడు రాసిన రాత ఎవ్వరు తప్పించలేరు అని అంటారు.అలాగే bike racing పోటిలలో మితి మీరిన వేగంతో bike నడుపుతూ, పోటిలలో గెలిస్తే చూసారా నా power అని అంటాడు. అనుకోని ప్రమాదము జరిగి leg,hand విరిగితే దేవుడు ఇలా రాసి పెట్టాడు అని అంటారు. handle మన చేతుల్లో ఉందా?? దేవుని చేతుల్లో ఉందా ఆలోచించండి.

9) దేవుడు అందరికి ఉపకారి అయినప్పుడు ఒకరికి చెడు జరగాలని, చెడుగా బ్రతకాలని దేవుడు ఆదేశిస్తాడంటారా? ఒక్క మాటలో చెప్పండి- మద్యం సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని దేవుడు రాత రాస్తాడంటారా? ఉన్న భార్యను వదిలి రెండో పెళ్ళికి సిద్దమవ్వమని దేవుడు రాత రాస్తాడంటారా?? మితి మీరిన వేగముతో వాహనమును నడిపి ప్రమాదము కొని తెచ్చుకోమని దేవుడు నుదిటిపై లిఖించాడంటారా? ఇవన్ని మనము చేసుకుంటున్న వివిధమైన స్వయము పనులు. దేవుడు ఇలా బ్రతకమని ఎప్పుడు చెప్పడు. చేయించడు.

10) ప్రసంగి 7:29- దేవుడు నరులను యదర్ధవంతులుగా పుట్టించెను గానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనియున్నారు. అనగా దేవుడు మనిషిని యదార్థవంతంగా పుట్టించాడు, యదార్ధవంతుడుగా, పరిశుద్దుడుగా, నిర్దోషిగా వాక్యపు పనులతో బ్రతకమని తన గ్రంధములో వ్రాసుకున్నాడు. మనము ప్రయత్నము చేస్తే దేవుని తోడ్పాటు ఉంటుంది. అంతే తప్ప ప్రయత్నము ఏమి చేయకుండా, అయన రాసినట్లు జరగకుండా మానదు అని ఇంట్లో కూర్చుంటే ముద్ద కంచంలోకి రాదు. కనుక ప్రతి పనికి మన ప్రయత్నము అవసరం. ఈ విధముగా పని విషయమై ప్రయత్నము చేయమనేదే దేవుని చిత్తము కానీ నేడు అందరు దేవుని చిత్తమైతే చేస్తాను, చూస్తాను, వస్తాను, కొంటాను, ఇస్తాను అని వారికీ తెలియకుండానే నుదిటి రాతపై నమ్మికయుంచుతున్నారు.

11) దేవుడు రాసుకున్న విధముగా నడిచి చూపిన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుని గ్రంధపు చుట్ట్టలో రాసుకున్న వ్రాతకు బిన్నముగా ప్రవర్తించి దేవుడు ఏర్పరిచిన మార్గము నుంచి తప్పిపోయిన యుధా ఉన్నాడు. మత్తయి 26:24- ఈ సందర్బ్భాములో దేవుడు క్రీస్తును గురించి వ్రాసుకున్నట్లు క్రీస్తు పోవుచున్నట్లు గమనించగలం. వ్రాయబడిన ప్రకారం దేవుడే జరిగించడం లేదు గానీ కరిస్తే అలాగున వెళ్లుచున్నాడు. దేవుడు దీనికి సహకరిస్తూన్నాడు .ప్రయత్నము క్రిస్తుది. సహాయము దేవునిది. వ్రాయబడిన ప్రకారము అనగా పరిశుద్దులముగాను, నిర్దోషులముగాను బ్రతకాలి,శ్రమలు అనుభవించాలి.ఈ విధముగా క్రీస్తు తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి ,తండ్రి సిద్దపరచిన పనిని ఉన్నదున్నట్లు సంపూర్తి చేశాడు. ఈ మార్గములో క్రీస్తు తనకు తానుగా వెళ్ళాడు, ఆ పని చేశాడు. అంతే కానీ దేవుడే నేట్టలేదు.

12) మరొక వ్యక్తి అయిన యుధా ఇస్కరియోతు మాత్రము దీనికి పూర్తిగా విరుద్ధముగా చేశాడు. తనకు తను తప్పిపోయాడు. అపోకార్య1:25- తన చోటికి పోవుటకు యుధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఇందులో దేవుని ప్రమేయము ఏమి లేదు. అందరు మారు మనస్సు కలిగి, క్రిస్తులా బ్రతికి, తండ్రి దగ్గరకు చేరడమనేది దేవుని చిత్తము.( గలతీ 5:1,1 తిమోతి 2:4, 11 పేతురు 3:9).

13) చాల మందికి కలిగే ప్రశ్నను చూస్తే నేను చెడ్డవాడిగా మారి నరకానికి వెళ్లిపోతాడని తెలిసి దేవుడు నన్నెందుకు పుట్టించాడు?? దేవునికి నా భవిష్యత్తు తెలుసు గదా, మంచిగా మార్చుకోవచ్చు గదా అని అంటారు. దేవునికి భవిష్యత్తు తెలుసు అన్న మాట correct. కానీ దేవుడు నీకై సిద్దపరచిన పనులు నెరవేర్చాలని, దేవుడు ఉన్న లోకానికి నీవు చేరుకోవాలన్నదే అయన(దేవుని) ఆశ. నువ్వు నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు ఎన్నడు ఆశించలేదు, ఆశించ డు కూడా.

14) దేవుడు జీవితాన్ని ఇచ్చాడు,స్వతంత్రత ఇచ్చాడు. సాతాను ద్వారా సమస్యలు వస్తాయని ,వాటిని ఎలా ఎదుర్కోవాలో bibleలో చెప్పాడు. ఎలా నేర్పుగా నడవాలో భోదించాడు.నడవకపోతే నరక శిక్ష ఉందని హెచ్చరించాడు. ఎందరో భక్తులు ఎలా నడిచారో సాదృశ్యముగా వివరించాడు.దేవుడు చెప్పినట్లు నడవని వారు ఏమయ్యారో bible లో చూపించాడు. ఇప్పుడు చెప్పండి. ఇందులో దేవుని తప్పు ఏమి ఉంది? ఇన్ని చెప్పిన మనకై మనము తప్పిపోతే,లోకశల్లో చిక్కుకుని నరకానికి జారిపోతే దేవుని ప్రేమేయము ఏముంది?

15) ఆత్మహత్య చేసుకోమని దేవుడు రాత వ్రాయలేదు-కానీ ఆత్మల రక్షణ కొరకు శరీరాన్ని అర్పించాలని వ్రాసుకున్నాడు(1యోహాను 3:16),, మితి మీరిన వేగంతో వెళ్లి ప్రమాదానికి గురి కావాలని దేవుడు వ్రాయలేదు-కానీ సత్య వాక్యాన్ని బహువేగంగా వ్యాప్తి చెందించి పాతాళమనే ప్రమాదము నుంచి ఎందరినో తప్పించమని వ్రాసుకున్నాడు( కొలస్సి 1:6), సాతాను పెట్టె శోధనలలో చిక్కుకుని పరలోకాన్ని పోగొట్టుకోవాలి అని వ్రాసుకోలేదు-గానీ సాతనును, వాని క్రియలను జయించాలని వానికి పరలోకములో క్రీస్తుతో పటు సింహాసనము ఇస్తానని వ్రాసుకున్నాడు(ప్రకటన 3:20)