Friday, May 9, 2014

పరిశుద్దాత్మ అల్లరికి కారకుడా?


1) మత్తయి 12:32 లో కాబట్టి ( యేసు) మీతో చెప్పునదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపము, దుషణయు క్షమింపబడును గాని “ఆత్మ విషయమైన దుషణకు పాప క్షమాపణ లేదు”. మనుష్య కుమారునికి విరోధముగా మాటలడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్దాత్మ విరోధముగా మాటలడువానికి ఈ యుగామందైనాను, రాబోవు యుగామందైనాను పాప క్షమాపణ లేదు.

2) పాపాలలో రెండు రకాలు a) క్షమింపబడే పాపాలు.. b) క్షమింపబడని పాపాలు.. example: రోగాలు రెండు రకాలు a) మందులకు లొంగే రోగాలు..b) మందులే లేని రోగాలు. యేసు రక్తము వలన క్షమించే లేక క్షమించబడే పాపాలు కొన్ని. యేసు రక్తము వలన క్షమించబడని పాపాలు కొన్ని.

3) రక్షించే యేసు క్రీస్తు పాపక్షమాపణ లేదు అంటే ఉంది అని ఎలా అంటాము? మన పాపక్షమాపణ కోసము రక్తము కార్చిన యేసుక్రీస్తే ఈ పాపానికి పాపక్షమాపణ లేదు అంటే ఉంది అని ఎలా అంటాము? కాబట్టి మనుష్యులు చేయు ప్రతి పాపము క్షమింపబడుతుంది అని అనుకుంటే పొరపాటు.

4) 1 John 5:16 లో తన సహోదరుడు మరణకరము కానీ పాపము చేయగా ఎవడైనాను చుసిన యెడల అతను వేడుకోనును;అతన్ని బట్టి దేవుడు మరణకరము కానీ పాపము చేసిన వారికీ జీవము దయచేయును. ఈ వచనములో మరణకరము అయిన పాపము కలదు అని తెలుసుకుంటున్నాము. మరణకరము అయిన పాపము అంటే పరిశుద్దాత్మ కు వ్యతిరేకముగా మాట్లాడటము.

5) విధులలో జరిగే సభల నుంచి టీవీ లో మనము చూసే meetings వరకు, దేవాలయములో( church) జరిగే ఆరాధన నుంచి grounds లో జరిగే మహా సభలు వరకు పరిశుద్దాత్మ పేరుతో అల్లరి జరుగుతుంది. పరిశుద్దాత్మ దిగిరా అని అల్లరి చేయటము,పరిశుద్దత్ముడు ground చుట్టు తిరుగుతున్నాడని అల్లరి చేయడము, కూర్చున్న వారు ఒక్కసారిగా కేకలు వేస్తూ పరిశుద్దత్ముడా దిగిరా అని పాటలు పాడడము మనము చూస్తున్నాము. ఈ కార్యక్రమాలు పరిశుద్దత్ముడికి అనుకూలముగా లేక వ్యతిరేకముగా జరుగుతున్నాయా అని ఆలోచించాలి.

6) ఏది పడితే అది మనము తినము. ఆరోగ్యానికి అవసరమైనదే తింటాము.. ఈ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగము. తాగే ముందు ఎమన్నా పడిందేమో చూసుకుని తాగుతాము. ఈ బట్టలు పడితే ఆ బట్టలు కొనము. మనకు సూటు అయ్యేవే కొంటాము.. కానీ Bible దగ్గరకు రాగానే ఎవరు ఏమి చెప్పిన గుడ్డిగా నమ్మే అలవాటు ఉంది మనలో. వాక్య పరిశిలన లేదు ( యెషయ 34:16). Christian జీవితములో Bible లో ఏమి ఉందో? ఏమి లేదో? ఏమి వ్రాయబడిందో? తెలిసి చేస్తున్నామా ? తెలియక చేస్తున్నామా అను ఈ జాగ్రత్తలతో ఉండాలి. పరిశుద్దాత్మ పేరుతో పిచ్చిపట్టిన వారిగా,అల్లరి చేసే వారిగామారిపోయారు నేటి Christianity లో. యేసు నాకు వ్యతిరేకముగా మాట్లాడితే క్షేమిస్తాను కానీ పరిశుద్దాత్మ విరోధముగా మాటలడువానికి ఈ యుగామందైనాను, రాబోవు యుగామందైనాను పాప క్షమాపణ లేదు అన్నపుడు పరిశుద్దాత్మ గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలి?

7) పరిశుద్దత్మకు వ్యతిరేకముగా పాపము(అబద్దము) చేసిన వారి ఫలితము ఈ విధముగా ఉంటుందో అని Bible లో చూస్తే అపోకార్య 5:1 నుంచి –అననియ,సప్పిర సంగతి చూస్తున్నాము.

8) పరిశుద్దాత్ముని గురించి ఈ రోజు ప్రపంచములో అల్లరి, గేంతటం, dances వేయటం, బట్టలు ఎటు పోతున్నాయో తెలియకుండా గేంతులు వేస్తు పరిశుద్దాత్మడు మా మీదకు వచ్చాడు అంటున్నారు. అస్సలు పరిశుద్దాత్ముడు వస్తే అల్లరి చేస్తారని ఎవరు చెప్పారు? Bible లో ఎక్కడ ఉంది? గెంతేవాడు,కేకలు వేసే వాడు ప్రసంగికుడా?? యేసుక్రీస్తు ఎక్కడైనా గెంతులు వేసినట్లుగా Bible లో ఉన్నదా?? పరిశుద్దత్ముడు వచ్చినప్పుడు కూర్చున్నవారు కేకలు వేసినట్లుగా Bibleలో ఎక్కడ ఉంది???

9) పరిశుద్దత్ముడు వస్తే అల్లరి జరుగుతుందని Bible లో ఎక్కడ ఉంది? చేయించడని Bible లోని మటల ద్వార చూద్దాము. 1 కొరంది14:33 లో దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. దేవుని సన్నిధిలో అల్లరి చేయకూడదని ఈ reference ద్వార మనకు అర్థమగుచున్నది. ప్రసంగి 5:2 ను చదవండి.

10) యేసు క్రీస్తు ఎక్కడైనా కేకలు వేసాడ అని Bible లో చూద్దాము.. మత్తయి 12:19,20 లో ఈయన కేకలు వేయడు( అల్లరి చేయడు). అపోకార్య 2:1 లో పెంతుకోస్తపు పండుగ దినమున గూర్చి చెప్పబడింది. ఇక్కడ మాట్లాడుతున్నార లేక కేక వేస్తున్నరా??. Christianity లో ఇలా జరుగుతుందంటే ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరు ఆలోచించటం లేదు. యేసు కేకలు వేయనప్పుడు భోదకుడు ఎందుకు కేకలు వేయాలి? దేవుడు అల్లరికి కర్త కాడు కదా మరి అల్లరి ఎందుకు జరుగుతుంది?

11) సౌలు మీదకు పరిశుద్దాత్ముడు వచ్చిన్నపుడు కేకలు వేసాడా?ప్రవచించాడు.దావీదు మీదకు పరిశుద్దాత్ముడు వచ్చిన్నపుడు కేకలు వేసాడా? గోల్యతును చంపాడు.సంసోను మీదకు పరిశుద్దాత్ముడు వచ్చిన్నపుడు కేకలు వేసాడా? ఫిలిస్తుయులను చంపాడు.మరియమ్మ మీదకు పరిశుద్దాత్ముడు వచ్చిన్నపుడు కేకలు వేసిందా? విరు ఎవ్వరు చేయనప్పుడు మరి ఈ రోజు సమాజములో అల్లరి ఎందుకు జరుగుతుంది?

12) అల్లరికి కారకుడు పరిశుద్దత్ముడు,యేసు,తండ్రి కాదు. Bible లో వాడు ఎవడో చూస్తే యాకోబు 3:15,16,17 లో దయ్యము(సాతాను).. ఎక్కడ నుంచి start అయిందో ప్రకటన 12:7 లో చూడొచ్చు. అల్లరికి కారకుడు సాతాను గాడు. విడి లక్షణాలు Bible లో చూస్తే Luke 4:41 లో కేకలు వేసి వదిలి పోయెను(దెయ్యము), Luke 4:34 లో కేకలు వేసెను(devil),మార్క్ 5:5 లో కేకలు వేయుచు....( దెయ్యము), అపోకార్య 8:6 లో పెద్ద కేకలతో వదిలిపోయేను( దెయ్యము).... పరిశుద్దత్ముడు వస్తే ఇలా కేకలు వేసారు అన్న ఒక్క reference చూపించండి నాకు? ఈ రోజు పరిశుద్దత్ముడు వచ్చాడని అల్లరి చేస్తే కేకలు వేస్తే వీడికి దయ్యము పట్టిందని అనుకోవాలి.

13) ఒకసారి Israels మధ్య అల్లరి జరిగితే దేవుడు ఏమి చేసాడో 1 కొరంది 10:3,4,5 లో చూడొచ్చు. ఇక్కడ తిన్న,త్రాగిన తర్వాత అల్లరి చేస్తున్నారని విషయము అర్థమగుచున్నది. ఇది మరనకరమైన పాపాము. దీనికి పాప క్షమాపణ లేదు.

పరిశుద్దత్ముని అస్సలు పని ఏంటో చూద్దాము

14) John 14:25,26- సమస్తమును మీకు భోదించి, John 16:8 –ఒప్పుకోన జేయును, John 16:13- సత్యములోకి నడిపించును, roma 8:26- విగ్యాపన చేయుచున్నాడు.

15) 1)నిన్ను దేవుని కోసము బ్రతికింపజేస్తాడు. 2)దేవుని వాక్యమును remind చేస్తాడు. 3)దేవుని వాక్యపు లోతులకు మిమల్ని తీసుకెళ్తాడు. 4) నివు దేవుని కుమారుడవు అని అనుట లో గుర్తుగా ఉంటాడు. 5) మన పక్షాన prayer చేస్తాడు. పరిశుద్దత్ముడు దేవుని కోసము బ్రతకడానికి కారకుడు గాని అల్లరికి కారకుడు కాదు. ఈ అల్లరికి కారకుడు సాతాను. 

No comments:

Post a Comment