Sunday, May 18, 2014

పరలోకము - నరకము నిజముగా ఉన్నాయా?


1) పరలోకములో ఉంటున్న దేవుడు భూమి మీద ఉంటున్న మనిషిని ప్రేమిస్తున్నాడు. దేవుడు అవకాశము ఇచ్చిన తర్వాత తన కొరకు బ్రతికినంత కాలము బ్రతకకపోతే అవసరమైతే మనిషిని దండించుటకు కూడా దేవుడు వెనుకంజ వేయడు. దేవుని పట్ల సమాజానికి పరిపూర్ణమైన అవగాహన లేకపోవటానికి కారణము ఈ లోక జ్ఞానమే. యాకోబు 3:15- ఈ జ్ఞానము పై నుండి దిగివచ్చునది కాక భూ సంభంధమైనదియు ప్రకృతి సంభంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. అనగా దేవుని మహా జ్ఞానము పరలోక సంభందమైనధైతే ఈ లోక జ్ఞానము భూ సంభంధమైనది.

2) లోక జ్ఞానము నిండిన మనిషికి దేవుని మాటలు చిన్నవిగా కనపడుతున్నాయి. లోకపు విద్యలు చదువుకున్న వారైనా ఒక హేతువాదులు, నాస్తికులు ,దేవుని నమ్మని వారు అడుగుతున్న ప్రశ్న అస్సలు స్వర్గము- నరకము నిజముగా ఉన్నాయా అని. ఉన్నాయా అని అడుగుతున్న వీరు వాటి గురించి తెలుసుకోవడానికి ఏ రోజు అయిన ప్రయత్నము చేసుండరు. అస్సలు దేవుని పట్ల నమ్మకము లేని మనిషికి దేవుడుండే ఒక లోకము ఉంటుందని, ఆ లోకము నుంచే ఈ భూమి మీదకు వచ్చామని మరలా వెళ్ళాలని జ్ఞాపకాలు ఎలా ఉంటాయి? పరలోక సంభందమైన జ్ఞానాన్ని ఈ భూమి మీద ఉంటున్న అయన పిల్లలమైన మనకు తెలియజేయటానికి జ్ఞానము , వాక్యమైన యేసును ఈ భూమి మీదకు పంపి ఆయన ఉన్న ముప్పైముడున్నారా years కాలములో సమాజానికి జ్ఞాన భిక్ష పెట్టాడు.

3) ఆలోచించటానికి ప్రయత్నము చేసి అర్థము కాలేక అడగకుండా Bibleలో వ్రాయబడినది తప్పు అని అనుకుంటూ ఏదో క్రైస్తవులు స్వర్గము-నరకము లేనివి కల్పించి సమాజానికి చెప్పి భయపెడుతున్నారు అని అనుకుంటూ ఈ రోజు హేళనగా ,వెకిలి మాటలతో మాటలాడుకుంటున్న వారికీ ఈ post కనువిప్పు కలగజేస్తుంది.

4) లోక జ్ఞానము చదువుకున్న వారికీ అంత జ్ఞానము ఉంటే పరలోక సంబంధమైన జ్ఞానమైన 66 పుస్తకాలను చదువుకున్న వారికీ ఇంకెంత జ్ఞానము ఉండాలి? hospitalలో పని చేసే compounderకి ఇంత జ్ఞానము ఉంటే లోపల కూర్చున్న doctorకి ఇంకెంత జ్ఞానము ఉండాలి? దేవునిని నమ్మని వాడికి ఇంత జ్ఞానము ఉంటె దేవునిని నమ్మిన మనకేంత జ్ఞానము ఉండాలి? పరలోకపు జ్ఞానము ఈ 66 పుస్తకాలలో భద్రముగా ఉన్నది.

5) ఈ రోజు స్వర్గము-నరకము గురించి మనిషి ఎందుకు లేవు అని అనుకుంటూన్నాడని చూస్తే మానవుని limit ఈ విశ్వమే. ఈ విశ్వాన్ని దాటి మనిషి ఎటు వెళ్ళలేడు. ఈ విశ్వములో ఒక గ్రహము నుండి నక్షత్ర మండలానికి వెళ్ళటానికి మనిషికి ఉన్న జీవిత కాలము సరిపోదు. ఇక్కడ ఉంటూ స్వర్గము- నరకము లేదు అని అంటున్నారు. అస్సలు స్వర్గము- నరకము లేవు అని ఎలా అనగలుగుతున్నారు?కంటికి కనిపించని మాత్రానా లేదా? భూమి మీద అంత వెతికి ఒక వేళా స్వర్గము-నరకము లేవని నిర్ణయానికి వచ్చారా? అస్సలు లేవు అని ఎందుకు అనుకొంటున్నారు? నిజముగా విశ్వములో పూర్తిగా ఏమి ఉందో తెలియదు. stars ఎన్ని ఉన్నాయి అంటే కోట్లు ఉన్నాయి అంటారు గానీ లెక్క చెప్పరు.ఈ విశ్వములో ఉన్న విషయాలే మనిషికి తెలియనప్పుడు ఈ విశ్వము దాటుకుని అవతలి ఏమి ఉందో అన్న విషయము మనిషికి ఎలా తెలుస్తుంది?

6) తెలియని మనిషి తెలియనట్టుగా ఉండకుండా తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు. స్వర్గము-నరకము అనునది భూమి మీద ఉన్నవి కాదు. భూమి మీద ఉన్నవే సరిగా తెలియనప్పుడు ఈ విశ్వము దాటుకుని అవతలి ఉండే పరలోకాలు గురించి ఏమి తెలుసు?లేవు లేవు అని అంటున్న వారు ఎక్కడ చూసి లేవు అని అంటున్నారు? ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇక్కడ ఉన్నవే సరిగా తెలియదు మరి లేవు అనగానే అయిపోతుందా?

7) లేవు అన్న వారిని అడుగుతున్న ప్రశ్న::: ఎక్కడ చూసి లేవు అని అంటున్నావు? వెతికితే, దొరకకపోతే లేవు అనాలి. విశ్వము దాటి అవతలి ఉన మహా లోకాల గురించి మనిషికి ఏ ఆలోచన లేకుండానే లేవు అని అనుకోవటము తప్పు. మరికొద్ది మంది ఓపిక లేక స్వర్గము అయిన, నరకము అయిన అనీ మన చేతిలో ఉన్నాయి అంటారు. హ్యాపీ వచ్చినప్పుడు స్వర్గమని and sad వచ్చినప్పుడు నరకము అనుకోవాలా?? మరి happy-sad కలిసివస్తే సగము నరకము-సగము స్వర్గము అనుకోవాలా? సాతాని గాడి జ్ఞానాన్ని మనిషికి ఎక్కించి దేవుని వైపు తిరిగి చూడకూడదని ఇలాంటి మాటలు నేర్పించింది.

8) స్వర్గము అనగా ఆనందము తప్ప భాదలే ఉండవు. నరకము అనగా భాద తప్ప ఆనందమే ఉండవు. స్వర్గములో నరకము ఉండదు and నరకములో స్వర్గము ఉండదు. ఒకటి ఆనందానికి సూచనా అయితే మరొకటి భాధకు సూచనా.రెండు వ్యతిరేకముగా ఉన్నది. ఈ లోకములో మనకు కష్టము-నష్టము and సుఖము- దుఃఖము వచ్చిపోయేవి.ఎప్ పుడు మనకు కష్టము ఉండదు and అలా అని ఎప్పుడు నష్టము ఉండదు. ఈ లోకము సుఖ-దుఃఖాలతో మిలితమైనది. ఇక్కడ కష్టాలు ఉంటాయి and సుఖాలు ఉంటాయి.

9) స్వర్గము నరకము ఉన్నవి అనుటకు రుజువులను చూస్తే అపోకర్య 7:54 నుంచి- అయితే అతడు( స్తేఫెను) పరిశుదాత్మ తో నిండుకోనినవడై ఆకాశము వైపు తేరి చూసి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వ మందు నిలిచియుండుట చూచి. స్తేఫెనును తండ్రి సంకల్పాన్ని వివరిస్తున్నాడని రాళ్ళతో కొడుతూ చంపుతున్నారు. యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకము వెళ్ళాడని చెప్పబడింది( అపోకర్య 1:11). యేసు ఉండే లోకము పరలోకము. ఇప్పుడు స్తేఫెను ఆకాశము వైపు తేరి చూడగా యేసును చూసాడట.. యేసు శిష్యులకు ప్రార్ధన నేర్పించుటలో పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. ఈ భూమి మీద మనుష్యులుగా మనము ఉండడానికి ఒక లోకము ఉన్నప్పుడు దేవుడు ఉన్నవాడు అయితే ,ఉన్నవాడు ఉండడానికి మరోలోకము ఉండదా? రాష్ట్రపతికి రాష్ట్రపతి bhavan ఉంది. ప్రతి department వారు ఉండడానికి quarters ఉన్నాయి. పరలోకములో దేవుడు ఉన్నాడు అని నమ్మగలిగితే దేవుడు ఉండడానికి కూడా ఒక లోకము ఉంది . అదే పరలోకము. ఇంతవరకు స్వర్గము ఉన్నది అని చెప్పను. ఉన్నది ఎక్కడ ఉన్నదో చెప్పను.

10) లేదు అని అంటున్నవారు నేను ఎక్కడ అయితే ఉంది అని చెప్పానో అక్కడికి వెళ్లి చూసొచ్చి లేదని చెప్పాలి. ప్రస్తుతము నేను karnatakaలో ఉన్నాను. మా సొంత ఊరు అయిన nellore జిల్లాకి వెళ్లి అక్కడ వెదికితే నేను దొరుకుతనా? నేను దొరకాలంటే కర్ణాటకలో వెతకాలి. ఆకాశము తర్వాత పరలోకము ఉంటె భూమి మీద వెతికి లేదు అని అంటున్నారు.ఇక్కడ ఉంటుందని ఎవరు చెప్పరు?ఎక్కడో ఉన్న లోకము ఇక్కడే ఉందని ఎలా అనుకుంటారు?

11) యేసు ఉన్న లోకము, పరలోకపు కన్న తండ్రి ఉన్న లోకములో ఒకప్పుడు ఆ లోకము నుంచి మనము ఈ భూమి మీదకు వచ్చాము.( కీర్తన 90:1). పరలోకము ఎలా వెళ్ళాలి అని అడగవలసిన మనిషి అస్సలు పరలోకము లేదు అని అంటున్నాడంటే మనిషికి లోకజ్ఞానము పిచ్చి పట్టింది అనుకుంటా... phillipu2:9- మూడు లోకాలు అయిన పరలోకము,భూ లోకము and భూమి క్రింద ఉన్న లోకము గూర్చి చెప్పబడింది. మనము ఉంటున్న భూమి క్రింద ఉన్న మహా లోకమే నరకము. americaను నాకు చూపించు అని ఎవరైనా అడిగితే world map లో చూపిస్తాము. లేదు నేను నమ్మను అని అంటే ఇప్పుడు ఇతనికి americaను తీసుకొచ్చి చూపించాలా? అదేమన్నా cake ముక్క తీసుకురావడానికి?భూమి మీద ఉన్నదానిని చూపించడానికి ఇంత కష్టమైతే స్వర్గము-నరకము ఎలా తెచ్చి చూపిస్తారు?

12) అస్సలు పాతలములో ఏమి ఉందో చూస్తే యెషయ 14:15- పాతలములో నరకము ఉందట.కొంత మంది స్వర్గము- నరకము ఏమి లేవు and అన్ని ఇక్కడే అంటున్నారు. మరి అన్ని ఇక్కడే అయితే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మనిషి మరణము తర్వాత వెళ్ళిపోయే లోకాలు స్వర్గము-నరకము. ఒక వేళా ఈ బ్రతుకు దేవుని కోసము కాకపోతే నరకము ఉందని చనిపోయిన తరువాత అర్థమవుతుంది.ఈ లోకము మనది కాదు కనుక చావు పేరుతో అందరము వెళ్ళిపోతున్నాము. అందరు వెళ్ళిపోతున్నారంటే దాని అర్థము ఈ లోకము మనది కాదని. మనదైన లోకమైన పరలోకానికి వెళ్లిపోవాలి. దేవుని కోసము బ్రతికితే పరలోకము. ఇది శాశ్వతము. దేవుని కోసము బ్రతకకపోతే నరకము. ఇది కూడా శాశ్వతము.

13) 11 కోరంది2:17- అదృశ్యమైనవి నిత్యములు.. ఆ నిత్యమైన ఈ లోకాన్ని చూస్తూ నిత్యమైన లోకాలు లేవని అనుకుంటున్నారా? ఈ లోకము నుండి నువ్వు వెళ్లిపోవచ్చు లేదా యేసుక్రీస్తు రెండవ సారి ఈ లోకానికి వస్తే ఈ లోకమే వెళ్లిపోవచ్చు. వెళ్ళిపోయే లోకాన్ని మధ్యలో ఉండి, మధ్యలో వచ్చి ,మధ్యలో పోయే ఈ లోకము మీద మమకారము పెంచుకుంటున్నాము తప్ప మనము వచ్చిన లోకము మీద ప్రేమ ఎందుకు లేదు? ఈ కళ్ళ ముందు ఉన్న లోకము శాశ్వతము కాదు. కంటికి కనబడని పరలోకము శాశ్వతము and భూమి క్రింద ఉన్న పాతలు శాశ్వతము. కాని నరకము వెళ్ళితే నిత్యము భాద. స్వర్గము-నరకము ఎక్కడ ఉందో Bibleలో చెప్పబడింది. స్వర్గము- నరకము లో ఏమి ఉందో చెప్పబడింది. ఇక్కడ ఉంటున్న మనము జాగ్రత్త పడాలని చెప్పబడింది. పరలోకము ఉందని and అక్కడ ఎప్పుడు happy అని, నరకము ఉందని and అక్కడ ఎప్పుడు sad అని చెప్పబడింది. ఇంతకంటే information ఏమి కావాలి? Bibleలో స్వర్గము-నరకము ఉన్నాయని, ఎలా వెళ్ళాలో, ఏమి ఉందో, ఎంత కాలము ఉంటామో వ్రాయబడింది. లోక జ్ఞానము కంటే దేవుని మహా జ్ఞానమును నమ్మి మనము బ్రతుకును ఆ మహాలోకమైన పరలోకానికి వైపు నడిపించు కొనగలిగితే మన కంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు.

Monday, May 12, 2014

అంత్య దినములు ప్రారంభమైనవా? లోకము అంటున్న అంత్యక్రీస్తు వచ్చాడా? వస్తాడా? అంత్య తీర్పు ఎప్పుడు జరుగుతుంది?


నేటి క్రైస్తవ సమాజములో ఎక్కువ మందికి సందేహము ఈ అంత్య దినాలకు పైనే. ఈ యొక్క post లో మూడు భాగాలుగా విభాగించబడినది.
(1) అంత్య దినములు గూర్చి (2) లోకము అంటున్న అంత్య క్రీస్తు and క్రీస్తు విరోధి గూర్చి (3) అంత్య తీర్పు గూర్చి.

(1) (a) ఇప్పుడు మొదటి భాగమైన అంత్య దినముల గూర్చి Bible లోతులోకి వెళ్లి చూద్దాము.. అంత్య దినాలు అనేవి ఈ మధ్య కాలములో start అయ్యాయి అన్నట్లుగా అనుకుంటున్నారు. వాక్యము దగ్గరకు రాగానే ఏ వ్యక్తిని నమ్మక, ఏ వ్యక్తిపై ఆధారపడక కేవలము వాక్యముపై ఆధారపడి, వాక్యాన్ని మాత్రమే నమ్మి ఈ సమాజములో సత్యము పక్షాన నిలబడాలి. ఇంతకు అంత్య దినములు start అయ్యాయా? ఒక వేళ start అయితే ఈ మధ్యకాలములో ప్రారంభమైనవా? అప్పుడప్పుడు మనము కూడా భారి తుఫాను, సునామి, భూకంపాలు వచ్చినప్పుడు వెంటనే మనము అంత్య దినాలలో ఉన్నామని అనుకుంటున్నాము. ఇవి రాకపోతే మాములుగా ఉన్నాము అని అనుకుంటున్నాము. తుఫాను హెచ్చరికలు జారి  అయిన వెంటనే అమ్మో!! అంత్య దినాలు start అయ్యాయి అని అనుకుంటాము. ఏదో ప్రకృతిలో సంభవించిన ఒక వైపరిత్యాన్ని బట్టి, ప్రకృతిలో జరుగుతున్న ప్రమాదాలను బట్టి అప్పుడే అంత్యదినాలు start అయ్యాయి అని అనుకుంటున్నారు.
(b) Bible లో వెళ్లి దిని గురించి పరిశిలించినట్లు అయితే అస్సలు అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనాయి అనే విషయమును చూస్తే హెబ్రీ 1:1- ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలడెను. సుమారు క్రి.శ 65 timeలో పౌలు హేబ్రియులకు ఈ పత్రిక రాసాడు. సుమారు క్రి.శ 65 timeలో పౌలు రాసిన ఈ మాటలో ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడేను. అనగా అప్పుడు యేసు మాటలాడిన దినాలే అంత్యదినాలుగా ఇక్కడ పౌలు అంటున్నాడు. యేసు మాటలాడిన దినాలే అంత్యదినాలుగా ఈ మాటలో అర్థమవుతుంది. యేసు మాటలాడి 2000 years అయింది. ఈ లోకానికి వచ్చి నోరు విప్పి మాట్లాడి ఇప్పటికి సుమారు 2000 years అయింది. అయన మాటలాడిన దినాలు అంత్యదినాలు అయితే ఇప్పటికి అంత్య దినాలు ప్రారంభము అయ్యి 2000 years అని అర్థము. యేసు మాటలాడిన ఆ కాలమే అంత్యకాలము. ఎపుడో యేసు 2000 years క్రితము మాటలాడిన దినాలు అంత్యదినాలు అయితే మనము ఈ మధ్యలో start అయ్యాయి అని మాటలాడుకోవడము అన్నది Bibleకు భిన్నమా? కాదా? అంత్య దినాలు మొదటి శతాబ్దములో start అయ్యాయి. యేసు రాకనే అత్యదినలు జరిగింది. 
(c) 1 పేతురు 1:21-అయన( యేసు) కడవరి కాలమందు అయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలము అనగా అంత్య కాలము.యేసు ప్రత్యక్షపరచబడిన కాలమే అంత్య కాలము.యేసు వచ్చింది చివరి గడియలో. యేసు రాకడ కడవరి గడియలో జరిగింది. యేసు పుట్టుకతో అంత్యదినాలు start అయ్యాయి అన్న విషయాన్ని ఇక్కడ పేతురు మాటలాడిన మాటను బట్టి అర్థమవుతుంది. పై pointలో యేసు మాటలాడిన దినాలు అంత్య దినాలు అన్నాడు. ఇక్కడ పేతురు కూడా యేసు వచ్చిన కాలమే కడవరి కాలము అన్నాడు.చెప్పింది వేరే వ్యక్తులు అయిన చెప్పింది మాత్రము ఒక్కటే. ఎందుకు ఒక్కటే ఉంది అంటే చెప్పించిన పరిశుదాత్ముడు ఒక్కడే గనుక. 
(d) హెబ్రీ 9:26- అయన(యేసు) యుగముల సమాప్తి యందు. ప్రత్యక్షబడెను. అనగా యేసు అంతములో ప్రత్యక్షబడెను.యేసు వచ్చింది అంత్యదినములలో. మనము ఈ రోజు ఉన్నది కూడా అంత్యదినాలలో యేసు వచ్చింది చివరి గడియలో. మనము ఉన్నది చివరి గడియలో ఉన్నాము.
(e) 1కోరంది10:11- యుగాంతుమందున్న మనకు బుద్ది కలుగుటకు వ్రాయబడింది. అనగా పౌలు గారు కోరంది సంఘమునకు పత్రిక రాసేటప్పటికి యుగంతమందున్నాము మనము అని అంటున్నాడు. అనగా అంత్య దినాలలో ఉన్నామని. యుగాంతము అనగా అంత్య దినాలు అని. యేసు మొదట రాకడలో అంత్య దినాలు start అయ్యాయి.
(f) 1 John 2:18- ఇది కడవరి గడియ. ఇది అంటున్నాడు. పై వివరణ బట్టి పౌలు చెప్పిన, పేతురు చెప్పిన, John చెప్పిన మాటలలో అంత్య దినాలు అన్నది యేసు రాకడతోనే అంత్యదినాలు start అయినట్లు అర్థమవుతుంది.
 
(2) (a) లోకము అంటున్న అంత్యక్రీస్తు గూర్చి చూద్దాము. నేడు అంత్యక్రీస్తు పొప్(pope) అంటున్నారు. అంత్యక్రీస్తు అను మాట ఆదికాండము నుండి ప్రకటన వరకు ఎక్కడ లేదు. అంత్యక్రీస్తు అన్న పదము Bible లో ఎక్కడ కనిపించదు. అంత్యక్రీస్తు అస్సలు భయటకు ఎలా వచ్చింది అంటే English లో ANTICHRIST అంటారు. antichrist అన్న దానిని మన వాళ్ళు అంత్యక్రీస్తుగా మాటలాడుకుంటున్నారు. antichrist అనగా క్రీస్తు విరోధి. Bible లో క్రీస్తు విరోధి అన్న విషయము చెప్పబడింది తప్ప అంత్యక్రీస్తు గూర్చి చెప్పబడలేదు.ఒక వేళ వీరు అన్నట్లుగా అంత్యక్రీస్తు అను పదము సరియైన పదము అని అనుకుంటే అంత్యకాలములో వచ్చిన వాడిని అంత్యక్రీస్తు అనాలి. అంత్యకాలములో ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చిన కాలము అంత్య కాలము. యేసు అంత్యకాలములో వచ్చాడు గనుక అంత్య క్రీస్తు యేసు క్రీస్తు అవుతాడు.
(b) క్రీస్తు విరోధి వచ్చాడా? రాబోతున్నాడా? 1 John 2:18- క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు.. అనేకులైన క్రీస్తు విరోధులు అంటున్నాడు..ఒక్కడు అనేక మందిగా మారిపోయాడు. భయలదేరుదురు అనకుండా already బయలుదేరియున్నారు అన్నాడు. అంత్య దినాలలోనే క్రీస్తు విరోధులు అనేకులుగా బయలుదేరునట్టు మనకు అర్థమవుతుంది. ప్రపంచము అనుకుంటున్న క్రీస్తు విరోధి already వచ్చాడు. వచ్చినవాడు అనేకులైన మార్చేసాడు. క్రీస్తు విరోధి వస్తాడు అనుకోవడము తప్పు. already వచ్చి అనేకమందిని మార్చేసాడు. అస్సలు క్రీస్తువిరోధి ఎవరో 2john 1:7 లో చూడొచ్చు. మొదటి శతాబ్దములో అంత్యదినలు start అయ్యాయి.లోకము అనుకుంటున్నా క్రీస్తు విరోధి అంత్య దినాలోనే ఉన్నారు.
 
(3) (a) చివరిగా అంత్య తీర్పు గూర్చి చూద్దాము. ముందుగా తీర్పు అనగా ఏంటి and అంత్య తీర్పు అనగా ఏంటి? చనిపోగానే తీర్పు జరిగింది అనుటకు Luke 16:22 లో ధనవంతుడు- లాజరు situation లో తెలుస్తుంది. చనిపోగానే ధనవంతుడు పాతలములో ఉన్న వెధనకరమైన స్థలములోకి వెళ్ళాడు. లాజరు పాతలములో ఉన్న పరదైసుకు వెళ్ళాడు. అంటే చనిపోయిన వెంటనే తీర్పు జరిగినట్టుగా తెలుస్తుంది. అంత్య తీర్పు (final judgement) అనగా చివరిగా జరిగే తీర్పు. example: నేరము చేసిన వ్యక్తిని వెంటనే police వచ్చి arrest చేసి తీసుకెళ్తారు. ఇదే తీర్పు నా?? కాదు. తర్వాత ఖైదిని courtలో ప్రవేశపెట్టాలి. సాక్ష్యాధారాలు అన్ని పరిశిలించాక అప్పుడు శిక్ష వేస్తారు. ఇదే అంత్య తీర్పు( final judgement).
(b) ప్రస్తుతము తీర్పు జరుగుతుంది. దేవుని కొరకు,దేవునికి ఇష్టముగా బ్రతికితే పరదైసుకు వెళ్తారు and దేవుని కొరకు,దేవునికి ఇష్టముగా బ్రతకకపోతే శిక్షకు వెళ్తారు.అంత్య తీర్పు యేసు రెండవ రాకడలో జరుగుతుంది. john 5:29, మత్తాయి 25:31,41లో వివరణ ఉన్నది. రెండవ రాకడగా ప్రపంచమునకు యేసు వచ్చినప్పుడు జరిగేదే అంత్య తీర్పు. చివరిగా అంత్య దినాలు యేసు వచ్చినప్పుడే start అయ్యాయి. అంత్యక్రీస్తు అను పదము bibleలో లేదు కాని antichrist అని ఉంది. క్రీస్తు విరోధి ఎప్పుడో వచ్చేసాడు. అంత్య తీర్పు యేసు రెండవ రాకడ ద్వార జరుగుతుంది.


(4) ఎవరి మాటలు మనము నమ్మక కేవలము bibleపై ఆధారపడి, bibleలో ఉన్నవాటినే నమ్మి మన బ్రతుకును సరి చేసుకుంటూ దిన దినము మన ఆత్మీయ జీవితాన్ని నూతన పరుచుకుంటూ దేవుడు ఉన్న ఆ పరలోకానికి చేరే ప్రయత్నము చేద్దాము. దేవుడు ఇచ్చిన ఈ దినాలలో కనీసము కొన్ని దినాలైన దేవుడిచ్చు వాక్యముతో గడపక పోతే ఆ జీవితానికి అర్థము అంటూ ఉండదు. ఆయుష్షు, ఆరోగ్యమ అవయవాలు అన్ని ఇచ్చిన దేవుడి కోసము కనీసము కొన్ని దినాలు అయిన దేవుని కొరకు గడిపిన దినాలు లేకపోతే అది న్యాయమా?? అన్యాయమా అనేది ఆలోచించుదాము. సమస్తాన్ని ఇచ్చిన దేవుడికి సమస్తములో కొంతైనా ఇవ్వకపోతే ఇంకా మనము ఏం పిల్లలము? అయన మన కోసము చేసినవి గుర్తుతెచ్చుకుంటే మనము అయన కొరకు చేసేది,ఇచ్చేది చాలా చిన్నద

Friday, May 9, 2014

సాక్షాము (TESTIMONY)


దేవుని పిల్లలు ఈ ప్రపంచములో దేవుడంటే ఎవరో తెలియని వారి కంటే ప్రత్యేకముగా ఉన్నారు. ఈ ప్రపంచములో 2 తెగలు ఉన్నారు. 
a) దేవుడంటే తెలియని వారు ( హేతువాదులు, నాస్తికులు). 
b) దేవుడు అంటే తెలిసినప్పటికీ నిజదేవుడు ఎవరో తెలియని వారు ఉన్నారు. సాతాను పైన చెప్పబడిన రెండు తెగలు వారిపై శ్రద్ధ వహించడు కానీ దేవుడంటే తెలిసి,నిజ దేవుడు ఎవరో తెలిసియున్న వారిపై వాడి గురి. యుద్దము చేయాలంటే శత్రువు యొక్క కన్ను ఎక్కడ ఉంటుందో,శత్రువు పన్నాగాలు తెలిస్తే వాడిని అరికట్టగలము. సాతాను మానవులైనా మనల్ని ఒక ఆయుధము గా చేసుకుని Christianityను నాశనం చేస్తున్నాడు. 

Christians గా చేయవలసిన రెండు పద్దతులు a) వాక్యము వినడము( receive) b) పంపడము or చాటించడము( production). వినినంత మాత్రన దేవుని పని జరగదు. ఎక్కువగా produce( పంపడము) చేయాలి.

PART-1: 

సాక్షాము అను పేరు మీద చెప్పబడుతున్న సాక్షాములు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.

TYPE-1 TESTIMONY: పుట్టుకతో christian అని సాక్షాము చెప్పేవారు. ఈ సాక్షాము తప్పు .అసలు baptism తీసుకుని క్రీస్తును ధరిస్తే వాడు christian అంతేకాని పుట్టుకతో christian అనబడరు. అసలు మనిషి ఒక christian గా ఎలా మారుతాడు అంటే a) పరిపక్వత రావాలి b) maturity రావాలి c) నిజ దేవుడు ఎవరో తెలియాలి d) పాపము అంటే ఏంటో తెలియాలి. e)ఏది మంచి, ఏది చెడ్డది అని తెలియాలి తర్వాత తన పాపాలు ఒప్పుకోవాలి. f) baptism తీసుకుని క్రీస్తును ధరించాలి .

TYPE-2 TESTIMONY: కొందరు నేను పాలనా year లో రక్షింపబడ్డాను అని సాక్షాము చెప్పేవారు. ఈ సాక్షాము కూడా తప్పు. అసలు రక్షింపబడ్డాను అంటే safe zone అని. రక్షింపబడుట అంటే ఒక ప్రమాదము నుండి రక్షింపబడాలి. ప్రమాదము అనగా పాతాళము. మనము చనిపోయిన తర్వాత ప్రమాదము వస్తుంది. ఇప్పుడు 1990 లో రక్షింపబడ్డాను అంటే 1990 లో చనిపోయినట్ల? బ్రతికి ఉండగా పాతాళమునకు చేరలేరు కదా. రక్షింపబడడం మనిషికి ఎప్పుడు జరుగుతుంది? first- Roma 10:9 లో యేసు ప్రభువు అని, పునరుర్ధానము నీ ఒప్పుకుంటే రక్షింపబడుతాము. second- Mark16:16 ఒప్పుకోనిన నివు baptism తీసుకోవాలి. అంటే విస్వసించాలి, baptism తీసుకోవాలి తర్వాత third-యేసు నామము పెరట తండ్రికి ప్రార్ధన చేయటం మొదలు పెట్టాలి (Roma10:13). last గా Mathew 24:13 లో అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును

1) Jesus ప్రభువు అని ఒప్పుకోవాలి. 2) baptism తీసుకోవాలి. 3) ప్రభునామములో తండ్రి కి ప్రార్ధన చేయాలి 4) అంతము వరకు(జీవితాంతము) సహించాలి. వీటి ద్వార మనము “”రక్షణలోకి వచ్చినవారము”” అవుతాము. రక్షింపబడ్డాను అనుట కాకా రక్షణలోకి వచ్చాను అనాలి. మనము పడవలోనికి వచ్చాము.

TYPE-3 TESTIMONY: స్వస్థత కలిగింది అని సాక్షాము చెప్పేవారు. నా జీవితము లో స్వస్థత కలిగినందుకు నేను యేసుక్రీస్తు నీ నమ్మాను అంటున్నారు.మేలు జరిగిందని ప్రభువుని నమ్మాను అంటున్నారు. ఈ సాక్షాము కూడా తప్పు. Bible లో యేసు క్రీస్తు కూడా స్వస్థతలు చేసాడు. స్వస్థతలు చేసిన ప్రతి చోట ఏది ఎవ్వరితోను చెప్పవద్దు అన్నాడు.నిజంగా స్వస్థతలు చేసిన యేసుక్రీస్తు ఎవరికీ చెప్పద్దు అంటే ఈ రోజు మన కళ్ళముందు జరుగుతున్నది నిజమైన స్వస్థతలు అంటారా? నిజమైన స్వస్థత అంటే leg పూర్తిగా తెగిపోయిన వాడికి leg ఇవ్వాలి. నాకు మేలు జరిగింది కనుక ప్రభువుని నమ్మాను అని చెప్పడము. 

TYPE-4 TESTIMONY: పైన చెప్పబడిన 3 and 4 సాక్షాముల మధ్యలో ఉంటుంది. ప్రభువును నమ్మాక అన్ని మేలులే అని సాక్షాము చెప్పేవారు.ప్రభువులోకి వచ్చాక double money వచ్చిందని.మొదట ప్రభువు లో రకముందు money లేని వారు కొద్ది నెలలకి లక్షదికారి అయిపోతున్నారు.మొదటి శతాబ్దము లో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినవారు ఆస్తులు అమ్ముకున్నారు. ఉన్నదంతా అమ్ముకున్నారు. ఈ సాక్షాము తప్పు

TYPE-5 TESTIMONY: మంత్ర శక్తీ నుంచి విముక్తి కలిగింది కనుక ప్రభువుని నమ్ముకున్నాను అని సాక్షాము చెప్పేవారు.. అపోకార్య 19:19 లో మంత్రిక అబ్యాసించినివారు వాళ్ళ documents, bags కల్చివేసారు. మంత్రాలు ఉన్నాయి అని అనుకుని కాల్చారా? లేక ఇవేమీ లేవు అని కాల్చారా?? ఈ సాక్షాము తప్పు.

TYPE-6 TESTIMONY: నాకు స్వరం వినబడింది అని సాక్షాము చెప్పేవారు. John 5:37 లో ఏ కలమంధైనాను అయన స్వరము వినలేదు. అయన స్వరూపము చూడలేదు. ఏ మానవుడు దేవునిని చూడలేదు. (1 John4:12). అలనే 1 Timothy 6:16, Hebre1:1. ఈ సాక్షాము తప్పు.

PART-2:

అసలు చెప్పవలసిన సాక్ష్యము ఏంటి? Roma10:17 లో వినుట వలన విశ్వాసము కలుగును. విన్న మాట క్రీస్తుది అయ్యి ఉంటె విశ్వాసము కలుగుతుంది. ఇప్పుడు క్రీస్తు సాక్షాము చెప్పాలి. అపోకార్య 1:8లో నాకు సాక్షులు గా ఉండాలి అని అంటున్నాడు. నా గురించి చెప్పాలి అంటున్నాడు... అసలు క్రీస్తు సాక్షము ఏమి చెప్పాలి??? మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, వచ్చిన అయన శ్రమ పడ్డాడని, శ్రమ పడిన అయన మరణించాడని,మరణించిన అయన సమాధి నుండి తిరిగి లేచాడని, అయన తిరిగి నీ కొరకు వస్తున్నాడని చెప్పాలి (Luke 24:46, అపోకార్య2:32, అపోకార్య 5:30,32)..... అబద్ద సాక్షము చెప్పక క్రీస్తు సాక్షము చెప్పాలి. క్రీస్తు సాక్షము-జీవ మరణ పునరుర్ధానము- తిరిగి వస్తాడని-అయన కొరకు బ్రతికితే తిరిగి తీసుకెళ్లతడని. చెప్పవలసిన సాక్షము క్రీస్తు సాక్షము అయ్యి ఉండాలి.

PART-3: 

నిజమైన సాక్షము ఎలా చెప్పాలి? Luke24:44 లో యేసుక్రీస్తు లేఖనములు ఎత్తిపట్టి తన గురించి సాక్షము చెప్పుకున్నాడు. లేఖనములు ఆధారము చేసుకుని చెప్పాలి. అపోకార్య 26:23,28:23, 17:2,3, 1దేస్సా 1:10, ఆమోసు5:10, ప్రకటన 1:9, 6:9, 19:10.

Conclusion:

Part 1: చెప్పబడుతున్న సాక్షాలు- పుట్టుకతో Christian అని, పాలనా year లో రక్షింపబడ్డాను అని, స్వస్థత కలిగిందని,మేలు జరిగింది గనుక అని, ప్రభువు లోకి వచ్చాక మేలు జరిగిందని, మంత్రశక్తీ నుండి విముక్తి కలిగిందని, స్వరము నాతో మాట్లాడిందని సాక్షాలు తప్పు.

Part 2: చెప్పవలసిన సాక్షము-క్రీస్తు సాక్షము- మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, వచ్చిన అయన శ్రమ పడ్డాడని, శ్రమ పడిన అయన మరణించాడని,మరణించిన అయన సమాధి నుండి తిరిగి లేచాడని, అయన తిరిగి నీ కొరకు వస్తున్నాడని చెప్పాలి

Part 3: ఎలా చెప్పాలి- లేఖనములు ఎత్తిపట్టి.

దేవునిని ఎందుకు నమ్మాలి? దేవునిని ఎందుకు నమ్మవలసి వస్తుంది?

1) నాస్తిక ఆస్తిక వాదుల సైతం తరతరాలుగా యావత్తు మనవ జాతిని వేదిస్తున్న అతి ప్రాముఖ్యమైన ప్రశ్నయే దేవుడు ఉన్నాడా?? ఉంటే ఆ దేవుడు ఎవరు? అని అది నుండి నేటి వరకు ప్రపంచములో ఎప్పుడు అనుమానాలతో ఉంటూనే ఉన్నారు. దేవుడు కనిపించకపోయినా నమ్మేవారు ఒకరైతే దేవుడు ఉన్నాడు అనుటకు సాక్షాలు కావాలని ప్రశ్నిస్తూ నమ్మనివారు మరొకరు. ఈ ఇరువర్గాల నమ్మకాలలో ఎవరిదీ నిజము?దేనిని నమ్మాలి? ఇలాంటి వారిలో ఒక తెగ దేవునిని నమ్ముతారు ఎలాగంటే ఏదైనా రోగము వస్తే ఆ రోగము పోవడానికి ఏ దేవుడైన ఫరవాలేదు,ముందు రోగము పోతే చాలు అని అనుకున్తున్న్నారు. అంటే వీరు అవసరానికి దేవునిని వాడుకొనుటకు నమ్ముతున్నారు.

2) ప్రతి ప్రారంభానికి ఒక మూలం(endpoint) ఉంటుంది.ఒక చక్కని building నిర్మించబడిoదంటే దానిని నిర్మించాలని ఎవరికో కలిగిన ఆలోచనకు రూపకల్పనే ఆ building.ఆ building నిర్మించిన తర్వాత కట్టిన పనివారు ఇంటిదగ్గర ఉండవలసిన అవసరం లేదు.కట్టిన వారు లేనంత మాత్రన ఆ ఇల్లు దానికదే వచ్చిందని అనుట వేర్రితనమే. సృష్టిని దేవుడు చేసాడు. సృష్టికర్తయైన దేవుడు కనిపించనంత మాత్రన అయన లేడు అనుట వేర్రితనమే అవుతుంది.ఈ రోజు మనిషిని సుఖపెట్టాలనే ఆలోచనలో scientists ప్రతి పదార్ధాన్ని పరిశోదిస్తున్నారు. ప్రకృతిని పరిశిలిస్తున్నారు గాని ప్రకృతిని కలిగించిన దేవునిని పరిశిలన చేసి తెలుసుకొనే పరిశోదన కేంద్రాలు ప్రపంచములో కరువయ్యాయి. 

3) దేవుడు మనిషికి కనిపించడు.అయన అద్రుశ్యుడు. కనిపించని దేవుడు ఇతనే అని ఆ రూపము ఎలా చూసావు?ఎలా గిసావు?దేవుడు మనిషిని చేసాడు కానీ మనిషి దేవునిని చేయలేదు.ఒక తండ్రి కుమారుని కనగలడు కానీ కుమారుడు తండ్రిని కనలేడు. కుమ్మరి కుండను చేస్తాడు కానీ కుండ కుమ్మరిని చేయదు. దేవుడు మనుష్యులను చేస్తే మనుష్యులు దేవుళ్ళను చేసే ఎత్తుకు ఎదిగిపోయారు.దేవుడు ఒక్కడే అని కచ్చితముగా తెలుసుకొని అతనే దేవుడు అనే నిర్ణయానికి వస్తే మన నమ్మకానికి ఒక అర్థము ఉంటుంది. వంశపారంపర్యంగా ముత్తాతలు,తల్లితండ్రులు నమ్ముకున్నారు గనుక వారు నమ్మిన దేవుడినే పిల్లలు నమ్ముకున్తున్నారు.తండ్రి సుర్యనమస్కారము చేస్తే కుమారుడు (msc) చదువుకున్న science స్టూడెంట్ కూడా సూర్య నమస్కారము చేస్తాడు. సూర్యుడు ఒక star అనే సంగతి తెలిసిన దేవునిగా పూజిస్తున్నారు.చంద్రుడు దేవుడు కాదని,అది ఒక నేల అని 1969వ yearలో neil armstrong వెళ్ళొచ్చి చెప్పాడు. వంశపారంపర్యంగా పుజించటము అలవాటైపోయింది గానీ,నిజ నిర్ధరనతో రుజువులతో ఇతనే దేవుడు అని ఏ మనిషికి పరిశోధించి తెలుసుకోవాలని ఆశగాని,ఆలోచనగాని లేదు.దేవుని తెలుసుకోవాలంటే పరిశీలన అవసరము. అంతే కానీ ఏ దేవుడైన ఒక్కటే అని adjust అవ్వకూడదు? కనీ ఏ దేవుడైన ఫరవాలేదని సర్దుకుపోయారంటే కష్టము. మనుష్యుల చేత విమర్శింపబడే వాడు దేవుడు కాదు. దేవునిని ఎందుకు నమ్మాలో అని తెలుసుకోకుండా ప్రపంచములోని వారంతా దేవునీ అవసరాల కోసమే నమ్ముతున్నారు.ఆపదలో అదుకోనేవడేనా దేవుడు?60 years వరకే దేవుడా?చనిపోయినతర్వత దేవుడు అవసరము లేదా?మనము పుట్టకముందే ఈ మహా విశ్వాన్నికిలిగించి అందులో మనము త్రాగడానికి నీరు,ఉపిరి పిల్చుకోవడానికి గాలి, రంగురంగుల ప్రకృతి,ఒక కాయ ఒక పండుతో adjust అవ్వలేవని నీ నాలుక రుచిని ఎరిగి దేవుడు నీకు ఏది ఇష్టమో అని నీ మనస్సును తెలుసుకుని రకరకాల రంగులతో,ఆకారాలతో,రుచులతో లెక్కలేనన్ని ఆహార పదార్ధాలు చేసినది ఎవరు?నీ కోసము ఇన్ని ఎందుకు చేయాలి? నీవు ఆయనకు ఏమి అవుతావు అని ఎప్పుడైనా ఆలోచించావా? మనము మార్కెట్లో ఏది కొన్న ఏది made in india న కాదా అని, వాటి తయారీ ఎక్కడ ,ఎవరు చేసారని తెలుసుకునే నువ్వు నిన్ను ఎవరు చేసారు?అనుభవిస్తున్న సూర్యచంద్ర నక్షత్రాలు ,భూమి,గాలి ,నీరు ఇవన్ని ఎవరు చేసారని తెలుసుకోవా?? తల్లి ఆహారము వండిన తరువాత ఆహార పదార్ధలన్నిటి మీద మూతలు పెట్టినట్లుగా –మనం తినే బత్తాయి పండు మీద చక్కని ముత( తొక్క),అరటిపండు మీద ముత,వేరుశనగ పలుకులకు కుడా చిన్న ముత దేవుడు పెట్టాడు.మన మీద ఎంత శ్రద్ద ఎందుకు కలిగింది? ఆ కనిపించని దేవుడు ఎవరు?మన కోసము ఈ ప్రకృతి ఎందుకు చేయవలసిన వచ్చింది?ఆ దేవునికి మనము ఏమి అవుతాము అన్న విషయాలను తెలుసుకోవాలని ఆశ లేదా?60 years వచ్చిన ఈ సృష్టిని సృష్టించిన దేవుడే ఆత్మలకు కన్నతండ్రి అని తెలుసుకొనక పోవుట విచారకరము. ఒక family ఒకే తండ్రి ఉంటాడు కానీ తండ్రులు ఉండరు.ఒక కుటుంబములో నలుగురు sons and 2 daughters ఉన్నంతమాత్రాన,తండ్రులు 6 నా లేక జన్మనిచ్చిన తండ్రి ఒక్కడేన?? అలాగే భూమి మీద ఉన్న మానవులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవునికి మనమంతా పిల్లలము గనుకనే దేవుడు సృష్టిలో ఉన్నవాన్ని మనకొరకు సృష్టించి ఉచితముగా ఇచ్చాడు.

4) సూర్యుడు,చంద్రుడు,నక్షత్రాలు దేవుడు కలిగించి సుమారు 1500 crores years అయింది. వెలుగులో, కాలాలలో తేడా లేదు. భూమి తన చుట్టూ తను తిరగటానికి రోజుకు 24hours,చంద్రుడు భూమి చిత్తూ తిరగడానికి 1 month. మనిషి చేత నడిపింపబడుతున్న bus, rail, aeroplane అన్ని ఆలస్యముగా తిరుతున్నాయి కానీ, మన కొరకు దేవుడు పుట్టించిన సూర్యచంద్ర నక్షత్రాలు second కూడా తేడా లేకుండా కచ్చితముగా తిరుగుతున్నాయి అంటే వీటిన్నంటిని మహా వేగముతో తిప్పుతున్నది దేవుడే.tv ని మనము remoteతో operate చేస్తునట్టు ఈ విశ్వాన్ని కూడా దేవుడే నడిపిస్తున్నాడు.గనుక ఎంత వేగముతో తిరిగిన danger జరుగుట లేదు.వాటిని నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు మన ఆత్మలకు తండ్రి.ఆ దేవున్ని తండ్రిగా నమ్మాలి గని అవసరాలకు దేవుడు అని నమ్మకూడదు.

5)భూమి మీద మీకు జన్మనిచిన శరీర సంభందించిన మీ తండ్రిని మీ తల్లి చెబితే నమ్ముతారు.మరి కనిపించని దేవుడు ఉన్నాడని చెబితే నమ్మలేవా? సృష్టికర్త అయిన దేవుడే మన ఆత్మలకు కన్నతండ్రి అని తెలియజేసిన వ్యక్తి శకపురుషుడైన క్రీస్తు యేసు.నేడు ప్రతి మనిషి ఫలానా year, month, date వెయ్యగాలుగుతున్నదంటే దేనిని బట్టో తెలుసా??క్రీస్తు అనే మహానుభావుడు పుట్టాడు గనుక. క్రీస్తు శకము(AD),క్రీస్తు పూర్వము(BC) అని కాలాన్ని విభజించారు.కాలాన్ని లెక్కించుటకు క్రీస్తు యేసును మాత్రమే ఎందుకు శకపురుషునిగా గుర్తుంచాలి?క్రీస్తుకు ముందున్న వారిలో ఎవరు కూడా శక పురుషుడిగా గుర్తున్చ్తకు సరిపోరా?? క్రీస్తుకు ఎవరు సరిరారు గనుకనేఅయన అందరికంటే గొప్పవాడని అయన చేసిన త్యాగానికి శక పురుషునిగా గుర్తించారు.

6)ప్రపంచము అంత గుర్తుంచిన వ్యక్తి అయిన క్రీస్తు యేసు పరలోకము ఉందని,ఆ లోకములో ఉన్న దేవుడు మనకు తండ్రి అని, అయన ఉనవదని చెప్పిన మాటలు నమ్మలేర??శక పురుషుడు అయిన క్రీస్తు మాట్లాడిన మాటలున్న The Bible ను నమ్మలేర?అందులో ఉన్న మాటలు వాస్తవము గనుకనే ముద్రన యంత్రము కనుగొన్న తరువాత ముద్రింపబడిన తొలి పుస్తకముగా చరిత్రక్కేక్కింది.

7)దేవుడు లేదని నమ్మి, చచ్చిపోయిన తరువాత తీరా ఆ లోకానికి వెళ్ళాక దేవుడు ఉన్నాడని తెలిస్తే ఆ స్థితి చాల భయంకరము.ఎందుకంటే ,ప్రతి మనిషికి దేహము విడిచిన తరువాత తెలుస్తుంది అస్సలు నిజము.ఒక విత్తనము మట్టిలో పది చచ్చి బ్రత్కి మరో బ్రతుకుందని తెలుపుతుంటే విత్తనము కంటే గొప్పవాడైన నీకు మరణించిన తరువాత మరో లోకంలో మరో బ్రతుకుందని తెలుపుటకు క్రీస్తు చనిపోయి మరణ బ్రతికేను.

ఉపవాసము అంటే ఏమిటి? సంపూర్ణ రాత్రి ఉపవాస కుడికలు వాక్యానుసరమా??


1) ఉపవాస ప్రార్ధన గురించి మరి ముఖ్యముగా ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఉపవాసం ప్రార్ధనను ప్రకటన చేసి మరి ఆచరిస్తున్నారు. ఉపవాసము అనునది రహస్యముగా ఉండాలన్నది వాక్యము చెబుతున్నది. ద్వితియోప 12:4 లో israels యొక్క భక్తీని వివరిస్తున్నాడు. వారు( అన్యజనులు) తమ దేవతలకు చేసినట్లుగా మీరు( israels) యెహోవ కు చేయాకూడదు. దేవుడు ఒక హెచ్చరిక జారి చేసినను ఏమి పట్టించుకోకుండా అన్యజనుల నుంచి ఆచారాలు నేర్చుకొని జరిగించారు. యెషయ 29:13 లో యెషయ యొక్క కాలము వచ్చేటప్పటికి israels యొక్క భక్తీ గురించి మురిసిపోతున్నడో, అసహ్యించుకొంటున్నదో చూద్దాము. నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు... హృదయములో దేవుని మాటలు ఉండాలి. israels జరిగించిన భక్తీ వారి స్వార్దప్రయోజనాలు కోసముగా మనకు కనిపిస్తున్నది. పాత నిబంధనలో esther గారు ఉపవాసము చేసినట్లుగా మనకు కనపడుతున్నది. హము- మోద్దుకై గల సందర్బము మనకు తెలుసు. అస్సలు esther ఉపవాసము ఎందుకు చేసింది?? esther 4:15 లోని సందర్బము అంతటిలో జరిగిన ఉపవాసము గురించి మనము అలోచించినట్లుయితే esther కానీ, యూదులు కానీ ఎందుకు ఉపవాసము చేసారు?? దేవుని కోసము చేసారా??లేక వారి ప్రాణభయము కోసమా?? యూదులు ఉపవసము చేసినది వాళ్ళ స్వప్రయోజనము తప్ప దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయలేదు. వారి స్వప్రయోజనము కోసము, వారి ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి చేసారు. అలానే 2 Samual లో దావీదు బిడ్డ రోగముతో భాదపడడం చూసి దేవుడు కనికరిస్తాడని ఉద్దేశముతో దావీదు ఉపవాసము చేసాడు. అలానే నిర్గమ 34:27 లో మోషే గారు దేవుని పనిలో ఉన్నపుడు ఉపవాసము చేసిన సందర్బము. Luke 4:2 లో Jesus ఉపవాసము చేసిన సందర్బము. భక్తీ పేరున మనము జరిగించే ప్రతి పని లేక కార్యము దేవునికి ఇష్టము అయ్యేదిగా ఉండాలి. 

2) దేవుడు ఈ కాలములో ఉపవాసము కోరుకొంటున్నాడా ??? కోరుకుంటే ఎలాంటి ఉపవాసము ఇష్టమో దేవుని మాటలను పరిశలించాలి. Mathew 6:16 లో యేసుక్రీస్తు ఉపవాసము గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజులలో చాలా మంది కనిపించేటట్లు చేస్తారు. ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనపడవలెనని కాక రహస్యమందు తండ్రికి కనపడాలి. ఉపవాసము అనునది రహస్యంగా జరగాలన్న సంగతి మనకు అర్థమవుతున్నది. ఎవ్వరికి తెలియకుండా జరగాలి. ఉపవాసము అనునది రహస్యముగా ఉండాలని యేసుక్రీస్తు అంటే సంపూర్ణ రాత్రి ఉపవాసము అని ప్రకటించడము వాక్యానికి విరోధము. దేవునికి రహస్యముగా ఉంటె ఉపవాసము ఇష్టము. Mathew 6:16 ప్రకారముగా ఉపవాసము గూర్చి ప్రకటన చేయకూడదు. వాక్యము యొక్క భావము, దేవుని యొక్క ఆలోచన తెలియలి మనకు అంతే కానీ Bible లో వారు చేసారు కదా మేము కూడా చేస్తాము అంటే సరిపోదు. అక్కడ వాక్యము యొక్క సందర్బము చూడాలి. అందుకే Mathew 9:13 లో వాక్యభావము ఏమిటో వెళ్లి నేర్చుకోనుడని చెప్పెను. వాక్యము నేర్చుకోవడము కంటే దాని యొక్క భావము నేర్చుకోమని చెబుతున్నాడు. రహస్యముగా ఉండమన్న వాక్యభావము తెలుసుకొనక all night prayer అని ప్రకటన చేస్తున్నారు.

3) ఉపవాసము రహస్యము గా ఉండాలి. దేవునికి ఇష్టము గా ఉండాలి. ఉపవసములో మనుష్యుల స్వార్ధము ఉండకూడదు.స్వప్రయోజనము ఉండకూడదు. జేకర్య 7:5 లో ఉపవాసము గూర్చి చెప్పబడింది. ఒక సమస్య తీర్చుకోవడానికి జరిగించే ఉపవాసము స్వార్దాపురితమైనది.

ఎలాంటి ఉపవాసము దేవునికి ఇష్టము?

4) యెషయ 58:3 నుంచి ఉపవాసము గురించి చాలా చక్కటి వివరణ ఉన్నది. వారు దేవునిని ప్రశ్నిస్తున్నారు ఎందుకు మా ఉపవసమును అంగీకరించలేదు అని. యెషయ 58:6 లో దుర్మాగులు కట్టిన కట్లను విప్పుటయు,కడియను అను మేకులు తియుటను, భాదింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగోట్టుటయు నే నేర్పరచుకోనిన ఉపవాసము కదా..... ఈ వచనములో ఉపవాసము యొక్క వివరణ ఉన్నది. ఇందులో దుర్మాగులు కట్టిన కట్లను విప్పుటయు,కడియను అను మేకులు తియుటను అను మాటలు ముఖ్యము... ‘పాపము’ అను కట్టు సాతాను చేసాడు. పాపము అను కట్ల నుండి విదిపించబడాలి. దేవుని కొరకు ఉపవాసము అంటే ఏంటో బాగా తెలుసుకున్న యేసుక్రీస్తు అదే జరిగించాడు. కట్టిన కట్లను విప్పుటయు అంటే Luke 13:16 లో ఉన్నది. దేవునికి ఇష్టమైన కార్యము సాతాను బందించిన కట్ల నుండి విడుదల. కడియను అను మేకులు తియుట అంటే కీర్తనలు 38:4 లో ఉన్నది.పాపము నుంచి విడుదల.

5) ఒక మనిషిని పాపము నుండి విదిపించాలంటే Bible ప్రకారముగా ఒక పద్ధతి ఉన్నది. ఒక అవిశ్వాసిని విశ్వాసి గా మార్చాలంటే వినుట వలన జరుగుతుంది. వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలగాలి. వాక్యము ప్రకటించడము ద్వార ఒక వ్యక్తి పాపము నుండి విడుదల పొందుకొంటాడు. వాక్యము ప్రకటించడంలో ప్రయసపడినప్పుడు ఆ ప్రయాస దేవుడు ఉపవాసము గా అనుకుంటాడు. వాక్య ప్రకటన ద్వార పాపి విడుదల పొందుతాడు. వినిపించుట(దేవుని మాట) వలన పాపము నుండి విడుదల కలుగుతుంది. సువార్త ప్రకటించిన్నపుడు అనుకోకుండా జరిగేదే ఉపవాసము. సువార్తకు వెళ్ళినప్పుడు ఎదుర్కున్న ఉపవసమే ఉపవాసము.

6) 2 కోరంది 11:23 నుంచి, 6:4 నుంచి 10 లో Paul ఎదురకున్న ఉపవాసము మనకు అక్కడ కనపడుతున్నది. ఇది నిజమైన ఉపవాసము. అంటే ఉపవాసము రహస్యముగా జరగాలి. రహస్యముగా సువార్త ప్రకటనలో జరుగుతుంది. ఉపవాసము సువార్త భాగములో రావాలి కానీ మనము ఇష్టము వచ్చినట్లుగా మన స్వార్ద, స్వప్రయోజనాల కోసము చేసే ఉపవాసము ఉపవాసం కాదు.

7) ప్రకటించే ఉపవాసము, స్వార్ధప్రయోజనాలు కోసము చేసే ఉపవాసము దేవునికి ఇష్టమైనది కాదు. అయన పిల్లలైనా అనేక మందిని పాపపు కట్ల నుండి విడిపించాలి. విడిపించాలంటే సువార్త ప్రకటించాలి.. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చేసే ప్రతి త్యాగము ఉపవాసము. ఇది దేవునికి ఇష్టము. దిని వలన దేవుని నుంచి ప్రతి ఫలము వస్తుంది.

పరిశుద్దాత్మ అల్లరికి కారకుడా?


1) మత్తయి 12:32 లో కాబట్టి ( యేసు) మీతో చెప్పునదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపము, దుషణయు క్షమింపబడును గాని “ఆత్మ విషయమైన దుషణకు పాప క్షమాపణ లేదు”. మనుష్య కుమారునికి విరోధముగా మాటలడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్దాత్మ విరోధముగా మాటలడువానికి ఈ యుగామందైనాను, రాబోవు యుగామందైనాను పాప క్షమాపణ లేదు.

2) పాపాలలో రెండు రకాలు a) క్షమింపబడే పాపాలు.. b) క్షమింపబడని పాపాలు.. example: రోగాలు రెండు రకాలు a) మందులకు లొంగే రోగాలు..b) మందులే లేని రోగాలు. యేసు రక్తము వలన క్షమించే లేక క్షమించబడే పాపాలు కొన్ని. యేసు రక్తము వలన క్షమించబడని పాపాలు కొన్ని.

3) రక్షించే యేసు క్రీస్తు పాపక్షమాపణ లేదు అంటే ఉంది అని ఎలా అంటాము? మన పాపక్షమాపణ కోసము రక్తము కార్చిన యేసుక్రీస్తే ఈ పాపానికి పాపక్షమాపణ లేదు అంటే ఉంది అని ఎలా అంటాము? కాబట్టి మనుష్యులు చేయు ప్రతి పాపము క్షమింపబడుతుంది అని అనుకుంటే పొరపాటు.

4) 1 John 5:16 లో తన సహోదరుడు మరణకరము కానీ పాపము చేయగా ఎవడైనాను చుసిన యెడల అతను వేడుకోనును;అతన్ని బట్టి దేవుడు మరణకరము కానీ పాపము చేసిన వారికీ జీవము దయచేయును. ఈ వచనములో మరణకరము అయిన పాపము కలదు అని తెలుసుకుంటున్నాము. మరణకరము అయిన పాపము అంటే పరిశుద్దాత్మ కు వ్యతిరేకముగా మాట్లాడటము.

5) విధులలో జరిగే సభల నుంచి టీవీ లో మనము చూసే meetings వరకు, దేవాలయములో( church) జరిగే ఆరాధన నుంచి grounds లో జరిగే మహా సభలు వరకు పరిశుద్దాత్మ పేరుతో అల్లరి జరుగుతుంది. పరిశుద్దాత్మ దిగిరా అని అల్లరి చేయటము,పరిశుద్దత్ముడు ground చుట్టు తిరుగుతున్నాడని అల్లరి చేయడము, కూర్చున్న వారు ఒక్కసారిగా కేకలు వేస్తూ పరిశుద్దత్ముడా దిగిరా అని పాటలు పాడడము మనము చూస్తున్నాము. ఈ కార్యక్రమాలు పరిశుద్దత్ముడికి అనుకూలముగా లేక వ్యతిరేకముగా జరుగుతున్నాయా అని ఆలోచించాలి.

6) ఏది పడితే అది మనము తినము. ఆరోగ్యానికి అవసరమైనదే తింటాము.. ఈ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగము. తాగే ముందు ఎమన్నా పడిందేమో చూసుకుని తాగుతాము. ఈ బట్టలు పడితే ఆ బట్టలు కొనము. మనకు సూటు అయ్యేవే కొంటాము.. కానీ Bible దగ్గరకు రాగానే ఎవరు ఏమి చెప్పిన గుడ్డిగా నమ్మే అలవాటు ఉంది మనలో. వాక్య పరిశిలన లేదు ( యెషయ 34:16). Christian జీవితములో Bible లో ఏమి ఉందో? ఏమి లేదో? ఏమి వ్రాయబడిందో? తెలిసి చేస్తున్నామా ? తెలియక చేస్తున్నామా అను ఈ జాగ్రత్తలతో ఉండాలి. పరిశుద్దాత్మ పేరుతో పిచ్చిపట్టిన వారిగా,అల్లరి చేసే వారిగామారిపోయారు నేటి Christianity లో. యేసు నాకు వ్యతిరేకముగా మాట్లాడితే క్షేమిస్తాను కానీ పరిశుద్దాత్మ విరోధముగా మాటలడువానికి ఈ యుగామందైనాను, రాబోవు యుగామందైనాను పాప క్షమాపణ లేదు అన్నపుడు పరిశుద్దాత్మ గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలి?

7) పరిశుద్దత్మకు వ్యతిరేకముగా పాపము(అబద్దము) చేసిన వారి ఫలితము ఈ విధముగా ఉంటుందో అని Bible లో చూస్తే అపోకార్య 5:1 నుంచి –అననియ,సప్పిర సంగతి చూస్తున్నాము.

8) పరిశుద్దాత్ముని గురించి ఈ రోజు ప్రపంచములో అల్లరి, గేంతటం, dances వేయటం, బట్టలు ఎటు పోతున్నాయో తెలియకుండా గేంతులు వేస్తు పరిశుద్దాత్మడు మా మీదకు వచ్చాడు అంటున్నారు. అస్సలు పరిశుద్దాత్ముడు వస్తే అల్లరి చేస్తారని ఎవరు చెప్పారు? Bible లో ఎక్కడ ఉంది? గెంతేవాడు,కేకలు వేసే వాడు ప్రసంగికుడా?? యేసుక్రీస్తు ఎక్కడైనా గెంతులు వేసినట్లుగా Bible లో ఉన్నదా?? పరిశుద్దత్ముడు వచ్చినప్పుడు కూర్చున్నవారు కేకలు వేసినట్లుగా Bibleలో ఎక్కడ ఉంది???

9) పరిశుద్దత్ముడు వస్తే అల్లరి జరుగుతుందని Bible లో ఎక్కడ ఉంది? చేయించడని Bible లోని మటల ద్వార చూద్దాము. 1 కొరంది14:33 లో దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. దేవుని సన్నిధిలో అల్లరి చేయకూడదని ఈ reference ద్వార మనకు అర్థమగుచున్నది. ప్రసంగి 5:2 ను చదవండి.

10) యేసు క్రీస్తు ఎక్కడైనా కేకలు వేసాడ అని Bible లో చూద్దాము.. మత్తయి 12:19,20 లో ఈయన కేకలు వేయడు( అల్లరి చేయడు). అపోకార్య 2:1 లో పెంతుకోస్తపు పండుగ దినమున గూర్చి చెప్పబడింది. ఇక్కడ మాట్లాడుతున్నార లేక కేక వేస్తున్నరా??. Christianity లో ఇలా జరుగుతుందంటే ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరు ఆలోచించటం లేదు. యేసు కేకలు వేయనప్పుడు భోదకుడు ఎందుకు కేకలు వేయాలి? దేవుడు అల్లరికి కర్త కాడు కదా మరి అల్లరి ఎందుకు జరుగుతుంది?

11) సౌలు మీదకు పరిశుద్దాత్ముడు వచ్చిన్నపుడు కేకలు వేసాడా?ప్రవచించాడు.దావీదు మీదకు పరిశుద్దాత్ముడు వచ్చిన్నపుడు కేకలు వేసాడా? గోల్యతును చంపాడు.సంసోను మీదకు పరిశుద్దాత్ముడు వచ్చిన్నపుడు కేకలు వేసాడా? ఫిలిస్తుయులను చంపాడు.మరియమ్మ మీదకు పరిశుద్దాత్ముడు వచ్చిన్నపుడు కేకలు వేసిందా? విరు ఎవ్వరు చేయనప్పుడు మరి ఈ రోజు సమాజములో అల్లరి ఎందుకు జరుగుతుంది?

12) అల్లరికి కారకుడు పరిశుద్దత్ముడు,యేసు,తండ్రి కాదు. Bible లో వాడు ఎవడో చూస్తే యాకోబు 3:15,16,17 లో దయ్యము(సాతాను).. ఎక్కడ నుంచి start అయిందో ప్రకటన 12:7 లో చూడొచ్చు. అల్లరికి కారకుడు సాతాను గాడు. విడి లక్షణాలు Bible లో చూస్తే Luke 4:41 లో కేకలు వేసి వదిలి పోయెను(దెయ్యము), Luke 4:34 లో కేకలు వేసెను(devil),మార్క్ 5:5 లో కేకలు వేయుచు....( దెయ్యము), అపోకార్య 8:6 లో పెద్ద కేకలతో వదిలిపోయేను( దెయ్యము).... పరిశుద్దత్ముడు వస్తే ఇలా కేకలు వేసారు అన్న ఒక్క reference చూపించండి నాకు? ఈ రోజు పరిశుద్దత్ముడు వచ్చాడని అల్లరి చేస్తే కేకలు వేస్తే వీడికి దయ్యము పట్టిందని అనుకోవాలి.

13) ఒకసారి Israels మధ్య అల్లరి జరిగితే దేవుడు ఏమి చేసాడో 1 కొరంది 10:3,4,5 లో చూడొచ్చు. ఇక్కడ తిన్న,త్రాగిన తర్వాత అల్లరి చేస్తున్నారని విషయము అర్థమగుచున్నది. ఇది మరనకరమైన పాపాము. దీనికి పాప క్షమాపణ లేదు.

పరిశుద్దత్ముని అస్సలు పని ఏంటో చూద్దాము

14) John 14:25,26- సమస్తమును మీకు భోదించి, John 16:8 –ఒప్పుకోన జేయును, John 16:13- సత్యములోకి నడిపించును, roma 8:26- విగ్యాపన చేయుచున్నాడు.

15) 1)నిన్ను దేవుని కోసము బ్రతికింపజేస్తాడు. 2)దేవుని వాక్యమును remind చేస్తాడు. 3)దేవుని వాక్యపు లోతులకు మిమల్ని తీసుకెళ్తాడు. 4) నివు దేవుని కుమారుడవు అని అనుట లో గుర్తుగా ఉంటాడు. 5) మన పక్షాన prayer చేస్తాడు. పరిశుద్దత్ముడు దేవుని కోసము బ్రతకడానికి కారకుడు గాని అల్లరికి కారకుడు కాదు. ఈ అల్లరికి కారకుడు సాతాను. 

యేసుక్రీస్తు ఎవరు?

అటు Christians లోను, ఇటు Non-Christians విషయములోను యేసు గురించి ఒక ఏకాభిప్రాయాము లేదు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఎవరు యేసుక్రీస్తు ?అయన ఉనికి ఏంటి? అన్న విషయము పై దేవుని మనస్సు అయిన గ్రంధములో పరిశోధన చేద్దాము ఇప్పుడు. ముందుగా అయన ఉనికిని ఆలోచిస్తే అనగా అయన ఎప్పటి నుండి ఉన్నవాడో తెలుసుకోవాలి. ఈ ప్రపంచానికి కేవలము కన్యక గర్బమున ద్వార వచ్చెనని తెలుసు. ఈ లోకానికి వచ్చాడు కనుక కాబట్టి ఉన్నవాడు అని అంటున్నారు ,కానీ ఈ లోకానికి రాకముందే ఉన్నవాడే అన్న సంగతి ప్రపంచమునకి తెలియదు.

1) John 8:57,58 లో అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నాను అంటున్నాడు .. ఇంతకు ఎక్కడ ఉన్నాడు? అంటే భూమి మీదకు రాకముందు పరలోకములో ఉన్నాడు( సామెతలు 8:26). సామెతలు 8:30 లో నేను అయన ( తండ్రి) దగ్గర ఉన్నాను.నిత్యము అయన సన్నిధీలో ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు చరిత్ర ఈ లోకానికి వచ్చాక start అయింది అంటే పొరపాటు. యేసుక్రీస్తు ఉన్నవాడు. అబ్రహాము, ఈ సృష్టి పుట్టాకముందే ఉన్నవాడు. పరలోకములో ఉన్నవాడు. పరలోకములో దేవుని యెద్ద ఉన్నవాడు. john 1:1 లో ఆయనలో ఉన్నాడా? అయన వద్ద ఉన్నాడా? యేసు తండ్రి వద్ద ఉన్నాడు.

example:: నాకు పెళ్లి అయ్యి కుమారుడు పుట్టనంత వరకు నాలో ఉంటాడు. పుట్టిన తర్వాత నా యెద్ద ఉంటాడు. యేసు పరలోకములో పుట్టాడు.పుట్టిన అయన తండ్రి యెద్ద ఉన్నాడు.అయన యెద్ద ఉన్న యేసు శారిరధారిగా మరియ గర్భమున ఈ లోకానికి వచ్చాడు. ఇంతవరకు ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడన్న వివరణ మనకు ఇంతవరకు తెలుసుకున్నాము. 

2) ఇంతకు అయన ఎవరు?

ఈ రోజు యేసుక్రీస్తు ఎవరు అన్న విషయము పై భిన్నమైన వాదనలు ఉన్నాయి. non-christians నీ అడిగితే ఈయన మహానాయకుడు అని, పుట్టిన మహాను భావులలో ఈయన ఒకడని, ఒక మత నాయకుడని, మేధావుడని,  తత్వవేత్తుడని, మత వ్యవస్థాపకుడు అని జవాబు ఇస్తున్నారు. christians నీ అడిగితే ఈయనే తండ్రి అని, పరిశుద్దాత్మ అని జవాబు ఇస్తున్నారు.

3) యేసు కాలములో ఉన్నవారికి యేసుక్రీస్తు అర్థముకాలేదు. ఎవరు అన్న విషయము పై భిన్నముగా మాట్లాడుకున్నారు.

a) మత్తయి 13:55,56 లో శాస్త్రులు ,పరిసయ్యులు -ఈయన వడ్ల వాని కుమారుడు అని అంటున్నారు.
b) Luke 7:33లో తిండిబోతు అని అంటున్నారు.
c) Mark3:20 లో యేసు ఇంటి వారు –మతి చేలించింది అంటున్నారు( mental fellow)
d) Mark3:22 లో యేరుషలేము నుంచి వచ్చిన శాస్త్రులు-దయ్యలా అధిపతి అని అంటున్నారు.
e) Mark 4:35లో యేసు శిష్యులు – ఈయన ఎవరో... అంటున్నారు

4) మత్తయి 16:13లో శిష్యులను మీరు నా గురించి ఏమి అనుకుంటున్నారు అంటే అందుకు పేతురు “దేవుని కుమారుడవైన క్రీస్తు” అని జవాబు ఇచ్చాడు. అందుకు యేసు నీవు ధన్యుడవు అంటున్నాడు. అలానే మత్తయి 3:16 లో పరలోకపు తండ్రి చెప్పుచున్నాడు యేసు క్రీస్తు ఎవరో అని – “ప్రియ కుమారుడని”. అంటే యేసు తండ్రికి కుమారుడు.. Mark 5:6,7 లో దెయ్యము చెప్పుతున్నాడు యేసు ఎవరో అని- ఈయన “సర్వోన్నతుడైన దేవుని కుమారుడని”.

5) దేవుడు కుమారుడే కాక దేవుడై ఉన్నాడు.కుమారుడైన యేసు క్రీస్తు దేవుడు. John 10:33,34లో నీవూ మనుష్యుడవు అయ్యి ఉండి దేవుడని చెప్పుకోనుచున్నావు... యేసు దేవుని కుమారుడు and అదే సమయములో దేవుడు కూడా.కానీ యేసే దేవుడు అని చెప్పటము తప్పు. ధీని అర్థము ఇంకా ఎవ్వరు లేరు అని. మరి ఈయన కన్న అయన ఉన్నాడుగా?? తండ్రి ఉన్నాడు . కుమారుడుగా యేసు కూడా ఉన్నాడు.

6) యేసు గురించి దేవుని కుమారుడిగా,దేవుడిగా చెప్పటము correct and ప్రవక్త అని చెప్పటము కూడా correct. ప్రవక్త అనగా తండ్రికి, ప్రజలకు మధ్యవర్తి అని. దేవుని మాటలు ప్రజలకు చెప్పేవాడు ప్రవక్త. యేసుక్రీస్తు ఈ పనే చేసాడు. నా తండ్రి దగ్గర విన్న సంగతులు తప్ప నేను ఏమి చెప్పడము లేదు అన్నాడు. యేసు క్రీస్తు చెప్పిన ప్రతి మాట,సంగతులు తండ్రి చెప్పమన్నాడు. తండ్రి చెప్పమన్నది చెప్పాడు గనుక ఈయన ప్రవక్త కూడా.

7) ప్రవక్తగా, కుమారుడిగా, దేవుడిగా యేసుక్రీస్తు మనకు కనపడుచున్నాడు. అది ఏంటి ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా ఉన్నారు అంటే example::: నీ గురించి- ఇంటికి రాగానే భార్య husband అని, పిల్లలు daddy అని, parents కుమారుడని,ఆఫీసులో sir అని పిలుస్తున్నారు. ఒక్కడే వ్యక్తి రకరకాలుగా సమయాన్ని ,సందర్బాన్ని బట్టి, దేవుడు గా, కుమారుడిగా,సందర్బాన్ని బట్టి ప్రవక్త గా చెప్పటములో తప్పులేదు.

దేవుని దర్శనాలు నిజామా? దర్శన దేవడు నిజామా?

క్రైస్త్యవ్య సమాజములో ఈ మధ్యకాలములో దర్శనాలలో దేవుడు కనిపించాడని, మాట్లాడాడని, జరగబోయే విషయాలను తెలియజేస్తున్నాడని అనుకుంటున్నారు. దేవుడు అందరికి కనిపిస్తున్నాడు అంటే ఆలోచించాల్సిన పని లేదు కానీ, కొందరికి మాత్రమే కనిపిస్తున్నాడు అని అంటే ప్రశ్నలు మనకు వస్తాయి అది నిజామా ,కాదా అనీ. ఒక మనిషి ఏది మాట్లాడిన అది నిజాము కాకపోవచ్చు కనీ అవసరాల బట్టి ఎన్నో రకాలుగా మాట మార్చే కాలము లో మనము ఉంటున్నాము. ఎప్పుడు కూడా Bible ను చదివేటప్పుడు సమయము,సందర్భము,సన్నివేశాలు, ఎవరు ఎవర్తో మాట్లాడుతున్నారో గమనించాలి. మనకు ఏది అర్థము కాకపోయినా Bible నుంచు చూస్తే మనకు అర్థము అవుతుంది. 

Bibleలోని దేవుని మాటలను బట్టి దేవుడు కనిపిస్తాడా లేక కనిపించడు అని ఉందా, దర్శనాల గురించి దేవుడు Bible లో ఏమి వ్రాయించాడు అని లేఖనాలు పరిశిలిస్తే మనకు అర్థమవుతుంది. రోమియులు 1:20 లో అయన అదృశ్యలక్షణాలు అని ఉంది. అదృశ్యము అనగా కంటికి కనిపించనిది.ఎక్కడ కూడా Bible లో తండ్రిని గురించి అదృశ్యుడు అని వ్రాయబడింది. అలానే కొలస్సియు 1:15 లో అయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికి అడిసంభుతుడై యున్నాడు..ఇక్కడ అదృశ్య దేవుడు అని మనకు అర్థము అవుతుంది. దేవుడు కనిపించడు అను మాటలు Bible లో మనము చూస్తున్నాము. కనిపించనిది ఎమన్నా ఉంటె అది ఎవ్వరికి కనిపించదు అలాగే కనిపించేది ఏది అన్నఉంటె అందరికి కనిపిస్తుంది. 
example: గాలి కనిపించనిది, ఎవ్వరికి కనిపించదు. 

ఇప్పుడు చెప్పండి దేవుడు కనిపించేవాడా? కనిపించని వాడా? కనిపించడు. కనిపించని దేవుడునీ మనము చూడలేము. కనిపించనది కలలో కూడా రాదు

ఎక్కువ మంది నమ్మేది నిజాము అనుకుంటాము మానవులైనా మనము. పరలోకమునకు ప్రవేశింపాలని అనుకొను వారు అనేకులు. కనీ ప్రవేశి౦చువారు కొద్ది మందే. కొద్ది మంది నమ్మేదే నిజాము.సత్యము తక్కువ మంది నమ్ముతారు.

భోదకుడు యొక్క భోద మనుష్యులను సంతోశపెట్టువాడుగా కాక దేవుని సంతోషపెట్టువాడై ఉండాలి. దేవుని సంతోశపెట్టాలంటే ఈ Books ( bible) ను చక్కగాతెలుసుకుని విశ్లేషించి చెప్పాలి.

పాతనిబందనలో ఎప్పుడు దర్శనాలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయో చూద్దాము. సమాజములో క్రైస్త్యవ్యలు దర్శనాలు అనునవి ఎక్కువుగా రాత్రి సమయములో వచ్చాయి అంటున్నారు. 

(a) ఆదికాండము15:12 లోని సందర్భము అబ్రహాము దర్శనము. ప్రోద్దుగుంక సమయములో వచ్చింది(evening). దర్శనములో Israels యొక్క చరిత్ర గురించి చెప్పుతున్నాడు. నీ సంతతి వాళ్ళు 400 years వరకు బానిసత్వములో ఉంటారు, ఆ తర్వాత విడిపిస్తాను అంటున్నాడు. అంటే దర్శన సందర్భము-israels కు సంభందించిన భవిష్యత్తును అబ్రహముకు తెలియజేస్తున్నాడు.అబ్రహాము దేవుని మాట విని జీవిస్తున్నాడు గనుక దేవుడు మాట్లాడుతున్నాడు. 

(b) న్యాయాది 6:11,12లోని సందర్భము గిద్యోను దర్శనము. పొలములో గోధుముల పని (morning) వచ్చింది. దర్శన సందర్భము-నీవూ యుద్దము వెళ్ళాలి.300 మనుషులను arrange చేసుకుని యుద్దముకు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. అంటే దర్శన సందర్భము – యుద్ద సందర్భము. ఇది కూడా israels కు సంభందించిన భవిష్యత్తును తెలియజేస్తున్నాడు.

(c)మనోహ-మొనోహకోయకి దర్శనము వచ్చింది పొలములో పని చేస్తున్నపుడు. దూత ప్రతేక్ష్యపడింది. దర్శన సందర్భము-నీ గర్భమున మహా బలాడ్యుడు పుట్టబోతున్నాడు. israelsను ఫిలిస్తియుల బానిసము నుండి విడిపించడానికి మహా బలాడ్యుడు పుట్టబోతున్నాడు. పైన చెప్పబడిన దర్శనాలు israels యొక్క భవిష్యత్తు,పరిస్థితులు గురించి చెప్పుతున్నాడు.

క్రొత్తనిబందనలో ఎప్పుడు దర్శనాలు వచ్చాయి,ఎందుకు వచ్చాయి,ఎలా వచ్చాయో చూద్దాము. కల and దర్శనము వేరు. కల పడుకున్నపుడు వస్తుంది, దర్శనము మేలుకవగా ఉన్నప్పుడు వస్తుంది. 

(a) అపోకార్య 9:3,4 లో afternoon time( అపోకార్య 22:6) న దర్శనము వచ్చినట్లుగా చూస్తున్నాము. దర్శన సందర్భము-నీవు సేవ సెహ్స్తున్నావు అని అనుకుంటున్నావు కానీ నివు నన్ను హింసిస్తున్నావు అని చెప్పుతున్నాడు.అంతవరకు Paul శాస్త్రులు,పరిసయ్యల మాట విని Christians నీ హింసించడమే దేవుని సేవ అని చేస్తున్నాడు.

(b) అపోకార్య10:3లో పగలు మూడు గంటలకు వచ్చింది-కోర్నేలుకు వచ్చింది Peter ను పిలిపించుకో అని, 10:9 లో Peter కు కూడా వచ్చింది time పగలు 12. దర్శన సందర్భము -కోర్నెలు మనుష్యులను పంపిస్తున్నాడు.

(c) Luke 1:20,21 లో జేకర్య కు దర్శనము.పగలు (దేవాలయము లో ధూపము). దర్శన సందర్భము- నీకు సంతానము కలుగుతుందని (యోహాను).

నేటి క్రైస్త్యవ్య సమాజములో దర్శనాలలో దేవుడు కనిపించాడని, మాట్లాడాడని, జరగబోయే విషయాలను తెలియజేస్తున్నాడని గొప్పగా చెప్పుతున్నారు. ఎందుకు గొప్ప కావడానికి. దేవుడు వీరికే ఎందుకు కనపడుతున్నాడు?? దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ప్రస్తుతము కనిపించే అవసరత ఏమి ఉంది ??? మనకు చెప్పవలసినదంతా bible లో వ్రాయించి పెట్టారు. మీకు చేరవలసిన information లెటర్( bible) ద్వార వస్తే మల్లి మనిషి(దేవుడు) అవసరమా?

చదివిన ఈ దర్శన సందర్భాలలో దేవుడు కనపడినట్లుగా చదివారా? లేఖ దూత కనపడినట్లుగా చదివారా?? దూత. ఎక్కడ కూడా దూత కాక దేవుడు కనిపించినట్లుగా proofs లేదు. దర్శనాలలో కేవలము దూతలు .example: యేసేపు- about jesus-దూత, మోషే పొదలో- దూత, అబ్రహమునకు- దూత. సూర్యుడునే మనము చూడలేము ఇంకా కోట్ల కోట్ల కంతివంతుడైన దేవుడిని ఎలా చూస్తాము మనకు ఉన్న ఈ చిన్న కన్నులతో??

దేవుడు ఎలాగో కనిపించడు, పోనీ దూత కనపడుతుంద అని చూస్తే గలతీ 1:8 లో పరలోకము నుండి ఒకవేళ దూత దేవుని permission లేకుండా ఇప్పుడు భూమి మీదకు వచ్చిన అది సాపగ్రస్తుడు అవుతుంది.

రాత్రి ఏంటో వెలుగు వస్తుంది అని అనుకుంటే 2 కొరంది11:14 లో సాతాను తనే వెలుగు దూత వేషము ధరించుకోనుచున్నాడు. దర్శనము అంటే కళ్ళ ముందు ఉన్న bible చదవాలి. ఆలోచించాలి. దేవుడు చెప్పాలనుకున్నది bible లో చెప్పాడు. తండ్రి ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చిన వారి కొరకే heaven అన్నాడు. ఈ భూమి మీద దర్శనాల కోసము ఎదురు చూడక దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి కష్టపడితే నువ్వే పరలోకము వెళ్తావు...

Thursday, May 8, 2014

బాప్తీస్మం అనగా ఏమి? ఎందుకు తీసుకోవాలి? తీసుకోవడము వలన ఏమి జరురుగుతుంది? ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? చిన్న పిల్లలకు బాప్తీస్మం ఇవ్వవచ్చా?


మనము దేవుని పనికి ఉపయోగపడాలంటే ముందు :

a) వాక్యము నేర్చుకోవాలి.అప్పుడు subject అంతా mindలోకి పోతుంది. దీనిని “receive” అంటారు. 

b) నేర్చుకున్న వాక్యమును పంపాలి. దీనిని “production” అంటారు. 

అంటే వాక్యమును నేర్చుకున్నవాడు వాక్యము చెప్పాలి and వాక్యము చెప్పేవాడు ముందు వాక్యము నేర్చుకోవాలి. 3 ½ years వరకు యేసు శిష్యులకు training ఇచ్చాడు. శిష్యులు వాక్యము చెప్పేముందు యేసు దగ్గర వాక్యమును నేర్చుకున్నారు. యేసు కూడా తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడు. john 8:26లో “ నేను అయన( తండ్రి) యెద్ద వినిన సంగతులే లోకమునకు భోదించుచున్నాను అని చెప్పెను.john 8:28 లో తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు నేను మాట్లాడుచున్నాను. అంటే యేసు ఈ లోకానికి రాక ముందు తండ్రి దగ్గర వాక్యము విని ,నేర్చుకుని చెప్పాడు. ఈ రోజు భోదకులు చాలా మంది పరిశుద్దత్ముడే మా చేత మాట్లాడిస్తున్నాడు అని అంటున్నారు. మత్తయి10:18to20, john 16:13 లో పరిశుద్దత్ముడు కూడా వేటిని వినెనో అవే చెప్పుతున్నాడు. 

బాప్తీస్మం అనగా ఏమి?

బాప్తీస్మం అను పదము greek భాష నుండి baptiso అను పదము ద్వార derive చేయబడింది.baptiso అనగా సమాధి చేయుట,పాతి పెట్టుట,ముంచుట. బాప్తీస్మం గురించి roma 6:3 లో యేసు లోనికి బాప్తీస్మం పొందిన మనమందరము “అయన మరణములోనికి” బాప్తీస్మం పొందితిరని మీరు ఎరుగరా?? roma 6:4 లో మనము బాప్తీస్మం వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా “పాతిపెట్టబడితిమి”. ఇది బాప్తీస్మం యొక్క అర్థము. బాప్తీస్మం ద్వారా పాతిపెట్టబడుతున్నాము. యేసు క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యముగా మనమందరము బాప్తీస్మం ద్వారా పాతిపెట్టబడుతున్నాము. 

ఎందుకు తీసుకోవాలి?తీసుకోవడము వలన ఏమి జరుగుతుంది?

సమాజములో బాప్తీస్మం ఎందుకు తీసుకుంటున్నారో చూస్తే సంఘములో సబ్యత్వం కొరకు, సమాధి స్థలము కొరకు పెళ్లి కొరకు, caste certificate కొరకు, ఇలా ఎన్నో...... bible చెప్పిన కారణాలు ద్వార తీసుకునే బాప్తీస్మం అసలైన బాప్తీస్మం. బాప్తీస్మం తీసుకుంటే ప్రధానముగా 3 విషయాలు జరుగుతాయి. a) అపోకార్య 22:16- బాప్తీస్మం పొంది నీ పాపములను కడిగివేసుకోనమని చెప్పెను. “బాప్తీస్మం తీసుకోవడము వలన మొట్టమొదట పాపాలు కడగబడుతాయి”. బాప్తీస్మం తీసుకొనేవాడు పాపాలు కడిగివేసుకోవటానికి తీసుకోవాలి. నేను పాపి అని ఒప్పుకొని, మారు మనస్సు పొంది, ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంబిస్తాను అని నిర్ణయించుకుని పాపాలు ఒప్పుకొనక పోతే కుదరదు. అపోకార్య 2:38-మీరు మరుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తీస్మం పొందుడి. b) mark 16:16- నమ్మి బాప్తీస్మం పొందువాడు రక్షింపబడును.బాప్తీస్మం తీసుకోవడము ద్వార రక్షణ అనే ఓడలోకి వస్తాము.

బాప్తీస్మం తీసుకోవడము వలన ఏమి జరుగుతుంది అంటే మొట్టమొదట పాపక్షమాపణ కలిగి,రక్షణ అనే ఓడలోనికి వచ్చినట్లు అర్థము. రక్షణ పొందాలంటే ముందు బాప్తీస్మం తీసుకోవాలి.

ఎందుకు బాప్తీస్మం తీసుకోవడము అంటే పరిశుధాత్మ అను వారము పొందుతాము( అపోకార్య2:38,39).

ఎలా తీసుకోవాలి?

బాప్తీస్మం ఎలా తీసుకోవాలో అన్న విషయము పై ఒకరు చిలకరింపుగానా,జెండా క్రింద దూరడముగానా, అస్సలు అవసరము లేదు అంటున్నారు నేటి వారు. john 3:23- నీళ్ళు విస్తారముగా ఉండెను గనుక యాహోను కూడా అక్కడ బాప్తీస్మం ఇచ్చుచుండెను. నీళ్ళు విస్తారముగా ఉన్నందున. అపోకార్య 8:36 to 38- phillippu-నపుంసకుడు సన్నివేశము- నీళ్ళులోనికి దిగిరి... దినిని బట్టి బాప్తీస్మం నీళ్ళలో మునిగి తీసుకోవాలని అర్థము. పాతిపెట్టబడడము అంటే మునగాలి.

ఎప్పుడు తీసుకోవాలి ?

ఏ రోజు అయితే మనస్సులో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నావో,పాపి అని ఎప్పుడు ఒప్పుకొంటున్నావో అప్పుడు immediateగా పాపాలు ఒప్పుకొని బాప్తీస్మం తీసుకోవచ్చు. అపోకార్య22:16-నీవు తడువు(ఆలస్యము) చేయుట ఎందుకు.... , అపోకర్య8:36to38- phillippu-నపుంసకుడు సన్నివేశము-వారు త్రోవలోవెళ్ళుచుండగా బాప్తీస్మం జరిగింది. అపోకార్య 16:33-paul- చెరసాల నాయకుడు సన్నివేశము-midnight బాప్తీస్మం పొందారు. ఈ రోజు అయితే ఏ గడియ అయితే నీ పాపాలు ఒప్పుకొని,ఎందుకు బాప్తీస్మం తీసుకోవాలన్న కారణాలు నేర్చుకుని విస్వసిస్తే ఆ గడియలోనే బాప్తీస్మం పొందవచ్చు. బాప్తీస్మం పాపక్షమాపణ కొరకు తీసుకోవాలి. 

పసి పిల్లలు పాపము చేస్తారా? 

చిన్ని పిల్లలకు పాపము,మంచి,చెడు,విశ్వాసము,యేసు ,పునర్ధానము అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. 1 peter2:1to3- క్రొత్తగా జన్మించిన “శిశువులను” పోలి ఉండాలి , మత్తయి18:3-మీరు మార్పు నొంది “బిడ్డలు” వంటి వారు అయితే పరలోక రాజ్యములో ప్రవేస్తారు, మత్తయి 19:14- “చిన్నపిల్లలను” ఆటంకాపరచనియ్యకుడి. దేవుడు పిల్లలను గూర్చి చెప్పుతున్నాడు. 

గలతీ3:27- క్రిస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. christian అనగా క్రీస్తును ధరించినవాడు.

Conclusion: 

బాప్తీస్మం లేకుండా రక్షణ కలగదు అని, అది తీసుకుంటే పాపక్షమాపణ, రక్షణ ,పరిశుదత్మ అను వరము వస్తుందని,ఈ రోజు అయితే ఏ గడియ అయితే నీ పాపాలు ఒప్పుకొని,ఎందుకు బాప్తీస్మం తీసుకోవాలన్న కారణాలు నేర్చుకుని విస్వసిస్తే ఆ గడియలోనే బాప్తీస్మం పొందవచ్చని, మునిగితేనే బాప్తీస్మం తిసుకోనట్లు లెక్క అని,చిన్న పిల్లలకు బాప్తీస్మం ఇవ్వకూడదని తెలుస్తుంది.

Important point:

బాప్తీస్మం తీసుకున్న వారికీ పరలోఖము వస్తుందా? రాదు. ఇది తీసుకుంటే పని అయిపోయినట్లు కాదు కానీ దేవుని పని ప్రారంభమైనట్టు. యేసు బాప్తీస్మం తీసుకుని దేవుని పని మొదలుపెట్టాడు. బాప్తీస్మం తీసుకున్న వాడు దేవుని పనిలోనికి ళ్ళాలి. ఆపనిలోఉండగాకష్టాలు,శ్రమలు, అవమానాలు, ఆటంకాలు వస్తాయి. వీటి అంతటిని సహించాలి అంతము వరకు. అప్పుడు రక్షి౦పబడుతాము. ఈ రోజు నుంచి క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించి, అయన రాజ్య వ్యాప్తి కొరకు పని చేస్తానని వాగ్ధానము చేసినట్టు బాప్తీస్మం అనగానే.

ఇప్పటివరకు చనిపోయిన వారందరు పరలోకము వెళ్ళరా?

ఈ రోజు మరణించిన వారి విషయములో Christians కీ ఉన్న అభిప్రాయము,ఆలోచన మరణించగానే పరలోకము వెళ్ళిపోతున్నారని. మరణించినవారు ఎలాంటి వారు అనే ఆలోచన చేయకుండా ఎవ్వరు మరణించిన స్వర్గాస్తులు అయ్యారు,పరలోకము వెళ్లారు అని చెప్పడము పరిపాటి అయ్యినది. అస్సలు వీరి మాటలలో ఎంత వాస్తవం ఉంది?మరణించినవారు పరలోకానికి వెళ్ళిపోతున్నారా?? మనము bibleనే నమ్మాలి తప్పమనుష్యులు రాసిన పుస్తకాలను కాదు.bible లోని దేవుని మాటలకు శిరస్సు వంచాలే తప్ప మనుషుల మాటలకు కాదు.అంటే మనుష్యుల మాటలలో లేదు నిత్యజీవము దేవుని మాటలలో ఉంది.

భూమి మీద మొదటి జననము ఆదాము జరిగింది కానీ మరణము మాత్రము హేబెలు ద్వార ప్రారంభం అయినట్లుగా మనకు తెలుసు.మొదటిగా మరణించిన ఈ నితిమంతుడైన హేబెలు మొదలుకొని నేటివరకు మరణించిన నీతిమంతులు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు?ఎక్కడ ఉన్నారు?ఎంతకాలము ఉంటారు? ఆ తర్వాత ఏమి అయిపోతారు అన్న విషయాలను ఇప్పుడు ఆలోచిద్దాము. మరణించినవారు మరణించగానే స్వర్గాస్తులు అయ్యారు అని చెప్పటము చాలా తప్పు.మరణము అనగా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడము.ఆత్మ విడిచిపెట్టినప్పుడు ఎవరికీ కనపడదు కదా? కనపడని ఆత్మ స్వర్గానికి వెళ్లిందని వీళ్ళకు ఎలా తెలుసు??? ఏమి జరుగుతుంది మరణము తర్వాత???మరణించిన వారిలో నీతిమంతులుగా ఉన్నవారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు??? నిజముగా అనుకున్నట్టు పరలోకముకి వెళ్ళుతున్నార???ఇంకా ఎక్కడికైనా వేళ్ళుతున్నారా? అన్న ప్రశ్నలకు జవాబు Bible లోని మాటలు ద్వార చూద్దాము.

అబ్రహాము మరణించిన తర్వాత ఎక్కడికి పోయాడో చూద్దాము-- ఆదికాండ25:8-నిండు వృద్దాప్యముకు వచ్చినవాడై మరణించి “”తన పితరుల యొద్దకు చేర్చబడెను””. ఇక్కడ అబ్రహాము మృతి చెంది పరలోకముకు చేర్చబడ్డాడు అని వ్రాయబడిందా??? లేదు. అబ్రహామునే పరలోకము వెళ్ళకపోతే వీరు ఎలా పోతారు? మరణించిన అబ్రహాము పితరుల యొద్దకు చేర్చబడెను. నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడుగా పిలవబడిన అబ్రహాముచనిపోయిన తర్వాత పితరులయొద్దకు వేళ్ళాడే తప్ప పరలోకము చేరుకోలేదు అని తెలుస్తుంది.

ఇస్సాకును మరణించిన తర్వాత ఎక్కడికి పోయాడో చూద్దాము— ఆదికాండ35:28- నిండు వృద్దుడై మరణించి “”తన పితరుల యొద్దకు చేర్చబడెను””. ఇస్సాకు విషయములో కూడా మరణించిన తర్వాత తన పితరుల యొద్దకు చేర్చబడ్డడే తప్ప పరలోకమునకు కాదు. అంటే అబ్రహాము ,ఇస్సాకు ఇద్దరు ఒకే చోటులో ఉన్నారని అర్థమైనది. వీరికి ముందు Novah,హనోకు, హేబెల్ కూడా ఒకే చోట ఉన్నట్టుగా మనకు అర్థమైనది.

యాకోబును మరణించిన తర్వాత ఎక్కడికి పోయాడో చూద్దాము—ఆదికాండ 49:33-తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఈయన కూడా తన పితరుల యొద్దకు చేర్చబడ్డడే తప్ప పరలోకమునకు కాదు. అంటే నీతిమంతులు అందరు ఒక చోటికి చేరిపోతున్నారని అర్థమైనది. పరలోకము వెళ్ళారని వీళ్ళులేదు.

దావీదును మరణించిన తర్వాత ఎక్కడికి పోయాడో చూద్దాము. అపోకర్య2:34- దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు.. దేవునికి ఇస్టానుసారుడు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చిన దావిదే పరలోకము వెళ్ళకపోతే నీతిమంతులు (novah, హనోకు, హేబెల్ ఇస్సాకు, అబ్రహాము) కూడా వెళ్ళలేదు.మరణించినవారు పరలోకము వెళ్లలేదని చెప్పితే ఈ మధ్యకాలములో మేము పరలోకము వెళ్లి వచ్చాము అని అంటున్నారు. మరణించినవారు నితిమంతులైన వారు పరలోకము వెళ్లలేదని bible చెప్పింది.

ఇంతవరకు పరలోకము ఎవ్వరు వెళ్లలేదని bible ద్వార సులువుగా అర్థమైతే ఈ మధ్యకాలములో ఒకడు నేను పరలోకము వెళ్లివచ్చానని, చనిపోయినవారు పరలోకము పోతున్నారని అంటున్నారు.పరలోకానికి picnic అని, నరకానికి picnic అనే పుస్తకాలను చదివి నమ్ముతున్నారు. మోసపోయేవాడు ఉన్నంతకాలము మోసగించేవాడు మోసగిస్తునే ఉంటాడు.ఇలాంటి అబద్ద భోదలు వినినంతకలము అబద్దభోదకులు చెప్తూనే ఉంటారు.ఇప్పటివరకు bible లోని సందర్భాలను బట్టి ఎవ్వరు పరలోకము వెళ్ళలేదు కానీ యేసుక్రీస్తు వెళ్ళాడు. John 3:13-పరలోకము నుండి దిగివచ్చినవాడే,అనగా పరలోకములో ఉండు మనుష్యకుమరుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఇది యేసు స్వయముగా చెప్పుతున్న మాట.ఇప్పటివరకు పరలోకానికి Jesus తప్ప ఎవరు వెళ్ళలేదు. యేసు అయన మాత్రము వెళ్ళాడు అంటే వీరు మేము పరలోకము వేల్లివచ్చము అంటారు ఏంటి?గొప్పలు కోసము దేవుని మాటలను మార్చేస్తున్నారు.

మరి మరణించినవారు ఇటు ఈ భూమి మీద లేక, అటు పరలోకము వెళ్ళక మరి ఎక్కడికి వెళ్లినట్టు??ఏమి అయ్యినట్టు??మనకు తెలిసింది మూడు లోకాలు. పరలోకము-దేవుడు ఉండే స్థలము,భూలోకము-నరులు ఉన్న లోకము , పాతలలోకము-మరణించినవారు ఉండే లోకము.ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులు పరలోకములో లేరు, భూలోకములో లేరు ఇంకా పాతాలలోకము లో ఉన్నట్టు. ఇదేంటి నీతిమంతులు కూడా పాతాలములో ఉంటారా అని సందేహపడకండి. దీనికి జవాబు చూద్దాము.

Luke 16:22 నుంచి ప్రతిమాట చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ధనవంతుడు and లజారు సన్నివేశము..అబ్రహాము address తెలిస్తే ఇప్పటివరకు మరణించిన నీతిమంతులు కూడా ఎక్కడ ఉన్నరో తెలుస్తుంది. చదివితే అబ్రహాముకూడా పాతాలములో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దేవుని కోసము ఈ భూమి పై బ్రతికిన వారు పాతాళము పోతున్నారు and అంటే దేవుని కోసము ఈ భూమి పై బ్రతకని వారు పాతాళము పోతున్నారు అని అర్థమైనది. ఈ భూమి పై మరణించిన తర్వాత వెనువెంటనే వెళ్ళే చోటు పాతాళము అని తెలుసుకున్నాము.

లజారు ను పంపుము అంటున్నాడు అంటే ఒకే పాతాల ప్రదేశములో స్థలాలు వేరుగా ఉన్నట్టు అర్థమవుచున్నది. ఈ భూమి పై దేవుని కోసము బ్రతకక చనిపోయిన ధనవంతుడు అగ్ని జ్వాలలలో ఉన్నాడు. హా పాతాలములో ఉన్నప్పటికీ ఒక ప్రతేకమైన స్థలములో ఉన్నట్టు అర్థమవుచున్నది. కనులెత్తి అను మాటను బట్టి నీతిమంతులు 
up section లో ఉన్నట్టుగా, ధనవంతుడు down section లో ఉన్నట్టుగా అర్థమైనది.పతలములో రెండు sections అంటే వేధనకరమైన స్థలము మరియు నెమ్మది స్థలము.

పాతాళము ఒక్కటే కానీ రెండు విబిన్న స్థలాలు కనపడుతున్నాయి. a) నెమ్మది స్థలము b) వేధనకరమైన స్థలము. ఈ భూమి పై దేవుని కొరకు బ్రతికేవారు వెళ్ళు చోటు నెమ్మది స్థలము. ఈ భూమి పై దేవుని కొరకు బ్రతకనివారు వెళ్ళు చోటు వేధనకరమైన స్థలము అని మనకు అర్థమవుతుంది. Luke 16:26- రెండిటి స్థలాల మధ్య ఒక అగాధము ఉన్నట్టుగా చూస్తున్నాము. నెమ్మది స్థలము అనగా Luke 23:43 లో పరదైసు అని ఉంది. పరదైసు ,పరలోకము ఒక్కటి కాదు ( John 20:17). పరదైసు(నెమ్మది స్థలమ) పాతాలములో ఒక భాగము. ఈ భాగము లో హేబెలు మొదలుకొని ఇప్పటివరకు చనిపోయిన నితిమంతుకు అందరు ఉన్నారు.యేసుక్రీస్తు రెండవ రాకడ గా వచ్చేంతవరకు వెళ్ళవలసిన స్థలము ఇదే.

హెబ్రీ 11:36 నుంచి చూస్తే నెమ్మది స్థలము కు వెళ్ళిన వారు ఈ భూమిపై దేవునికోరకు ఎంత శ్రమ పడ్డారో తెలుస్తుంది. john 14:2- నేను వెళ్లి మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుతున్నాను.. అంటే పరలోకములో స్థలము సిద్దపరిచే వరకు ఈ పరదైసులో ఉండండి అని అర్థము.

Conclusion:

హేబెలు మొదలుకొని ఇప్పటివరకు మరణించిన నీతిమంతులు ఈ ఒక్కరు యేసు తప్ప పరలోకానికి వెళ్ళలేదు. నీతిమంతులు పాతాలములోని నెమ్మది స్థలములో(పరదైసు) లో ఉన్నారు. అనీతిమంతులు పాతాలములోని వేధనకరమైన స్థలము న ఉన్నారు. కనుక మనము ఈ బహుము పై ఉన్నంతవరకు దేవుని పనిలో ఉండి మరణించిన తర్వాత ఉండే పరదైసులో ఉండడానికి ప్రయత్నము చేద్దాము. 

భుమికి పునాది వేసిన దేవుడు సమాధి చేస్తాడా?

గత 2 or 3 years నుంచి అక్కడ,ఇక్కడ మనకు వినబడుతున్న మాట యుగాంతము గురించి. ఈ ప్రపంచము నాశనము అవుతుందని dates fix చేస్తున్నారు,books రాస్తున్నారు. ఇవన్ని మనము వింటున్నపుడు దేవుడు అనుకుంటున్నది ఏదో తెలుసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. దేవుడు ఈ ప్రకృతిని కలిగించేటప్పుడు,ఈ ప్రక్రుతిలోనికి మనిషి వచ్చిన తర్వాత దేవుని ఆలోచన ఏంటో మనము పరిశిలిస్తే ఒక ప్రణాళికతో ఉన్నాడని అర్థమవుతుంది. హెబ్రీ1:10- ప్రభువా! నీవూ “ఆదియందు భూమికి పునాది వేసితివి”,ఆకాశములు కూడా నీ చేతి పనులే ఇలా paul గారు పరిశుద్దాత్ముని ప్రేరేపణతో భుముకి పునాది వేసిన సందర్భాన్ని జ్ఞపకము చేస్తున్నాడు.విశ్వములో గ్రహాలు,stars, ఎన్నో వస్తువులు దాగి ఉన్న భూమిని గురించే దేవుడు మాట్లాడుటకు గల ప్రత్యేకత or ప్రాదాన్యత ఏంటి???? ఈ విశ్వములో భూమికంటే పెద్దవి ఉన్నప్పటికీ, ప్రత్యేకించి భూమికి పునాదులు వేసిన సందర్బంనే గుర్తుచేస్తున్నాడు. అంటే భూమి ఈ విశ్వమంతటిలో ప్రాముక్యతతో ఉన్నదని హెబ్రీ1:10 ద్వార అర్థమవుతుంది.

ఆదికాండము 1:1- ఆదియందు దేవుడు భుమ్యకసములను సృజించెను. మల్లి ఇక్కడను కూడా భూమి ప్రస్తావనే కనపడుతుంది. అనగా భూమి మీద అయన పిల్లలముగా మనము రాబోతున్నామని కనుక భూమి చాల ప్రాముక్యతగా ఉన్నది అని అంటున్నాడు. దేవుడు భూమికి పునాది వేసిన రోజులు ఎలా ఉన్నాయి?? భూమికి పునాదులు వేసిన్నప్పుడు దేవుని మనస్సులో ఎంత సంతోషము ఉందో లేఖనలలో చూస్తే మన మనస్సు ఆనందముతో నిండుతుంది. దేవుడు భూమిని కలిగించిన తర్వత మనకు కావలసినవన్ని సిద్దపరచిన తర్వాతే ఆదామును కన్నాడు. తొలి రోజుల దేవుని సంతోష పరిస్థితి చూస్తే యోబు 38:7- ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు,దేవదుతలందరు ఆనందించి జయ ద్వనులు చేసినప్పుడు దాని ములరాతిని వేసినవాడు ఎవడు?ఇక్కడ యోబు తో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పరీక్షించాలని,సాతాను శోదించాలని అనుకున్నాడు.ఈ పరిక్ష,శోధనల మధ్య స్నేహితులు వచ్చి యోబుతో మాట్లాడుతు నీవూ ఏదో తప్పు చేసి ఉంటావు ,అందుకే ఈ కష్టాలు వచ్చాయని మాటలతో యోబును నిందిస్తున్నప్పుడు నిరసించిన యోబును చూసి ,మానవ పుట్టుక గురించి జరిగిన తొలి దినాల సందర్భాన్ని జ్ఞపకము చేసి యోబును సంతోషపరచాలని,నిరసించిన యోబును మానసిక ధైర్యము ఇవ్వడానికి దేవుడు మాట్లాడుతున్న సందర్భము. యోబు 38:4- నేను భూమికి పునాదులు వేసిన్నప్పుడు నీవేక్కడ నుంటివి? అనగా ప్రారoభములో దేవుడు ప్రకృతిని కలిగించిన తొలి రోజుల సందర్బాన్ని గురించి చెప్పుతున్నాడు.( ఈ వివరణ హెబ్రీ1:10 కు link)

యోబు 38:7లో మనము రాబోతున్నామని ఆనందముతో మనకోసము భూమిని కలిగిస్తున్నపుడు మొట్టమొదట రాయి వేసినప్పుడు ఎంత ఆనందమో చెప్పుతున్నాడు. కేవలము ఈ భూమిపై ఒక స్వంత ఇల్లు కట్టుకుని సంతోషపడే మనకు రాబోయే మన గురించి దేవుడు కడుతున్న ఈ విశ్వమనే ఇల్లు గురించి ఆలోచిస్తే దేవుడికి కూడా గొప్ప ఆనందము ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.ఉదయనక్షత్రములు యొక్క పాటల మధ్య,దేవదూతలు యొక్క జయద్వానుల మధ్య ఈ నేలపై నా పిల్లలు రాబోతున్నారని గొప్ప ఆనందముతో ఉన్నాడు. దేవుడు ఈ విశాలమైన ,ఉహకు అందని ప్రకృతిని కలిగించడానికి 6 days కష్టపడ్డాడు. 6 days కష్టపడింది అయన ఉండడానికి కాక రాబోయే మనము ఉండడానికే.. అంటే రాబోవుతున్న మనయెందు దేవునికి ఎంత ప్రేమ???మనము పుట్టాక ముందే ఇంత ప్రేమ ఉంటె ఇంకా పుట్టిన తర్వాత ఇంకా ఎంత ప్రేమ ఉండాలి?? మనిషి పుట్టాక ముందే ఇంత ఆనందముగా ఉన్న దేవుడు ,పుట్టిన తర్వాత ఇంకెంత ఆనందముగా ఉండాలి? కోట్లనుకోట్ల మంది పిల్లలు కలగబోతున్నారని ఆ తొలి రోజులలో దేవునికి ఆనందమే. భూమి మీదకు వచ్చి,నా కోసము బ్రతుకుతూ,తండ్రి అని నన్ను పిలుస్తుంటే ఆనందపడాలి అని అనుకున్నాడు.

ఇంతవరకు మనము పుట్టాక ముందు తొలి రోజులలో దేవుడు మన యెడల ఒక ప్రణాళికతో ఉన్నాడని, చాల ఆనందముగా ఉన్నాడని తెలుసుకున్నాము.మనము పుట్టక ముందే దేవునికి ఆనందము ఉంటె పుట్టిన తర్వాత ఆనందము రెట్టింపు అవ్వాలి కానీ పుట్టిన తర్వాత భాద అంటే ఏంటో దేవునికి పరిచయము చేసాడు మనవుడు . అప్పటివరకు ఆనందముగా ఉన్న, కన్నతండ్రికి భాద ఎలా ఉంటుందో రుచి చూపించింది మనిషే. ఆదాముని అదేను తోటలో పెట్టి ఒక్క పండును తిన్నోద్దు అంటే అదే తిని దేవుని మాట మీరి దేవునిని భాదపెట్టాడు. 11timothy3:1 నుంచి-మనుష్యులు స్వార్ధప్రియులు,ధనపేక్షులు,బిమ్కములడువారు దుషకులు ........అని అంటున్నాడు.మనవ చరిత్ర మలినము అయింది.. ఆదికాండము6:6-తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవ సంతాపము నొంది తన హృదయము నోచ్చుకోనేను.. అంటే ప్రారంభ దినాలలో మనము పుట్టాక ముందు ఆనందపడ్డ దేవుడు తర్వాత దినాలలో మానవుని క్రియలు ద్వార హృదయము నోచ్చుకోన్నట్ట్లుగా మనకు అర్థమవుతుంది. యేసు రాక ముందు అనేక ప్రకతి వైపరిత్యాలు చేసినను, jesus పంపించినను మనిషి మారడము లేదు. మారలేదు. మనిషి ఎప్పటికి మారని వాడిగా మిగిలిపోతున్నాడు.

రాభోవుతున్న తన పిల్లలకోసము భూమికి పునాదులు వేసి,మనకు కావలసినవన్నీ దేవుడు పెడితే మనిషి మానవత్వము కోల్పోయిన పరిస్థిని బట్టి దేవుడు ఎలాంటి నిర్ణయము తిస్కుకోవాలి???? మనిషికి భుద్ది చెప్పటానికి ప్రకృతి వైపరిత్యాలు కలగజేసి తెలియజేస్తూ ఉన్నాడు.ఇంత వరకు ఎన్నో earth quakes, tsunami వచ్చిన ఉపయోగము లేదు.ప్రవక్తలను,యేసును,apostles భోధన ద్వార,ప్రకృతి వైపరిత్యాలు ద్వార మానవుడు మరుతాడని చేసిన ఏమి పట్టనివాడిగా ఉన్నాడు.వినని సమాజానికి ఏమి చేయాలి దేవుడు? అందుకే దేవుడు హెబ్రీ 12:26- భూమిని,నక్షత్రాలను కంపింపజేతును అని అంటున్నాడు.

మనకి భుద్ది కలగటానికి earth quakes,tsunami కలిగిస్తున్నాడు.ఇలా ప్రపంచములో అంతట ఎక్కడోఅక్కడ ప్రకృతి వైపరిత్యాలు మనము చూస్తున్న భుద్ది కలగట్లేదు.అక్కడ కదా వచ్చింది మాకు ఏంటి అని అనుకుంటున్నారు. ప్రకటన 6:13- ఆకాశానక్షత్రాలు రాలును అంటున్నాడు. మత్తయి 24:29-యేసు రెండవ రాకడలో ఆకాశము నుండి stars రాలబోతున్నాయి అని అంటున్నాడు.

ముంచుకొస్తున్న ప్రమాదము గురిచి అలోచించి అయిన మనిషి జగ్రతపడుతదని ఈ విలువైన bible మాటలను రాసాడు దేవుడు.యేసు ను రెండవ రాకడగా పంపబోతు ఈ విశ్వాన్ని అంతము చేయాలనుకుంటున్నాడు.దేవుడు ముగించాలనుకున్న ఈ కాలములో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ అంత్య దినలలో ఎలా ఉన్నమన్నడో 11 peter3:11,12,13- పరిశుద్దమైన ప్రవర్తనతోను ,భక్తితోను ఎంతో జాగ్రతగా ఉండాలి అని అంటున్నాడు.

ఆ ప్రమాదము వచ్చేముందు మనము ఉండే ఈ కొద్దికాలములో ఆత్మలను రక్షిస్తే దేవుడు సంతోశపడుతాడు.ఒకసారి అలోచించి ఒక మంచి నిర్ణయము మన జీవితము పట్ల తీసుకుని మనల్ని మనము కాపాడుకొని,సమాజములో ఉంటున్న కొద్దిమందైన మనము కాపాడాలి.