Friday, May 9, 2014

ఉపవాసము అంటే ఏమిటి? సంపూర్ణ రాత్రి ఉపవాస కుడికలు వాక్యానుసరమా??


1) ఉపవాస ప్రార్ధన గురించి మరి ముఖ్యముగా ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఉపవాసం ప్రార్ధనను ప్రకటన చేసి మరి ఆచరిస్తున్నారు. ఉపవాసము అనునది రహస్యముగా ఉండాలన్నది వాక్యము చెబుతున్నది. ద్వితియోప 12:4 లో israels యొక్క భక్తీని వివరిస్తున్నాడు. వారు( అన్యజనులు) తమ దేవతలకు చేసినట్లుగా మీరు( israels) యెహోవ కు చేయాకూడదు. దేవుడు ఒక హెచ్చరిక జారి చేసినను ఏమి పట్టించుకోకుండా అన్యజనుల నుంచి ఆచారాలు నేర్చుకొని జరిగించారు. యెషయ 29:13 లో యెషయ యొక్క కాలము వచ్చేటప్పటికి israels యొక్క భక్తీ గురించి మురిసిపోతున్నడో, అసహ్యించుకొంటున్నదో చూద్దాము. నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు... హృదయములో దేవుని మాటలు ఉండాలి. israels జరిగించిన భక్తీ వారి స్వార్దప్రయోజనాలు కోసముగా మనకు కనిపిస్తున్నది. పాత నిబంధనలో esther గారు ఉపవాసము చేసినట్లుగా మనకు కనపడుతున్నది. హము- మోద్దుకై గల సందర్బము మనకు తెలుసు. అస్సలు esther ఉపవాసము ఎందుకు చేసింది?? esther 4:15 లోని సందర్బము అంతటిలో జరిగిన ఉపవాసము గురించి మనము అలోచించినట్లుయితే esther కానీ, యూదులు కానీ ఎందుకు ఉపవాసము చేసారు?? దేవుని కోసము చేసారా??లేక వారి ప్రాణభయము కోసమా?? యూదులు ఉపవసము చేసినది వాళ్ళ స్వప్రయోజనము తప్ప దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయలేదు. వారి స్వప్రయోజనము కోసము, వారి ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి చేసారు. అలానే 2 Samual లో దావీదు బిడ్డ రోగముతో భాదపడడం చూసి దేవుడు కనికరిస్తాడని ఉద్దేశముతో దావీదు ఉపవాసము చేసాడు. అలానే నిర్గమ 34:27 లో మోషే గారు దేవుని పనిలో ఉన్నపుడు ఉపవాసము చేసిన సందర్బము. Luke 4:2 లో Jesus ఉపవాసము చేసిన సందర్బము. భక్తీ పేరున మనము జరిగించే ప్రతి పని లేక కార్యము దేవునికి ఇష్టము అయ్యేదిగా ఉండాలి. 

2) దేవుడు ఈ కాలములో ఉపవాసము కోరుకొంటున్నాడా ??? కోరుకుంటే ఎలాంటి ఉపవాసము ఇష్టమో దేవుని మాటలను పరిశలించాలి. Mathew 6:16 లో యేసుక్రీస్తు ఉపవాసము గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజులలో చాలా మంది కనిపించేటట్లు చేస్తారు. ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనపడవలెనని కాక రహస్యమందు తండ్రికి కనపడాలి. ఉపవాసము అనునది రహస్యంగా జరగాలన్న సంగతి మనకు అర్థమవుతున్నది. ఎవ్వరికి తెలియకుండా జరగాలి. ఉపవాసము అనునది రహస్యముగా ఉండాలని యేసుక్రీస్తు అంటే సంపూర్ణ రాత్రి ఉపవాసము అని ప్రకటించడము వాక్యానికి విరోధము. దేవునికి రహస్యముగా ఉంటె ఉపవాసము ఇష్టము. Mathew 6:16 ప్రకారముగా ఉపవాసము గూర్చి ప్రకటన చేయకూడదు. వాక్యము యొక్క భావము, దేవుని యొక్క ఆలోచన తెలియలి మనకు అంతే కానీ Bible లో వారు చేసారు కదా మేము కూడా చేస్తాము అంటే సరిపోదు. అక్కడ వాక్యము యొక్క సందర్బము చూడాలి. అందుకే Mathew 9:13 లో వాక్యభావము ఏమిటో వెళ్లి నేర్చుకోనుడని చెప్పెను. వాక్యము నేర్చుకోవడము కంటే దాని యొక్క భావము నేర్చుకోమని చెబుతున్నాడు. రహస్యముగా ఉండమన్న వాక్యభావము తెలుసుకొనక all night prayer అని ప్రకటన చేస్తున్నారు.

3) ఉపవాసము రహస్యము గా ఉండాలి. దేవునికి ఇష్టము గా ఉండాలి. ఉపవసములో మనుష్యుల స్వార్ధము ఉండకూడదు.స్వప్రయోజనము ఉండకూడదు. జేకర్య 7:5 లో ఉపవాసము గూర్చి చెప్పబడింది. ఒక సమస్య తీర్చుకోవడానికి జరిగించే ఉపవాసము స్వార్దాపురితమైనది.

ఎలాంటి ఉపవాసము దేవునికి ఇష్టము?

4) యెషయ 58:3 నుంచి ఉపవాసము గురించి చాలా చక్కటి వివరణ ఉన్నది. వారు దేవునిని ప్రశ్నిస్తున్నారు ఎందుకు మా ఉపవసమును అంగీకరించలేదు అని. యెషయ 58:6 లో దుర్మాగులు కట్టిన కట్లను విప్పుటయు,కడియను అను మేకులు తియుటను, భాదింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగోట్టుటయు నే నేర్పరచుకోనిన ఉపవాసము కదా..... ఈ వచనములో ఉపవాసము యొక్క వివరణ ఉన్నది. ఇందులో దుర్మాగులు కట్టిన కట్లను విప్పుటయు,కడియను అను మేకులు తియుటను అను మాటలు ముఖ్యము... ‘పాపము’ అను కట్టు సాతాను చేసాడు. పాపము అను కట్ల నుండి విదిపించబడాలి. దేవుని కొరకు ఉపవాసము అంటే ఏంటో బాగా తెలుసుకున్న యేసుక్రీస్తు అదే జరిగించాడు. కట్టిన కట్లను విప్పుటయు అంటే Luke 13:16 లో ఉన్నది. దేవునికి ఇష్టమైన కార్యము సాతాను బందించిన కట్ల నుండి విడుదల. కడియను అను మేకులు తియుట అంటే కీర్తనలు 38:4 లో ఉన్నది.పాపము నుంచి విడుదల.

5) ఒక మనిషిని పాపము నుండి విదిపించాలంటే Bible ప్రకారముగా ఒక పద్ధతి ఉన్నది. ఒక అవిశ్వాసిని విశ్వాసి గా మార్చాలంటే వినుట వలన జరుగుతుంది. వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలగాలి. వాక్యము ప్రకటించడము ద్వార ఒక వ్యక్తి పాపము నుండి విడుదల పొందుకొంటాడు. వాక్యము ప్రకటించడంలో ప్రయసపడినప్పుడు ఆ ప్రయాస దేవుడు ఉపవాసము గా అనుకుంటాడు. వాక్య ప్రకటన ద్వార పాపి విడుదల పొందుతాడు. వినిపించుట(దేవుని మాట) వలన పాపము నుండి విడుదల కలుగుతుంది. సువార్త ప్రకటించిన్నపుడు అనుకోకుండా జరిగేదే ఉపవాసము. సువార్తకు వెళ్ళినప్పుడు ఎదుర్కున్న ఉపవసమే ఉపవాసము.

6) 2 కోరంది 11:23 నుంచి, 6:4 నుంచి 10 లో Paul ఎదురకున్న ఉపవాసము మనకు అక్కడ కనపడుతున్నది. ఇది నిజమైన ఉపవాసము. అంటే ఉపవాసము రహస్యముగా జరగాలి. రహస్యముగా సువార్త ప్రకటనలో జరుగుతుంది. ఉపవాసము సువార్త భాగములో రావాలి కానీ మనము ఇష్టము వచ్చినట్లుగా మన స్వార్ద, స్వప్రయోజనాల కోసము చేసే ఉపవాసము ఉపవాసం కాదు.

7) ప్రకటించే ఉపవాసము, స్వార్ధప్రయోజనాలు కోసము చేసే ఉపవాసము దేవునికి ఇష్టమైనది కాదు. అయన పిల్లలైనా అనేక మందిని పాపపు కట్ల నుండి విడిపించాలి. విడిపించాలంటే సువార్త ప్రకటించాలి.. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చేసే ప్రతి త్యాగము ఉపవాసము. ఇది దేవునికి ఇష్టము. దిని వలన దేవుని నుంచి ప్రతి ఫలము వస్తుంది.

No comments:

Post a Comment