Showing posts with label mantralu. Show all posts
Showing posts with label mantralu. Show all posts

Wednesday, February 5, 2014

జోతిష్య శాస్త్రము నమ్మవచ్చా??



జోతిష్యo అనగానే రాబోయే భవిష్యత్తునీ ఉహించి చెప్పే శాస్త్రముగా ప్రజల మనస్సులో ముద్ర వేయబడినది. అస్సలు శాస్త్రము పుట్టడానికి బలమైన కారణము ప్రజల బలహీనత అనే చెప్పాలి.ఏమి జరగబోతుందో అన్న ఆతురత ప్రతి మనిషిలో ఉంటుంది.ప్రతి మనిషిలో ఉన్న ఆతురతను ఆసరాగా తీసుకుని జరగబోయేది మేము చెప్పుతాము అని ఒకప్పుడు సోదేగండ్రులు ఇప్పుడు జోతిశ్యులు అనుట విచారకరము. జోతిష్య శాస్త్రానికి అధరాలు,రుజువులు ఉన్నాయో ఆలోచిస్తే మనిషి మూడనమ్మకాలు కనపడుతున్నాయి..  మధ్య Numerology ( సంఖ్యా శాస్త్రము) అనగా అంకెలకు ,మన బ్రతకులకు సంభందము ఉన్నదని చెప్పే శాస్త్రము.అలానే వస్తు శాస్త్రము.కట్టుకున్న ఇంటికి,మన భవిష్యత్తుకు ముడిపెట్టి ఏది ఎక్కడ ఉండాలో చెబుతూ ,కలుగుతున్న కష్టాలకు కారణము ఇల్లు అని చూపించి లక్షల్లో కట్టుకున్న ఇళ్ళను పగలకోట్టుతున్నారు.మనిషి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచుకోవాలనుకుంటున్న వారు పుట్టిoచిన శాస్త్రాలే ఇవన్ని కూడా.



1)    సమాజానికి దేవునిపై నమ్మకము తొలగిపోయి మనిషి మీద నమ్మకము పెంచుకొని శాస్త్రాల పేరుతో మనిషి పోతున్నాడనటానికి ఉదాహరణకు జోతిష్య శాస్త్రము. జరిగిపోయిన గతము గుర్తుచేసుకోవడము చాలా కష్టము.జరగబోయే భవిష్యత్తును ఉహించడము మనిషి వాళ్ళ అవుతుందా??? భవిష్యత్తు చెప్తాను అంటే జరిగిన గతము కూడా చెప్పాలి గా???గతము గురించి చెప్పలేని మనిషి జరగబోయే futureనీ జోతిష్యo పేరుతో నేను చెప్తాను అనే మనిషి నమ్మించి మోసము చేస్తున్నాడు.

2)    అస్సలు జోతిష్య శాస్త్రాo ఎప్పుడు పుట్టింది?దీని విభాగాలు గురించి bibleలోకి వెళ్లి ఆలోచిస్తే జోతిష్య శాస్త్రాo క్రీస్తు పూర్వమే పునాది పడింది.అది ఎక్కడో,ఎప్పుడో చూస్తే దానియేలు2:27-జోతిశ్యులైనాను తెలియజెప్పజాలరు.....దానియేలు గ్రంధములో వ్రాయబడిన చరిత్ర బబులోను సామ్రాజ్యపు చరిత్ర. క్రీస్తు పూర్వమే ఉన్నదని వచనము ద్వార అర్థమవుతుంది.రాజు గారి కల వచ్చినప్పుడు కల ఎవరు చెప్పగలరు అన్నప్పుడు వీరు వచ్చారు. తుమ్మితే ,పిల్లి అడ్డు వస్తే ,శవము అడ్డు వస్తే పని జరగదు ,మంచిది కాదు అనే శకునాలను బట్టి నడుస్తున్నవారు కూడా ఇప్పుడు ఉన్నారు.బబులోను కాలములో నేబుకజరు పరిపాలించే కాలములోనే జోతిష్య ఉసు bible లో కనపడింది

3)    యెషయ 47:13- జోతిశ్యులు,నక్షత్ర సుచకులు,మాసచర్య చెప్పు వారు...... నక్షత్రలను సూచిస్తూ నక్షత్రలకు మన భవిష్యత్తుకు సంభందము చెప్పేవారు నక్షత్ర సుచకులు. మాసచర్య అనగా నేల ఫలాలు చెప్పేవారు. ఇలాగె హస్త శాస్త్రము కూడా ఉంది. సంతన రేక అని,ధన రేక అని, ఆయుష్షు రేక అని ,భాగ్య రేక అని ఇలా చెయ్యిలో ఉన్న రేకలన్నిటికి పేర్లు పెట్టి చెప్పుచున్నారు. ఇలా చెయ్యి చూసి future చెప్పేవారు ఒకరు,stars చూసి ఒకరు,రాశులను బట్టి ఒకరు,శకునాలని ఒకరు,అందరు future చెప్పడానికి ready అయిపోయారు,మనిషిని మోసగించడానికి మనిషి ఆడుతున్న ఆటలు ఇవన్ని కూడా.

4)    66 పుస్తకాల మహా జ్ఞాన గ్రంధములోనికి వెళ్ళితే ఇవన్నీ ఎలా అబద్దాలో బట్ట బయలు చేసిన ఏకైక గ్రంధము “THE BIBLE”.

5)    ఇలా చిలక దగ్గర నుంచి నక్షత్రాల వరకు ఆలోచిస్తే మన భవిష్యత్తు వీటికి తెలుసా???మన future దేవుడు చిలకకు చెప్పాడా???అస్సలు చిలక జ్ఞానము ఎంత ? మనిషి జ్ఞానము ఎంత?యోబు35:11-భుజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ది నేర్పుచు ,ఆకాశ పక్షులకంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు.... మనిషి అన్నింటికంటే జ్ఞానవంతుడు అని దేవుడు అంటున్నాడు. ఇకపోతే చిలక మెడదు నిమ్మకయలో ఉన్న విత్తనము అంతది. మనిషి brain1300grams. నిమ్మకయలో ఉన్న విత్తనము గల మెదడు అయిన చిలకకు 1300grams ఉన్న మనిషి భవిష్యత్తు చెబుతుందా? భవిషత్తు కావాలంటే bibleలో ఎందులో ఉందో చూస్తే హెబ్రీ10:7-దేవుని దగ్గర ఉన్న గ్రంధాపు చుట్టలో మన future ఉంది.

6)    మన భవిష్యత్తు వారి చేతిలో లేదు.పరలోకపు తండ్రి యొక్క గ్రంధాపు చుట్టలో మన భవిష్యత్తు వ్రాసాడు.చిలకను అడిగితే ఏమి చెబుతుంది?ఇవన్ని మోసపురితమైనవి.

7)    హస్తము చూసి చెప్పొచ్చు అని అనుకుంటే చెయ్యి లో గీతలు ఉన్నాయి మరియు కాళ్ళ పాదము క్రింద కూడా గీతలు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి?ముసలి వారు అయితే శరీరమంత గీతలు వస్తాయి .మరి గీతల సంగతి ఏంటి? చేతి గీతలు మనిషి బ్రతుకు రాతలా??గీతలు ఎందుకు ఉన్నాయి అంటే చెయ్యి ముడుచుకోవడానికి సులువుగా ఉంటుందని.ఎక్కడ గీతలు ఉన్నాయో అక్కడే ముడత పడుతుంది. విషయము తేలిక హస్త రేఖ శాస్త్రమును పుట్టించారు.కీర్తనలు 31:5- నా కాలగతులు నీ వసములోనున్నది...... దేవుని ఆధీనములో ఉన్నది మన భవిష్యత్తు. కాలములో ఏమి జరగాలో,జరగనున్నదో అది దేవుని ఆధీనములో ఉంది అని దావీదు అంటున్నాడు.

8)    నక్షత్రాలను బట్టి చూస్తే మనిషి future అర్థమవుతుందా??అస్సలు stars గురించి ఆలోచిస్తే మనవ మెదడు సరిపోతుందా? కీర్తనలు 8:3-నీవూ కలగజేసిన చంద్ర నక్షత్రాలు చూడగా నీవూ మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు.....? అవి దేవుని చేతి పనులని మనము గుర్తించాలని దేవుడు పెట్టాడు starsనీ. starsలో future ఉండదు. bible లో ఆకాశ నక్షత్రాలు దేనిని సుచిస్తాయో చూస్తే మత్తయి24:29-మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడెను....... యేసు రెండవసారిగా భూమి మీదకు రాబోతున్నాడని అనడానికి stars సూచనగా ఉంటే stars లో future ఉంది అని చెబుతున్నారు. మత్తయి 2:9,10 చదవండి -star యేసును సూచించింది. యెషయ 47:10- అలంటి వారికీ దేవుడు మాటలు అంటున్నాడు.

9) Future చెప్పడము మనిషి వాళ్ళ అయ్యే పని కాదు .యాకోబు 4:14-రేపేమి సంభావించునో మీకు తెలియదు ఇక్కడ దేవుడు మానవులకు తెలియదు అంటే నాకు తెలుసు అన్నవాడు ముందుకు రావాలి... సామెతలు 20:24-తనకు సంభవి౦పబోవునది యోకదేట్లు తెలుసుకొనగలడు??? ప్రసంగి 8:7- సంభవి౦పబోవునది నరులకు తెలియదు.

10) కష్టాలు,కన్నీళ మధ్య దేవుని దగ్గరకు రావలసిన మనిషి వాళ్ళ దగ్గరకు పోతున్నారు. సామెతలు27:1-రేపటి దినము గూర్చి అతిసయపడకుము. దినమున ఏది సంభావించునో అది నీకు తెలియదు. మత్తయి 6:34-రేపటి గూర్చి చింతింపకుడి. భవిష్యత్తు పేరిట హస్తము చూస్తామని ,చిలుక ద్వార చెప్తామని,stars ద్వార చెప్తామని జనాలను మోసము చేస్తున్నారు.

చనిపోయిన వారు దయ్యాలుగా మారుతారా?? దయ్యాలు, మంత్రాలు, క్షుద్రశక్తులు ఉన్నాయా??

అటు గ్రామీణ స్థాయి నుండి ఇటు చదువుకున్న వారి వరకు అర్చర్యాన్ని కలిగించి ఎటూ తేల్చుకోని విషయమే దయ్యాలు,మంత్రాలు,క్షుద్రశక్తులు ఉన్నాయా అని. ఒక వైపు అక్షర జ్ఞాన౦ అంతరిక్షానికి వెళుతున్న మనిషి నమ్మకాలలో మాత్రము మూడనమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి అనుటలో దయ్యాలు, మంత్రాలు, క్షుద్రశక్తులు ఉన్నాయా.. technology పేరుతో మనిషి అభివృద్ది అవుతున్నా కానీ మూడ నమ్మకాల పేరుతో పతనానికి వెళ్ళిపోతున్నాడు. పతన అంచుల లోతు వెళ్తున్న మనిషికి దైవ జ్ఞానం(bible) తో సరి చేయడము అవసరము. 66 పుస్తకాలలో మనిషికి అవసరమైనది లేదు అనే మాట రానియ్యకుండా ప్రతి విషయాన్నీ దేవుడు మన చేతిలో పెట్టాడు(bible).

1) రోజు ఎవ్వరు మాట్లాడుతున్న దయ్యాలు కనిపించాయి అని మాట్లాడడము, దయ్యనికి రూపు రేకలు ఉన్నాయి అనుకోవటము చూస్తున్నాము, వింటున్నాము. ఇలా మాట్లాడడానికి కారణము సినిమాలు. మనిషి మరణించిన తరువాత ఏదో జరిగిపోతున్నాడని, భూమి మీదకు దయ్యముగా వచ్చినట్లు చూపించి నీజ జీవితములో ఇవే సత్యాలుగా రోజు మనిషి నమ్ముతూ దయ్యాలు ఉన్నాయన్న భ్రమలో ఉన్నాడు. అస్సలు ఉన్నవి ఏంటి, లేనివి ఏంటి?? అస్సలు గందరగోళము జరగటానికి కారకులు ఎవరు అను విషయమును bible లో చూస్తే ఎంతో సమాచారాన్ని దేవుడు వ్రాయించాడు. ప్రకటన 12:7-ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడెను. సృష్టి కలుగక ముందు పరలోకములో జరిగిన మహా యుద్దము జరిగింది. వాడు (సాతాను లేక అపవాది, లేక దయ్యము) ఎన్నో పేర్లుతో భూమి మీదకు వచ్చాడు. ప్రకటన 12:12-అపవాది తనకు time కొంచమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చిఉన్నాడని చెప్పెను. దయ్యము అనగా మనిషి ఏమి అనుకుంటున్నాడంటే మరణిస్తే దయ్యముగా మారుతాడని, కోరికలు తీరకపోతే దయ్యాలుగా మారుతారని.

2) ఒక వేళా కోరికలు తీరనివారు దయ్యాలు అయితే భూమి మీద ప్రతి మనిషి చచ్చేంత వరకు ఏదో ఒక కోరికతో ఉంటాడు. చచ్చిన కూడా కోరికలు తీరకుoటే వారు దయ్యాలు గా వస్తారా??? కోరికలకు, దయ్యాలుగా మారటానికి సంభందము ఉన్నదా??? కేవలము మరణించిన తరువాత దయ్యాలుగా మారుతారని తెలుసు మనుషులకు. ప్రసంగి 10:14-నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? మహా జ్ఞాని అయిన సోలోమోను పరిశుద్దాత్ముని ప్రేరణతో చనిపోయిన తరువాత ఏమి జరుగుతుందో తెలియదు అంటున్నాడు. గాలిలో కలిసిపోతాడని కొంతమంది ,కోరికలు తీరకపోతే భూమి మీదకు వచ్చి కోరికలు తిర్చుకునేంతవరకు ఇకడిక్కడే తిరుగుతాడని కొంతమంది ఇలా ఎంతో మంది భుద్దిహినులు అపోహ పుట్టించి దాన్ని వాస్తవాలను కుంటున్నారు.. 

3) అస్సలు కోర్కెలు అత్మకా? లేక శరీరానికా?? శరీర సంభంధమైన కోర్కెలు ఆత్మకు ఉండవు. కోర్కెలు కలిగిన శరీరము శవమై మట్టిలో కలిసిపోతే, వెళ్ళిపోయినా ఆత్మ మల్లీ శరీర సంభంధమైన కోర్కెలను తీర్చుకోవటానికి రావడము ఏంటి?? చనిపోయిన తర్వాత ఆత్మకు ఇక భూమికి సంభందము లేదు. ప్రసంగి 9:5,6- అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు, వారి పేరు మరువబడింది, వారికిక లాభము కలగదు, వారిక  ప్రేమింపరు, పగపెట్టుకోనారు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యెందును వారికిక నెప్పటికి వంతు లేదని ఉంది వాక్యము.. మరణించిన వారి కొరకు మాట్లాడుతున్న మాట. కోరికలు తీరనంత మాత్రన దయ్యాలుగా మారుతారనుటలో వీళు లేదు. ఎందుకంటే భూమి మీద సంభందము ఉండదు. ఏదో గాలిలో కలిసిపోతారని నమ్మవలసిన అవసరము అంతకన్నా లేదు. మరణించిన తరువాత గాలిలో కలిసిపోయే చిన్నది కాదు మనలో ఉండే ఆత్మ. మనము సాక్షాత్తు దేవునిలో నుండి వచ్చిన వారము. ఒకవేళ మనము గాలిలో కలిసిపోతే మనకంటే ముందు దేవుడు గాలిలో కలిసిపోవాలి. ఎందుకంటే దేవుడు కూడా ఆత్మ గనుక. దేవుడు గాలిలో కలిసిపోయేవాడా?? గాలినే కలిగించిన గొప్పవాడు. మనిషిలో ఉన్న ఆత్మ ఎందుకు గాలిలో కలిసిపోవాలి?? సత్యాలు తెలియకపోవటము వలన ఇక్కడే ఉంటుందని ఒకడు, అప్పుడప్పుడు వస్తుందని ఒకడు రోజు విభిన్నముగా మాట్లాడుకుంటూ దయ్యాలుగా ఉహించుకుంటూ ఎన్నో కధలు తెచ్చారు.

4) ఇలా అనుకోవడానికి కారణము శవాన్ని మేమే తీసుకెళ్ళి పాతిపెట్టాము కదా కానీ ఆత్మ ఏమి అయిపోయిందో మాత్రము మాకు తెలియదు గనుక ఇక్కడిక్కడే తిరుగుతుందని అనుకుంటున్నారు. శవాన్ని తీసివేయటము మన పని కానీ ఆత్మను తీసివేయటము దేవుని పని. మరణించాక శవాన్ని ఎత్తివేయుటలో మూడు రోజులన్న ఆలస్యము అవుతుందేమో గాని దేవుని పని (ఆత్మను తీసివేయుట) మాత్రమూ ఒక్క క్షణము. యోబు 21:13-ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అనగా శరీరాన్ని విడిచిపెట్టిన మరు క్షణమే పాతాళానికి దిగిపోయాలి. శరీరము లేకుండా భూమి మీద ఆత్మ ఉండదు అలానే ఆత్మ లేకుండా శరీరము భూమి మీద ఉండదు. కనుక మరణించిన తరువాత ఏమి జరుగుతుందో తెలియక పోవటము వలన మనిషి తన జ్ఞానముతో ఇక్కడిక్కడే ఉన్నాడని, దయ్యాలుగా మారుతారని ఉహిస్తున్నాడు.

5) సాతాను( దెయ్యము) తన ఉనికిని మనిషికి తెలియనివ్వకుండా స్మసానాన్ని చూపించి వాడు మాత్రము సమాజములో ఎవరిని మ్రింగుదునా అని ఎదురుచూస్తున్నాడు. మనము స్మసానములో దయ్యము ఉందని అనుకుంటున్నాము. అస్సలు దయ్యము(సాతాను) సమాజములో ఉంది. స్మసానములో శవాలు ఉంటాయి. దెయ్యముగా, సాతానుగా, ఘట సర్పముగా, ధర్మ విరోదుగా, సత్య విరోధిగా పరలోకానికి మనల్ని వెళ్ళనివ్వకుండా మనిషిలో ఎన్నో దుర్గునాలు పెట్టి దేవునికి కాకుండా లోకాన్ని, లోక వ్యామోహాన్ని చుపించి, పడవేసి మనిషిని దేవుడికి దూరముగా చేస్తన్న అసలైన వాడిని వదిలేసి మరణించినవారు దయ్యాలుగా మారుతారని రోజు మనిషి మాట్లాడుకుంటున్నాడు. john 8:43,44-మీరు నా భోధ విననేరకుండుట వలనే గదా?? మీరు మీ తండ్రియగు అపవాది(సాతాను, దయ్యము) సంభందులు. నా భోధ విననేరకుండుట వలనే గదా అపవాది(సాతాను, దయ్యము) సంభందులు అయ్యారు అని యేసు అంటున్నాడు.

6) మనిషి దేవుని మాటలు నమ్మక Newspaper, TV లో వచ్చే News వినీ నమ్ముతున్నాడు. మనిషి రాసిన news విలువ ఎక్కువ లేక దేవుడు రాసిన వార్తలు విలువ ఎక్కువ??? దేవుడు ఏమి చెబుతున్నాడని bible నే చూడాలి తప్ప లోకాన్ని కాదు. లొకము నుంచి bible నీ చూస్తే నమ్మాలని పించాడు. వాక్యములో ఉంటున్న విలువియన్ సమాచారాన్ని విని లోకములో ఉన్నవి ఆలోచించగలిగితే అస్సలు ఎంత మోసము జరుగుతుందో వీటి వలన తెలుస్తుంది. దెయ్యము అనగా సాతాను.